April 2023
మెట్ గాలా కు దీపిక
ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో మెట్ గాలా ఒకటి న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో నిర్వహించే ఈవెంట్ కు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు గాయకులు, మోడళ్ళు, ఫోటోగ్రాఫర్లు వస్తారు ఒక్క టికెట్ ధర 28 లక్షలు 2021లో ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన 137 కోట్ల రూపాయలు యూనిసెఫ్ అనుబంధ సంస్థలు ఇతర ఎన్జీవోలకు ఇచ్చారు. ఈ సంవత్సరం ఆలియా బట్ ఈవెంట్ లో పాల్గొంటుంది ప్రముఖ నేపాలీ అమెరికన్ డిజైనర్ […]
అనువాద రచయిత్రి
పొన్నియిన్ సెల్వమ్ తమిళ నవల ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసింది నందిని కృష్ణన్ .చెన్నైలో స్థిరపడ్డ నందిని స్టేజ్ యాక్టర్, నాటక కర్త రచయిత్రి, హెచ్డ్ మోడ్రన్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఇన్ విజిబుల్ మెన్ పుస్తకాలు రాశారు నందిని.ఇప్పుడు పొన్నియిన్ సెల్వమ్ అనువాదం పాఠకుల ముందుకు రాబోతోంది.
అపూర్వ సాహసం
యుద్ధంలో వీరమరణం పొందిన వీరులకు ఇచ్చే అశోక చక్ర అందుకున్న తొలి మహిళ నీర్జా భానోత్ చండీగఢ్ లో జన్మించిన నీరజ ఫ్లైట్ అటెండెంట్ గా పని చేసేది. 1986 సెప్టెంబర్ 5 ముంబై నుంచి అమెరికా వెళ్లే విమానంలో విధులు నిర్వహిస్తోంది నీర్జా తీవ్రవాదులు దాన్ని హైజాక్ చేసి 380 మంది ప్రయాణికులను బంధించారు ఆ ప్రయాణికులను వేరే మార్గం ద్వారా బయటకు పంపి కాపాడిన నీర్జా ఆ క్రమంలో ప్రాణాలు వదిలింది ఆమె ధైర్య […]
స్త్రీవాద గ్రంథాలయం
ముంబైలోని ధారావి లో మొట్టమొదటి స్త్రీ వార గ్రంథాలయం ఉంది ఇది డార్జిలింగ్ కు చెందిన 32 సంవత్సరాల అక్వి థామీస్ ఏర్పాటు చేశారు ఈమె తల్లిదండ్రులు తేయాకు తోట లో కూలీలు చదువు పూర్తయ్యాక ఆక్వి మురికివాడల పిల్లల కోసం ధారవి ఆర్ట్ రూమ్ ఏర్పాటు చేసింది. తర్వాత స్త్రీల రచనలతో సిస్టర్స్ లైబ్రరీ ప్రారంభించింది. ఇక్కడ దేశీయ సాహిత్యం తో పాటు నేపాల్, బంగ్లాదేశ్,న్యూజిలాండ్, అమెరికా దేశాల రచనలు కూడా ఉంటాయి. సిస్టర్స్ ప్రెస్ […]
యువతకు జోష్
చిన్న వయసులో కాలేజీ రోజుల్లోనే జోష్ టాక్స్ స్టోరీ స్టార్టప్ ప్రారంభించారు సుప్రియ పాల్. ఈ మీడియా ప్లాట్ ఫామ్ వివిధ అంశాలపై నిపుణులపై మాట్లాడించడం లైవ్ ఈవెంట్స్ సమావేశాలు నిర్వహించటం చేస్తుంది.10 లక్షల మంది పెయిడ్ యూజర్లు ఈ యాప్ ద్వారా వివిధ రంగాలలో నైపుణ్యాన్ని పొందుతున్నారు జోష్ కోష్ 5 లక్షల మంది సభ్యులకు ప్రతి నెల కెరీర్ గైడెన్స్ అందిస్తోంది. ఇంత విజయాన్ని సాధించిన సుప్రియ పాల్ డిజిటల్ ఉమెన్ అవార్డ్ 2017 […]
సాహస యాత్రలు
థ్రిల్లోఫిలియా టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్ర గుర్నాని దాగా 2009 లో స్థాపించారు.భారతదేశంలోని టాప్ 20 ట్రావెల్ వెబ్ సైట్స్ లో ఇదొకటి. ఈ వెబ్ సైట్ యూజర్లు 30 లక్షల కంటే ఎక్కువ. 25 పైగా డెస్టినేషన్స్ తో 12,500 యాక్టివిటీస్ వీళ్లు నిర్వహిస్తారు. థ్రిల్లోఫిలియా సంస్థ స్కూబా డ్రైవింగ్ ఒంటెల సఫారీ,బైకింగ్ కేవింగ్,పారా గైడింగ్ వైల్డ్ లైఫ్ ఎక్స్ ప్లోరేషన్ తదితరాల నిర్వహణ లో ఎంతో పేరు తెచ్చుకుంది థ్రిల్లోఫిలియా యాత్రలకు కేరాఫ్ అడ్రస్ […]
ఎండల్లో ఆరోగ్యం
వేసవిలో పిల్లలకు తల్లిపాలతో పాటు ఘానా ఆహారం కూడా ఇమ్మంటున్నారు ఎక్సపర్ట్స్. ఆరు నెలలు దాటిన పిల్లలకు రెండు సార్లు అన్ని పోషకాలు ఉండేలా ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, అన్నం కలిపి ఇవ్వాలి. మిగతా మూడు సార్లు పాలు ఇవ్వచ్చు తేలికగా తినగలిగే అరటిపండు, నారింజ, కర్పూజ, బొప్పాయి ఉడికించిన చిలకడ దుంప, ఆలుగడ్డ, క్యారెట్ వంటివి చేతితో చిదిమి పెట్టవచ్చు ఎండ ఎక్కువగా ఉంటే తరచూ నీళ్లు మజ్జిగ కూడా ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలోనూ […]
డాన్సింగ్ డాల్స్
కూచిపూడి భరతనాట్య భంగిమలతో సరికొత్త ఇయర్ రింగ్స్ వచ్చాయి.డాన్సింగ్ డాల్స్ ఇయర్ రింగ్స్ లేటెస్ట్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. సంప్రదాయ ఆధునిక దుస్తులకు కూడా మ్యాచ్ అవ్వటంతో ఇప్పుడు ఇవి అమ్మాయిల క్రేజీ నగలైపోయాయి. చెవుల పైన నర్తిస్తూ ఈ లోలాకులు ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త మాయాజాలం సృష్టించాయి. జువెలరీ డిజైనర్లు పచ్చలు, కెంపులు, వజ్రాలు ముత్యాల తో ఈ డాన్సింగ్ డాల్స్ అందంగా చెక్కేస్తున్నారు.
మేలు చేసే పల్లీలు
వేరుశనగ గింజలు గాని పల్లి బటర్ గాని రోజు తింటే రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది అని చెబుతున్నాయి అధ్యయనాలు.వేరుశనగలు తినే వాళ్ళలో రక్తనాళాలను వ్యాకోబింపజేసి వాటి పనితీరు మెరుగు పరిచే ప్రోస్టాసైక్లిన్ -12 థ్రోంబాక్సేన్ ఏ2 వంటి వాస్క్యూలర్ మార్కర్ల శాతం పెరిగింది.క్రమం తప్పకుండా పల్లీలు తినమంటున్నారు నిపుణులు .
సూర్యరథం
ఒరిస్సా లో కోణార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా గా పిలుస్తారు. తూర్పు చాళుక్య రాజు మొదటి నరసింహ దేవుడు ఈ ఆలయాన్ని కీ.శ 1250 లో నిర్మించారు కలింగ వాస్తు శిల్ప ప్రకారం నిర్మించిన ఈ దేవాలయం ఓ రథం ఆకారంలో 24 చక్రాలు ఏడు గుర్రాలు లాగుతున్నట్లు నిర్మించారు. 100 అడుగుల ఎత్తైన ఈ రాతిరథం 1984 లో యునెస్కో వారసత్వ గుర్తింపు పొందింది సంవత్సరానికి ఆరు కోట్ల 50 లక్షల మంది టూరిస్ట్ […]
మిస్ ఇండియా
ఈ సంవత్సరం మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన నందిని గుప్తా సొంతం చేసుకుంది. మణిపూర్ లోని కుమన్ లింప్ ఇండోర్ స్టేడియం లో జరిగిన 50 9వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఆమె విజేత. గత సంవత్సరం మిస్ ఇండియా గా ఎంపికైన సినీ శెట్టి ఆదివారం నందిని కి కిరీటాన్ని తొడిగారు. ఈ మిస్ ఇండియా పోటీల్లో ఢిల్లీకి చెందిన శ్రేయ మొదటి రన్నరప్ మణిపూర్ కి చెందిన తౌజ్యోమ్ రెండో […]
ఈ మోడల్ చాలా ప్రత్యేకం
వోగ్ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీగా 106 సంవత్సరాల బామ్మ అపోహంగడి అపో వాంగ్-ఓడ్ కనువిందు చేశారు.ఫిలిప్పీన్స్ లోని బుస్కలన్క గ్రామానికి చెందిన ఈమె అద్భుతంగా పచ్చబొట్టు వేస్తుంది. ఈమె వేసే టాటూ కోసం పర్యాటకులు వెతుక్కుంటూ వస్తారు. కళింగ తెగకు చెందిన ఈ పచ్చబొట్టు వేయటంలో చివరి వారసురాలు. వెదురు కర్ర ముల్లు బొగ్గులతో ఈమె వేసే టాటూ ఆకారాలకు యువతరం ఫిదా అవుతోంది.ఆర్థికంగా వెనుకబడిన ఈ గ్రామానికి ఈమె కళ గుర్తింపు తెచ్చింది.
గులాబీల సౌందర్యం
వేసవి వస్తే గులాబీల సౌందర్యం అన్ని రకాల దుస్తుల పై కనిపిస్తుంది. ఎప్పటినుంచో ఈ గులాబీలు చీరలు, బ్లౌజులు పై ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నా ఇప్పుడు డిజిటల్ ప్రింట్ల రూపంలో చీరలు లెహంగాలు కుర్తీలు దుపట్టాలు అన్నింటిపై గా అందంగా కనిపిస్తోంది. ఇప్పుడీ గులాబీ అందమే హాట్ ఫేవరెట్. ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు కొత్త అందాలతో ఈ రోజా పువ్వును ఆవిష్కరిస్తూనే ఉంది.
కళాభిమాని
కిరణ్ నాడార్ ఎం సి ఎం లో కమ్యూనికేషన్ అండ్ బ్రాండ్స్ ప్రొఫెషనల్ గా కెరియర్ ప్రారంభం చేశారు. హెచ్.సి.ఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ భార్య ఆమె. 2005 లో కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ప్రారంభించారు. ఎంతో ఇష్టంగా కిరణ్ నాడార్ సేకరించిన ఐదు వేల కళాకృతుల తో ఈ మ్యూజియం ప్రారంభమైంది. శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ గా భారత్ ఫ్రెంచ్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల పురోభివృద్ధికి కళల సహకారానికి కృషి […]
సినిమాలకో లాయర్
గీతిక అగర్వాల్ సినిమాలకు న్యాయ సలహాదారు 400 చిత్రాలకు పైగా ఆమె న్యాయ సలహాలు ఇచ్చారు. సినిమాలకు వచ్చే ప్రైవేట్ పెట్టుబడులు, లాభాల్లో వాటా శాటిలైట్ మేధా హక్కులు కాపాడుకోవడం మార్కెటింగ్ విషయాల్లో ఆమె సలహాలు ఇస్తారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, మస్తాన్, ఎం.ఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ బాహుబలి,ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలు ఆమె న్యాయ సలహాలు తీసుకున్నాయి. సినిమా హక్కుల రాయితీల విషయంలో లాయర్ల అవసరం ఎంతో ఉంటుంది.
నిద్ర ఇచ్చే క్యాండిల్
అరోమా క్యాండిల్స్ తో ఒత్తిడి మాయం అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజు మేరీ క్యాండిల్ మానసిక అలసటను దూరం చేస్తుంది. యూకలిప్టస్ స్పెయర్ మింట్ సెంటెడ్ క్యాండిల్ ఉత్తేజపరిస్తే వెనిలా క్యాండిల్ అలసట మాయం చేస్తుంది. లావెండర్ సెంటడ్ క్యాండిల్స్ ఒత్తిడి మాయం చేసి చక్కని నిద్ర ఇస్తాయి.సి బ్రీజ్ రిలాక్సింగ్ క్యాండిల్ వెలిగిస్తే సముద్రపు ఒడ్డున కూర్చున్న అనుభూతి వస్తుంది. చామంతి సెంటెడ్ క్యాండిల్ విశ్రాంతి ఇస్తుంది. ప్రతిరోజు ఇంట్లో వెలిగించుకొనే క్యాండిల్స్ ఇవన్నీ.
ఆర్థికవేత్త అను అయ్యంగార్
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించిన వంద మంది ఆర్థికవేత్తల జాబితాలో అను అయ్యంగార్ కూడా ఉన్నారు. ప్రపంచ అగ్రశ్రేణి పెట్టుబడుల బ్యాంక్ లో ఒకటైన జెపీ మోర్గాన్ ఛేజ్ లో విలీనాలు, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయ అధిపతి అను అయ్యంగార్. ఆమె స్వస్థలం కేరళ చదువు నిమిత్తం అమెరికాలో అడుగుపెట్టి జాత్యహంకారాన్ని లింగ వర్ణ వివక్ష ను అడుగడుగునా ఎదుర్కొన్నారు అను. తన ప్రతిభతో వాటిని దాటి ఎమ్ అండ్ ఏ విభాగంలో సుమారు 500 వేల […]
ఈజీగా ఇంట్లోనే
రసాయనాలు లేని లిప్ బామ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్.దీని తయారీకి టేబుల్ స్పూన్ చొప్పున షియా బటర్,బీస్ వాక్స్, రెండు స్పూన్లు కొబ్బరి నూనె కలిపి వేడి చేయాలి బాగా కరిగే వరకు ఈ మిశ్రమం గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత కిందికి దించి చల్లార్చి గాజు గిన్నెలో పోసుకొని చల్లారనివ్వాలి. సువాసన కోసం రెండు చుక్కల రోజు ఆయిల్ కలుపుకోవచ్చు. ఇది నేచురల్ లిప్ బామ్.
సరి కొత్త ఫ్యాషన్ ట్రెండ్ కప్తాన్
ప్రకృతి రావు స్థాపించిన కఫ్తాన్ లాంజ్ వేర్ ఒక్క ఫ్యాషన్ బ్రాండ్.ఇది ఇంట్లో ఉన్నప్పుడు వేసుకొనే డ్రెస్. నైటీలు పైజామాల్లాగా ఇది కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. కాటన్,లెనిన్ వస్త్రశ్రేణి లో ఈ కఫ్తాన్ లాంజ్ వేర్ మోడరన్ లైఫ్ స్టయిల్ లో ఒక భాగం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అమ్మాయిలు ఈ కప్తాన్ లు బాగా వాడుతున్నారు. లూజ్ గా ఉండే ఈ కప్తాన్ లు ఇప్పుడు ట్రెండ్.ఈ కప్తాన్ లు మార్కెట్ చేసేందుకు […]
మంచి పరిష్కారం
ఈ ఎండల్లో మొహం జిడ్డుగా మొటిమలు బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా తయారవుతుంది. టర్మరిక్ క్యూట్స్ తో ఈ సమస్య గట్టెక్కొచ్చు స్పూన్ పసుపు,టీ స్పూన్ కమలా తొక్కల పొడి, కప్పు రోజు వాటర్, కొబ్బరి పాలు, నిమ్మ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ లో పోసి గడ్డకట్టించాలి. ముఖం శుభ్రంగా కడుక్కొని ఈ క్యూబ్స్ తో మసాజ్ చేసుకుని 20 నిమిషాల తర్వాత ముఖం తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇక […]
