March 2023
40 కోట్ల అభిమానులు
అమెరికన్ పాప సింగర్ సెలెనా ఇన్ స్టా లో అనుసరించే వారి సంఖ్య 40 కోట్లు. 2002 లో బర్నీ అండ్ ఫ్రెండ్స్ సీరియల్ తో కెరియర్ ప్రారంభించిన సెలెనా కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2017 లో బిల్ బోర్ట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన, ఆమె నటిగా, గాయనిగా, నిర్మాత వ్యాపారవేత్త గా ఎన్నో అంశాల్లో దూసుకుపోయింది. యూనిసెఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయింది. ఆమె కొత్త […]
ఉన్నత పురస్కారం
పాండిచ్చేరి రచయిత్రి జర్నలిస్ట్ నందిని సేన్ గుప్తా రాసిన రాణి దుర్గావతి ది ఫర్ గెటెన్ లైఫ్ ఆఫ్ ఏ వారియర్ క్వీన్ పుస్తకం బెస్ట్ నాన్ ఫిక్షనల్ విభాగంలో అట్ హర్ అవార్డు 2023 (ఇండియా) గెలుచుకున్నది కలింజార్ కోటలో పుట్టిన దుర్గావతి గోండ్వా నారాయణి గా ఉక్కు మహిళ గా పేరు తెచ్చుకున్న విధానాన్ని ఆమె పాలనాపరమైన నైపుణ్యాలను జీవితంలో ఆమె ఎదుర్కొన్న సాహస ఘటనలను ఎన్నో విషయాలను ఈ పుస్తకం లో రాశారు […]
పండుగ స్పెషల్స్
ఈ మధ్యకాలంలో వేడుకులకు ప్రత్యేకమైన నిండా నగలు ధరిస్తున్నారు అమ్మాయిలు. బంగారు ఆభరణాల్లో నక్షి నగలు టెంపుల్ డిజైన్ లో భాగం 21వ శతాబ్దానికి చెందిన ఈ నగల్లో నెక్లెస్ లు గాజులు పెండెంట్లు చెవి కమ్మలు చాలా అందంగా ఉంటాయి అలాగే కుందన్ పెండెంట్లు కూడా నిండుగా ఉంటాయి. మెడ నిండుగా కనిపించే లేయర్ జువెలరీ కూడా ఫ్యాషనే. అలాగే వీటికి జతగా లేయర్ బ్యాంగిల్స్ రాళ్లు పొదిగినవి సాదా వి టీనేజ్ అమ్మాయిలకు చక్కగా […]
ఇది అందాల పందిరి
తెలుపు,గులాబీ,ఎరుపు,పసుపు వర్ణాలతో చాలా అందమైన పూలతో వింకా రోజ్ కుండీల్లో పెరిగే మొక్క దీన్ని బిళ్ళ గన్నేరు అంటారు విత్తనాలు వేర్లు నాటిన చక్కగా బతుకుతుంది.ఎంతో ఎండను ఓర్చుకునే ఈ బిళ్ళ గన్నేరు చాలా తక్కువ నీళ్లతో చక్కగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా వేస్తే మొత్తం ఆకుల్ని కనిపించకుండా నిండుగా పువ్వులు పూస్తుందీ మొక్క బాల్కనీలో తొట్టెల్లో వేలాడదీస్తే నిండుగా పువ్వులతో చాలా బాగుంటుంది.
ట్యూషన్ లే వ్యాపారం
బి-జీనియస్ స్థాపించి ట్యూషన్ పాటలు చెబుతోంది త్రినా దాస్ 2013 లో ప్రారంభం అయిన ఈ స్టార్టప్ ప్రపంచ వ్యాప్తంగా 130 సెంటర్లు లక్షల మంది విద్యార్థులతో కొనసాగుతోంది బరాక్ ఒబామా మెప్పునూ గ్రాంట్ నూ అందుకుంది అనుబంధంగా టాలెంట్ ల్యాబ్స్ ప్రారంభించింది. త్రినా దాస్.ఆరో హెచ్ ఆర్ సంస్థ మేనేజర్ నుంచి టెక్నీషియన్ వరకు ఉద్యోగాలను అందిస్తోందీ సంస్థ ఒక ఏడాదిలో 20 కోట్ల టర్నోవర్ అందుకుందీ సంస్థ 32 ఏళ్ల త్రినా దాస్ ఫోర్బ్స్ […]
అందంగా పైథాని
పైథాని పట్టు ఎప్పుడూ అందమే మరాఠీ పెళ్లిళ్లలో ప్రత్యేకంగా మెరిసే ఈ పైథాని ఇప్పుడు ప్రపంచం మొత్తం సందడి చేస్తోంది.చీరలు,దుపట్టాలు, బ్లౌజ్ లు పిల్లల పట్టు పరికిణీలు ఒకటి కాదు అన్ని వయసుల వారికి పైథాని ఫ్యాషన్ స్టేట్ మెంట్. ముదురు రంగులతో మెరిసిపోయే ఈ పట్టు వస్త్రం పైన చిలకలు నెమళ్లు పూల డిజైన్లు చాలా అందంగా అమరిపోయాయి అమ్మాయిల వార్డ్ రోబ్ లో ఉండాల్సిన వెరైటీ ఇది.
కాటన్ ఎప్పుడూ బెస్ట్
వేసవిలో డ్రెస్ ఎంపికలో కూల్ అండ్ కంఫర్ట్ కే ప్రాధాన్యత. ఫ్యాబ్రిక్స్ కాటన్స్ ముందుంటాయి. నైట్ ఫంక్షన్స్ లో సిల్వర్ కలర్ డ్రెస్ లు ఈ సీజన్లో అగ్రస్థానంలో ఉంటాయి. గోల్డ్ కలర్ తర్వాత స్నానం స్లిట్స్ ఉన్న డ్రెస్సులు సౌకర్యం డెనిమ్ ప్రతి సీజన్ కు ప్రత్యేకంగా ఉంటాయి కార్గో పాంట్స్, షర్ట్స్ వాటికి తగిన కార్పెట్ టాప్స్ ఈ వేసవికి సౌకర్యం కాటిల్ డ్రెస్సులు కూడా పగలు, నైట్ ఫంక్షన్లకు న్యూ లుక్ ఇస్తాయి.
ఎంతో ప్రత్యేకం
టీనా రహీమి ప్రపంచంలోనే మొదటి హిజాబ్ బాక్సర్ కామన్ వెల్త్ క్రీడల్లో హిజాబ్ తో బాక్సింగ్ చేసిన మొదటి మహిళ కూడా సిడ్నీలో స్థిరపడిన ఆస్ట్రేలియన్ జాతీయత స్వీకరించిన మహిళ ముందుగా మేకప్ ఉమెన్ గా కెరీర్ మొదలు పెట్టింది. 2017 లో సరదాగా మొదలుపెట్టిన బాక్సింగ్ 2018 నాటికి క్వాలిఫైడ్ బాక్సర్ గా మారింది. ఆమెకు గత సంవత్సరం స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వచ్చింది.
కాల్పనిక లోకం
సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ షెల్మ సహాయం రాసిన ది ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా జెనిసిస్ గోల్డెన్ బుక్ అవార్డు (ఉరుగ్వే) అందుకున్నది అలాగే గ్లోబల్ పబ్లిషింగ్ హౌస్ ఎక్స్ సెల్లర్, ఎక్సలెన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ (ఇండియా) కు ఎంపికైంది ఆమె రాసిన తొలి ఫాంటసీ థ్రిల్లింగ్ నవల ఇది అచ్చమైన జానపద కథ అంటున్నారు పాఠకులు అద్భుతమైన మాంత్రిక ప్రపంచాన్ని దర్శించాలనుకుంటే నవల చదవాలి.
ఆమె ఒక్కరే
చారువి అగర్వాల్ యానిమేషన్ ఫిల్మ్ మేకర్ పురుషాధిపత్య రంగం గా పేరున్న ఈ ప్రపంచంలో చారువి అగర్వాల్ యాని మేటర్ గా శిల్పిగా పెయింటర్ గా తనలోని సృజనాత్మకత తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. కెనడా లో కంప్యూటర్స్ యానిమేషన్ లో మాస్టర్స్ చేసిన అగర్వాల్ గురుగ్రామ్ కేంద్రంగా చారువి డిజైన్ ల్యాబ్స్ (సి డి ఎల్) మొదలు పెట్టింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది చారువి.
తియ్యని అద్భుతం
పూణే కి చెందిన ప్రముఖ బేకింగ్ నిపుణురాలు ప్రాచీ దేబ్ 100 కేజీల రాయల్ ఐసింగ్ షుగర్ తో 1500 తినే విడి భాగాలతో మిలన్ కేథడ్రల్ చార్ట్ నకలును తయారు చేసింది ఇటలీలోని ఈ చార్ట్ నిర్మాణానికి ఆరు దశాబ్దాలు పట్టింది. సృజనకి ప్రతిరూపం గా భావిస్తారు. ఈ చార్ట్ అందాన్ని నెల రోజులు కష్టపడి ఈ చార్ట్ ప్రతిరూపాన్ని తయారు చేసింది ప్రాచీ దేబ్. ఈ కేక్ ప్రపంచ రికార్డును బద్దలు చేసింది. గతంలో […]
అందరూ మహిళలే
పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పైన సి.మల్లవరం నుంచి కుక్కల పల్లి వరకు నిర్మించిన ఆరు వరుసల రహదారికి గాదంకి సమీపంలో ఒక టోల్ ప్లాజా ఉంది. ఇక్కడ 10 కౌంటర్లలో 11 మంది మహిళలు ఉన్నారు. పాకాల చంద్రగిరి మండలాలకు చెందిన మహిళలు ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు.టోల్ ప్లాజా దగ్గర కార్ల రద్దీని క్రమబద్ధీకరించటం తో వీళ్లంతా ముందున్నారు.
తొలి దర్శకురాలు
1922 లో వీర్ అభిమన్యు తో సినిమాల్లోకి వచ్చారు ఫాతిమా బేగం. అప్పట్లో అన్నీ మూకీ సినిమాలే మగవాళ్లే మహిళా పాత్రలు కూడా నటించే వారు. అలాంటి సమయంలో ఫాతిమా తన పేరుతో ఫాతిమా ఫిల్మ్ కంపెనీ తో సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ముగ్గురు కూతుళ్లను సినిమాల్లోకి తెచ్చారు. దర్శకురాలిగా తొలి సినిమా బుల్ బులే పరిస్థాన్ లో ముగ్గురు అమ్మాయిలు నటించారు ఈ సంస్థ ద్వారా 16 ఏళ్ల పాటు నిర్మాతగా కదా రచయితగా […]
వేడుకులకు పూజ బాక్స్
దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళలను ఒక వేదికపైకి తెచ్చే ఉద్దేశంతో ‘మై పూజ బాక్స్’ ప్రారంభించింది కావేరి సచ్ దేవ్. పర్యావరణ హితం కోరే ఈ సంస్థ సేంద్రియ రంగులను తయారు చేస్తుంది. 2018 లో ప్రారంభమైన ఈ సంస్థ గ్రామీణ మహిళలకు ఉపాధి ఇస్తుంది.వేడుక ఏదైనా దానికి తగ్గట్టు పూజా బాక్స్ సిద్ధం చేస్తుంది. దేశం లోని భిన్న సంప్రదాయాలకు తగ్గట్లు నాలుగువేల ఉత్పత్తులను అందిస్తున్నారు. లండన్ లోని కోవెంటో విశ్వవిద్యాలయంలో బిజినెస్ పట్టా తీసుకుంది కావేరి.
ఇక్కడ చదువు ఉచితం
కర్మ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అమ్మాయిలు ఉచిత విద్య చదువుకునేందుకు సాయం చేస్తున్నారు రాధికా భారత్ రామ్ ఢిల్లీకి చెందిన ది శ్రీరామ్ స్కూల్స్ వైస్ పర్సన్ రాధిక భారత్ రామ్ అమ్మాయిలకు చదువు చెప్పించడం కోసం కర్మ ఫౌండేషన్ ఫెల్ షిప్ లకు శ్రీకారం చుట్టింది.ఈ ఫెలోషిప్ కు ఎంపిక అయితే మూడేళ్ల పాటు ఫీజులు, వసతి ట్రావెల్ అలవెన్స్, లాప్ టాప్, పుస్తకాలు అన్ని ఇస్తారు.
హై స్పీడ్ రైల్ పైలెట్
సోలాపూర్ స్టేషన్,ముంబై లోని చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వల్ల సెమీ హై స్పీడ్ ట్రైన్ కు ప్రైవేట్ పైలెట్ గా ఉన్నారు సురేఖ యాదవ్ మహారాష్ట్ర కు చెందిన సురేఖ భారతదేశపు మొట్టమొదటి మహిళా డ్రైవర్ గా 1988లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తిరిగి ఆసియాలోని మొట్టమొదటి మహిళా లోకో పైలెట్ గా చరిత్ర సృష్టించారు. ఈ రైలు సేవలు సోలాపూర్ స్టేషన్ లో మార్చి 13 నుంచి మొదలయ్యాయి ఈ రైలును 450 కిలోమీటర్ల […]
తబలా విధ్వాంసురాలు
ప్రపంచంలో తొలి మహిళ తబలా విధ్వాంసురాలు అనురాధ పాల్.ఆమె మ్యూజిక్ లో ఎం.ఎ చేశారు. 40 రకాల వాయిద్యాలు వాయించగలరు. స్త్రీ శక్తి అనే బ్యాండ్ పేరుతో 27 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్త ప్రదర్శనలు ఇస్తున్నారు. రాష్ట్రపతి అవార్డుతో సహా 108 కి పైగా పురస్కారాలు అందుకున్నారు.ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ఆల్బమ్స్ కు సంగీతాన్ని సమకూర్చారు.
సౌందర్య ఉత్పత్తులు ఇష్టం
నయనతార అటు సినిమాలు ఇటు వ్యాపారం లో మల్టీ టాస్కింగ్ చేస్తోంది. స్నేహితురాలు రేణితా రాణితో కలిసి ‘ది లిప్ బామ్ కంపెనీ’ స్థాపించి సౌందర్య ఉత్పత్తుల రంగం లోకి ప్రవేశించింది నయనతార. చెన్నైకి చెందిన ‘ఛాయ్‌వాలె’లో లోను సొంత ప్రొడక్షన్ కంపెనీ ‘రౌడీ పిక్చర్స్’ లోనూ పెట్టుబడులు పెట్టిన నయనతార వెబ్ సిరీస్, ఫీచర్ యాడ్ ఫిలిం నిర్మిస్తోంది.
పెట్టుబడి పెట్టడం ఇష్టం
గీత గోవిందం పుష్ప సినిమా లతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్న.లీగన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులకు ఇన్వెస్టర్. ప్యాకేజింగ్ నుంచి అమ్మకాల వరకు ఈ కంపెనీ లో ప్రతి విషయం చాలా శ్రద్ధగా చూసుకుంటుంది రష్మిక వ్యక్తిగతంగా చాలా నచ్చింది కనుకనే ఈ బ్రాండ్ లో ఎంతో పెట్టుబడి పెట్టాను అంటుంది రష్మిక.
బయో లెదర్ వ్యాపారం
ఆలియా భట్ కు వ్యాపారం చాలా ఇష్టం కాన్పూర్ ఐటి మద్దతుతో నడుస్తున్న ‘ఫూల్’ లో పెట్టుబడులు పెట్టింది ఆమె ఈ సంస్థ వాడి పడేసిన పూలతో బయో లెదర్ అగరబత్తీలు తయారు చేస్తుంది.ఎడ్-ఎ- మామ్మా పేరుతో చిన్నపిల్లల దుస్తుల అమ్మకాల వ్యాపారం లో కూడా ఉంది ఆలియా మెటర్నిటీ వేర్ ను అందుబాటులోకి తెస్తానంటోంది.
