December 2024
ఇది విడాకుల మెహందీ
పుట్టిన రోజు పెళ్లి రోజు ల మెహందీ మనం ఎన్నో చూశాం కానీ ఒక మహిళ తన వైవాహిక గా జీవితం లో తనకు ఎదురైన కష్టాలు బాధలు ఎదురైనా ఇబ్బందులు మెహందీ గా వేయించుకొని బయటి ప్రపంచానికి చూపెట్టింది.ఆ మెహందీ వేసిన ఆర్టిస్ట్ ఊర్వశి వోరా శర్మ ఇన్‌స్టా లో షేర్ చేసిన ఈ మెహందీ వీడియో నెటిజన్ల హృదయాలను కదిలించింది.
రోజు తినండి చాలా మంచివి
రేగు పండ్లు విరివిగా వచ్చే కాలం ఇది ఆకుపచ్చ,లేత ఎరుపు,ముదురు ఎరుపు రంగులో కనిపించే ఈ పండ్లు పోషకాలకు పుట్టిల్లు వంటివి. ఎన్నో రకాల పండల్లో లగే వీటిలో కూడా పిండి పదార్థాలు చాలా ఎక్కువ.పండిన పండ్లలో చక్కెర శాతం కూడా ఎక్కువే.రేగు పళ్లలో సి- విటమిన్,పీచు, క్వెర్స్టెయిన్ కాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ.అజారై మలబద్ధకం వంటి సమస్యలకు ఇవి ఔషధం వంటివి. ఈ సీజన్ లో వచ్చే పండ్లు రోజు తినాలి.
నిలిచి గెలిచిన సమంత
సమంత తిరుగులేని నటి ఈ ఏడాది ఐఫా అవార్డుల్లో ఆమెను ప్రతిష్టాత్మక ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సిటాడెల్ సిరీస్ ను ప్రపంచంలో అత్యధికులు చూసి మెచ్చుకున్నారు. 200 దేశాల్లో స్ట్రీమింగ్ అయింది.150 దేశాల్లో ట్రెండింగ్ లో ఉంది.ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటినీ చిరునవ్వుతో తన శక్తిని ధైర్యాన్ని చాటుకున్న సమంత నిజంగానే ఉమెన్ ఆఫ్ ది ఇయర్.
ఆలియా చాలా ప్రత్యేకం
జాతీయ ఉత్తమ నటి ఆలియా భట్, టైమ్ మ్యాగజైన్ 2024 ప్రపంచ అత్యంత ప్రభావంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఆమె పేరు చోటుచేసుకుంది. ప్రత్యేక ఫ్యాషన్ వేదిక మెట్ గాలా భారతీయత ఉట్టిపడే చీరకట్టుతో కనిపించి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నారామె. ఈ చీరను 163 మంది కళాకారులు 1965 గంటల పాటు శ్రమపడి తయారు చేశారు. ఈ సంవత్సరం మెట్ గలా థీమ్ కోసం ఆలియా తన చీర కొంగు పైన పూలు, […]
అరణ్యానికి రక్షణ
మహారాష్ట్ర అటవీశాఖ ఫారెస్ట్ గార్డ్ గా నియమితురాలైన తొలి ట్రాన్స్ జెండర్ మహిళా విజయ వాసవీ గిరిజన కుటుంబంలో పుట్టిన విజయ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నది తోటి వారి నుంచి తీవ్రమైన వెక్కిరింపులు వేధింపులు ఎదుర్కొన్నది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక పూణే లో మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లో చేరింది. ఫారెస్ట్ గాడ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన ఏకైక ట్రాన్స్ జెండర్ విజయ ఒక్కతే. ఆత్మహత్య తప్ప ఇంకో గత్యంతరం లేదని బాధపడిన విజయ ఇప్పుడు ఏకంగా […]
మంచి గోల్ఫర్ అమ్మాయిలే
వాణి కపూర్ గోల్ఫర్ పదేళ్ల వయసులో గల్ఫ్ నేర్చుకునేందుకు కోచ్ దగ్గర చేరింది వాణి కపూర్ ఢిల్లీలోని డి ఎన్ ఎఫ్ గోల్ఫ్ క్లబ్ లో ఆమె ఒక్కతే అమ్మాయి గోల్ఫ్ వ్యక్తిగతంగా ఆడవలసిన ఆట కొన్ని వేల గంటల శిక్షణ తర్వాత వాణి కపూర్ అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో పాల్గొన్నది. ఆస్ట్రేలియా లేడీస్ పి జె ఎ టూర్ లో పాల్గొన్న సమయంలో అప్పటికి భారతీయ మహిళా క్రీడాకారులు అందులో పాల్గొన్నదే లేదు. సాధారణంగా పురుషుల […]
మారాలనుకొన్న
50 ఏళ్ళ వయసులో ఆరు ప్రపంచ మారథాన్ లను పూర్తి చేసి స్టార్ మెడల్స్ గెల్చుకొన్నది కవితారెడ్డి.హైదరాబాద్ తో సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్ లో పాల్గొన కవిత పదేళ్ల క్రితం వరకు గృహిణిగా కుటుంబ బాద్యతల్లోనే ఉన్నది జీవన శైలిని మార్చుకోవాలనుకొన్న ఒకేఒక్క ఆలోచన తోనే ఆమె జిమ్ లో చేరి,అటునుంచి రన్నర్ గా మారింది.ఇండియాస్ ఫాస్టెస్ట్ మారథాన్ రన్నర్ గా తన కై తాను ఓ గుర్తింపు తెచ్చుకున్నది కవితారెడ్డి.
పెళ్లిళ్ల గూఢచారి
ఈ కాలం పెళ్లిళ్లకు అమ్మాయి అబ్బాయి గుణగణాలు కనిపెట్టి చెప్పే మ్యారేజ్ డిటెక్టివ్ లు ఎంతోమంది.వారిలో ముందు వరుసలో ఉంటుంది ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్. ఈమెకు ఢిల్లీలో తేజప్ డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది.వరుడి జీతం,వారికీ ఇతరులతో లైంగిక సంబంధాలు ఉన్నాయా వ్యక్తిగత విషయాలు అన్ని కనిపెట్టి చెప్పే వెడ్డింగ్ డిటెక్టీవ్ ఈమె పెళ్ళికి ముందు అబద్దాలు చెపితే అవి పెళ్లయ్యాక మెడకుచుట్టూకుంటాయి.వయసు,ఆస్తిపాస్తులు,చదువు,గతంలో విఫల ప్రేమలు,మొదలైనవన్నీ ముందే నిజాలు చెపితే సమస్య రావు.భావనా పాలివాల్ ఇలాటి విషయాలన్నీ […]
శారీ మార్కెట్ విలువ 53 వేల కోట్లు
మనదేశంలో శారీ మార్కెట్ విలువ 53 వేల కోట్లు పైగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.చీరలో వచ్చినన్ని ఫ్యాషన్లు మరే డ్రెస్ లోను రాలేదు. చీరకట్టు పైన ది శారీ సిరీస్ పేరుతో 80 పైగా షార్ట్ ఫిలిమ్స్ తీసింది మాలికా వర్మ డాలీజైన్ అనే శారీ డ్రేపర్ ఒకే చీరని 300 రకాలుగా కట్టి రికార్డు సృష్టించింది. రీటా కపూర్ బిస్తి దాదాపు 14 రాష్ట్రాల్లో రకరకాల చీర కట్టు పైన పరిశోధన చేసి 180 రకాల […]
లెక్కలే తేలిక
గణిత సూత్రాలను అర్థం చేసుకుంటే లెక్కలంతా తేలిక ఇంకేది కాదు అంటారు సుజాత రామ్ దొరై.అన్నామలై యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదువుకున్న సుజాత ప్రస్తుతం కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా లో ప్రొఫెసర్. నంబర్ థియరీ విభాగంలో జపాన్ గణిత శాస్త్రవేత్త ఇవాసావా థియరీ పైన పరిశోధనలు చేస్తున్నారు.ఆమెకు గణితంలో రామానుజం ప్రైజ్ 2006 ,క్రిగెర్-నెల్సన్ అవార్డు 2020 పద్మశ్రీ అవార్డు 2023 లభించాయి. పిల్లలకు బాల్యంలోనే గణితం పై ఆసక్తి కలిగించాలి అందుకు […]
ప్రపంచ స్థాయికి పాయల్ సినిమా
పాయల్ కపాడియా తీసిన ఆల్ వియ్ ఇమాజిన్ అల్ లైట్ అనే చిత్రం ఫెస్టివల్ లో గ్రాండ్ ఫిక్స్ అవార్డు సాధించింది. అలాగే మూడు దశాబ్దాల తర్వాత ఫామ్ ది ఓర్ విభాగంలో పోటీ పడిన తొలి భారతీయ చిత్రంగా గుర్తింపు దక్కించుకుంది. కేరళ నుంచి ముంబై కి ఉపాధి కోసం వలస వచ్చిన ఇద్దరు నర్సులు వారు పనిచేస్తున్న ఆసుపత్రిలో వంట చేసే మరాఠీ మహిళతో సంబంధాలు వారి మధ్య భావోద్వేగాలు జీవితంలో సంతోషం కోసం […]
చదవటం కూడా వ్యాయామమే
జవానీ జానేమన్ తో బాలీవుడ్ లోకి వచ్చింది ఆలియా ఎఫ్ ఆమె తల్లి పూజాబేడి కూడా బాలీవుడ్ లో కథానాయిక గా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఐదేళ్ల కెరీర్ లో ఆరు చిత్రాల్లో నటించిన తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకుంది ఆలియా నైకా లెన్స్ కార్ట్ వంటి పెద్ద కంపెనీలకు ప్రచారకర్త. ఇన్‌స్టా లో ఆమెకు 20 లక్షల మంది అభిమానులున్నారు ఫిట్ నెస్, ఆహార నియమాలు వ్యాయామాలు, యోగాసనాలు వంటివి ఆమె పోస్ట్ ల్లో ఉంటాయి. […]
పచ్చబొట్టుతో గుర్తింపు
మధ్యప్రదేశ్ లోని బైగా తెగకు చెందిన గిరిజన ఆర్టిస్ట్ మారావి మంగళాబాయి.ఈ బైగా తెగ ప్రజలు తన సంస్కృతి సంప్రదాయాలను వంటిపై పచ్చబొట్టుగా వేయించుకుంటారు.పుల్లలు,సూదులతో ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ టాటూ వేస్తారు. ఏడేళ్ల వయసు నుంచే ఈ పచ్చబొట్టు వేయటం నేర్చుకుంది మంగళ బాయి, దాదాపుగా అంతరించిపోతున్న ఈ గిరిజన సాంప్రదాయ పచ్చబొట్టును జాగ్రత్తగా నేర్చుకొని అందులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది మంగళ బాయి.
లగ్జరీ బ్రాండ్స్ పై పెయింటింగ్స్
లగ్జరీ ఉత్పత్తులను కష్టమైజ్ చేస్తుంది కనికా అదానీ ముంబైలో పుట్టి పెరిగింది ఫైన్ ఆర్ట్స్ చదువుకుంది లగ్జరీ బ్రాండ్స్ ను కష్టమైజ్ చేసే వృత్తి లో ఉంది కనికా 2016 లో ది స్టూడియో ప్రాజెక్ట్ పేరుతో, షూలు, వాలెట్లు పాస్ పోర్ట్ కేసులు,స్కేట్ బోర్డ్ లు,గిటార్లు, బ్యాగులపై హ్యాండ్ పెయింటింగ్ చేస్తుంది. ఆమె ఖాతాదారులలో ప్రముఖ సినిమా నటులు అందరూ ఉన్నారు సమంత,సోనం కపూర్,విరాట్,ఆయుష్మాన్ ఖురానా వంటి వారి కోసం ఎన్నో వస్తువులపై గ్రాఫిటీ ఆర్ట్ […]
హాన్ కాంగ్ కు నోబెల్
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ 2024 సంవత్సరానికి గాను,సాహిత్య విభాగం లో నోబెల్ పురస్కారం అందుకున్నారు.ఈ ఘనత సాధించిన మొదటి ఆసియా మహిళా హాన్.దేశభక్తి,యుద్ధం,శాంతి గురించి మాత్రమే రాసే ఈ రచయిత్రి రచనల్లో అణగారిన వర్గాలు,మహిళలే ప్రధాన పాత్రలు కొరియన్ భాషలోనే రాస్తారు హ్యాన్ హ్యూమన్ యాక్ట్స్ అనే నవల 1980 ల్లో జరిగిన గ్వాంగ్జు మారణ హోమం గురించే ప్రస్తావించింది అలాగే ఆమె ఇంకొక నవల ‘ది వెజిటేరియన్’ 2015 లో బుకర్ ప్రైజ్ […]
ఫ్యాషన్ గా షాల్
ఉన్ని, నూలు పట్టుతో తయారయ్యే అందమైన శాలువల పైన అందమైన డిజైన్లు సృష్టిస్తున్నారు కళాకారులు.సోజ్ని ఒక రకమైన నీడిల్ ఎంబ్రాయిడరీ. ఈ పర్షియా భాషలో సోజ్ని అంటే సూది. 15వ శతాబ్దంలో పర్షియన్లు ఈ కళను కాశ్మీర్ కు తీసుకువచ్చారు. సోజ్ని శాలువాలు ఎంతో తేలికగా ఈ నీడిల్ ఎంబ్రాయిడరీ తో ఎంతో అందంగా ఉంటాయి. వెచ్చదనం ఇస్తూనే ఫ్యాషన్ గా కనిపించే ఈ శాలువలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ ఉంది.
ఈమెనే సుమో దీది
భారతదేశంలో తొలి మహిళ సుమో రెజ్లర్ గా ప్రపంచంలో టాప్-5 ప్రత్యేకమైన ముద్ర వేసింది. హేతల్ దావే ఈ మధ్య కాలంలో ఆమె పేరుతో నిర్మించిన సుమో దీదీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రముఖుల ప్రశంసలు పొందింది. ముంబై కు చెందిన హేతల్ తండ్రి చిన్నతనం నుంచే క్రీడల విషయంలో ఎంతో ప్రోత్సహించారు. ఐదేళ్ల వయసులోనే జూడో కుస్తీ నేర్చుకుంది.సుమో రెజ్లర్ కావాలనుకున్నది.2015 లో ఏషియన్ సుమో ఛాంపియన్ షిప్ లో కాంస్యం 2016 లో మన […]
అదృష్టాన్నిచ్చే స్నేక్ ప్లాంట్
వాస్తు రీత్యా అదృష్టం సంపాదనను ఇస్తుంది స్నేక్ ప్లాంట్ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందంటున్నారు ఎక్సపర్ట్స్. స్నేక్ ప్లాంట్ కు గాలిని శుభ్రం చేసే శక్తి ఉందని నాసా ప్రకటించింది ఎనిమిది అంగుళాల పొడవున్న స్నేక్ ప్లాంట్ ను గదిలో ఉంచితే గదిలోని కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ ను ఇంటి ఆగ్నేయ మూలలో పెడితే సంపద,నైరుతిలో పెడితే ఆరోగ్యం,తూర్పులో పెడితే సానుకూల శక్తి పెరుగుతాయి.
విజయవంతంగా ఒంటరి ప్రయాణం
యాంగ్‌మిలా జిమిక్ చేసిన ఒంటరి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ గిరిజన మహిళ తన బిడ్డను, అనారోగ్యంతో ఉన్న తండ్రిని పోషించు కునేందుకు ఎన్నో ఉపాధి మార్గాలు కనుగొన్నది. చివరిగా,పచ్చళ్ళ తయారీ లు కృషి విజ్ఞాన కేంద్ర వారి దగ్గర శిక్షణ తీసుకొని మణిపూర్ లో ఒక యూనిట్ స్థాపించింది. కొందరు గిరిజన మహిళల తోడ్పడరు షిరీన్ ఫుడ్స్ సంస్థ అన్ని రకాల క్యాండీలు పచ్చళ్ళు తయారు చేస్తుంది. ఫేస్ బుక్ తదితర ఆన్ లైన్ విక్రయాల […]
ఆర్బిటల్ కు బుకర్ ప్రైజ్
2024 బుకర్ ప్రైజ్ విజేత సమంతా హార్వే. ఈ బ్రిటిష్ రచయిత్రి రాసిన ఆర్బిటల్ నవలకు ఈ పురస్కారం లభించింది.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆరుగురు వ్యోమగాములు చుట్టూ తిరుగుతుంది నవల. సృజనాత్మక రచయిత్రిగా ఎంతో గుర్తింపు కలిగి ఉన్నా సమంత 2009లో మొదటి నవల ‘ది వైల్డర్‌నెస్’తో బుకర్ లాంగ్ లాస్ట్ కు ఎంపికయ్యారు.
