• ఆహారంతో అందం 

    చర్మ సౌందర్యం కోసం ఎన్నో రకాల ఫేషియల్స్ చేయిస్తుంటారు కాని ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని లోపల నుంచి మెరిపిస్తాయి. చలికాలంలో మృదువైన చర్మం మీ…

  • అందం కోసం ఇంత చేయాలి.

    ఏ దంగల్ సినిమానో, బాహుబలి సినిమానో చూసినప్పుడు హీరో, హీరోయిన్ లు కరక్ట్ ఫిట్నెస్ ప్లాన్ చేసారనిపిస్తుంది. అంటే పూర్తి శరీరాన్ని పరిగణలోకి తిసుకుని ఎక్సర్సైజులు చేయడం…

  • టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన చిట్కాలతో ఈ మొటిమలు తగ్గించవచ్చు. సమపాళ్లలో తేనే నిమ్మరసం మొటిమల పైన రాస్తే ఫలితం ఉంటుంది. నువ్వులు నీళ్లలో నాననిచ్చి నూరిముద్దగా చేసి మొటిమల పై రాసి కడిగేస్తే చాలు. ముఖానికి బంగాళా దుంప రాస్తే ఇవి మొటిమలు తగ్గించటం కాక మెరిసేలా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న చోట లవంగాలు నీళ్లు లేదా పాలతో కలిపి మెత్తగా నూరి అప్లయ్ చేసి పదినిమిషాలు పాటు ఆరనిచ్చి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. పూదీనా ఆకులు నూరి ఆ పేస్ట్ ను మొటిమల పై రాసినా మార్పు కనిపిస్తుంది. పుదీనా తో చర్మానికి చల్లదనాన్ని పాక్ లాగా అప్లయ్ చేసినా మంచిదే. ఎండా బెట్టిన తులసి ఆకులు షాపుల్లో దొరుకుతాయి. దాన్ని నీళ్లలో కలిపి పేస్ట్ లాగ చేసిన రాసినా మొటిమలు తగ్గుతాయి. బజార్లో దొరికే ఖరీదైన మందుల కంటే ఈ సహజమైన పద్ధతులే ఫలితాలు ఇస్తాయి.

    మొటిమలు ఈ పూతలతో తగ్గుతాయి

    టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన…

  • అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల మృత కణాలు పూర్తిగా పోయి శరీరం శుభ్రపరుస్తుంది. మంచి మెరుపు నిగారింపు పటుత్వం వస్తుంది. ఇదే బియ్యపిండి పాలు మిశ్రమానికి అలొవెరాని కలిపి పెదవులు ఎండిపోకుండా తేమతో మెరిసిపోయేందుకు వాడతారు. తాజాగా ఉన్న బియ్యపిండి రైస్ బ్రాన్ నూనె లో రకరకాల పదార్ధాలు కలిపి రకరకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఆర్గానిక్ కొబ్బరి షియా బటర్ లతో కలిపి డ్రై స్కిన్ కు అధిక తేమను ఇచ్చేందుకు వాడతారు. బియ్యం పిండి శరీరానికి రుద్దుకొనే సబ్బు లాంటిది. బియ్యం పిండి తేనె పాలు మిశ్రమం ఫేస్ ప్యాక్ గా చక్కగా ఉంటుంది. ఈ మిశ్రమాన్నే బాడీ స్క్రబ్బర్ లాగా ఉపయోగిస్తారు.అయితే శరీరానికి దీన్ని మృదువుగా అప్లయ్ చేయాలి. బియ్యం వండి తినేందుకే కాదు మంచి బ్యూటీ ట్రీట్ మెంట్ కూడా.

    బియ్యంతో అద్భుత సౌందర్యం

    అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్…