August 2018
చదువుల తల్లి
అమ్మాయిలను చదువుల సరస్వతులు అనటంలో అతిశయోక్తి లేదు. ఏ సదుపాయాలు,సౌకర్యాలు లేకుండా మావోయిస్టుల గుప్పిట్లో ఉన్న చత్తీస్ ఘడ్ లోని మారుమూల ప్రాంతం దోర్నపాల్ నుంచి మాయా కాశ్యప్ అనే నిరుపేద అమ్మాయి ఏ కోచింగ్ లేకుండానే తానే కష్టపడి చదువుకుని నీట్ ప్రవేశపరీక్ష రాసి అంబికాపూర్ మెడికల్ కాలేజ్ లో సీటు సంపాదించింది. ఎస్టీ కేటగిరిలో 154వ ర్యాంక్ ఓపెన్ కేటగిరిలో 12,315వ ర్యాంక్ సాధించిందట మాయా కాశ్యప్.కనీస సౌకర్యాలు లేని పల్లె ప్రాంతాల్లో ఆరోగ్య […]
అలాంటి పాత్ర వస్తే
నటిగా నన్ను కష్టపెట్టే పాత్రలు రావాలని నేను కలలు కంటాను అంటోంది ఆదాశర్మ . తమిళంలో ,హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తనకు తన టాలెంట్ నిరూపించుకొనే పాత్రలు కావాలని అంటోంది ఆదాశర్మ. నేను ఇంతకు ముందు చేయని పాత్రలు,ఆవకాశాలు రావాలని ఎంతో కోరుకొంటాను .ఆ పాత్ర నాపై ఒత్తిడి పెంచాలి. ఆ మరునాడు షూటింగ్ అంటే ఆ పాత్రను తలుచుకొంటే నాకు నిద్రపట్టకూడదు. అలాంటి ఛాలెంజ్డ్ క్యారెక్టర్ ను నేను కలగంటున్న అంటోంది ఆదాశర్మ
నరాలకు శక్తి
ఈ సీజన్ సన్నగా వర్షం పడుతూ వాతావరణం చల్లగానే ఉంటుంది. కానీ జలుబు ,శ్వాసకోశ ఇబ్బంది విసిగిస్తాయి. దీనికో తియ్యని చికిత్స ఉంది. ఓ గ్లాస్ పాలలో కొన్ని కిస్మిస్ లు కలిపి తీసుకొంటే ఈ సమస్య నుంచి ఉపశమనం అంటున్నాయి. ఈ కిస్మిస్ పండ్లు ప్రతి రోజు తింటే శరీరంలో పులుపు స్వీకరించే శక్తిగల ఆమ్లాలు సమతుల్యం అవుతాయి. జ్వరం రాకుండా ఉంటుంది. కొన్ని కిస్మిస్ పండ్లు నీటిలో నాననిచ్చి తింటే నరాలకు బలం వస్తుంది. […]
చక్కని ఫిట్ నెస్
ప్రతి రోజు కొద్దీ నిమిషాల పాటు ప్లాంక్స్ ప్రాక్టీస్ చేస్తే శరీరం ఫిట్ గా ఉంటుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఇవి పుషప్స్ లాంటివే . ఈ ప్లాంక్స్ ని చెసేటప్పుడు శరీరాన్ని,మోకాళ్ళను పాదాలపైన బ్యాలెన్స్ చేయాలి. వీటిలో శరీరంలోని కండరాలకు మంచి వ్యాయామం దొరుకుతుంది. ఈ వ్యాయామంతో బరువులు చాలా సులువుగా మోయగలుగుతాయి.బోటాక్స్ గట్టి పడతాయి.వెన్నెముక ,తొడకండరాలు బలపడుతాయి. ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. ఇవి రెగ్యూలర్ గా చేస్తే నడుం బలంగా ఉంటుంది. నిటారుగా నిలబడటం […]
శాఖహారం మంచిది
ఆకు కూరల్లో దొరికే ల్యుటిన్ అనే పదార్థం వల్ల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుంది అంటున్నారు. పరిశోధనలు 25 నుంచి 45 ఏళ్ళ వయసు వారిపైన పరిశోధన జరిపారు .ఈ రిజల్ట్ ఆకుకూరలు ,గుమ్మడి వంటివి గుడ్డు కంటే ఎక్కువ మేలు చేస్తాయని తేల్చారు. చిన్న వయసులో తినే ఆహారం ,మాంసాహారం తినే వారిలో కంటే మెదడు చురుగ్గా ఉందని కనిపెట్టారు. ఒక విషయం పైన దృష్టి కేంద్రీకరించే శక్తి ,జ్ఞాపక శక్తిని ల్యుటిన్ ఎంతో […]
ఆమెకు 118 ఏళ్ళు
బొలివియాకు చెందిన జూలియా ఫ్లోర్స్ కోల్కే 118 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం ఆక్టోబర్ 28న ఆమెకు 119 ఏళ్ళు వస్తాయి. 1900 సంవత్పరం ఆక్టోబర్ 26న తేదిన జన్మించిన జూలియా తన జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలు చూసింది. ఆమె నివసించే సకాబా గ్రామంలో 300 మంది జానాభా కాస్త ఆమె కళ్ళ ముందే లక్ష75వేలు అయ్యారు. బహుశ ఈమె ప్రపంచలోనే అతి వృద్ధురాలైన మహిళగా గిన్నిస్ కి ఎక్కుబోతుంది.
అన్నీ బోగస్
నేషనల్ కమిషన్ ఫర్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సుప్రీం కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో దేశవ్యాప్తంగా 2874 చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూట్ లను తనిఖీ చేస్తే అందులో కేవలం 54 మాత్రమే చట్టబద్ధంగా నడుస్తున్నాయని అంది. బీహార్ లో ముజఫర్ లో ఇటీవల బాలల సంరక్షణలో జరిగిన లైంగిక అకృత్యాలపై ఆలోచన చెలరేగిన నేపథ్యంలో ఆ సంరక్షణాలయాల విషయంలో క్షుణంగా అధ్యయనం చేసి ఎన్.సి.పి.ఆర్ ఈ నివేదిక ఇచ్చింది. పిల్లల జీవితం […]
తెలికైన నూనె
మేకప్ తొలగిచేందుకు మేకప్ రిమూవర్స్ కంటే బేబీ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. పేరుకు పిల్లలకోసం అని ఉంటుంది కానీ దీనీ వల్ల చర్మానికి చక్కని తేమ ఉండి ఆరోగ్యంగా అయిపోతుంది అంటారు మేకప్ ఎక్స్ పర్ట్స్. వాకింగ్ తర్వాత దద్దుర్లు రాకుండా ఉండాలంటే కాస్త ఈ ఆయిల్ తో మృదువుగా రాస్తే సరిపోతుంది. చర్మానికి స్వాంతన కలుగుతుంది. కంటి కింద వలయాలకు బేబీ ఆయిల్ చక్కని మందు. ప్రతి రోజూ ఈ ఆయిల్ తో కళ్ళ కింద […]
మచ్చలు పోతాయి
కాలిన గాయపు మచ్చలు చాలా రోజుల వరకు చర్మంలో కలసిపోకుండ కనిపిస్తాయి. ఆయిట్ మెంట్ కంటే గృహ చికిత్సలే వీటికి బాగా పని చేస్తాయి. మెంతుల్ని నానబెట్టి రుబ్బి మచ్చలపై రాస్తూ ఉంటే చాలా తోందరగా తగ్గుతాయి.పెరుగు ,బార్బీపొడిలో నిమ్మరసం కలిపి మచ్చలపై రాసి కాసేపు ఆరనిచ్చి కడిగేయాలి. ఉల్లిపాయరసం కూడా మచ్చలకు బాగా పనిచేస్తుంది. క్యారెట్ గుజ్జు చేసి రాసిన మంచి ఫలితం ఉంటుంది. పసుపు ,తెనే ,గులాబీ నీరు కలిపి మచ్చలపై రాస్తూ ఉంటే […]
బద్దకం ఎక్కువే
నేను ఎప్పుడు ఒకేలా ఉండను అంటోంది కియా అద్వానీ .అప్పుడప్పుడు క్రమ శిక్షణగా ఉంటాను. సినిమా షూటింగ్ అంటేనే తెల్లవారు జామునా లేచేస్తాను,చాలా హుషారైపోతాను. ఒక వేళ షూటింగ్ లేకపోతే అస్సలు మంచం దిగాలనే ఉండదు అంటోంది కియారా అద్వానీ. భరత్ అనే నేనులో నటించిన కియారా ఇప్పుడు రామ్ చరణ్ తో నటిస్తుంది. ఎప్పుడు ఒకే రకమైన ఎనర్జీ ఎందుకు ఉండదో ఏమో . ఏమాత్రం వీలున్న నా పద్దతి మార్చుకోవాలనిపిస్తుంది. కానీ షూటింగ్ లేకపోతే […]
కఠినంగా వద్దు
పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం చాలా కష్టమైన బాద్యతే ఒక వయసు వచ్చే దాక పర్లేదు తర్వాత వాళ్ళు శారీరంకంగా బలపడ్డతర్వాత టీనేజ్ లోకి వచ్చాక వాళ్ళను తిట్టి కొట్టి అదుపులో పెట్టాలనుకోవడం అవివేకం. అలా చేస్తే అప్పటి వరకు ఉన్న భయం కూడా పోయినట్లే పిల్లలు తల్లిదండ్రుల ప్రతిరూపాలు తల్లిదండ్రులను బట్టి,పెరిగిన పరిణామాలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది.అందుకే ముందు నుంచి పిల్లలతో ఎక్కువసేపు గడపాలి, తెలిసో తెలియకో తప్పుయ చేస్తే మరి కోపగించుకోవద్దు.పిల్లల పెంపకంలో ప్రేమ […]
చూసి నేర్చుకుని మరీ!
పిల్లలు అబద్దాలు ఆడితే మనకి ఒళ్ళు మండిపోతుంది. ఒక పరిశోధన ఏం చెబుతుందంటే పిల్లల చుట్టు వాతావరణాన్ని పెద్దవాళ్ళు చేసే పనులు తమ ప్రవర్తన బట్టే అబద్దాలు గాని ఏవైనా నేర్చుకుంటారు.పన్నెండు సంవత్సరాలు ఉన్న వందమందిని ఎంపిక చేసి వాళ్ళ ప్రవర్తనను,కుటుంబ నేపథ్యం ఇంట్లో వాళ్ళ ప్రవర్తన,చదువు,ఉద్యోగం అన్ని కూలంకషంగా పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.పెద్దవాళ్ళు ఎదైన విషయం తప్పించుకోవల్సి వస్తే ఎలాంటి కబుర్లు చెప్తారు, చిన్న చిన్న అబద్దాలు సంకోచించకుండా ఎలా ఆడతారో చూసి నిశితంగా […]
అనాసతో ఆరోగ్యం
పైనాపిల్ లో పొటాషియం పుష్కలంగా ఉండటంతో పాటు సమృద్దిగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్లనూ బీపి ని తగ్గించటంలో దంతాల చిగుళ్ళు బలంగా ఉంచటంలో ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో ముందుంటుందట.క్యాన్సర్ రోగుల్లో రేడియేషన్ కారణంగా తలెత్తే దుష్పరిణామాలు ఇందులోని బొమిలైన్ అనే ఎంజైమ్ తగ్గించ గలుగుతుంది. పుండ్లు,గాయాలు మాన్పగలుగుతుంది.కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. సంతాన సాఫల్యానికి ఈ పండు ఎంతగానో ఉపకరిస్తుందట.ఇందులో ఉండే సీ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.కంటి కండరాల క్షీణతను తగ్గిస్తుంది.
జన్యువులే కారణం
కొందరు తీపి ఎక్కువ తినేందుకు కొవ్వు పదార్ధాలు ఇష్టపడుతున్నందుకు జన్యువులే కారణం అంటున్నారు .ఏ కారణం తెలియకుండానే చాలా మంది ఊబకాయం ఉన్న వాళ్ళు కొవ్వు పదార్ధాలు తినటం ,తియ్యనివి ఇష్టపడటం తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన కొత్త పరిశోధన ఈ అలవాట్లకి కారణం జన్యువులే నంటోంది. చిన్నతంలో ఆహారపు అలవాట్లు కనిపెట్టి తీపి కొవ్వు పదార్ధాలు ఇష్టంగా తినే పిల్లల్ని గమనించి ఆజన్యు లోపాన్ని సవరించగలిగితే ఊబకాయం ముప్పు ఉండదంటున్నారు.
నానపెట్టి తినాలి
భాదం పప్పుల్ని నానబెట్టి తింటేనే మంచి ఫలితం ఉంటుందని వాటిలో పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయని పోషక నిపుణులు చెపుతున్నారు. బాదం తొక్కల్లో ఉండే టాన్సిన్లు అందులోని పోషకాలు శరీరంలోని ఇంకకుండా అడ్డుకుంటాయి. బాదం పప్పుల్ని కనీసం ఎనిమిది గంటలు నాననిచ్చి తింటే అందులోని పోషకాలు పూర్తిగా వంటపడతాయి. నానిన బాదం పప్పు పై తొక్క వలిచేసి ఫ్రిజ్ లో భద్ర పరిచినా వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. నానబెట్టిన పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్స్ […]
పరిమళం మహత్యం
భయమేసిందా? బాధకలిగిందా? మనలో ఒత్తిడా? మరువ లేని లేని సంఘటనా ? ఇలాంటి ఏదైనా జీవింతంలో సంభవించిన ఆ కష్టం నుంచి మనసు కోలుకోలేకపోతే సిట్రస్ జాతికి చెందిన పండ్లతో చేసిన గాఢ తైలాన్ని వాసన చూస్తే శాంతిగా ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. కమలా నుంచి కమలా పండు తొక్కల నుంచి తైలం తీస్తారు. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుతో పాటు ఎన్నో ఆహార పదార్థాల తయారీలో వాడుతారు .ఈ వాసన మనసును కుంగదీస్తే ఒత్తిడి నుంచి […]
మొటిమల సమస్యా?
మొటిమల సమస్యకు ఆహారం చక్కని పరిష్కారం అంటున్నారు నిపుణులు. టోమోటోల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ మృదుత్వాన్ని కాపాడుతాయి. మొటిమలు రాకుండా చేస్తాయి.వెల్లుల్లి లోని ఎలిసిన్ చర్మంలోని హానికారక బ్యాక్టిరియా వైరస్ లను నియంత్రించటం ద్వారా మొటిమలు రాకుండా చేస్తాయి. ముఖాన్ని వేడి నీటితో శుభ్రం చేస్తూ ఉంటే మొటిమలు రావు. నిమ్మపండు ముక్కలు మొటిమలపై తేలిగ్గా రాస్తే చాలు . నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలకు కారణమైన బ్యాక్టిరియాను చంపేస్తుంది. పచ్చి బంగాళ […]
గొప్ప ఔషధం
తులసిని పూజిస్తారు .దేవతా రూపంగా భావిస్తారు.కాని తులసిలోని జీవ రసాయనాలకు యాంటీ బ్యాక్టీరియా,యాంటీ ఫంగస్ ,యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయని ఏనాడో నిరూపించాయి అధ్యయనాలు. ఈ మధ్య కాలంలో తులసిలోని జీనోమ్స్ ని ఇటీవల పరిశోధించారు. మొక్కలో జరిగే జీవక్రియలో భాగంగా విడుదలయ్యే రసాయనాలు మెటబోలైట్స్ అని పిలుస్తారు. ఈ జన్యుకోడ్ తెలుసుకోవటం వల్ల మెటాబోలైట్స్ లో పది ఎందుకు ఉపయోగపడుతోందో తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఔషదాల తయారీ సులభం అవుతోందని అంటున్నారు . […]
కాస్త శ్రధ్ద పెట్టండి
మహిళల్లో గుండె పోటు లక్షణాలు స్పష్టంగా కనబడవు .పురుషుల్లో గుండె పోటు వస్తే ఛాతీనొప్పి ,బరువు ,చెమటలు పట్టడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. కానీ మహిళల్లో అంత స్పష్టంగా ఏవీ ఉండవు. కడుపు నొప్పి అనో,వికారమో ఏదో అసౌకర్యమో అనిపంచటం ఎన్నో సంధర్భాల్లో అసలు అదేం నొప్పో తెలియకపోవటం,పోత్తి కడుపు పై భాగాంలో నొప్పిగా ఉండటం,వీటి వల్ల స్త్రీలలో గుండెపోటు గుర్తించటడం ఆలస్యం అవుతోంది. అందువల్లేనే గుండె జబ్బు కారణంగా మరణాలు స్త్రీలలో ఎక్కువని ప్రపంచ ఆరోగ్య […]
ఇక అందమే అందం
ప్రపంచ వ్యాప్తంగా ఇవ్వాళ ఎన్నో ఫేషియల్ మాస్క్ లు సందడి చేస్తున్నాయి. పాములతో రిలాక్స్ అవ్వటం,నత్తలతో ఫేఫియల్ కూడా అశ్యర్యం ఏమీ లేదు. అలాంటిదే ఇంకొక మార్కెట్ ఫేఫియల్ . ఈ ఫేషియల్ తో ముఖం ఎంతో యవ్వనంగా మెరిసిపోతుంది అంటున్నారు. మెత్తని ఆయస్కాంత రేణువు పొడికి తడిచేసి ముఖానికి మాస్కులా వేస్తారు. పది నిమిషాల్లో మాస్క్ పొడారి పోతుంది. ఇప్పుడు ఒక ఆయస్కంతం ముక్కను ముఖంపై పెట్టి అలాపై పైన రాస్తే మాస్క్ పోరలు ఊడివస్తాయి. […]
