Friday, 14 Aug, 2026

ఇది మరీ సౌకర్యం

ప్యాంట్ కి షర్ట్ కి జేబు లున్నట్లే అందమైన చీరకు ఈ  ప్యాకెట్ కుట్టేస్తున్నారు డిజైనర్లు. పూసలు,అద్దాలు జరీ దారాలతో పాకెట్ క్లాత్ ఎంబ్రాయిడరీ చేసి దాన్ని చీరకు జత చేస్తున్నారు. ఒక్కసారి జాకెట్,పాకెట్ ఒకే ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసి స్టయిల్ లుక్ తీసుకొస్తున్నారు. షర్ట్స్ బ్యాగ్ తప్పనిసరి అవసరమైన అమ్మాయిలకు ఈ ప్యాకెట్ శారీస్ అనువుగా ఉంటున్నాయి.ఫోన్,డబ్బులు పెట్టుకొని వెళ్లేందుకు వీలుగా ఉండటం తో ఈ ప్యాకెట్ స్టయిల్ ట్రెండ్ అయిపోయింది.

నృత్యమే జీవితం

చెన్నయ్ కు చెందిన రాణీ రామస్వామి భారత నాట్య కళాకారిణి మూడు దశాబ్దాల క్రితం అమెరికా లోని మినియా పోలీస్ లో రాగమాల డాన్స్ కంపెనీ కి శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ జాతీయ అంతర్జాతీయ కళాకారులతో కలిసి పని చేస్తోంది రాణీ రామస్వామి ఆమెతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు అపర్ణ అశ్విని కూడా ఆమె తోడుగా ఈ ప్రయాణంలో ఉన్నారు. హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన రిటన్ ఇన్ వాటర్ నృత్యరూపకం వాళ్ల ముగ్గురికి […]

మల్టిపుల్ రింగ్స్

కొన్ని శుభ సందర్భాల్లో అన్ని వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటారు అదే ఇప్పుడు మల్టీ రింగ్, లేదా స్టాకింగ్ రింగ్ స్టేట్ మెంట్ పీస్ అయిపోయింది. బెస్ట్ స్టాకింగ్ ఐడియాలు చూస్తే ఇన్ని రకాల ఉంగరాలు చేయచ్చు అని ఆశ్చర్యం వేస్తుంది. అద్భుతమైన క్రియేటివిటీ తో ఈ ఉంగరాలు బాలీవుడ్ అందాల తారలు అందరూ ఇష్టపడేలా చక్కని డిజైన్లతో వచ్చాయి. ఈ కాలపు అమ్మాయిలు కూడా ఫ్యాషన్ కోసం స్టాకింగ్ రింగ్స్ ని తప్పనిసరిగా ధరిస్తున్నారు.

చుండ్రు తగ్గుతుంది

షాంపూల కంటే కుంకుడు కాయలు వంద రెట్లు మంచివంటున్నారు ఎక్సపర్ట్స్. వీటిలో ఉండే యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది.కుంకుడు రసం లో మెంతిపిండి, మందార ఆకులు కలిపి రెండు రోజులకొకసారి   తలస్నానం చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది. వీటిలో ఉండే ఇలాంటి అలర్జీ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మొటిమలు మచ్చలు పోగొడతాయి.

ఓ అమ్మ కదా

తన బిడ్డలను తనకు అప్పగించాలని నార్వే ప్రభుత్వం పై సాగరిక చక్రవర్తి చేసిన పోరాటం ఇప్పుడు రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలు ‘మిసెస్‌ ఛటర్జీ వర్సస్‌ నార్వే’ సినిమాగా వచ్చి విజయం సాధించింది. భారతదేశంలో అలవాటైన పద్ధతిలో చేత్తో అన్నం తినిపించడం పాపాయి పక్కన పడుకోవడం వంటివి బ్యాడ్ పేరెంటింగ్‌ రిపోర్ట్ చేసి నార్వే లో పిల్లల సంరక్షణ సభ్యులు పిల్లలను పోస్టర్ పేరెంటింగ్ లో ఉంచారు. దూరమైన పిల్లల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సాగరిక […]

ఆమెదే తొలి అడుగు

బెంగళూరుకు చెందిన అదితి అశోక్  ఐదేళ్ల వయసులోనే క్రీడారంగంలో అడుగుపెట్టింది బెంగళూరు గల్ఫ్ క్లబ్ కర్ణాటక గల్ఫ్ అసోసియేషన్ తరఫున ఎన్నో పోటీల్లో పాల్గొన్నది తాజాగా ఎల్.పి.జి.ఏ ప్రపంచ ర్యాంకింగ్ టాప్ 50 లోకి ప్రవేశించింది.ఆ ఘనత అందుకున్న తొలి భారతీయురాలు అదితి.

ఆంజనేయుని సృష్టికర్త చారువి అగర్వాల్ పేరున్న యానిమేటర్ పురాణ పాత్రలను సృష్టించటం లో ఆమెకు ఆమె సాటి.హనుమాన్ చాలీసా కు దృశ్యరూపం ఇచ్చా రామే 2021 లో డిస్నీ లో ది లెజెండ్ హనుమాన్ వెబ్ సిరీస్ చారువి చేసింది ఆమె సెశిల్పి క్లే ట్రానిక్స్ కూడా ఎన్నో మీనిమేచర్స్  తయారు చేసింది. 25 వేల చిరు గంట లతో 25 అడుగుల ఎత్తు ఆంజనేయ విగ్రహం తయారు చేసింది. ఈ విగ్రహం లిమ్కా రికార్డ్ లోకి […]

ప్రకటనల్లో మహిళ కోణం  

రీడిఫ్యూజన్ బ్రాండ్ సొల్యూషన్ సంస్థ ఆల్ విమెన్ యాడ్ ఏజెన్సీ ప్రారంభించింది టిస్టా సేన్. దానికి డైరెక్టర్ చైర్ పర్సన్ తన్వి గోయిల్  ఈ సంస్థలో అందరూ మహిళా ఉద్యోగులే ఒక నివేదిక ప్రకారం ఎన్నో బ్రాండ్ లకు మహిళలే ఎక్కువ కొనుగోలు దారులు. ప్రకటనల్లో స్త్రీ కోణాలను సృజించటం వ్యాపార, వాణిజ్య రంగాల్లో కొత్త వరవడి సృష్టించటం తమ లక్ష్యం అంటారు.

స్త్రీల కోసం పింక్ పార్కులు

ఢిల్లీ లోని 250 వార్డుల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉన్న పింక్ పార్కులు రానున్నాయి. ఈ పార్కుల్లో అందరూ స్త్రీలే పని చేస్తారు. పదేళ్లు దాటిన మగ పిల్లలకు ఇందులో ప్రవేశం లేదు. పిల్లల ఆరోగ్యం కోసం తమకు కాస్త విరామం ఆహ్లాదం కోసం స్త్రీలు ఈ పార్కుల్లో హాయిగా స్వేచ్ఛగా ఉండచ్చు. సిసి టీవీలు కాపలా తప్పనిసరిగా ఉంటాయి.

వేసవిలో రక్ష

ఈ వేసవిలో ఆరోగ్యపరంగా కీరదోస ఎంతో మేలు చేస్తుంది. అధిక శాతం నీటితో డిహైడ్రేషన్ సమస్యకు గొప్ప పరిష్కారం. పీచు ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి పొట్ట, పేగులు శుభ్రపడతాయి. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయి భయపెట్టే రొమ్ము, అండాశయ క్యాన్సర్ ల నుంచి రక్షణ ఇస్తుంది.

ఆర్.జె కేరాబాయి  

72 సంవత్సరాల కేరాబాయి ఫేమస్ రేడియో జాకి మహారాష్ట్ర లోని మహాస్వాద్ లో ఉంటుంది. మన్ దేశీ అనే కమ్యూనిటీ రేడియో ద్వారా చక్కగా పాడుతుంది. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం లో కూడా పాల్గొన్నది. యుఎస్ ఇంటర్నేషనల్ బ్రాడ్ కాస్టర్ వాయిస్ ఆఫ్ అమెరికా తారాబాయ్ జీవితాన్ని వాటర్ ఫర్ గోల్డ్ పేరుతో రూపొందించింది. ఇంటి పనులు,వంట పనులు, పొలం పనులు చేస్తూ కనిపించే తారాబాయి ఆశువుగా కవిత్వం కూడా చెబుతుంది.

తీయని వ్యాపారం

జాగర్ కేన్ పేరుతో నాణ్యమైన బెల్లం పొడి వ్యాపారం చేస్తోంది నవనూర్ కౌర్. చక్కెర కు ప్రత్యామ్నాయం బెల్లమే అని చెప్పే నవనూర్ కౌర్  తయారు చేసే బెల్లం 9 నెలలు నిల్వ ఉంటుంది ఆమె జన్మస్థలం లుధియానా. ఆమె బ్రాండ్ జాగర్ కేన్. గత ఏడాది రెండు కోట్ల టర్నోవర్ సాధించింది. పంజాబ్ లోని 22 జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది.

ఇలా చేయకండి

సాధారణంగా చపాతీ పరోటాలను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి లంచ్ బాక్స్ లో పెడుతూ ఉంటారు.ఈ కాగితంలో వేడి చపాతీలు చుడితే మూత్రపిండాల వ్యాధులు వస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్.అలాగే ఆమ్ల స్వభావం ఉన్న వెనిగర్ టమాటో చింతపండు కూడా ఈ అల్యూమినియం ఫాయిల్ లో ప్యాక్ చేయకూడదు చపాతీలను మెత్తని కాటన్ బట్టలో చుట్టి ప్యాక్ చేసుకో మంటున్నారు ఎక్సపర్ట్స్.

అత్యుత్తమ రుచులు

చిన్న వయసులోనే స్టార్ చెఫ్ గా పేరు తెచ్చుకున్న ముంబై కు చెందిన నియతి రావు.ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా 2023 జాబితాలో చోటు సంపాదించింది.కోపెన్‌హాగన్ లో వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్ నోమాలో ఇంటర్న్ షిప్ చేసి నియతి ‘ఎక్కా’ రెస్టారెంట్ ప్రారంభించింది. 14 నెలల్లో ఎక్కా ఆసియాలోని అత్యుత్తమ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సంపాదించింది.భారతీయ వంటకాలలో ఉపయోగించే దినుసులతో కొత్త ప్రయోగాలు చేసే నియతి ఎన్నో కొత్త రుచులు పరిచయం చేసింది.

క్రీడా స్ఫూర్తి

బౌ సామ్నాంగ్ కంబోడియా రన్నర్ అయిదువేల కిలో మీటర్ల రేసులో పాల్గొన్నది ఆమె కటిక పేదరికంలో వట్టి పాదాలతో సాధన చేసి నేషనల్ ఆధ్లటీ గా ఎదిగిన సాహసి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆరోజు జోరున వాన కురుస్తుంది అప్పటికే విజేత పేరు కూడా ప్రకటించారు కానీ కళ్ళల్లో వర్ష దారాలు పడుతున్న కాలు పటుతపుతున్న ఎలాగో పరుగు పూర్తి చేసిన సామ్నాంగ్ వీడియో వైరల్ అయిపోయింది.సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ లో చోటు చేసుకున్న ఈ […]

ఇన్ స్టెంట్ చీరెలు

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని స్టైల్స్ వచ్చినా చీర కట్టుకున్న స్థానం ఎప్పటికీ పోదు. చీర కట్టు అనుకున్నంత సులువు కాదనే ఉద్దేశ్యం తో  ఫ్యాషన్ డిజైనర్స్ ఇన్ స్టెంట్ శారీలను సృష్టించారు. దోతి, స్కర్ట్, పలాజో, జంప్ సూట్ మోడల్స్ తో సిల్క్ కాటన్ జార్జెట్ ఎంబ్రాయిడరీల ఫ్యాబ్రిక్స్ తో ఈ వన్ మినిట్ శారీస్ వచ్చేసాయి ఇవి వేసుకునే చీరలు. ఇతర డ్రెస్సులు మాదిరే వీటిని ధరించే వీలు ఉండటంతో ఇవి ఈ రోజుల్లో ట్రెండ్ […]

పెళ్ళికి గౌరవం

పోస్టల్ శాఖ తాజాగా పెళ్లికూతుళ్ళ బొమ్మలతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ లు విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల లోని వివాహ సంప్రదాయాలు యావత్ దేశానికి చాటి చెప్పాలని ఉద్దేశ్యం తో పోస్టల్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. పెళ్లి కూతురి కట్టు బొట్టు ఆభరణాలు ఇతర అలంకారణాలతో ఆ సంప్రదాయం ఏ రాష్ట్రానికి సంబంధించినదో స్టాంప్ పైన ముద్రించింది. పంజాబ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కేరళ రాష్ట్రాల స్టాంప్ లు ఇప్పుడు విడుదలయ్యాయి మిగతా రాష్ట్రాల […]

తొలి గ్రాఫిక్ నవల

దేబాస్మిత దాస్‌గుప్తా గ్రాఫిక్ నవల రచయిత్రిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తాజాగా ఆమె రాసిన టెర్మినల్-3 గ్రాఫిక్ నవల కు విశేష ఆదరణ లభించింది. మాస్ కమ్యూనికేషన్స్ చదువుకొన్న దేబాస్మిత సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియా యూరప్ ఫౌండేషన్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసింది. ఆర్ట్ పాజిటివ్ అనే స్వచ్ఛంద సంస్థ కు శ్రీకారం చుట్టింది.ఆమె రాసిన నవల చదువుతూ అందులో బొమ్మలు చూస్తుంటే ఆ బొమ్మల ద్వారా సినిమా చూస్తున్నట్లు […]

మిన్ను మణి

మిన్ను మనీ కేరళ కు చెందిన తొలి గిరిజన మహిళ క్రికెటర్ కేరళలోని వయనాడ్ జిల్లా లోని గిరిజన గూడెం కరూబియ గిరిజన తెగ బ్రహ్మగిరి కొండల అంచున జీవిస్తారు. మిన్ను మణి వయనాడ్ జిల్లా జట్టుతో అండర్ 16 జట్టుతో కేరళ రాష్ట్ర మహిళా జట్టుతో ఆడింది. ఇప్పుడు ఆమెను విమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం 30 లక్షల కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నాయి. మిన్ను మణి భారత్ అండర్ 23 జట్టులో ఆడింది. […]

సులువుగా ఫేస్ ప్యాక్

ఇంట్లోనే ఉండే ఇంగ్రిడియంట్స్ తో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.అలోవెరా జెల్ తో ముఖాన్ని మసాజ్ చేస్తే ఇరిటేషన్ తగ్గి రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. ఒక బౌల్ లో తేనె, అర స్పూన్ ఆల్మండ్ ఆయిల్,మిల్క్ పౌడర్ కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది.నారింజ రసం, తేనె అలాగే అరటిపండు గుజ్జు, రోజ్ వాటర్ మిశ్రమం నిమ్మరసం కూడా చర్మాన్ని కాపాడతాయి.