Saturday, 27 Jun, 2026

డాక్టర్ ఆల్కా మిత్తల్

ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో తొలి తరం మహిళా డాక్టర్  ఆల్కా మిత్తల్ ఓ ఎస్ జి పి కి సీఎం డి గా ఎంపికైన తొలి మహిళ ఆమె డెహ్రాడూన్ కు చెందిన ఆల్క ఎకనామిక్స్ లో పీజీ ఎంబీఏ పిహెచ్ డి చేశారు 35 సంవత్సరాల క్రితం ఓ ఎన్ జి పి లో అడుగుపెట్టి ఆ సంస్థ లో తొలి పూర్తిస్థాయి డైరెక్టర్ గా రికార్డ్ సృష్టించారు.

నల్లతంబి కలైసెల్వి

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) సంస్థ డైరెక్టర్ జనరల్ నల్లతంబి కలైసెల్వి సాధారణ కుటుంబంలో పుట్టి మాధ్యమంలో చదువుకొన్న కలైసెల్వి తమిళనాడు కరైకుడి సీఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా 25 సంవత్సరాలు పనిచేశారు.ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్ లిథియం అయాన్ బ్యాటరీ రంగంలోనూ విశేష కృషి చేశారు. ఈ స్థాయికి ఎదిగిన తొలి మహిళగా ఈమె రికార్డ్ సృష్టించారు.

మధబి పూరి బుచ్

ఆర్ధికరంగా సంస్థ సెబి తొలి మహిళ ఛైర్ పర్సన్ మధబి పూరి బుచ్ అహ్మదాబాద్ ఐ ఐ ఎం లో మేనేజ్ మెంట్ డిగ్రీ చదివారు. 1989 లో ఐసిఐసి బ్యాంక్ లో కెరియర్ ప్రారంభించారు. 2017-21 వరకు సెబి (భారత మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ) తొలి మహిళ హాల్ టైమ్  మెంబర్ గా కీలక పాత్ర పోషించారు.

అందాన్నిచ్చే బంతి

సంక్రాంతి వరకు బంతిపూల రోజులు ఇవి చూసేందుకే కాదు అందానికి ఎంతో అందం ఇస్తాయి. బంతిపూల రెక్కల్ని నీటిలో మరిగించి ఆ నీళ్లలో తేనె కలిపి ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తే అది సహజ టోనర్ గా పని చేస్తుంది. ఈ నీళ్లకు కాసిని  గులాబీ నీరు, నిమ్మరసం చేర్చి ముఖం కడుగుతూ ఉంటే చర్మంపై టాన్ పోతుంది. బంతి పువ్వులో ఉండే గైకో ప్రోటీన్ న్యూ క్లియో ప్రోటీన్ అనే […]

వాట్ ది హెల్ నవ్య

వాట్ ది హెల్ నవ్య పాడ్ కాస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మూడు తరాలకు చెందిన నవ్య నంద, శ్వేతా నంద జయ బచ్చన్ లు జీవితానికి సంబంధించిన భిన్నమైన కోణాల గురించి మాట్లాడటం ప్రత్యేకం.ఈ పాడ్ కాస్ట్ వినేందుకు ఎంతో సరదాగా ఉంది త్రీ లేడీస్ త్రీ జనరేషన్ త్రీ పర్ఫెక్టివ్స్ అంటారు వీళ్లు ముగ్గురు సీరియస్ విషయాలు ఎంతో సరదాగా మాట్లాడుతారు. ఈ ముగ్గురు మాట్లాడే పాడ్ కాస్ట్ లో ఎన్నో విషయాలు […]

జీవితం మన గుప్పిట్లో

ఒక రోడ్డు ప్రమాదంలో నా కాలు కోల్పోవడం నా భవిష్యత్తు శూన్యం చేసింది కానీ నేను ధైర్యం పోగొట్టుకోలేదు ప్రోస్థటిక్ కాలు అమర్చుకొని నాకు ఇష్టమైన బ్యాడ్మింటన్ లో రాణించాలి అనుకున్నాను. ఆట నా ఆత్మవిశ్వాసం పెంచింది అంటుంది మానసి జోషి. గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్న మానసి పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ పథకాలు అందుకున్నది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆమె తండ్రి సాయంతో తనను తాను మెరుగుపరుచుకుంది. జీవితం […]

గణిత మేధావి

గణిత శాస్త్రవేత్త ఆస్కార్ జరిస్కి లెక్క 65 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉంది ఆ సమస్యను పరిష్కరించి 2014లో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు గణిత మేధావి నీనా గుప్తా.2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారామే. గత సంవత్సరం రామానుజన్ ప్రైజ్ కు ఎంపికైన నీనా గుప్తా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తా లో ప్రొఫెసర్ తాజాగా ఫోర్బ్స్  ఇండియా ఉమెన్ పవర్ 2020 జాబితాలో చోటు సంపాదించారు. గణితంలో ప్రతిభకు గాను 2020 లో […]

రెండు కలిపి ఒకటే

ఇది టూ టోన్డ్ స్టయిల్ ట్రెండ్ రెండు రంగుల తో కుడి ఎడమల్ని విభజించేలా రూపొందించటం దీని ప్రత్యేకత దుస్తుల డిజైన్ లోనే కాదు రంగుల ఎంపిక చాలా ముఖ్యం అద్భుతమైన రంగులు ముఖ్యంగా రెండు వైపులా సంబంధం లేని ఎంపిక తో ఈ టూ టోన్డ్ అమ్మాయిల ప్రత్యేకం కలర్ షర్ట్ ల నుంచి కఫ్తాన్ వరకు కుర్తి ల నుంచి టీ షర్ట్ ల వరకు టూ టోన్డ్ దే హవా.

వైవిధ్యం తప్పనిసరి

టెక్నాలజీ సరిగ్గా ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు వ్యాపారంలో వైవిధ్యం తీసుకురావటం బిజినెస్ సక్సెస్ సీక్రెట్ అంటుంది మౌనిక హెర్నాండెజ్. మహిళలకు వ్యాపార వృద్ధి నిర్ధారించేందుకు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ డిజిటల్ సేవలు అందించే మాస్ గ్లోబల్ కన్సల్టింగ్ హెడ్ మౌనిక హెర్నాండెజ్. మహిళలు తమ వ్యాపార విధానం లో బృందాలతో సరిగ్గా వ్యవహరించే నేర్పు పెంచుకోవాలని చెబుతారు. సామాజిక బాధ్యత తో ఉంటేనే వ్యాపారం లో వృద్ధిలోకి వెళతామంటారు. వ్యాపారికి సమాజానికి ఒక బాంధవ్యం ఉండి తీరాలంటారు.

వనరులు ఉపయోగించుకోండి

ఒక సమస్యను ఎప్పుడు విభిన్న దృక్రోణాలతో చూడాలి అంటారు క్రిష్టినా సిలీ మ్యాగ్జిమమ్ గేమ్స్ సృష్టించిన క్రిష్టినా వరల్డ్ టాప్ బిజినెస్ లీడర్స్ లో ఒకరు. వీడియో గేమ్స్ తయారీలో ఒక థీమ్ సృష్టించటం కష్టం అని అనుకోవచ్చు. కానీ వీడియో గేమ్స్ మన జీవిత విధానం వంటివే వాస్తవ ప్రపంచం నైపుణ్యాలే అందులో జోడిస్తాం ఒక అపూర్వమైన పాత్ర జీవితం నుంచే వస్తుంది అంటుంది క్రిష్టినా. ఉన్న వనరులు శ్రద్ధగా ఉపయోగించుకోండి అంటుంది ఈ అద్భుతమైన […]

గుడ్లగూబల రక్షణ లక్ష్యం

వన్యప్రాణి సంరక్షణ కోసం పూణేలో వైల్డ్ లైఫ్ రీసెర్చ్ అండ్ కన్సర్వేటివ్ సొసైటీ సంస్థను స్థాపించారు డాక్టర్ ప్రాచీ మెహతా.ఈ కృషికి గాను స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు ను అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హౌస్ సెంటర్ (ఐఓసి) వారు ఆమెకు ప్రధానం చేశారు. అడవి గుడ్లగూబల జాతి అంతరించిపోకుండా వాటి పరిరక్షణ కోసం అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారామె. మన దేశంలో ఎంతో జీవవైవిధ్యం ఉంది. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత […]

మిస్ భారత్ సుమ వర్ష

అమెరికాలో జరిగిన మిస్‌ భారత్‌ యుఎస్‌ఎ జాతీయ స్థాయి అందాల పోటీల్లో విజయం సాధించింది సుమ వర్ష కుప్పిలి.  హైదరాబాద్‌కు చెందిన ఆ మిస్‌ భారత్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేయడం కోసం 2016లో అమెరికా వెళ్ళింది. ఈ అందాల పోటీలకు మిస్‌ యూనివర్స్‌ 2021 విజేత హర్‌నాజ్‌ కౌర్‌ సంధు జడ్జిగా ఈ పోటీలకు మిస్‌ యూనివర్స్‌ 2021 విజేత హర్‌నాజ్‌ కౌర్‌ సంధు జడ్జిగా వ్యవహరించారు.మై డ్రీమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ ప్రతి ఏటా […]

మిసెస్ వరల్డ్ సర్గమ్

ఈ ఏడాది మిసెస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని 32 సంవత్సరాల సర్గమ్ కౌశల్ గెలుచుకున్నారు జమ్మూ కు చెందిన కౌశల్ భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారి ఇంగ్లీష్ లిటరేచర్ లో పిజి చేసిన సర్గమ్ టీచర్ గా పని చేసారు. క్యాన్సర్ బాధిత పిల్లల కోసం సేవా సంస్థ తో కలిసి పనిచేస్తారు. అమెరికా లోని వెస్ట్ గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ కాసినో లో జరిగిన పోటీలు 63 దేశాల సౌందర్య రాసుల […]

స్వర్ణం సాధించిన నిఖత్

జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సొంతం చేసుకుంది ఆరో మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది మధ్యప్రదేశ్ లోని భూపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళా ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని స్వర్ణం గెలిచి తెలంగాణ కు వాన్నే తెచ్చింది.

ఉత్తమ పురస్కారం

రాజస్థాన్ కు చెందిన డాక్టర్ కృతి భారతి జెనివా యాల్ హ్యూమన్ రైట్స్ ఛాంపియన్ అవార్డ్ తీసుకున్నారు ‘సారధి ట్రస్ట్’ పేరుతో స్వచ్చంధ సంస్థ స్థాపించి రాజస్థాన్ లోని బాల్య వివాహాలు అడ్డుకొన్నారామె. కాలేజీ రోజుల నుంచే ఎన్నో స్వచ్ఛంద సంస్థ ల్లో పని చేసిన భారతి ఈ బాల్య వివాహాలను దేశానికి సంబంధించిన సమస్య గా భావించారు.

శక్తి నిచ్చే ఆహారం

చలికాలంలో సోకే దగ్గు జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవాలనుకుంటే ఇమ్యూనిటీ ఫుడ్ తినాలి అంటారు ఎక్సపర్ట్స్. నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు తో పాటు శక్తిని వ్యాధి నిరోధక శక్తిని పెంచే బెల్లంతో చేసిన రొట్టెలు, తీపి పదార్థాలు తినాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల తో పాటు చేసిన ఆహారం తో శరీరానికి పిండి పదార్థాలు అందటంతో పాటు జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. బ్యాక్టీరియా వైరల్ శిలీంధ్రాలు ఇన్ఫెక్షన్లు రాకుండా నిమ్మ నారింజ పండ్లు […]

ఆదివాసీల స్వరం జసింత

ఆదివాసీ హక్కుల ఉద్యమకారిణి కవయత్రి జసింత కెర్కెట్టా తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ 2022 సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించింది జార్ఖండ్ లోని సింగ్ భూమ్ జిల్లాలోని భెటియా గ్రామంలో జన్మించిన జసింత వృత్తిరీత్యా జర్నలిస్ట్ తన మాతృభాష అయినా వోరాన్ ఆదివాసి భాష లో ఆదివాసీల సమస్యల పై సమర్థవంతమైన రచనలు చేసింది.

తొలి మహిళ ట్రక్ డ్రైవర్

యోగితా రఘువంశీ మన దేశం లో తొలి మహిళ ట్రక్ డ్రైవర్ ఉత్తరప్రదేశ్ లో పుట్టిన యోగితా కామర్స్ చదివింది పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త చనిపోతే కుటుంబ పోషణ కోసం తమ సొంత రవాణా సంస్థ లో ట్రక్ నడిపేందుకు శిక్షణ తీసుకొంది హైవేల్లో రాష్ట్రేతర ప్రాంతాలకు రాత్రి వేళ ప్రయాణం చేయడం అలవాటు చేసుకొంది ఇప్పుడు యోగిత దేశ వ్యాప్తంగా గూడ్స్ రవాణా చేస్తోంది మగవాళ్ళ మాత్రమే భారీ వాహనాలు నడుపుతారనే ఆలోచన […]

తొలి మహిళ దర్శకురాలు

1896 లో ఎలీస్ గై బ్లాష్ అనే ఫ్రెంచి మహిళ తన 22వ ఏటా సినీ నిర్మాత గోమాంట్ నిర్మించిన ‘ ది ఫెయిరీ ఆఫ్ ది క్యాబేజీ అనే సినిమాకు దర్శకత్వం వహించింది ఈమె తొలి మహిళ దర్శకురాలు 1906 లో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో అధిక బడ్జెట్ తో తీసిన ది బర్త్ ది లైఫ్ అండ్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాను అమెరికాలో విడుదల చేసింది ఏలీస్. […]

ఉన్నది ఒకటే జీవితం

మహిళలంటే శక్తికి ప్రతీక వాళ్లకే స్ఫూర్తి దాతవు అయ్యావు అంటే గర్వంగా ఉంటుంది అంటుంది హర్షిణి కన్వేకర్. దేశంలో తొలి మహిళ ఫైర్ ఫైటర్ అగ్ని ప్రమాదాలు, వరదలు, భవనాలు కూలిపోవడం, నదులు పొంగటం వంటి విపత్తుల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న హర్షిణి మన కలలను సాధించేందుకు మనకి ఉన్నది ఇదే జీవితం. నచ్చింది చేసే విషయంలో స్త్రీ పురుషులు అన్న తేడా లేదు అంటుంది.