Saturday, 27 Jun, 2026

మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డ్

ఈ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగుల మైలురాయిని దాటి తన ఘనత చాటింది మిథాలీ రాజ్. దేశంలో మహిళల క్రికెట్ కు అంతగా గుర్తింపు లేని రోజుల్లో క్రికెట్ స్టేడియం లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్ రెండు దశాబ్దాలకు పైన పోటీల్లో కొనసాగుతూ దానికి ఆదరణ పెంచటంలో తన వంతు పాత్ర పోషించింది. తాజాగా అన్ని ఫార్మల్ లతో కలిపి పది వేల అడుగులు పూర్తి చేసిన ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా […]

పొడిగా ఉంటేనే ఆరోగ్యం

వంటిల్లు చెమ్మగా ఉంటే క్రిమికీటకాలు చేరతాయి. తడితో దుర్వాసన వస్తుంది. వంట ఇంటి తలుపులు కిటికీలు వీలైనంత ఎక్కువ సేపు తెరిచి, గాలి, వెలుతురు లోపలికి వచ్చేలా చూడండి. చెద పురుగులు, బొద్దింకలు చేరకుండా ఉంటాయి. వంట చేసే గట్టు పైన జిడ్డు మురికి ఎప్పటికప్పుడు వదిలించాలి. సింక్ మూలల్లో తడిలేకుండా పేరుకోకుండా చూడాలి. వంటగది అరల్లో నిలకా జెల్ ప్యాకెట్లు కానీ, బొగ్గు ముక్కలను చిన్న మూటలా కట్టి ఉంచితే ఫ్రెష్ గా ఉంటుంది. సింక్ […]

జుట్టు ఊడుతోందా ?

చర్మం పొడిబారకుండా ఉండేందుకు వాడే మాయిశ్చరైజర్ల కంటే ప్రకృతి సహజంగా దొరికేవి వాడితేనే ఆకర్షణీయంగా ఉంటాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారానికి ఒకరోజు అలోవేరా గుజ్జులో తేనె కలిపి రాస్తే చర్మ సౌందర్యం మాత్రమే కాదు దురద, మంట వంటి సమస్యలు కూడా రావు. వేపాకు నూరి తలకు పట్టిస్తే పేలు, చుండ్రు వంటి సమస్యలు పోతాయి. అలాగే జుట్టు ఊడిపోతుంటే  వారానికి ఒకసారి కొబ్బరిపాలు అప్పటికప్పుడు తీసినవి తలకు పట్టించి ఓ గంట ఆగాక తలస్నానం చేస్తే […]

మెరిపించే మేకప్

ఇంట్లోంచే మేకప్ వేసుకోవాలి అనుకుంటే చక్కని చిట్కాలు చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మం రంగుకు సరిపోను గ్లాసీ ఫౌండేషన్ ఎంచుకోవాలి. ఇది చర్మానికి అంటిపెట్టుకొని ముఖం నున్నగా కనిపించేలా చేస్తుంది. లేకపోతే మ్యాలే ఫౌండేషన్ కు రెండు చుక్కల హై లైటర్ లో కలిపిన సరిపోతుంది. తర్వాత కన్సీలర్ రాసి ఆపై ప్రెస్ డే పౌడర్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మాస్క్ వాడటం తప్పనిసరి కనుక కళ్ళ మీదకే పోతుంది. కనుబొమ్మలు హైలైట్ చేయాలి కనురెప్పలకు వాటర్ […]

ఇంటి భోజనం బెస్ట్

ప్రతిరోజు రెస్టారెంట్ లో భోజనం చేసే వారి కంటే ఇంటి భోజనం చేసేవారు ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాయి అధ్యయనాలు. హోటల్ ఆహారంలో సమతుల్యత ఉండదని రుచికోసం కలిపే కొన్ని రకాల పదార్థాలు జీర్ణ క్రియలకు ఇబ్బంది కలిగిస్తాయని చెబుతున్నారు. సోడియం కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు శాచ్యురేటెడ్ ఫ్యాట్  పెంచే వాటిని రెస్టారెంట్స్ లో వాడతారు అదే ఇంటి భోజనంలో ప్రతిదీ ఆచితూచి వాడతారు కనుక ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇమ్మని చెబుతున్నారు.

స్ఫూర్తి ప్రదాత

తొలి అన్న పదం ఎప్పుడూ ప్రత్యేకం. అది ఎంతోమందికి మార్గదర్శకత్వం, మార్గనిర్దేశం కూడా దేశం లో పైలట్ గా రాణిస్తున్న అమ్మాయిలు ఎందరో కానీ రక్షణ రంగం లో అమ్మాయిల ఉనికి తక్కువే ఈ లోటు పూర్తి చేసింది. భారత వైమానిక దళం లో విమానం ద్వారా యుద్ధంలో పాల్గొనే అర్హత సాధించింది. గణతంత్ర వేడుకల్లో ఎం ఐజీ- 21 బైసన్ ఫైటర్ విమానాన్ని నడిపి యుద్ధం లో పాల్గొనే అర్హత సాధించింది. మొదటి మహిళా ఫైటర్ […]

పెరిగిన మహిళా సంఖ్య

దేశ చరిత్రలో మొదటిసారిగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే చెబుతోంది. ఈ నవంబర్ లో నిర్వహించిన సర్వే లో మహిళల సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2019-2021 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారని సర్వే చెబుతోంది. లింగ నిర్ధారణ పరీక్షల తర్వాత జరిగే బ్రూణ హత్య కారణంగా ఆడ పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజా నివేదిక ఈ […]

వ్యాపార విజయం

సౌందర్య ఉత్పత్తుల ఈ కామర్స్ సంస్థ నైక్ తాజాగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది మొదటి రోజే లక్ష కోట్ల మైలురాయినీ దాటింది. యూనీ కార్నర్ హోదా పొందింది. దీనితో ఫల్గుణి నాయక్ దేశం లోని అత్యంత సంపన్న సెల్ఫ్ మేడ్ మహిళ బిల్లి నియర్ గా ఎదిగారు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు నాయర్ ఆస్తుల విలువ 48 వేల కోట్ల 48 వేల కోట్లు దాటిపోయింది రెండు ప్రమోటర్ల ట్రస్ట్ లు, […]

బియ్యం గింజలు వెండివే

వెండి పూజా వస్తువులకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. ఇవి వాడుకునేందుకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు కూడా చక్కగా ఉన్నాయి. అందం గట్టిదనం తేలికగా వివిధ ఆకృతుల్లో కి ఒదిగి పోయే గుణం వెండి కి మాత్రమే ప్రత్యేకం. లైట్ వెయిట్ తో చాలా ఆడంబరంగా అందంగా ఉన్నాయి దీపాలు, ప్లేట్లు, పూలసజ్జ లతోపాటు పూజకు వాడే పూలు అగ్గి పెట్టి బియ్యం గింజల వరకూ వెండివే. శుభసూచకంగా నిల నిలబెట్టే అరటి మొక్కలు, కొబ్బరికాయలు, చెరుకు […]

తెలంగాణా నా కిష్టం

ఏవియేషన్ ఇది హైదరాబాద్ డొమినియన్స్ పుస్తకంలో దేశం లో తొలి వైమానిక చరిత్ర రచయిత్రిగా ఘనత కెక్కారు అనురాధ పింగ్లె రెడ్డి. భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ’ (ఇంట్యాక్‌) గవర్నింగ్‌ కౌన్సిల్‌కి జీవితకాల సభ్యురాలు. నిజమ్స్ డక్కన్ ఎయిర్ వేస్ చరిత్ర గురించి చెన్నయ్,ముంబయ్,ఢిల్లీ నగరాల్లో అందులో పని చేసిన వారందరినీ కలిపి అప్పటి ఫర్మానాలు,డాక్యుమెంట్స్ సంపాదించి,ఆ సమాచారంతో ఈ పుస్తకం రాశారు అనురాధ ఎవి ఆయిల్ సంస్థ దీన్ని ముద్రించింది. ఇప్పటి తెలంగాణా చాప్టర్‌ […]

బుల్లి రచయిత్రి

ది మిస్సింగ్ ప్రొఫెసీ- రైజ్ ఆఫ్ ది బ్లూ ఫోనిక్స్ పేరుతో నవల రాసింది చండీగఢ్ కు చెందిన 17 సంవత్సరాల ఖుషి శర్మ ఇంటర్మీడియట్ చదువుతోంది. జాతీయస్థాయి స్క్వాష్ పోటీల్లో రెండు సార్లు పథకాలను సాధించింది. కథక్ డాన్సర్. పియానో వాయిస్తుంది. ఈమె రాసిన నవల అమెజాన్ లో నెలరోజుల్లోనే వెయ్యి కాపీలు అమ్ముడై ట్రేండింగ్ బుక్ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచింది చిన్న వయసులోనే థ్రిల్లింగ్ నవల రాసి పాఠకుల మనసు దోచుకుంది […]

రోజ్ వాటర్ తో నిద్ర

రోజ్ వాటర్ తో చర్మం మృదువుగా మారటమే కాదు ఇంకా నిద్రకు కూడా మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక కప్పు నీళ్ళలో పావు కప్పు రోజ్ వాటర్ కలిపి తలస్నానం పూర్తయ్యాక ఆఖర్లో ఈ మిశ్రమంతో జుట్టు కడిగేస్తే లిఫ్ట్ జుట్టు మెరిసిపోతుంది. రోజ్ వాటర్ కొన్ని చుక్కల జాస్మిన్, లావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్ కలిపి తలంతా స్ప్రే చేసి మృదువుగా మర్దన చేస్తే రక్తప్రసరణ మెరుగవడం తో పాటు శిరోజాలు సువాసనలు […]

ఆమె విజయం

ఈ సంవత్సరం లైంగిక వేధింపుల కేసులో ఈ విజయం సాధించి ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చారు జర్నలిస్ట్  ప్రియా రమణి. ‘మీటూ’ పేరిట ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులను బయటపెట్టారు. ధైర్యవంతులైన కొందరు ఆడవాళ్ళు. వారిలో ప్రియమణి ఒకరు మాజీ ఎంపీ ఎం.జె అక్బర్ ఢీ కొట్టి గెలిచారామె. అయినా గతంలో ఒక వార్తా సంస్థకు ఎడిటర్ గా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ నిమిత్తం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన బాధ కలిగించిందని ప్రియా సోషల్ మీడియా […]

ఎంత తింటున్నామో అదీ ముఖ్యం

40 ఏళ్లు దాటినా అందం కాపాడుకో గలుగుతున్నాను అంటే కేవలం శాకాహారం వర్క్ వుట్స్. ముఖ్యంగా ఏం తింటున్నాననే దాని పట్ల ధ్యాస ఉంచటం మాత్రమే అంటోంది మలైకా అరోరా. ఆరోగ్యం తీరు శరీరం బరువు మొదలైన విషయాలు లెక్కలు తూచే ఏం తినాలో నిర్ణయిస్తారు డైటీషియన్లు. కానీ ఎంత తినాలో కూడా ఖచ్చితంగా పాటించాలి అంటారామె. నేనయితే ఉదయం గోరువెచ్చని నీరు తేనె కొబ్బరి నూనె కలిపిన పానీయం తాగుతాను. ఇది చర్మాన్ని మెరిపించి వ్యర్థాలను […]

పురుషులే సున్నితం

 కుటుంబం ప్రేమ సంబంధాల్లో విభేదాలు తలెత్తి విడిపోవాల్సి వస్తే ఆ బాధ స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు. లాంకాస్టర్ యూనివర్సిటీ నిపుణులు చేసిన అధ్యయనంలో ఈ విడిపోవటం, స్త్రీల కంటే పురుషులనే బాధించాయని ఆన్ లైన్ కౌన్సిలింగ్ సెంటర్లలో తీసుకున్న డేటా చెపుతోంది. విడిపోవటం వల్ల తామెంత బాధ పడుతున్నామొ చెప్పుకోని ఏడ్చిన పురుషులే ఎక్కువ అని చెబుతున్నారు. భావోద్వేగాలు ఆడవాళ్ళకున్నట్లే మగవాళ్ళకి ఉంటాయని, ఇంకా చెప్పాలంటే మరి కాస్త పురుషుల్లోనే ఎక్కువ అని […]

ఈ చిట్కాలు బెస్ట్

మెనోపాజ్ సమయంలో వచ్చే నెలసరి సమస్యలకు కొన్ని చిట్కాలు వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యులు నెలసరి ఆలస్యంగా వచ్చినా ముందే వస్తున్నా నువ్వుల పానీయం తీసుకోమంటున్నారు. టీ స్పూన్ చొప్పున నువ్వులు, పసుపు, సొంటి పొడి తీసుకొని అందులో గ్లాసు నీళ్లు పోసి సగం అయ్యేవరకు మరిగించాలి. తర్వాత ఓ స్పూన్ బెల్లం కలిపి గోరువెచ్చగా తాగాలి. నెలసరి ముందే వస్తుంటే కొత్తిమీర, సొంపు పానీయం తాగాలంటున్నారు. టీ స్పూన్ చొప్పున ధనియాలు సోంపు తీసుకుని అందులో […]

రెండు ఆకులు చాలు

సౌందర్యం కోసం ఉపయోగించే ఎన్నో క్రీములు లోషన్ల కంటే వేపాకులు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి అంటారు ఆయుర్వేద వైద్యులు.  వేపాకులు వేసి మరిగించిన నీళ్లతో మొహం కడుక్కుంటే కళ్ళు తేటగా ఉంటాయి. ముఖంలో నిగారింపు వస్తుంది. కళ్ళు మంటలు ఎర్రబడటం ఉండదు. ప్రతి ఉదయం రెండు వేపాకులు తింటే, లేదా ముద్దగా నూరి తిన్న చర్మం కాంతివంతంగా ఉంటుంది. మొటిమలు కళ్ళకింద వలయాలు తగ్గుతాయి. వేపాకు నూరి తలకు పట్టిస్తే జుట్టు రాలడం చిట్లటం డ్రై గా […]

సమయం మన గుప్పిట్లో

చాలాకాలం ఇంట్లోంచి పనిచేశాక ఇప్పుడిక ఆఫీస్ కు వెళ్లి పని చేయవలసిన సమయం వచ్చింది. ఎంతో గ్యాప్ తర్వాత మళ్లీ కొత్తగా పనిచేస్తున్నట్లు ముందు కొంచెం అలసట అనిపించవచ్చు. నెమ్మదిగా రొటీన్ కు అలవాటు పడాలి. పనిచేసే మహిళలు అందరికీ 24 గంటలే ఉంటాయి. ముందుగా పని వేళలను నిర్ణయించుకోవాలి విశ్రాంతి కోసం రాత్రి సమయం ఉంచుకోవాలి. సమావేశాలు డెస్క్ పని ఇతర పని ప్రాజెక్ట్ వర్క్ ని ఇంటి పని అన్ని ప్లాన్ ప్రకారం మాత్రం […]

హ్యాపీ గా ఉండాలంటే

మనసు ఉల్లాసంగా ఉండాలంటే ఫీల్ గుడ్ హార్మోన్ డోపమైన్ ఉత్పత్తి మెరుగ్గా ఉండాలి. అందుకోసం జీవన విధానంలో మార్పులు అవసరం. ఉల్లాసవంతమైన పనుల్లో పాల్గొనోట డాన్స్, ఆటలు, నచ్చిన పాటలు వినటం ఏ పనిలో ఉత్సాహం దొరికితే ఆ పని కోసం కొంత సమయం కేటాయించాలి. ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. మనసారా నవ్వాలి. పజిల్స్ చిక్కు ప్రశ్నలతో మెదడుకు వ్యాయామం అందించాలి. మెదడు చురుగ్గా ఉంటే డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది.

అపురూపమైన పుష్పం

ఎన్నో వన్నెల్లో గుండ్రని బంతి ఆకారంలో కనిపించే బొగడ బంతి పూలను గ్లోబ్ అమరాంధ్  అంటారు. కొమ్మలు రెమ్మలు ఎండినా పువ్వు మటుకు వాడకుండా రూపం పోకుండా ఉంటుంది. కనుకనే వీటిని నేచర్స్ సూపర్ ఫ్లవర్ గా చెబుతారు. జమైకా అమెరికాల్లో వీటిని బ్యాచిలర్ బటన్ అంటారు. ఈ పువ్వుల్లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాంపెరల్ అనే చర్మాన్ని రక్షించే గుణం కూడా ఉంది.ఫంగై, బ్యాక్టీరియా తో పోరాడే ఆంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. ఈ చిన్న పువ్వుతో […]