Thursday, 06 Aug, 2026

మహిళల రక్షణ ధ్యేయం

అస్సాం లోని లుండింగ్ లో పుట్టిన పల్లబి ఘోష్ బాలికల,మహిళల అక్రమ రవాణా నిరోధక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పదివేల మంది అమ్మాయిలను ఈ ఊబి నుంచి రక్షించారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో పీజీ చేసిన పల్లబి చదువు పూర్తి చేశాక హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి పనిచేసే శక్తి వాహిని అనే ఎన్జీవో ఏర్పాటుచేసి హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. హరియాణా,రాజస్థాన్,ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ లో పనిచేస్తుంది.

శక్తి సరాలు

దక్షిణ భారతదేశంలో చంప సరాలు,మాటీలు ఒక ఆచారం. ప్రాచీన ఆభరణంగా అలంకరణలో సంపూర్ణతకు చిహ్నంగా ఉండే ఈ ఇయర్ చైన్స్ వివాహ వేడుకల్లో వధువు అలంకరణ లో తప్పనిసరిగా వాడుతారు. పండగ రోజుల్లో ధరించే ఈ ఇయర్ చైన్స్ ఇప్పుడు మళ్లీ యువతుల్లో పాపులర్ అయింది. సిల్వర్, ఆక్సిడైజ్డ్,మెరూన్ కలర్ పూసలతో ముత్యాల మెరుపులతో ఈ చైన్లు స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. పెద్దవాళ్లు వీటిని శక్తి సరాలు అంటారు. చెవులు జుట్టు ప్రాంతంలో ఈ చెవి ఆభరణాలు […]

ఇది ఫ్యాషన్ స్టేట్‌మెంట్

మల్టీ లేయర్ చోకర్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే ఫ్యాషన్. సాధారణ చోకర్ మాదిరిగా కాకుండా రెండు నుంచి ఐదు వరుసల ముత్యాలు, ఇతర పూసలు మధ్యలో డాలర్ తో ఈ మల్టీ లేయర్ చోకర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇది భారీ ఆభరణం కనుక చెవులకు చిన్న స్టడ్స్,సింపుల్ గా వేలికి ఉంగరం చాలు హెవీ హెయిర్ స్టైల్ తో చోకర్ అందం రెట్టింపు అవుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇతర వేడుకలకు ఈ చోకర్ […]

గులాబీ మెరుపుల నగలు

గులాబీ రంగులో మెరిసే రోజు గోల్డ్ ఆభరణాలు ఇవాల్టి యువతలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ కోసం బంగారంలో ఎక్కువ శాతం రాగి కొద్ది పరిమాణంలో వెండిని కలుపుతారు ఎంత ఎక్కువ రాగి కలిపితే బంగారం అంత ఎరుపు రంగులోకి వస్తుంది గులాబీ రంగు వచ్చేంత రాగి కలిపి అన్ని రకాల ఆభరణాలు తయారు చేస్తున్నారు. 18 క్యారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, 21 శాతం రాగి,4 శాతం వెండి ఉంటుంది. రోజ్ గోల్డ్ […]

అందాల రోజ్ గోల్డ్

బంగారం రంగు మార్చుకొని రోజ్ గోల్డ్ గా ఈ మధ్యకాలంలో పాపులర్ అయింది. బంగారం, రాగి, వెండి లోహాల కలయిక ఈ రోజ్ గోల్డ్ పసిడి తో పోలిస్తే ఈ ఆభరణాల ధర తక్కువే సింపుల్ గా,ఎలిగెంట్ డిజైన్ లతో చిన్న పెండెంట్స్ ఉన్న రోజు గోల్డ్ హారాలు యువతులు  ఇష్టపడుతున్నారు. పెద్ద పెండెంట్లు జూకాలు, చోకర్లు ఈ రోజ్ గోల్డ్ ఆభరణాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. శుభ్రమైన మెత్తని గుడ్డతో తుడిస్తే చాలు ఈ రోజు […]

శీతాకాలపు సీరమ్  

చలిగాలులకు చర్మంలో తేమ తగ్గిపోయి పొడిబారి పగుళ్లు వస్తాయి. ఇందుకోసం ఇంట్లోనే సీరమ్ తయారు చేసుకోవచ్చు. కమల పండు తొక్కలు ఒక గిన్నెలో వేసి రెండు టేబుల్ స్పూన్ గులాబీ నీరు అర టేబుల్ స్పూన్ గ్లిజరిన్ విటమిన్ ఇ క్యాప్సిల్స్ నూనె కలపాలి. వీటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసి వడకడితే వచ్చే రసంలో కాస్త అలోవెరా గుజ్జు కలిపి సీసాలో భద్రపరుచుకుంటే రెండు మూడు వారాలు వాడుకోవచ్చు. క్రీమ్ రాసుకునే ముందు ఈ […]

వేసవి లో పర్ ఫెక్ట్ ప్యాక్

పెసరపప్పు ప్యాక్ తో చర్మం మెరిసిపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. పొట్టు పెసలు నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి అందులో టీ స్పూన్, టీ స్పూన్ బాదం నూనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇది రోజు మార్చి రోజు వేసుకుంటే మొహం తెల్లబడుతుంది. ఎండలో చర్మం నల్లబడి పోతే ఆ టాన్ వదిలేందుకు ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయమంటున్నారు.

ప్రత్యేకమైన రూపం

చల్లని సాయంకాలాలు షికారుకు వెళ్లేందుకు బాగుంటాయి మేకప్ ప్రత్యేకంగా ఉంటే లుక్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఫేర్ గా ఉన్నవాళ్లు బ్లష్ తో ముఖాన్ని మెరిపించవచ్చు.బ్లష్ తర్వాత రెగ్యులర్ ఫౌండేషన్ వేసుకుంటే చాలు. ఆధునికంగా కనిపించాలి అనుకుంటే గ్లిట్టర్ ఐ షాడో ఎంపిక చేసుకోవచ్చు. జరీ అంచు దుస్తులు వేసుకొని బంగారు లేదా వెండి షిమ్మర్ ఐ షాడో వేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. అలాగే డార్క్ లిప్ స్టిక్ కూడా మేకప్ ను మరింత అందంగా మార్చేస్తుంది.

అందమైన రాణి హారం

పండుగలు ప్రత్యేక సందర్భాల్లో సరికొత్తగా ప్రత్యేకంగా కనిపించాలి అంటే రాణి హారం ఎంచుకోమంటున్నారు డిజైనర్స్. చీరే చుడిదార్  వంటి ఆహ్వానానికి సరైన మ్యాచింగ్ రాణి హారం. లెహంగా, ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ దేనికైనా సరే నప్పుతోంది. ఈ హారం ముత్యాలు జేడ్స్‌ కుందన్లు కలిగిన మూడు ఐదు ఏడు వరుసల్లో రాణి హారం చాలా అందంగా ఉంటుంది. సంక్రాంతి ని ఆహ్వానిస్తూ రాణి హారం ధరిస్తే మెరిసిపోవడం ఖాయం ఈ ఒక్క నగే వెయ్యి నగలు పెట్టుగా […]

నిమిషాల్లో మేకప్

తక్కువ సమయంలో మెరిసేలా మేకప్ వేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. మాయిశ్చరైజర్ ఫౌండేషన్,రెండు కలిపి రాసేయచ్చు ముఖం డాల్ గా అనిపిస్తే లిక్విడ్ హైలైటర్ ని కొన్ని చుక్కలు కలిపి రాస్తే ముఖం మెరుస్తుంది ముఖం,కళ్ళకింద కన్సీలర్ వాడాలి. గడ్డం నుదురు బుగ్గలకు కాంపాక్ట్ లేదా పొడి మేకప్ పైపైన అద్దితే సరిపోతుంది. వాటర్ ప్రూఫ్ కాజల్ పెన్సిల్ తో కళ్ళు దిద్దుకొని నచ్చిన రంగు లిప్ గ్లాస్ వేసుకొంటే మేకప్ అయిపోయినట్లే.

బావుంటాయి

సాదా సీదా దుస్తులకు కాస్త ప్రత్యేకమైన రూపం ఇవ్వాలి అనుకుంటే ఇండో వెస్ట్రన్ జాకెట్స్ ఎంచుకోండి అంటున్నారు డిజైనర్స్. లాంగ్ ఫ్రాక్, లెహంగా, గౌను ఇలా ఎలాంటి డ్రెస్ అయినా చక్కగా మ్యాచ్ అవుతాయి. ఈ జాకెట్స్ డోరీలు,బటన్స్ క్రాస్ కట్స్ వంటి వేర్వేరు  డిజైన్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి జాకెట్స్ ధరిస్తే చెవులకు హ్యాంగింగ్స్ తప్ప ఎలాంటి ఆభరణాలు అవసరం ఉండదు వేసుకున్న డ్రెస్ మెటీరియల్ కు తగ్గట్టు నచ్చిన జాకెట్ ఎంచుకోవాలి.

బ్లౌజ్ కు అందం

ఎన్నో అందమైన దృశ్యాలు పెయింటింగ్స్ రూపంలో చూస్తూ ఉంటాం చివరకు క్యాలెండర్ లో కుట్టు మిషన్ లు, రేడియోలు ఇతర ఎన్నో పెయింటింగ్స్ ఇప్పుడు బ్లౌజ్ ల పైన బ్యాక్ స్పేస్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ కి వేదిక అయ్యాయి బ్లౌజ్ లు. హై నెక్ బ్లౌజ్ లు ఇష్టమైతే ఇలా ప్రత్యేకమైన డిజైన్ల ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. రొటీన్ ఆకులు, పువ్వులు కాకుండా మోడరన్ ఆర్ట్ కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ లు గా మారిపోయాయి. ఎంబ్రాయిడరీ […]

స్టయిల్ గా అంగరఖా

పూర్వం రాజ దర్బారులో సంగీత సంగీతకారులు వేసుకున్న అంగరఖా స్టయిల్ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్. అంగరఖా తో పాటు మ్యాచింగ్ గా పైజామా లెగ్గింగ్ ఏదైనా ధరించవచ్చు. ధరించే బటమ్ ను బట్టి అంగరఖా పొడవు నిర్ణయించుకోవాలి. పలాజో ధరించాలి అనుకుంటే అంగరఖా చక్కగా సూట్ అవుతుంది. లెగ్గింగ్ కోసం మోకాళ్ళ కింద వరకు ఉండే అంగరఖా బాగుంటుంది. అంగరఖా కోసం ఏర్పాటు చేసే తాళ్లు రకరకాల రంగులతో కుచ్చుల తో ప్రత్యేకంగా డిజైన్ చేయించు కోవచ్చు.

బ్లాక్ హెడ్స్ మాయం

ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మొహం పై బ్లాక్ హెడ్స్ వస్తూనే ఉంటాయి. వీటిని సహజమైన పద్ధతిలో సులభంగా పోగొట్టవచ్చు. చర్మం పైన అతి ముఖ్యమైన ప్రోటీన్ కొలాజెన్ విడుదల మెరుగుపరచడంలో దాల్చినచెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం పైన ఏర్పడే రంద్రాలు తగ్గిస్తుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపైన రంధ్రాలు శుభ్రం చేస్తాయి. అంచేత అర చెక్క నిమ్మరసం టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో […]

అన్నింటికీ ఒకటే

మేకప్ సామాగ్రి అంటే ఐ లైనర్, లిప్ లైనర్, ఐ బ్రో లైనర్, హై లైటర్ అవన్నీ ఉంటాయి. ఇన్ని వస్తువులతో బ్యాగ్ నిండి పోకుండా ఆల్ ఇన్ వన్ మేకప్ పెన్ వచ్చింది. ఇది చూసేందుకు కాగితంపైన రాసే మామూలు పెన్ లాగే ఉంటుంది. దీన్ని మేకప్ కోసం బటన్ నొక్కితే ఇందులోనే ఐ లైనర్ లిప్ లైనర్ వంటివి వస్తాయి. ఒక్క దాన్లోనే నాలుగు రకాలు ఉంటాయి. కాబట్టి హ్యాండ్ బ్యాగ్ లో చక్కగా […]

ముఖ చర్మానికి మెరుపు

ఐస్ క్యూబ్స్ కు కొన్ని పోషకాలు జోడిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కని కాఫీ డికాషన్ ఐస్ క్యూబ్స్ ఫ్రిజ్ లో ఉంచి ప్రతి ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై రుద్దితే ముఖం తాజాగా కాంతివంతంగా ఉంటుంది. అలాగే కీరదోస గుజ్జు తో ఐస్ క్యూబ్స్ తయారుచేసి ఆ క్యూబ్స్ తో ముఖం రుద్దితే ముఖం పొడి బారదు. గుప్పెడు తులసి ఆకులు కలబంద గుజ్జు ముద్దగా చేసి ఐస్ క్యూబ్స్ ట్రే లో […]

మచ్చలు మాయం

మొటిమలు తగ్గి పోయిన వాటి తాలూకు మచ్చలు చర్మం పైన కనిపిస్తూ ఉంటాయి. చిన్నపాటి మేకప్ చిట్కాలతో ఈ మచ్చలు కనిపించకుండా చేయచ్చు. స్కిన్ కు మేకప్ కు మధ్య పొరల పనిచేసే ప్రైమర్ చర్మరంధ్రాలు మచ్చలు దాచేస్తుంది చర్మం జిడ్డుగా కనిపించనీయదు అలాగే నారింజ కలర్ కరెక్టర్ ను ఉపయోగించి చర్మం లో కలిసిపోయేలా బ్లెండ్ చేసుకుంటే పాత మొటిమల మచ్చలు కొత్త మొటిమల ఆనవాళ్లు కనిపించాయి. స్కిన్ టోన్ కు దగ్గరగా ఉండే కన్ […]

మెరిసే చర్మపు రహస్యం

చర్మం యవ్వనంతో మెరుపుతో ఉండేందుకు కొరియన్లు క్లే మాస్క్ వేసుకుంటారు.వారానికి ఒకసారి లేదా ముల్తానీ మట్టి తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. కాఫీ పొడి తేనె కలిపిన ప్యాక్ కూడా చర్మ రంధ్రాల్లో మురికి ని పోగొట్టి ముఖానికి మెరుపు ఇస్తుంది. బ్లాక్, వైట్ హెడ్స్ పోవాలంటే చార్ కోల్ మాస్క్ బాగా పనిచేస్తుంది. మేకప్ కు ముందు కొరియన్ సెలబ్రిటీలు నియాసిన్ మైడ్ సీరమే రాసుకుంటారు. ఫౌండేషన్ బదులు బేబీ క్రీమ్ రాస్తే […]

సౌందర్యానికి గుమ్మడి

తీయ గుమ్మడి మీ ఆహారంలో చేర్చుకుంటే చర్మం ముడతలు పడకుండా కాంతిగా ఉంటుంది గుమ్మడి గుజ్జు తో ఫేస్ ప్యాక్ వేస్తే ముఖానికి మెరుపు, నునుపు వస్తాయి. కళ్ళకింద వలయాలు పోతాయి. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్స్,మెగ్నీషియం, సోడియం, పీచు పుష్కలంగా ఉన్నాయి. వ్యాయామం తరువాత గుమ్మడి గింజలతో శక్తి వస్తుంది. మధుమేహం తో ఉన్న వారికి గుమ్మడి గొప్ప ఔషధం.

శిరోజాలు పెంచే గింజలు

పోషక విలువలున్న ఆహారానికి కొన్ని రకాల గింజలు జతచేసి తీసుకుంటే శిరోజాలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. నువ్వుల్లో పాలీ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి.పొద్దు తిరుగుడు విత్తనాలు లోని జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్-ఇ వంటివి శిరోజాలు పెరగటం లో తోడ్పడతాయి. అవిసె గింజల్లోని ఖనిజాలు శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. రోజు ఒక స్పూన్ గుమ్మడి విత్తనాలు […]