September 2022
ఈమె చాలా ప్రత్యేకం
కేరళ తొలి గిరిజన ఎయిర్హోస్టస్ గోపిక గోవింద్ కేరళలోని కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ కపుంకుడికి వీళ్ళు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాష మాట్లాడుతారు. అటవీ భూమి లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తారు. నాయినాడ్ లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్స్ ను స్కాలర్ షిప్ ద్వారా చేరింది గోపిక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా జాయిన్ అయ్యింది. […]
వెరైటీ కేప్ స్టయిల్స్
జాకెట్ కు మరో రూపం కేప్ స్టయిల్స్ స్కర్ట్ మీదికే కాదు జీన్స్ మీదకు కేప్ ధరించవచ్చు. ప్రింట్ చేసిన క్లాత్ కి రంగులు టాజల్స్ జతచేసి కొత్త కళ చేస్తున్నారు డిజైనర్స్. వెస్ట్రన్ స్టయిల్ కేప్ కు అద్దాలు జతచేస్తే వేడుకల్లో మరిచిపోవచ్చు. నెటెడ్ కేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లతో జత చేస్తే దీనికి జరీ అందాల తోడైతే సాధారణ కేప్ బ్లౌజ్ కాస్తా ఎంబ్రాయిడరీ కు మారిపోయి ఎ డ్రెస్ పైన అయినా మరి […]
కోహినూర్
కోహినూర్ వజ్రం మన దేశం లోనే కృష్ణాతీరంలో దొరికింది అంటారు చరిత్రకారులు. దాన్ని మొదట్లో శమంతకమని అని అన్నారు. 11 వ శతాబ్దంలో పర్షియన్ భాష లో కోహినూర్ అంటే కాంతి శిఖరం అనే అర్థం వచ్చేలా పేరు పెట్టారు. ఆ కాలానికి ప్రపంచంలో అతి పెద్ద వజ్రం అదే 1849 లో ఈస్టిండియా కంపెనీ దాన్ని సొంతం చేసుకొని 1851లో బ్రిటిష్ రాణి కి బహూకరించారు. అప్పటికి అది 186 క్యారెట్ల వజ్రం. మరో రెండు […]
అదేం కొత్త కాదు
వ్యాపార నిర్వహణ నాకేం కొత్త కాదు చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూనే ఉన్నాను బిజినెస్ నాకు కష్టమని నేను చేయలేను అని ఎప్పుడూ అనుకోలేదు అంటుంది ఇషా అంబానీ. ఇటీవలే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఆమె 30 ఏళ్ళ వయసులో రెండు లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీ పగ్గాలు పుచ్చుకున్నారు. స్టోన్ ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఎ పూర్తి చేశారు. పిరమల్ గ్రూప్ కు చెందిన వారసుడు ఆనంద్ పిరమల్ […]
సక్సెస్ ఫుల్ డాటర్
వారాంతాల్లో సెలవుల్లో మా నాన్నతో ఆఫీస్ లోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని నేను మా నాన్నకు ఇష్టమైన గినియా పిగ్ ను అంటుంది నదియా సరదాగా. పార్లే ఆగ్రో చైర్మన్ ప్రకాష్ చౌహాన్ కూతురు నదియా తండ్రి నుంచి వారసత్వంగా వ్యాపార బాధ్యతలు పుచ్చుకున్నారు ఆమె పార్లే ఆగ్రో సంస్థకు జాయింట్ ఎండి సి ఈ ఓ గా వ్యవహరిస్తున్నారు 36 ఏళ్ల నదియా ఎన్నో కొత్త ఉత్పత్తులను విడుదల చేశారు విజయవంతంగా నడుపుతున్న క్రెడిట్ నదియాకే […]
జోయితా మండల్
బెంగాల్ కు చెందిన జోయితా మండల్ మొదటి ట్రాన్స్ ఉమెన్ మహిళా జడ్జ్. సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన జోయితా ఎంతో వివక్షను ఎదుర్కొన్నారు. పదవ తరగతి లోనే ఆమెనూ స్కూల్ నుంచి పంపేశారు. బస్ స్టాండ్ ల్లో నిద్రిస్తూ వీధుల్లో భిక్షాటన చేశారు జోయితా కరస్పాండెంట్ కోర్స్ తో న్యాయవాది అయ్యారు. 2010లో ట్రాన్స్ జెండర్ గా ఓటర్ ఐడి కార్డ్ పొందిన మొదటి వ్యక్తి జోయితా దినాజ్‌పూర్ న్యూ లైట్ పేరుతో ఎన్జీవో స్థాపించి […]
రమ్యమైన రహదారి
ఇటలీ లోని స్టెల్వియో పాస్ రోడ్ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్ అంటారు. ఉత్తర ఇటలీ స్విట్జర్లాండ్ మధ్య సరిహద్దుగా ఉన్న ఈ పర్వత మార్గం ఆల్ఫ్ పర్వతాల్లో అత్యంత ఎత్తైనది సముద్ర మట్టం నుంచి సుమారు తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. 25 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు లో 48 మలుపులు ఉంటాయి ఈ ఎత్తయిన దారిలో ప్రయాణించేందుకు సాహసికులు వస్తూ ఉంటారు. మే నుంచి నవంబర్ వరకు సైకిల్ లిస్ట్ లు, […]
ఇది సుదీర్ఘమైన కెరీర్
మిగతా రంగాలతో పోలిస్తే మహిళ పైలెట్లు రాణించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఫ్లైటిక్ ఏవియేషన్ అకాడమీ నిర్వహిస్తున్న కెప్టెన్ మమత హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శిక్షణా కేంద్రం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పదివేల మంది పైలెట్లకు సుదీర్ఘమైన కెరీర్ లో కొనసాగేందుకు అవకాశాలున్నాయి. కమర్షియల్ పైలట్ కు నెలకు గరిష్టంగా 120 గంటలు మించి పర్మిషన్ ఉండదు కనుక కుటుంబంలో కుటుంబంతో కలిసి గడిపే సమయం ఎక్కువ గానే ఉంటుంది. ప్రసూతి సెలవులు ఉంటాయి […]
సహజ క్లెన్సర్
సహజమైన ఫేస్ వాష్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. అరకప్పు పాలలో 5 చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ కలిపిన మిశ్రమం రసాయన రహిత క్లెన్సర్ ఈ మిశ్రమాన్ని మెత్తని కాటన్ వస్త్రం పై వేసి ముఖం శుభ్రం చేసుకోవచ్చు. జిడ్డు చర్మం అయితే పావుకప్పు నిమ్మ రసంలో పాలు కలిపి అందులో రెండు స్పూన్ల కీరదోస రసం కలిపి ఆ మిశ్రమంతో మేకప్ తొలగించుకోవచ్చు. అలాగే ఎంజైమ్స్ పుష్కలంగా ఉండే […]
అన్నీ అక్కడే
యువ న్యాయవాది, స్క్రిప్ట్ రైటర్, ఖిమని అండ్ అసోసియేట్స్ వ్యవస్థాపకురాలు, ప్రియాంక కుమారి ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 న్యాయవాదులు ఒకరుగా ఉన్నారు. సుస్మితాసేన్, ఏ ఆర్ రెహమాన్, శృతి హాసన్ తో మల్లిక దూల వంటి ప్రముఖులు ఆమె ఖాతాదారులు 23వ ఏట లాయరుగా ప్రాక్టీసు మొదలు పెట్టిన ప్రియాంక లతా మంగేష్కర్ కు ముఖ్య సలహాదారు. న్యాయ సేవల రంగంలో స్త్రీలు చాలా అద్భుతంగా రాణిస్తారు. సమస్యలు ఉంటాయి అలాగే పక్కనే పరిష్కారాలు ఉంటాయి […]
స్ఫూర్తి దాత నికితా కుమారి
ఝార్ఖండ్ లోని మైకా గనుల్లో చిన్న పిల్లల రిహాబిలిటేషన్ కోసం పనిచేస్తోంది. నిఖితా కుమారి ధాబ్ గ్రామంలో నివసించే నికిత చిన్నతనం నుంచి ఆ గనుల్లో పనిచేస్తుంది. బచ్ పన్ బచావో ఆందోళన్ ఆ సంస్థ కార్యకర్తల ద్వారా బసరియా పంచాయత్ సభ్యత్వం తీసుకున్న ది 40 మంది పిల్లల వరకు మైకా గనుల నుంచి స్కూళ్లలో చేర్చింది. కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ ఫౌండేషన్ ప్రతినిధి రాకేష్ సెంగర్ ఆమె ఆశయాన్ని ప్రశంసించారు. నికిత ఎందరికో […]
గోళ్ళ రంగు తో సమస్య
గోళ్ల రంగులు రసాయనాలతో నిండి ఉంటాయి వీటిలో ఉండే టాట్యూన్ ఫార్మాల్డిహైడ్ ఏసిటోన్ వంటి కెమికల్స్ చర్మాన్ని పొడిగా చేయటం, అలర్జీలు గోటి పక్కన చర్మం పొడిబారటం కలుగుతాయి. సహజ నూనెలు విటమిన్-ఇ, వృక్ష సంబంధిత పదార్థాలు ఉన్నవే తీసుకోవాలి నెయిల్ పాలిష్ తొలగించేందుకు ఆల్కహాల్ లేని రిమూవర్ ను వాడాలి. రోజు గోళ్ళు వాటి పక్క చర్మం నూనెతో మర్దన చేయాలి ఎస్.పి.ఎఫ్ 30 ఉన్న హ్యాండ్ క్రీమ్ రాయాలి.
గింజల్లో పోషకాలు
దానిమ్మ విత్తనాల్లో కూడా పోషకాలు ఉంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఈ గింజలను ఎండనిచ్చి పొడి చేసే వంటల్లో వాడుకుంటారు. ఈ గింజలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి. కీళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ నెమ్మదిస్తాయి. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.వృద్ధాప్య లక్షణాలు కూడా చిన్న వయసులో రాకుండా ఉంటాయి.
అబ్బే, ఇది చాలా తప్పు
ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది కొందరు కావాలని సినీ పరిశ్రమ నాశనం కోసం కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోంది ఒక గ్రూప్ ప్రతి సినిమాను ప్రతి నటీనటుల్ని బాయ్ కాట్ చేయమని ప్రచారం చేస్తోంది సోషల్ మీడియాను అలా ఉపయోగించుకుంటుంది. ఇది తరగని ధోరణి అంటోంది బాలీవుడ్ నటి స్వర భాస్కర్. ఈ మధ్యకాలంలో ఈ బాయ్ కట్ అన్న పదం ఎఫెక్ట్ చాలా సినిమాలను నటుల్ని ఇబ్బంది పెట్టింది. ముందా బ్యాచ్ ను బాయ్ కాట్ చేయండి. […]
ఒక ప్లాన్ ముఖ్యం
ఎంతో హడావుడి పెట్టే వంటగది పనుల్లో ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. దాన్ని గుర్తిస్తే చాలు ప్రతి పని హైరానా లేకుండా పూర్తివుతుంది. ముందుగా వంట ఇంట్లో వంట కు అవసరమైన వస్తువులు అన్నీ అందుబాటులో ఉండాలి ఉదాహరణకు సమయానికి పెరుగు తోడు కోకపోతే కంగారు పడద్దు. ఒక కప్పు పాలలో ఒక స్పూన్ వెనిగర్ కలిపితే క్షణాల్లో మజ్జిగ గా రెడీ అవుతుంది. ప్రతిసారి మనం ఏం వంట చేయబోతున్నాము ముందు రోజే దానికి కావలసినవి […]
ఇదంతా సహజం
మహిళలు అందరూ ఒక వయస్సు దాటాక మెనోపాజ్ దశకు చేరుకుంటారు. ఇది అనారోగ్యం కాదు చిట్టచివరి రుతుస్రావం తర్వాత ఓ సంవత్సరానికి ఎదురయ్యే ఒక దశ ఈ దశలో నెలసరి లో మార్పులు వస్తాయి. దీన్ని పెరి మెనోపాజ్ అంటారు. ఈ దశలో శరీరంలో వేడి ఆవిర్లు మూడ్స్ లో మార్పులు చిరాకు డిప్రెషన్ లాంటి లక్షణాలు ఉంటాయి. ఈస్ట్రోజన్ తగ్గి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య వంతమైన డైట్, వ్యాయామాలు చక్కని ప్రశాంతమైన జీవనశైలిలో కుటుంబ […]
చర్మపు మెరుపు కు హెర్బల్ స్టీమ్
మేకప్ లేకుండానే మొహం మెరుపుతో ఉండాలి అనుకుంటే సహజసిద్ధమైన ఎన్నో వనరులున్నాయి. హెర్బల్ స్టీమ్ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. సహజమైన నూనె గ్లిజరిన్ తో తయారు చేసిన ఫేస్ వాష్, క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. చర్మ రంధ్రాలలో అదనపు నూనె మురికి పోయేందుకు ఒక గిన్నెలో ఆరేడు గ్లాసుల నీళ్లు గుప్పెడు గులాబీ రేకులు పలచగా కోసిన నిమ్మకాయ ముక్కలు వేసి మరిగించి పది నిమిషాలు ఆవిరిపట్టాలి. ఈ […]
ఉదయపు ఆహారం
కొన్ని ఆరోగ్యాన్నిచ్చే స్మూతీలు అల్పాహారంలో భాగంగా చేస్తే రోగనిరోధకత తో పాటు కావలసిన పోషకాలు అందుతాయి. అరకప్పు ఫ్యాటీ లేని పెరుగు ఒక నారింజ.,. కాస్త పసుపు కలిపి ఇవ్వవచ్చు పాలకూర, పుదీనా తో పోషకాలు తో కూడిన స్మూతీ తయారు చేయచ్చు. కివి, నారింజ, స్ట్రాబెర్రీలు, పెరుగు విటమిన్లతో కూడిన మంచి రసం తయారు చేయచ్చు. అవకాడో, లైమ్ జ్యూస్, స్ట్రాబెర్రీ, ఆపిల్, నిమ్మరసం జ్యూస్ కూడా శరీరానికి ఎంతో ఉపయోగం.
స్కిన్ ఫాస్టింగ్
స్కిన్ కేర్ కోసం ఎన్నో ఉత్పత్తులు వాడుతున్నా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకే స్కిన్ ఫాస్టింగ్ చేయండి, దీనితో చర్మం డిటాక్సింగ్ అవుతుంది అంటున్నారు నిపుణులు. బాగా ముఖం కడిగాక కొద్ది గంటలపాటు ఉత్పత్తి రాయకుండా అలా వదిలేయాలి. దీనితో స్కిన్ తనను తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. ఈ విధానంలో చర్మం ఊపిరి పీల్చుకున్నట్లే కాక సహజ నూనెలను ఉత్పత్తి చేస్తుంది. మనం వాడే ఉత్పత్తులు మంచివి కావో తెలుస్తుంది. స్కిన్ ఫాస్టింగ్ తర్వాత చర్మం […]
అత్యంత సాహసికురాలు
శాన్ ఫ్రాన్సిస్కో లోని ఏవియేషన్ మ్యూజియం లో మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటు దొరికింది. కోవిడ్ కోరలు సాచిన సమయంలో వందే భారత్ మిషన్ లో భాగంగా విమానంలో విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చింది జోయా. నలుగురు మహిళా పైలట్ లతో ఉత్తర ధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జోయా ను ఐక్యరాజ్యసమితి […]
