November 2022
ఉలెన్ ఫ్యాషన్స్
చలి రోజుల్లో విడిగా స్వేట్టర్ వేసుకోకుండా పూర్తి డ్రెస్ లే నేరుగా వచ్చేశాయి కుర్తి పైన ష్రగ్ వేసుకోనట్లు డబుల్ పీస్ ఉలెన్ కుర్తీలు ,లేటెస్ట్ ఫ్యాషన్ మిస్ అవకుండా ఆఫ్ షోల్డర్ సింగిల్ స్లీవ్,షోల్డర్ స్లీవ్స్ వంటివి ఉలెన్ టాప్ ల్లో ప్రాకుల్లోను కనిపిస్తున్నాయి. బటన్స్ తో కాస్త లూజ్ గా ఉండే బాయ్ ఫ్రెండ్ స్వెటర్ మోడల్ అయితే ఎవ్వర్ గ్రీన్ ఫ్యాషన్ అని చెప్పచు అబ్బాయిల స్వెటర్ లలో కనిపించే క్రూ రౌండ్,టార్టెల్,షాల్ […]
న్యూస్ మేకర్
తెలంగాణ లోని ఇందూరు కు చెందిన నిఖత్ ఈ ఏడాది ఏకంగా మూడు స్వర్ణాలు సాధించి బాక్సింగ్ రంగంలో తన పేరు శాశ్వతం చేసుకొంది 52 కిలోల విభాగంలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారత ప్రభుత్వం ఆమె సేవను గుర్తించి క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం అర్జున్ అవార్డ్ కు ఆమెను ఎంపిక చేసింది. ఈ సంవత్సరం న్యూస్ మేకర్.
పండ్లు తింటున్నారా?
చలికాలంలో జలుబు అన్నపదం అవతల పెట్టి జామ,ఉసిరి,నారింజ,బత్తాయి,కివి,రేగిపండు కమలాలు హాయిగా తినండి .ఈ సి-విటమిన్ పుష్కలంగా ఉన్న పండ్లు ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి తోడ్పడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. రోగనిరోధక శక్తి పెరిగి గుండె పనితీరు మెరుగు పడేందుకు ఈ పండ్ల లోని పోషకాలు ఉపయోగపడతాయి.ఈ కాలంలో దొరికే ప్రతి పండు తప్పని సరిగా తినండి అంటున్నారు.
విలువైన పదాలు
థాంక్స్ అన్న పదం కంటే విలువైంది ఇంకేదీ లేదు అంటున్నారు ఇల్లినాయ్ యూనివర్సిటీ పరిశోధకులు 200 జంటలను ఎంపిక చేసి మూడేళ్ళ పాటు వారి జీవిత విధానాన్ని క్షుణ్ణం గా పరిశీలించారట వాళ్లలో కృతజ్ఞత చూపించుకునే అలవాటున్న దంపతులు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారట. అందుకే చిన్నపాటి సేవ అందుకొన్న వెంటనే థాంక్స్ చెప్పండి మనుష్యుల మధ్య బలమైన బంధం పెంచేది ఈ రెండు మాటలే అంటున్నారు పరిశోధకులు.
నచ్చిన ప్రింట్ రెడీ
ఇష్టమైన క్లాత్ పైన నచ్చిన రంగుల్లో మెచ్చిన ప్రింట్ వేయించుకొని డ్రెస్ కుట్టించుకోవాలనుకొంటే వెంటనే ఫ్యాబ్ క్యూరటే (Fabcurrate) యాప్ ఓపెన్ చేయాలి గుజరాతీ లోని సూరత్ కు చెందిన ఒక దుస్తుల సంస్థ ఏర్పాటు చేసిన ఈ యాప్ లో ఏ రంగు వస్త్రం కావాలో ఎంచుకొని వందలాది డిజైన్ లతో ప్రింట్స్ ఎంచుకొని ఆర్డర్ ఇస్తే ఆలా రెడీ చేసి ఇస్తారు. ఎలాంటి వస్త్రశ్రేణి అయిన ఎంచుకోవచ్చు మీటర్ కు 250 నుంచి 1700 […]
క్లీనింగ్ క్వీన్
ఆరి కాటరీనా ను క్లీనింగ్ క్వీన్ అంటారు. పరిశుభ్రత ఈమెకు ఇష్టమైన వ్యాపకం సామాజిక మాధ్యమాల్లో ఇంటినీ వస్తువులను ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలు పెట్టేది. ఆమె కు కోట్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు. క్లీనింగ్ బ్రాండ్స్ ఎన్నో ఆమె వీడియోలను స్పాన్సర్ చేశారు. ప్రపంచం మొత్తం తిరిగి తనకు అడిగిన వాళ్ళ ఇళ్లను పైసా తీసుకోకుండా శుభ్రం చేసి పెడుతుంది. ఆ వీడియోలకు లక్షల్లో లైక్స్ వస్తాయి. సొంతంగా ఒక క్లీనింగ్ కంపెనీ పెట్టి ఎంతో […]
ధీర వనిత
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ఇండియా తరఫున తొలి మహిళ గూఢచారి గా పనిచేసిన నూర్ ఇనాయత్ ఖాన్ కథ లండన్ లో వేదిక పైన ప్రదర్శనకు సిద్ధం గా ఉంది సౌత్ వార్క్ లోని వేదిక పైన ప్రదర్శిస్తారు రెండవ ప్రపంచ కాలంలో బ్రిటిష్ యుద్ధ కాలంలో ఇనాయత్ ఖాన్ ను నాజీ ఆక్రమిత్ ఫ్రాన్స్ లో వైర్ లెస్ ఆపరేటర్ గా నియమించింది. సూఫీ కుమార్తె అయిన ఇనాయత్ ఖాన్ సహజంగా యుద్ధ […]
నా లక్ష్యం అదే
దక్షిణాఫ్రికా లో జరిగిన మిస్ డెఫ్ ఇంటర్నేషనల్ 22 పోటీల్లో మొదటి రన్నరప్ గా నిలిచింది సరిత ముసుకు వరంగల్ లోని వంటి మామిడి పల్లి ఆమె స్వగ్రామం.. మిస్ ఇండియా ట్రెడిషనల్ క్వీన్,మిస్ క్యాట్ వాక్,ఇంటర్నేషనల్ గ్లామ్ ఫ్యాషన్ వీక్ లలో డెఫ్ మోడల్ గా పాల్గొన్నది. సరిత పుట్టుకతో మూగ చెవిటి అయిన సరిత సంభాషణ అంత సైగలు సంజ్ఞల తోనే హైద్రాబాద్ లో హార్డింగ్ ల పైన తన ఫోటో చుసుకోవటం లక్ష్యం అంటుంది […]
నబీలా సయ్యద్
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీ కి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్ అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించారు.ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పాల్టైన్ విలేజ్ లో పుట్టిన నబీలా యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లలో పట్టా పుచ్చుకొంది. స్త్రీల సాధికారత హక్కులకు సంబంధించిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నది.
పల్లెల్లో వైద్యం
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సరిహద్దు నుంచి తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పరిధిలోని కుగ్రామాల్లో ట్రిపుల్ ఎల్ పనిచేస్తుంది. ఇది నా ఎన్జీవో లివ్ లవ్ లాఫ్ సంస్థ అంటే ట్రిపుల్ ఎల్ మానసిక సమస్యలు ఉన్న వారికి సేవ చేసే సంస్థ ఇంతకుముందే వికలాంగులకి సేవలు అందిస్తున్న వసంత ఫౌండేషన్ అన్న ఎన్జీవో మా నోడల్ సంస్థ అంటోంది దీపికా పడుకోణె. ఇక్కడ మానసిక సమస్యలు ఉన్నవారికి చికిత్స, మందులు ఇస్తారు. కోలుకున్న వారికి ఉపాధి కోసం […]
కాగితపు బొమ్మలు
రంగులు కుంచెలతోనే కాదు పేపర్లతో కూడా కళాకృతులు చేయవచ్చని నిరూపించాడు బ్రిటన్ కు చెందిన 47 ఏళ్ల బెక్ స్టోన్ ఫాక్స్ ఈ ఆర్టిస్ట్ క్విల్లింగ్ టెక్నిక్ తో రూపొందించిన కాగితపు బొమ్మలు. వాస్తవికత ఉట్టిపడుతూ కళా ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి. కుక్క, గొరిల్లా, పిల్లి,పక్షి వంటి రకరకాల జీవులను కాగితాలను మలిచి బొమ్మలు గా తయారు చేస్తారు ఫాక్స్.
రాణి అవంతి బాయి
రామ్‌ఘర్ రాణి అనంతి బాయ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన యుద్ధం ప్రకటించింది మధ్యప్రదేశ్ లోని రామ్‌ఘర్ పాలకుడు విక్రమాదిత్య సింగ్ అనారోగ్యం తో చనిపోతే అతని రాణి అవంతి బాయి ని, పిల్లలను లెక్కచేయకుండా బ్రిటిష్ కమాండర్ వాషింగ్టన్ ప్రజల పై అంతులేని పన్నులు వేశారు. ప్రజల కష్టాలు చూడలేక అవంతి బాయి తిరగబడి బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి ఓటమి తప్పదని అర్థం అయ్యాక 1858 మార్చి 20వ తేదీన కత్తితో పొడుచుకొని ఆత్మార్పణ […]
స్త్రీ సేవా లక్ష్యం
స్త్రీల ప్రసూతి కష్టాలు తీర్చేందుకు గైనకాలజీ లో పరిశోధనలు చేశారు బండారు అచ్చమాంబ. ఆమె మేనత్త పేరు కూడా బండారు అచ్చమాంబే. లండన్ వెళ్లి మూడు డిగ్రీలు పూర్తి చేశారు. వామపక్ష భావాలు అలవర్చుకున్నారు ప్రసూతి శిశు పోషణ అనే వైద్య గ్రంథాన్ని రాసి స్త్రీల లో చైతన్యం తీసుకువచ్చారు. ఇదంతా రెండో ప్రపంచం యుద్ధానికి ముందు మాట మాంటి స్టోరీ విద్యా విధానంలో చదువు చెప్పడం మొదలుపెట్టారు. శాసనోల్లంఘనం చేసి జైలుకు వెళ్లారు.1957లో కాంగ్రెస్ తరఫున […]
టీ పాట్ మ్యూజియం
భావన నిర్మాణాల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఇంజనీర్లు చైనా లోని మీటాన్ కౌంటీ లో ఉన్న టీ పాట్ మ్యూజియం ఇంజినీరింగ్ అద్భుతం. ఈ భవనానికి ప్రపంచంలోనే అతిపెద్ద టీ పాట్ షేప్ బిల్డింగ్ గా గుర్తింపు ఉంది. భవనం ఎత్తు 73 మీటర్లు. చైనీస్ గ్రీన్ టీ కి మీటాన్ కౌంటీ పుట్టిల్లు అంటారు. అందుకే ఇక్కడ టీ పాట్ మ్యూజియం కట్టారు. జగ్గు ముందున్న కప్పు కూడా ఇంకో చక్కని భవనం.
మానవ శిఖరాలు
కృష్ణాష్టమికి ఉట్టి కొట్టే వేడుక లాంటిదే స్పెయిన్ లో క్యాస్టిల్ పేరుతో జరుపుకొంటారు. కటాలోనియా నగరం లో జరిగే ఈ ఉత్సవానికి 15 వేల మందికి అంచెలంచెలుగా వలయాలుగా ఏర్పడుతూ పైకి ఎగబాకుతారు. ఈ క్యాస్టిల్ నిర్మించే వంద గ్రూప్ లు ఈ నగరంలోనే ఉన్నాయి. వివిధ జట్లు కలిసి 40 అడుగులు ఎత్తు వరకు మానవ శిఖరాలు నిర్మిస్తారు. పోటీల్లో అతి ఎత్తయిన మానవ శిఖరానికి బహుమతులు ఇస్తారు.
ఫెయిరీ టేల్ క్యాజిల్
అద్భుతమైన కోట వంటి హోటల్ ఒకటి చైనాలో ఉంది కధల్లో వర్ణించే అందమైన రాజమహల్ లాగా ఉండే ఈ హోటల్ పేరు ఫెయిరీ టేల్ క్యాజిల్ 2011 లో కొండల మధ్య వంతెనలను కలుపుతూ కట్టిన ఈ కోట వంటి హోటల్ లో బస చేసేందుకు బారులు తీరుతారు అచ్చం రాజు రాణీల్లాగా జీవించే లాగా ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉంటాయి.
‘యూజ్ మి’
ఢిల్లీ లో అప్ సైక్లింగ్ ప్రాజెక్ట్ ‘యూజ్ మి’ విజయవంతంగా నడిపిస్తున్న మీనాక్షి శర్మ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ఆమె స్టూడియో లో పేద మహిళలు పనికిరాని వ్యర్థాలతో క్లాత్ బ్యాగ్ లో గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తారు డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థాలను సేకరించి బ్యాగులు చేసి పర్యావరణహితమైన పద్ధతిలో ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేస్తారు నెలకు రెండు వందల కేజీల ఫ్యాబ్రిక్ వేస్ట్ తో అందమైన పూల తీగలు కుషన్ కవర్లు […]
ఆహారం చాలా ముఖ్యం
జుట్టు రాలే సమస్యకు తలపైన రాసుకునే నూనెల కన్నా తీసుకునే ఆహారం చాలా ముఖ్యం ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, చేప,గుడ్లు, పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, జింక్, సెలీనియం తదితర ఖనిజాలు పుష్కలంగా ఉండే మటన్, రొయ్యలే కాదు కందులు, పెసలు, మినుములు, బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు ఎక్కువగా తినాలి. విటమిన్ డి కోసం వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవాలి బాగా నిద్రపోవాలి.
సరికొత్త చరిత్ర
మేరీ ల్యాండ్ కు తొలి భారతీయ అమెరికన్ డెలిగేట్ గా తన ప్రత్యేకత చాటుకుంది అరుణ మిల్లర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా గెలిచిన అరుణ మిల్లర్ హైదరాబాద్ లో పుట్టింది. మిస్సౌరీ యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్పోర్టేషన్ ప్లానర్ గా ట్రాఫిక్ ఇంజనీర్ గా పనిచేశారు బ్రాండ్ గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది.
నేను గెలిచాను
నాకు నిక్టోఫోబియా అంటే చీకటి అంటే భయం దాన్ని పోగొట్టుకునేందుకు పెద్ద యుద్ధం చేసినంత పని చేశాను అలాగే వైఫల్యం అన్న భయం. ఎంతో కష్టపడే దాన్ని కానీ నెమ్మదిగా ఈ భయం నుంచి బయటపడ్డ. ఇప్పుడు ఫలితం గురించి కంగారు పడ్డాను అంటుంది ఆలియా భట్. ప్రతి వాళ్ళకి ఏదో ఒక భయం ఉంటుంది. అది ఎక్కువ ఫోబియా గా మారుతుంది వ్యక్తిగతంగా, వృత్తి గతంగా కూడా ఇది పెద్ద ఇబ్బంది ఇది మానసిక సమస్యే. […]
