Saturday, 27 Jun, 2026

ఈ వ్యాయామం మంచిదే

40 ఏళ్ళు వస్తూ ఉంటే వెయిట్ ట్రైనింగ్ మొదలు పెడితే ఆరోగ్యం అంటారు ఎక్సపర్ట్స్. ఈ ఎక్సర్సైజ్ తో బాడీ టోన్ అవుతుంది.తక్కువ  బరువులతో చేసే వ్యాయామాల తో అదనపు కొవ్వులు కరిగి ఫిట్ నెస్, స్ట్రెంగ్స్ పెరుగుతాయి. బరువు తగ్గి ఇంట్లో పనులు చేసుకోగలుగుతారు. అలాగే పిండి పదార్థాలు తక్కువగా మాంసకృత్తులు ఎక్కువగా తినాలి. రెండు నుంచి ఐదు కిలోల బరువుతో వ్యాయామాలు చేస్తే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

మెరిపించే కాఫీ మాస్క్

కాఫీ మాస్క్ తో మొహం మెరిసిపోతుంది అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి కి అదే పరిమాణంలో తేనె కలిపి మొహానికి మాస్క్ వేసుకొని 28 నిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం పై ఉండే మృతకణాలు పోయి మొహం మెరిసిపోతుంది. అలాగే కాఫీ పొడి పాలలో కలిపి మాస్క్ వేసుకుంటే పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే కాఫీ పొడి బ్రౌన్ షుగర్,కొబ్బరి నూనె మిశ్రమం కూడా ముఖాన్ని […]

పెడిక్యూర్ చాలా అవసరం

పాదాలకు ఇన్ఫెక్షన్ లు రాకుండా పెడిక్యూర్ చేయించు కోమంటున్నారు ఎక్సపర్ట్స్. సర్వ సాధారణంగా ఎదురయ్యే పాదాల పగుళ్లు పోతాయి. అలాగే మసాజ్ తో రక్తప్రసరణ మెరుగై గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి ఆర్థరైటిస్ నొప్పులు రావు. వెరికోసిస్ వైన్స్ వంటివి రాకుండా ఉంటాయి. పాదాలకు చేసే మసాజ్ లు శరీరం మొత్తం ఒకే రకమైన ఉష్ణోగ్రత కొనసాగుతుంది. లింఫ్ నోడ్స్ లోని టాక్సిన్స్ పోతాయి మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.

మహిళలకు ప్రోత్సాహం

పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్ స్వతంత్ర మైక్రోఫిన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాలలో మహిళ వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తోంది. స్వతంత్ర స్టార్టప్ కు ‘గోల్డ్ అవార్డ్’ వచ్చింది. 2016 నుంచి గ్లోబల్ లగ్జరీ ఇన్ ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ ఇ కై ఏషియా కు సి ఈ ఓ గా బాధ్యతలు తీసుకున్నది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకున్నది.

సంతోష సమయం

చంద్రయాన్-3 మిషన్ లో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నారు కల్పన కాళహస్తి. 2000 సంవత్సరంలో ఇస్రోలో చేరారు. ముందుగా శ్రీహరి కోటలో ఐదేళ్లు పనిచేసి బెంగళూరులోని శాటిలైట్ సెంటర్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. గతంలో చంద్రయాన్-2 మంగళయాన్ ప్రాజెక్ట్ ల లోను కీలక బాధ్యతలను నెరవేర్చారు. కల్పనా తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని తడుకు గ్రామం మద్రాస్ యూనివర్సిటీ లో బిటెక్ ఈ సి ఈ చదివారు. మిషన్ విజయవంతం కావడం నా జీవితంలో సంతోషభరితమైన […]

త్వరలో సూర్యుడిని కలుస్తాం

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ లో వివిధ విభాగాల్లో 54 మంది మహిళలు పని చేశారు.విక్రమ్ లాండర్ సురక్షితంగా చంద్రుడిపై దిగేలా రూపొందించిన సాఫ్ట్ వేర్ టెస్టింగ్ కీలక శాస్త్రవేత్తల బృందం లో మానస ఒకరు. గుంటూరు జిల్లా కు చెందిన బొల్లు మానస 2014లో బెంగళూరు ఇస్రో శాటిలైట్ కేంద్రంలో శాస్త్రవేత్తగా చేరారు. చంద్రాయన్-2 కి తన సేవలు అందించారు.ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో సూర్యుని పైకి త్వరలో ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్-1 లో పని చేస్తానని చెబుతున్నారు […]

గిల్ట్ నగలా ?

మాచింగ్ కోసం ఆర్ట్ నగలు వాడటం ఎక్కువైంది. కానీ చాలా మందికి ఈ గిల్ట్ నగలు పడవు. వీటిని ధరించే ముందర మాయిశ్చరైజర్,పౌడర్,పెట్రోలియం జెల్లి వంటివి రాస్తే సమస్య ఉండదు. అలాగే వాడాక ఈ క్రీమ్ లు పోయేలా శుభ్రం చేయాలి. లేదా నగల వెనక ప్లాటినం కోటింగ్ వంటిది వేసిన మంచిదే లేదా కలబంద గుజ్జు రాసి బాగా ఆరిపోయాక ధరిస్తే ఎలాంటి అలర్జీలు రావు.

బరువు పెరిగితే అనారోగ్యం

గర్భిణీగా ఉన్నప్పుడు తమ బిడ్డకు సరిపోయేలా ఎక్కువ ఆహారం తీసుకుంటారు. బరువు పెరుగుతూ ఉంటారు కానీ అలా బరువు పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్. ఆ సమయంలో క్రేవింగ్ కారణాలుగా అతిగా తీపి పదార్థాలు తింటారని అది మధుమేహానికి దారి తీస్తుందని సరైన ఆహారం, కొంత వ్యాయామం అవసరం అంటున్నారు.

మతిమరుపుకు మందు

సువాసనలకు జ్ఞాపక శక్తి కి గాఢమైన బంధం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. రోజ్, ఆరెంజ్, నిమ్మ రోజ్ మేరీ లావెండర్ వంటి సువాసనలు జ్ఞాపకశక్తి పెంచుతాయంటున్నారు.డిమెన్షియా కు గురి అయిన వారికి ఈ సువాసనలు చూపిస్తూ ఉంటే వాళ్లలో జ్ఞాపకశక్తి భాషా జ్ఞానం వృద్ధి అయినట్లు గుర్తించారు.

మరిగిస్తే పరిశుభ్రం

వర్షాల్లో తాగునీరు కలుషితం అవుతాయి. ఈ నీటిలో ఈ కోలై,హెపటైటిస్-ఎ కంపిలోబాక్టర్ సాల్మొనెల్లా, టాక్సో ప్లాస్మా వంటి సూక్ష్మజీవులు చేరుకుంటాయి. ఈ ప్రమాదం రాకుండా నీటిని మరిగించి చల్లార్చి తాగాలి. ఇలా మరిగించిన నీటిలోని లవణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాచి వడపోస్తే నలకలు,మట్టి ఇసుక పోయి నీరు శుభ్రం గా ఉంటాయి.

అందరూ మహిళలే 

హైదరాబాద్ లోని ముస్లిమ్ మెటర్నిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ 53 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.ఇందులో ప్రత్యేకత హాస్పిటల్ సి ఈ ఓ నుంచి సెక్రెటరీ సెక్యూరిటీ స్టాఫ్ వరకు అందరూ మహిళలే. 200 పడకల హాస్పిటల్ లో కులం,మతం తేడా ఉండదు.మహిళలందరికీ వైద్య సేవలు అందుతాయి. ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించిన మూడు స్కూళ్ళు, మూడు హాస్పిటల్స్ లో ఇది ఒకటి. మహిళల ఆసుపత్రి గా పిలిచే ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.ఇది టీచింగ్ హాస్పిటల్. […]

కడిగి వాడుకుంటే మేలు

వానాకాలంలో ఆకుకూరలు పెరిగే ప్రదేశంలో కలుషితమైన నీరు చేరితే వాటిలోని హానికరమైన సూక్ష్మజీవుల వల్ల జబ్బులు వస్తాయి.   అందుకే ఆకుకూరలు ఉప్పు నీటిలో పది నిమిషాలు నానబెట్టి తర్వాత మంచి నీళ్లతో కడిగి వాడుకుంటే సూక్ష్మజీవుల ప్రమాదం ఉండదు. క్యాలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

శుభ్రం, సువాసన కూడా

బాత్రూమ్స్ శుభ్రంగా ఉంచుకునేందుకు వాడే లిక్విడ్ ఎంతో ఘాటైన వాసన తో ఉంటాయి. ఆ రసాయనాలు వాడితే తల తిరుగుతుంది. సహజమైన వాటితో స్నానాల గది శుభ్రంగా ఉంచుకోవచ్చు. కప్పు వెనిగర్ కి అరకప్పు బేకింగ్ సోడా రెండు స్పూన్ల నిమ్మరసం,కాస్త లిక్విడ్ డిష్ వాష్ కలిపి బాత్రూం లో, సింక్ ల్లో ట్యాపుల పైన పోసి కాసేపు అలా వదిలేసి తర్వాత రుద్ది కడిగితే పసుపు రంగు మరకలు కూడా మాయం అవుతాయి. ఈ మిశ్రమానికి […]

మనసు బాధ కి మందు

అమీర్ ఖాన్ కూతురు ఇరా దత్త అగస్తు ఫౌండేషన్ స్థాపించి మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు వైద్యం,కౌన్సిలింగ్ థెరపీ చేయిస్తుంది. బాంద్రా  లోని పాలి విలేజ్ లో ఉన్న ఈ ఫౌండేషన్ లో సైకియాట్రిస్ట్ లు ఉంటారు. 50 రూపాయలకే మంచి వైద్యం దొరుకుతుంది.డిప్రెషన్ బారిన పడిన ఇరా దత్తా చదువు మానేసింది. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది.ఆ అనుభవం తో ఈ ఫౌండేషన్ ప్రారంభించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యత ను ప్రారంభిస్తోంది ఇరా ఖాన్.

ఆమె బొమ్మలు ప్రత్యేకం

అను చౌహన్ మొబైల్ గేమ్ ఆర్టిస్ట్ ఇలస్ట్రేటర్ వీడియో గేమ్ ఆర్టిస్ట్ కూడా. కెనడా లో పుట్టి పెరిగిన అను చౌహాన్ యానిమేషన్ సబ్జెక్ట్  చదువుకున్నది. పిల్లల కోసం అను రూపొందించిన ‘ఏ దుపట్టా ఈజ్’ హెన్నా ఈజ్ పుస్తకాలు ఎంతో ఆదరణ పొందాయి. బొమ్మల ద్వారా  స్త్రీ సాధికారత ను ప్రచారం చేయచ్చు అంటుంది అను చౌహన్ అంతర్జాలంలో ఆమె ఆర్ట్ వర్క్ కు వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు.

అద్భుతమైన స్ఫూర్తి

వ్యవసాయ కూలి సాకే భారతి ఈ మధ్యనే పి.హెచ్ డి పట్టా తీసుకున్నది. అనంతపురానికి చెందిన భారతి ఎరుకల కులంలో శింగమానల మండలం నాగులగుడ్డం గ్రామంలో పుట్టింది. భర్త ఎరికుల శివప్రసాద్ ప్రోత్సాహంతో అనంతపురం లో ఎమ్మెస్సి చదువుకున్నది కూలి పనికి వెళుతూనే పి.హెచ్ డి చేసింది.2023 సంవత్సరానికి పట్టా పుచ్చుకుంది. డాక్టర్ భారతి ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తి.

తోటకు రక్షణ

వర్షాలకు బాల్కనీ లో ఉండే మొక్కలకు తెల్ల రామ పేను బంక వంటి కీటకాలు ఆశిస్తాయి.గాఢత తక్కువ ఉన్న లిక్విడ్ సోప్ రెండు స్పూన్లు నీటిలో కలిపి ద్రావణాన్ని మొక్కలపై పిచ్చకారీ చేయచ్చు. అలాగే వెల్లుల్లి ఉల్లి ద్రవాలు కూడా చీడలను పోగొడతాయి. మిరియాలు పొడి చేసి నీటిలో కలిపి మొక్కల పై పిచికారి చేస్తే అది సహజమైన క్రిమి సంహారిణి లాగా పనిచేస్తుంది.ఇష్టంగా పెంచుకునే తోట తెగుళ్ల తో పాడైపోకుండా ఈ సహజమైన పదార్థాలతో మొక్కల్ని […]

కఠోర సాధన  

మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన సృష్టి సుధీర్ జగ్తాప్ విరామం లేకుండా 127 గంటల పాటు నృత్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్  లో గిన్నిస్ సాధించింది. ఆమె తాతగారు స్వయంగా నాట్య గురువు గిన్నిస్ రికార్డు కోసం కథక్ నాట్యం నేర్చుకుంది. ధ్యానంతో యోగా నిద్ర కూడా సాధన చేసింది సృష్టి. 16 సంవత్సరాల సృష్టి వరుసగా ఐదు రోజుల పాటు ఇచ్చిన నాట్య ప్రదర్శన తో ఆమె తల్లిదండ్రులు తాత అండగా ఉన్నారు. గిన్నిస్ […]

ఒత్తుగా కనురెప్పలు

ఒంపులు తిరిగి ఒత్తుగా ఉండే కనురెప్పలు ముఖానికి చాలా అందం. కనురెప్పలు ఒత్తుగా పెరగాలి అంటే పడుకునే ముందర ఆలివ్ ఆయిల్ గాని ఆముదం గాని రాయాలి. నిమ్మ తొక్కలను ఆలివ్ ఆయిల్ లేదా ఆమోదంలో వేసి ఆ నూనె రాసిన ప్రయోజనమే. పెట్రోలియం జెల్లి, గ్రీన్ టీ డికాషన్ కూడా కనురెప్పలను పెరిగేలా చేస్తాయి.

హస్తకళలకు సాయం

చోళుల కాలం నుంచి వస్తున్న కసూతి డిజైన్స్ ప్రపంచానికి మళ్లీ పరిచయం చేసింది ఆరతి హిరేమఠ్ ఆలయాలు, రథాలు, పల్లకీలు తామర పువ్వులు వస్త్రానికి రెండు వైపులా కనిపించేలా నేసే ఈ కసూతి డిజైన్స్ వందల ఏళ్ళనాటి సాంప్రదాయ కళ.ఈ కళాకారులు ధార్వాడ్ హుబ్లీల్లో ఉన్నారు. ఆర్తీ క్రాఫ్ట్స్ పేరుతో ఆన్ లైన్ మార్కెటింగ్ ప్రారంభించింది. ఆర్తి బెంగళూరు చుట్టుపక్కల గ్రామ మహిళలకు శిక్షణ కూడా ఇస్తుంది. ఆన్ లైన్ లో ఇప్పుడు ఈ చీరలు కెనడా, […]