Saturday, 28 Nov, 2026

నీ బుగ్గ తాకిన ఆ స్పర్శ నీకేమిచ్చిందీ

నీహారికా , అమ్మేపుడూ విసుక్కుంటుంది. ఒక్కోసారి నా పైన ప్రేమ లేదేమో అనిపిస్తుంది. ఆవిడ నన్ను ప్రేమిస్తోందా ? లేదా నాకే ప్రేమంటే ఏమిటో తెలియదు అన్నావు నిజమే మనసు నిండా ప్రేమ దాచేసుకుని దాన్నిక్రమశిక్షణ పేరుతోనో లేదా ఇంకేం కారణం వల్లనో వ్యక్తం చేయకుండా మనసులో దాచేస్తే ఫలితం ఉఇలాగే ఉంటుంది. చెప్పి తీరాలి . నువ్వు నాకెంతో అపురూపం అని ఎదిగే పిల్లల మనసులోకి ఎక్కేలా చెప్పాలి. ఒక వయసు పిల్లలకి మంచి గైడెన్స్ […]

బద్ధకం వదిలించుకోపోతే ప్రాబ్లమ్

ఈ పని చేయకుండా రిలాక్స్ గా ఉండటం చెప్పుకునేందుకు బావుంటుంది. కానీ ఆలా బద్ధకం పెంచుకుంటే ఆయుర్ధాయం తగ్గిపోతుందని చెపుతున్నారు. మనుషులు అర్ధాయుష్షుతో మరణించేలా చేస్తున్న స్మోకింగ్ ఆల్కహాల్ సరసన ఇప్పుడు  బద్ధకం కూడా చేరింది. ఎటువంటి శారీరిక వ్యాయామం చేయకుండా బద్ధకంగా బతకటం వల్ల  ఏటా  53 లక్షల మంది మరణిస్తున్నారని రిపోర్ట్ లు చెపుతున్నాయి. మనిషి శరీరం కష్టపడాలి . శరీర నిర్మాణం కూడా నడిచేందుకు ఆహారం సంపాదన కోసం ఆలోచన కోసం నిశితమైన […]

గ్రేప్ ఫ్రూట్ రసం శక్తిమంతమైన మెడిసన్

దబ్బ పండు జాతికి చెందిన గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ కు మెనో పాజ్ కు దగగ్రగా వుండే స్త్రీలు ప్రతిరోజు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి నిల్వలున్న ఈ గ్రేప్ ఫ్రూట్ తెలుపు పింక్ డ్యూబీ  రెడ్ రంగుల్లో దొరుకుతుంది. ఇదొక అద్భుతమైన మెడిసన్ వంటి దాని కెఫిన్ వంటి మందులు శరీరంలో ఎంత చురుగ్గా పనిచేస్తాయో ఈ జ్యూస్ అంతశక్తివంతంగా పనిచేస్తుందని చెపుతున్నారు. ఈ రసం ప్రత్యేకించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటున్న విషయం […]

నవ్వుతో మనో ధైర్యం

మన సంప్రదాయం అనుభవంతో ఇచ్చిన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అధ్యయనాలు ద్వారా ప్రూవ్ చేసుకుంటూ ఉంటాయి. ఎవరికైనా చిన్న పాటి అనారోగ్యం అనిపించినా ఆస్పత్రి లో ఉన్నా పరామర్శించి రావటం మన సమాజ సంప్రదాయం. అదే విదేశాల్లో అయితే కుదరదు. రోగిని కలిసేందుకు అనుమతి ఇవ్వరు. చూడటానికి వచ్చేవారు అంటు రోగాలు తెస్తారని వారి భయం. కానీబంధు మిత్రులు వచ్చి పలకరించడం వల్ల  రోగికి మనో ధైర్యం వస్తుందనేది మన నమ్మకం. ఇప్పుడైతే మన పద్దతే సరైనది. […]

ఆఫీస్ కు స్పెషల్ అంటే ఇవే

చీరకట్టుతో వుండే హుందాతనమే వేరు. ఇవి ఇంట్లోనూ బావుంటాయి. ఆఫీస్ కు కంఫర్ట్ గా ఉంటాయి. సాధారణంగా పార్టీ వేర్ డిజైనర్ వేర్ ప్రత్యేక సందర్భాల కోసం వెతికి బీరువాలు నింపేస్తారు. కానీ ఆఫీస్ వేర్ మాత్రం ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిందే కాటన్ నేత వంటివి ఇప్పుడు ఆధునిక డిజైన్లలో వస్తున్నాయి. షిఫాన్ జార్జెట్ వుండనే వున్నాయి. కాకపోతే ఆఫీస్ విషయానికొస్తే చిన్న ప్రింట్లు లేత రంగులే బావుంటాయి. డిజైన్స్ ఎంత తక్కువ వుంటే  అంత సింపుల్ గా […]

నుదుటి పై ట్యానింగ్ పోతుంది

మొహమంతా తెల్లగా లేదా ఉన్న  ఛాయతో చక్కగా వుంటూ నుదుటి పైన చెంపల పక్కన ట్యాన్ అనిపిస్తూ వుంటుంది. ఈ నలుపు పోగొట్టుకోవటం కోసం వేపాకు పూత చాలా బాగా ఉపయోగపడుతుంది. లేత వేపాకులు మెత్తగా నూరి కొద్దిగా పసుపు కలిపి దాన్ని మొహానికి రాసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం మృదువుగా మారటమే కాక మచ్చలాంటివీ పోతాయి . చెంచా వేపాకు పొడి కొద్దిగా గులాబీ పొడి పెరుగు పాలు కలిపి పూతలా వేసినా ఎండ వేడికి […]

వారానికోసారైనా క్లీన్ చేయాలి

మనం కొనే వస్తువుల్లో మనకి ఎంతగానో ఉపయోగపడే వస్తువుల లిస్ట్ రాస్తే మొదట ఫ్రిజ్ పేరు రాయాలి. ఇంత బాగా ఉపయోగపడే ఫ్రిజ్ ను కనీసం నెలకోసారి క్లీన్ చేయమంటారు నిపుణులు. ఫ్రిజ్ లో వుండే కెచెప్  సీసా మూతలు జామ్ బార్ మూతల పై మైక్రోబ్స్ యథేచ్ఛగా తిరుగుతాయి. ఎదో ఒకటి బతికిన ఆనవాళ్లు తప్పకుండా ఉంటాయి. ఇటువంటి వాటని వారంలో ఒక్కసారైనా సబ్బు నీళ్లతో తుడుస్తూ ఉండాలి. ఇది వీకెండ్ పనుల జాబితా లో […]

ఇవి వంటింటి రహస్యాలు

ఎన్ని నేర్చుకున్నా వంటగదిలో మనకింకా ఎన్నో తెలియని విషయాలు వుంటూనే వుంటాయి. కూరగాయలు మాంసం చేపలు వుడికించే సమయంలో పెరుగు కలిపితే పోషక విలువలు పెరుగుతాయి. పెరుగు కాల్షియం ప్రోటీన్లు విటమిన్ బి 12 కు మంచి ఆధారం పెరుగువల్ల పదార్ధాలకు అదనపు రుచి పోషకాలు దక్కుతాయి. నీళ్లలో వెనిగర్ వేసి స్ట్రా బెర్రీస్ ,గ్రేప్స్ వంటి పండ్లను కడగాలి. బట్ట తో తుడిచి ఆరనిచ్చి మూతవున్న డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెడితే పాడవకుండా ఉంటాయి. […]

వీళ్ళకి అందం పైనే శ్రద్ధ

నవ్వుతూ తుళ్ళుతూ అందరినీ  ఆటపట్టిస్తూ  ఎంతో చలాకీగా జలపాతాల్లా  కనిపించే టీనేజర్లతో ఇటీవల కాలంలో ఏదో ఓక్ టెన్షన్ కనిపిస్తోందని ఆందోళన గా కనిపిస్తున్నారని పలు సర్వే లు చెపుతున్నాయి. ఈ ఏజ్ లో బాలికల పై పడుతున్న ఒత్తిడి కారణంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది తాజా అధ్యయనం రిపోర్ట్. గర్ల్ గైడింగ్ యుకె. మెంటల్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మేగజైన్లు వెబ్సైట్స్ లో కనిపించే సెలబ్రెటీల కబుర్లు వాళ్ళ […]

సింపుల్ క్లాసిక్ లుక్ కోసం గ్రే కలర్

బ్లాక్ గ్రే కొంచెం దగ్గర దగ్గరే వుంటాయి కానీ బ్లాక్ కలర్ డ్రెస్ లు ఏ  సందర్భానికైనా బాగానే ఉంటాయి. కానీ ఆఫీస్ వర్క్ కు ఫార్మల్ గా కట్టుకునే చీర డ్రెస్ సూట్ ఏదైనా గ్రే కలర్ సూటవుతుందంటారు. దాన్లో లెక్కలేనన్ని షేడ్స్. చార్కోల్ గన్ మెటల్ కలర్స్ నేవీ బ్ల్యూ  దృఢత్వం ఆత్మ విశ్వాసం తెలిపే లాటిన్  బ్లూ క్లాసిక్ స్మార్ట్ నెస్ ను ప్రతిబింబిస్తాయి. వస్త్ర శ్రేణి ఎలాంటిదయినా  సిల్క్ కాటన్ పట్టు […]

తేనెల్లాంటి మాటలు స్నేహితుల్ని తెస్తాయి

నీహారికా, నువ్వడిగిన దానికి ఓ పద్యం సమాధానంగా  ఉంది. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ‘ అని. ఎవళ్ళనీ నొప్పించకుండా సంతోషపెడుతూ స్నేహంగా ఉండటం కష్టమే. కానీ అసాధ్యం కాదు. అందుకు సుమతీ  శతకం లో చెప్పినట్లు తప్పించుకు తిరగనక్కర్లేదు కానీ మాటలు రువ్వినట్లు కాకుండా పిల్ల తెమ్మెర లాగా తాకినట్లు వాడితే అందరితో కలుపుకుపోవచ్చు. ఇరుగు పొరుగు స్నేహితులు బంధువులు తోటి ఉద్యోగులు కుటుంబ సభ్యులు ఎవరితోనైనా చెరగని చిరునవ్వుతో మాట్లాడితే చాలు. […]

భారీ బ్రేక్ ఫాస్ట్ అంటే ఇదే

రోజంతా ఆకలి అంతగా వేయకుండా శక్తితో ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ భారీగా ఉండాలంటూ ఉంటారు అసలింతకీ మహారాజుల్లాగా తినగలిగే ఆ బ్రేక్ ఫాస్ట్ లో ఏముండాలి అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్ సూత్రాన్ని అనుసరించాలి. ప్రోటీన్లు అధికంగా వుండే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు చికెన్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లు వాల్ నట్స్  బాదం పప్పులూ  వుండాలి. శాఖా హారులైతే పనీర్ మొలకలు మంచి ఛాయిస్. ఇటువంటి బ్రేక్ ఫాస్ట్ నెమ్మదిగా జీర్ణం  అవుతుంది. […]

సొంత గుర్తింపు కోసం నిరంతర శ్రమ

ఈనాటి కూతుళ్లు ఎంతోమంది తండ్రి వ్యాపారంలో బాధ్యత తీసుకుంటున్నారు. ముఖేష్ అంబానీ పేరు వినని వాళ్లుండరు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత ఆయన కూతురు ఇషా అంబానీ చిన్నప్పటినుంచే చదువుల్లో దిట్ట. సైకాలజీ లో డిగ్రీ పూర్తీ చేసింది. అతి చిన్న వయసులో తండ్రి నడిపే సంస్థలకు బోర్డు డైరెక్టర్ గా ఎన్నికైంది. ఫోర్బ్స్ గ్లోబల్ యంగెస్ట్ బిలీనియర్ గా ద్వితీయ స్థానం లో వుంది. పవర్ బిజినెస్ ఉమెన్ గా ఎన్నికైంది. వ్యాపార మెళకువలు […]

ప్రతీదానికీ శిక్షణోకటుంది

ఇప్పటి యూత్ చాలా మంది ఛాయిస్ బుల్లితెర లేదా సినిమా లేదా సినిమా చుట్టూ వుండే ఉద్యోగావకాశాలు గురించే ఆలోచిస్తూ వుంటారు. మంచి ఫేస్ ఫీచర్స్ వుండే తెర  పైకి ఇతరత్రా క్రియేటివ్ లక్షణాలుంటే తెరవెనక్కీ తేలికగానే అవకాశాలు దొరికే రోజులివి. మంచి వాయిస్ ఉంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదా వాయిస్ వోవర్స్ కు ట్రై చేయచ్చు. చక్కని గొంతును అథారిటేటివ్ గామార్చాలంటే వాయిస్ డిమాండింగ్ గా వుండాలంటే  పోశ్చర్ నిఠారుగా వుండాలి. మెడ భుజాలు […]

ఇవి అమ్మాయిల వార్డ్రోబ్ లో ఉండాల్సినవే

కొన్ని రకాల డ్రెస్ లు పురుషులకే పరిమితం అనుకుంటారు అమ్మాయిలు మంచి సూట్లు ప్యాంట్లు షర్టులు ఇలాంటివి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ శ్రీ పురుష బేధం లేకుండా ఆఫీస్ లకు వేసుకునే ఫార్మర్స్. కాకపోతే మరీ సీరియస్ గా కనిపించకుండా కొన్ని కొత్త ప్రయోగాలు చేయాలి. జీన్స్ కాటన్ ప్యాంట్లు స్ట్రెయిట్ పెన్సిల్ కట్ తో ఉండేలా చూసుకుని దానిపైన పొడవాటి కుర్తీ వేసుకుంటే బావుంటుంది. పొడవాటి కుర్తీలకు లూజ్ గా వుండే షర్టుల్లకు పలాజో లు […]

పచ్చ బొట్టు పోగొట్టచ్చు

ఉత్సాహం కొద్దీ అప్పుడున్న మూడ్ కొద్దీ టాటూలు వేయించుకొంటారు గానీ తర్వాత అదేదో ఫ్యాషన్ ట్రెండ్ కాదని సరదా పోతుంది. దాన్ని తొలగించుకోవటం  అదో సమస్య. సరైన పరికరాలు వాడితే చర్మం పైన ఆ జ్ఞాపకం తొలగించుకోవచ్చు. డెర్మటాలజిస్టులైతే క్యూ స్విచ్ ఇండియా లేజర్లను టాటూ మరకల్ని తొలగించేందుకు వాడతారు. అయితే టాటూల రిమూవల్ టెక్నిక్స్ ని నిర్ణయించేది టాటూలో వాడిన రంగులు. నలుపు నీలం రంగుల పచ్చ బోట్లను క్యూ స్విచ్ ఇండియా లేజర్లతో తొలగించవచ్చు. […]

హాయిగా నిద్రపోకపోతే ప్రాబ్లమ్

ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోదా అనుకుంటే చాలా పొరపాటు. నిద్ర చాలినంత లేకపోతే జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరణ గ్లూకోజ్ మెటాబాలిజమ్ రక్తపోటు వంటి ముఖ్యమైన శారీరిక పనితీరు ప్రభావితం అవుతుందని చికాగో పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రపోయిన ప్రయోగాత్మక పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్నీ గుర్తించారు, ఆరుగంటల కంటే తక్కువసేపు నిద్రపోవటం […]

వేడిగా ఉంటే చాలా కష్టం

జిమ్ లో లేదా యోగానెషన్ లో ఎంత ఉష్ణోగ్రత వుండాలో  ఎప్పుడూ డౌట్ గా వుంటుంది. అంటుంటారు. చాలా మంది ఎక్సర్సైజులు చేస్తున్నపుడు ఎ.సి కట్టేస్తారు. కూడా. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెపుతారంటే ఎక్సర్ సైజులు చేస్తుంటే 23 డిగ్రీల ఉషోగ్రత ఐడియల్ టెంపరేచర్ అమీ . ఈ విషయం అధ్యయనాల్లో కూడా తేలింది. వేడి వాతావరణంలో వర్కవుట్ల వల్ల  డీహైడ్రేషన్ వస్తుంది. ఒక్కసారి వడ దెబ్బ కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. వేడిగా వున్న గదిలో […]

నీళ్లు తాగటం ప్రాక్టీస్ చేయాలి

మన శరీరంలో 60 శాతం నీటిలో కూడిన ద్రవాలుంటాయి. ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు పోషకాలను గ్రహించేందుకు రక్త సరఫరా సాఫీగా జరగటానికి లాలా జాలం ఉత్పత్తికీ రకరకాలుగా తోడ్పడతాయి. తగినంత నీరు తాగితేనే ఈ ద్రవాలన్నీ సరైన పాళ్ళలో చక్కని నియంత్రణలో ఉంటాయి. నీరు బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఎలాంటి క్యాలరీలు లేవు. అలాగే తగినన్ని నీళ్లు అందకపోతే కండరాలు అలసిపోయి నిస్సత్తువ కలుగుతుంది. వృధాప్య ఛాయలు బయటపడనీయకుండా చర్మం నిగనిగలాడేలా చేసేది నీరే. […]

బియ్యంతో అద్భుత సౌందర్యం

అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల  మృత కణాలు పూర్తిగా పోయి […]