Saturday, 27 Jun, 2026

ఎండు ద్రాక్ష ఆరోగ్యం

పోటాషియం,కెరోటిన్,విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఎండు ద్రాక్ష ఎండు కర్జురం ఈ వేసవి రోజుల్లో తినడం వల్ల ఎంతో ప్రయోజనం అంటున్నారు వైద్యులు జీర్ణ శక్తికి ఇది చాలా మంచిది అంటున్నారు. బీపీ నియంత్రణకు కూడా మంచివే ఊపిరితిత్తులు పని తీరు మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే పీచు కారణంగా మలబద్దకం, డయేరియాని నివారించి మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఫినాలిక్ పదార్ధాలు క్యాన్సర్లు రానివ్వవు. మధుమేహం తో బాధ పడే వాళ్ళకు ఇవి స్నాక్స్ […]

మచ్చలు పోతాయి

అమ్మాయిలకు మొటిమలు పెద్ద సమస్య. ముఖ్యంగా ఇవి మచ్చలు పడితే ఒక పట్టాన పోవు. మందుల కంటే వంటింటి చిట్కాలే బాగా పని చేస్తాయి. నిమ్మరసం,రోజ్ వాటర్,శనగ పిండి కలిపి పెస్టుల చేసి మొహానికి అప్లై చేసి ఆరాక కడిగేస్తే నెమ్మదిగా మచ్చలు పోతాయి. ఆపిల్ సిడర్ వెనిగర్ లో తేనె,నీళ్ళు కలిపి మొహానికి పట్టించి ఓ అరగంట తర్వాత కడిగేసిన మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె బాగా పని చేస్తుంది. కమలా తొక్కలు పొడి […]

ఒక్కతే ఉంటుంది

సైబీరియాలోని ఒల్కాన్ ద్వీపంలో ల్యుబోవ్ మొరఖ్ డోర్ అన్న 76 ఏళ్ళ వృద్దురాలు ఒక్కతే నివశిస్తుందట. ఆమె పైన ఒక డాక్యూమెంటరీ కూడ వచ్చింది. సంవత్సరంలో ఐదు నెలలు మంచుకు గడ్డకట్టిపోయే ఈ ద్వీపంలో కుక్కలు,పిల్లులు,ఆవులు,గొర్రెలు పెంచుకుంటూ వాటికి కావల్సిన తిండి,తిప్పలు చూసుకుంటుంది. స్కెటింగ్ చేస్తూ బైకాల్ సరస్సు దగ్గరకుపోయి మంచినీళ్ళు తెచ్చుకుంటుంది. ఇక వేసవిలో కలప సేకరించటం తనకోసం కావలిసిన ఆహారపదార్ధాలు సమకుర్చుకోవటం చలిలో ఏందొరకవో అవన్ని చేర్చి పెట్టుకోవడం చేస్తు ఉంటుందట. ఈ వయసులో […]

నైట్ షిఫ్టులే కారణం

ఇప్పుడు చాలా ఉద్యోగాలో నైట్ షిఫ్టులు తప్పనిసరవుతున్నాయి. ఒక అధ్యాయనం ఈ రాత్రి వేళ డ్యూటీ చేసే వాళ్ళు మాములు వాళ్ళ కన్నా అదనపు బరువు పెరుగుతున్నారని తేల్చింది. రాత్రి వేళ చేసే ఉద్యోగాలతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రాత్రివేళ నిద్ర మేల్కోనేందుకు తాగే పానీయాలు ఎక్కువ ఆహారం తీసుకోవటం పోషకాహరం పై శ్రద్ద చూపించే అవకాశం లేకపోవడం,పగలు నిద్ర పోవడం వల్ల ఇవే అధిక బరువుకు కారణమవుతున్నాయంటున్నారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని నైట్ […]

కన్నీళ్ళు మంచివి

చీటికి మాటికి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే తప్పు కానీ మనసారా ఏడవటం వల్ల కూడా సానుకూల ఫలితాలుంటాయి అంటున్నాయి అద్యయనాలు. ఏడవటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం రెండు దక్కుతాయి. కన్నీళ్ళు కను గుడ్లు,రెప్పలకు తేమను అందిస్తాయి. కళ్ళను శుభ్రం చేస్తాయి. కన్నీళ్ళు యాంటీ బ్యాక్టిరియాగా యాంటీ వైరల్ గా పని చేస్తాయి. ఏడవటం వల్ల మనుషులు గూడుకట్టుకున్న దిగాలు, భారం పోయి మానసిక ప్రశాంతత దక్కుతుంది. భావోద్వేగాల ఒత్తిడి తగ్గిపోతుంది. హాయిగా నవ్వండి అన్న పదంతో పాటు […]

డబ్బుతో ఆయుర్దాయం

కొన్ని అద్యాయనాలు ఆలోచనలో పడేస్తాయి. డబ్బే సరస్వం కాదు డబ్బుతో అన్ని సమకూరవు మమతానుబంధాలను డబ్బుతో కొనలేము. వీటిని చిన్నప్పటి నుంచే వింటాం. కాని ఒక అధ్యాయనం డబ్బుకు ఆరోగ్యానికి సంబంధం ఉంది అంటుంది. డబ్బుతో ఆనందం ఉందో లేదో కాని ఆయుర్ధాయం మాత్రం పెరుగుతుందట. ఆదాయం బావుండి ఆర్ధికపరమైన ఒత్తిడి లేనివారిలో ఎక్కువ మంది 15 శాతం అధికకాలం జీవించారని సర్వే రిపోర్ట్స్ నివేదిక ఇచ్చాయి. ఆదాయం అధికంగా ఉన్న వారు మెరుగైన ప్రవర్తన, పొగ తాగే […]

సుగంధ భరితం

కడిమి చెట్లు ఉన్న చోట పార్వతి దేవి కొలువై ఉంటుందంటారు. నియోలా మార్కియా అనే శాస్త్రీయనామం గల కదంబ వృక్షం మంచి సువాసనతో మత్తెక్కించేటట్లుగా ఉంటాయి కదంబ పూలు. గుండ్రని టెన్నిస్ బంతుల ఆకారంలో మొదట్లో ఆకుపచ్చగా తర్వాత పసుపు బంగారు వర్ణంలో తర్వాత తెల్లగాను మారతాయి. ఈ పువ్వులు పార్వతి దేవి పూజలు జరిగే చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే కడిమి పూలు ఎక్కువ పూస్తాయి. ఆద్యాత్మిక పరంగానే కాక వాణిజ్యపరంగాను కడిమి చెట్టు ప్రత్యేకమే. […]

అతి నిద్ర అనారోగ్యం

ఏదైన అతిగా చేస్తే అనర్ధమే. నిద్ర చాలకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో అతిగా నిద్రపోతే అంతకంటే ఎక్కువే ఇబ్బందులు వస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయే వారితో పోల్చితే పదిగంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే వారిలో అనారోగ్యకర లక్షణాలు కనపడతాయంటున్నారు. ఎక్కువ సేపు నిద్రపోతే గుండె సమస్యలు వస్తాయి. శరీరంలో చురుకుదనం లోపిస్తుంది. ముఖ్యంగా బరువు పెరుగుతారు. ఈ విషయంలో మగవారికంటే మహిళలకే ముప్పు ఎక్కువ అంటున్నారు. రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతాయి. టైప్-2 […]

వేడుకకు వెలుగు

సాధరణంగా పగటి వేడుకల కోసం బంగారు నగలు ధరిస్తేనే బావుంటుంది. రాత్రి వేళ మెరిసే జాతి రాళ్ళు పాల్కి, కుందన, మోజనైట్స్, వజ్రాల నగలు కళ్ళకు మిరుమిట్లు గొలుపుతాయి. అమ్మాయిల అందం రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా చిన్ని వేడుకల కోసం వేసుకునే సంప్రదాయ నగల్లో పోల్కీ నక్లెస్ లు, కాసుల పేర్లు అందంగా ఉంటాయి. ఇప్పటి ట్రెండ్ కైతే రాంపరీ వరాల మాల, మరీ భారీ నగలు బావుండవు కానీ మిడిల్ లెంగ్త్ హారంతో పాటు మాంగ్ […]

ఇలా చేస్తే నష్టమే

అమ్మాయిలు కొత్త కొత్త హెయిర్ స్టయిల్స్ లో చూడచక్కగా బావుంటారు. కానీ జుట్టు దెబ్బతినిపోతూ ఉంటుంది. జుట్టు బాగా వెనక్కి దువ్వటం చేస్తారు. అలా కొన్నాళ్ళకు దువ్వుకొన్నాక మళ్ళీ పాపిడి తీసేందుకు ప్రయత్నం చేస్తే జుట్టు రాలిపోతుంది. నడి నెత్తి పైన కొప్పు ఫ్యాషన్ ఆ కొప్పు కోసం గట్టిగా దువ్వి మాడు వరకు పైకి లాగి కట్టడం వల్ల నొప్పి పుడుతుంది. కురులు లాగినట్లు అయి దెబ్బతిని జుట్టు పలచబడుతుంది. పిల్లలకు జుట్టు చెదిరిపోకుండా బిగితుగా […]

నోరూరించే రంగులు

ఎప్పుడో ఒకప్పుడు పత్యంగా తినే బ్రెడ్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ రూపం మార్చేసుకుంది. కోరిన రంగుల్లో నోరూరిస్తుంది. రంగుల కాయగురల్ని కలగలిపి చూడగానే తినాలనిపించేటట్లు మార్కెట్లో ప్రత్యక్షమైంది. పాలకూర లో బీట్ రూట్,చిలగడ దుంప, క్యారెట్ ,గుమ్మడి, టమాటాల పోషకాల నిలయంగా మార్చారు పాకశాస్త్ర నిపుణులు. ఈ రంగుల బ్రెడ్ తయారీ కష్టమే. కూరగాయాలు పుచ్చు వాసన రాకుండా డి హైడ్రెడ్ చేసి పోడి రూపంలోకి మారుస్తారు. దాన్ని బ్రెడ్ పిండిలో కలిపేసి రేయిన్ బో రొట్టెలు తయారు […]

మెరిసే ఫుడ్

రుచిగా ఉండేవి తింటుంటే కరకరమని శబ్దం వచ్చేవి. నోట్లో వేసుకుంటే జున్నులాగా కరిగిపోయేవి ఎన్నో పదార్ధాలు తిని ఉంటాం. ఇప్పుడు గ్లో ఇన్ ది డార్క్ ఫుడ్స్ వచ్చాయి. చిరు చికట్లో ఏ బర్గరో,కేకో ,కూల్ డ్రింక్ జిగేల్ మని మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఈ వెలిగే తిండిని నోట్లో పెట్టుకోవడం సరదానే కదా. నూడిల్స్,పాస్తా, డిజార్ట్‌ లు క్యాండీల్లో వాటిని మెరిసేలా చేసేందుకు టానిక్‌ వాటర్ ను గాని విటమిన్ బీ 12 గాని ,జెల్ […]

మధుబని సౌందర్యం

బీహార్ లోని సమస్తేపుర అనే రైల్వే డివిజన్ కేంద్రం నుంచి ప్యాసింజర్ రైలు మాత్రమే నడిచే మద్ధుబని స్టేషన్ ఇప్పుడు అతి సుందరమైన స్టేషన్ గా ఇప్పుడు ప్రఖ్యాతి చెందింది. స్వచ్చ భారత్ లో భాగంగా స్టేషన్ల సుందరీకరణ పోటీల్లో పెడితే మిధిలా చిత్రకళకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతపు కళాకారులు 90 శాతం మంది స్త్రీలు కూలీ చేసుకుంటు పొట్ట పోసుకుంటూ నిరుపేద కళాకారులు ఈ మధుబని స్టేషన్ ను పదిరోజుల్లో ఓపెన్ ఆర్ట్ గ్యాలరీగా […]

ఇదోక కారణం

వివాహితులు వారు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా సంతానోత్పత్తి తగ్గిపోతుందని చెబుతున్నారు ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆరు వేల మంది మహిళల పై ఈ పరిశోధన సాగింది. కొన్ని పండ్లు,ఇతర పోషకాలు తీసుకున్న మహిళలు త్వరగా గర్భం దాల్చటం వీరు గుర్తించారు. కేవలం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే మహిళలు కొన్ని వారాలు,నెలలు ఆలస్యంగా గర్భం దాల్చారట. ఈ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తూ గర్భదారణను ఆలస్యం చేసే జంక్ ఫుడ్ మానేయండనే సలహా ఇచ్చారట.

పిల్లల పై తండ్రి ప్రభావం

దురలవాట్లు ఎప్పుడు నష్టమే తాజా పరిశోధన ఒకటి తండ్రికి మద్యం తాగే అలవాటున్న ఊబకాయం ఉన్న ఒత్తిడిని ఎదుర్కునే సామర్ధ్యం తక్కువ ఉన్నా ఇవి వీర్యకణాలను ప్రభావితం చేస్తాయని దీని ద్వారా పూట్టబోయే బిడ్దలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారని చెబుతున్నారు. తండ్రి ఊబకాయంలో ఉంటే ఆ ప్రభావం పిల్లలపై పడి ఊబకాయం,డయాబెటిస్, గుండె సమస్యలతో పిల్లలు బాధపడతారని హెచ్చరిస్తున్నారు. తండ్రికి ఉండే దురలవాట్ల ప్రభావం రాబోయే తరాల పైన కూడా ఉంటుందని తల్లిదండ్రుల అనారోగ్యానికి పిల్లలు […]

గుర్తించండి

షేక్ హ్యాండ్ కూడా మనకు ఆరోగ్యం గురించి చెబుతుందట. ఒక పరిశోధన ఏం చెబుతుందంటే చేతులు కలిసే సమయంలో పటుత్వం తగ్గితే భవిష్యత్ లో గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. కొన్ని వేల మంది పై ఈ అధ్యాయనం జరిగింది. షేక్ హ్యాండ్ లో పటుత్వం లేకపోతే గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, క్యాన్సర్ బారిన పడి అకాల మృత్యువుకు గురైనట్లు కనుగొన్నారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకోని మర్యాద పూర్వకంగా ఎదుటివారికి ఇచ్చే షేక్ […]

వట్టి అబద్దాల కోర్లు

అబద్దాలు చెప్పడంలో ఆడవాళ్ళు ముందుంటారు అంటారు కాని ఈ విషయంలో మగవాళ్ళదే పై చేయి అంటున్నాయి అధ్యాయనాలు.పురుషులు రోజుకు అనేకసార్లు అబద్దాలు చెబితే స్త్రీలు రోజుకు మూడుసార్లు మాత్రమే అబద్దాలు చెపుతారట. బావోద్వేగాలు వెల్లడించటంలో పురుషులే ముందుంటారు. ప్రేమ,కోపం తదితర భావాలు ముందుగా వ్యక్తం చేస్తారు. అలాగే స్త్రీలు అంత త్వరగా బయటపడరు. బాధను స్త్రీలు ఓర్చుకున్నంతగా పురుషులు ఓర్చుకోలేరు. ఉరుములు ఉరిమినా సరే పురుషులే ఎక్కువ బయపడతారట. ఏదైన ఆడవాళ్ళు చెబుతుంటే సోది వినడం ఇష్టం […]

పార్టీకి వెళ్ళాలా

ఎదైన పార్టీలో మెరిసిపోవాలి ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటే ముందుగా అనార్కాలీ వైపు చూడండి అంటున్నారు స్టైలిస్టులు. హై వెయిస్టెడ్ స్కర్టులు క్రేప్ జార్జేట్‌ వి బావుంటాయి. జతగా టీ షర్ట్ ఇన్ షర్ట్ చేస్తే మరింత అందం. బ్రోకెడ్ వస్త్రంతో బాక్స్ ప్లీటెడ్ స్కర్ట్ పార్టీ లుక్ ఇస్తుంది. అలాగే జార్జెట్ లో ఫ్రంట్ సీ కట్ స్కర్ట్‌ వేసుకున్న కొత్తగా ఉంటుంది. ముదురు ఎరుపు, గులాబీ తెలుపు, నీలం రంగులు స్మార్ట్ లుక్ ని ఇస్తాయి. […]

ఆ మాత్రం శ్రద్ద అవసరం

ఈ వేసవి రోజుల్లో ఎండల్లో తల్లో మురికి చెమట చేరి జుట్టు వాసనగా ఉంటుంది. నిమ్మ రసం ఈ సమస్య నుంచి కాపాడుతుంది. నిమ్మరసం కప్పు నీళ్ళలో వేయాలి షాంపూ అయ్యాక జుట్టు కుదుళ్ళకు తగిలేలా రాసి కడిగేయాలి. జుట్టు పొడి బారినట్లు ఉంటే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత కడిగేస్తే మెత్తగా మెరుస్తూ ఉంటుంది. టామోట రసం కూడా మంచిదే. అలాగే టిట్రీ నూనెలో బ్యాక్టీరియా దూరం చేసే గుణం […]

ఆరోజుల్లో తినాలి

నెలసరి వస్తే కలిగే చిరాకు,అలసట కలిగే ఒత్తిడి తగ్గాలంటే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాల్షీయం తో పాటు మెగ్నిషియం ఎక్కువగా ఉండే అవిసె గింజలు,గుమ్మడి గింజలు,పొద్దు తిరుగుడు గింజలు పాలు పాల పదార్ధాకు తీసుకోవాలి. గ్రీన్, చామంతి వంటి హెర్బల్ టీలు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మంచి నీళ్ళు తాగాలి వీటి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఎదురవ్వదు. పండ్లు,కూరగాయలతో పాటు తృణ ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవాలి. నువ్వుల్లో ఒత్తిడి తగ్గించే ఖనిజాలు,మెగ్నిషియం,కాల్షియం […]