Saturday, 27 Jun, 2026

దారపు కుట్టు తో కాంతా చీరల

దారపు కొట్టు తో కనువిందు చేసే కాంతా చీరలు బెంగాల్ బంగ్లాదేశ్ మహిళలు నేర్పుగా చేసే క్విల్లింగ్ తరహా చీరలు. కాంత అనే బెంగాలీ పదానికి పాత వస్త్రం అదే అర్థం ఉంది వాడి పడేసిన పాత చీరలతో దిండు కవర్లు, క్విల్ట్ లు తయారు చేసేవారు. ఆ కవర్ల పైన చేసే క్విల్టింగ్ పనితనం చీరల పైకి తీసుకు వచ్చారు డిజైనర్లు కాటన్, సిల్క్, ముస్లిన్ వస్త్రాల పైన ఎంబ్రాయిడరీ రూపంలో చికెన్ కారీ పని […]

అశోక్ చక్ర ఆమెకే

1939 లో క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ గా ఏర్పడి ఆ తర్వాత 1949 నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గా సేవలు అందిస్తున్న సి ఆర్ పి ఎఫ్ లో ఇప్పటివరకు ఓకే మహిళ అశోక్ చక్ర అవార్డ్ పొందింది. ఆమె పేరు కమలేష్ కుమారి. ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ కి చెందిన కమలేష్ కుమారి పార్లమెంట్ సమావేశాల్లో ఉమెన్ బెటాలియన్ లో సెక్యూరిటీ విధులు నిర్వహించేది ఢిల్లీలో పార్లమెంట్ పైన 2001, డిసెంబర్ […]

కేవలం మహిళలకే ప్రవేశం

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం లో మహిళల కోసం ప్రత్యేకంగా అట్టుకల్ భగవతి దేవాలయం ఉంది. కేరళ తమిళనాడు రాష్ట్ర  శిల్పాలు అందంగా తీర్చిదిద్దిన గుడి గోపురం ఆలయంలో ఆభరణాలతో అలంకరించిన దేవతా విగ్రహం వెనుక మరొక విగ్రహం తో ఈ  ఆలయం  ప్రశాంతతకు నిలయం. కణ్ణిగి అమ్మవారి అవతారంగా భావించి మహిళలు భక్తితో పూజిస్తారు. ప్రతి ఏటా మార్చి నెలలో పది రోజుల పాటు జరిగే అట్టుకల్ పొంగల్ ఉత్సవం దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు […]

కొత్త డిజైన్ లో ‘బుగాడి’

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా సంప్రదాయంగా ధరించే బుగాడి ఎప్పుడు సరికొత్త హంగులతో ట్రెండింగ్ లో ఉంది . చెవి పైన వెలుపలి భాగం లో పెట్టుకునే ఆభరణం ఇది. చెవి అంచు పైన సన్నని రంద్రాలు చేసి ఈ ఆభరణం ధరిస్తే ముఖ్యమైన ఆక్యుపంచర్ పాయింట్స్ ఉత్తేజితమై అనారోగ్య సమస్యలు దూరం చేస్తాయని అప్పటి వారికి నమ్మకం. బంగారు తీగకు ముత్యాలు, ఎర్రని రాళ్లు, రత్నాలు, కెంపులతో చిన్న దుద్దులు […]

పాఠాలు చెప్తున్న డాక్టర్

కానూరులో వైకల్యాలు ఉన్న పిల్లల కోసం స్పెషల్ స్కూల్ ఏర్పాటు చేసింది దీప్తి తివారి. ఆమె కొడుకు భరత్ శారీరక మానసిక వైకల్యంతో బాధ పడడం చూడలేక వైద్య విద్య చదువుకున్న దీప్తి ప్రాక్టీస్ మానేసి సంకల్ప స్పెషల్ స్కూల్ ప్రారంభించింది. 2007 లో ప్రారంభించిన ఈ స్కూల్లో కొన్ని వందల మంది స్పెషల్ చిల్డ్రన్ ఎన్నో నైపుణ్యాలు నేర్చుకున్నారు వీలైనంత చదువు కూడా చదువుకున్నారు. హస్త కళలలో ప్రావీణ్యత సంపాదించారు. పరమైన లోపాలు ఉన్న పిల్లల […]

నీటి పైన దేవతలు

అందమైన రంగులతో నీళ్లపైనే దేవతా రూపాలు సృష్టిస్తుంది సమ్మెట రేవతి. ఇప్పటివరకు వందకు పైగా కళారూపాలు సృష్టించారు. హైదరాబాద్ లో ఉండే రేవతి క్లాసికల్ డాన్సర్ సినిమా నటి కూడా. ఈ ఫ్లోటింగ్ ఆర్ట్ లో ఎక్కువమంది కళాకారులు లేరు కూడా. రంగోలి కోసం నీళ్లు నింపే పళ్ళెం, ముగ్గు నింపుకొనే భరిణెలు పూజ సామాగ్రి లాగే భావిస్తుంది రేవతి. తాను వేసిన బొమ్మలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే వేల మంది  సబ్ స్క్రైబర్స్ […]

ఇంద్రజాలానికి ఆస్కార్

ప్రముఖ మెజీషియన్ సుహాని షా బెస్ట్ మ్యూజిక్ క్రియేటర్ 2025 అవార్డు తీసుకుంది ఇంద్రజాల రంగంలో ఈ పురస్కారాన్ని సమానంగా భావిస్తారు మ్యూజిక్ షో ల పైన ఆసక్తి పెంచుకున్న సుహాని షా,  మెజీషియన్ అవడానికి ఎంతో సమయం పట్టలేదు గత పాతిక సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 5000 ప్రదర్శనలు ఇచ్చింది సుహాని. రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చెందిన సుహాని మెజీషియన్ మెంటలిస్ట్,మోటివేషనల్ స్పీకర్ కూడా. తన ఉపన్యాసాలతో ఎంతోమందికి దిశానిర్దేశం చేసిందీ మెజీషియన్.

రాలిపడిన ఆకులతో ఎరువు

ఉత్తరాఖండ్ లో నివసించే డాక్టర్ మేఘ సక్సేనా అక్కడి ఆల్మోరా జిల్లా గవర్నమెంట్ కాలేజీ లో పనిచేశారు. ఆమెకు పర్యావరణ పరిరక్షణ ఇష్టమైన అంశం అడవుల్లో రాలి పడిపోయే దేవదారు ఆకుల వల్ల అక్కడి అడవుల్లో కారు చిచ్చు రగులుతోందని ఆమె గ్రహించింది. ఎండి రాలే ఈ ఆకులపై ఆమె పరిశోధనలు చేసి వాటిని చక్కని సేంద్రియ ఎరువుగా ఫీల్డ్ ఫామ్ లు కోళ్లకు చేపల చెరువులు చేపలకు సేంద్రియ దానా ను తయారు చేసింది ఏకో […]

ఈ మొక్కే ఔషధం

అలాంగియం సాల్విఫోలియం పేరుగల అంకోలా లేదా ఉడగ చెట్టు అనారోగ్య ఔషధం.ఈ మొక్క ఆకులు వెండి నానో కణాల తయారీ ప్రక్రియ లో వాడతారు భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్క కు లేత పసుపు రంగు అందమైన, అతి సువాసన గల పూలు పూస్తాయి. ఈ మొక్కకు కాసే చిన్న పండ్లు ఎండాకాలంలో మూడు నాలుగు గంటలు దాహం వెయ్యదు. ఈ పండ్ల జీవ సంబంధ సమ్మేళనాలలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ […]

అసలు బ్రహ్మ కమలం ఇదే

ఈ మధ్య బాల్కనీల్లో పెరిగే బ్రహ్మ కమలం పువ్వులు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. కానీ ఈ బాల్కనీల్లో పెరిగే బ్రహ్మ కమలం పురాణాల్లో పేర్కొన్నది కాదు కాక్టస్ కుటుంబానికి చెందిన ఈ మొక్కని ఆర్కిడ్ క్లైమ్బింగ్ కాక్టస్ అంటారు. పవిత్రమైనదిగా చెప్పే బ్రహ్మకమలం హిమాలయ పర్వతాల్లో 3000, 4,500 మీటర్ల ఎత్తు లో పెరుగుతుంది. కేదార్నాథ్ హేమకుండ్ సాహిబ్, తుంగనాద్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. తెల్లని తామర వంటి ఈ దివ్య కమలాన్ని […]

రైతులకు భరోసా

ఉల్లిపాయల రైతులను నష్టాల్లోంచి  బయటపడేసి వారికి ఒక నికారమైన ఆదాయానికి మార్గం చూపించిన 23 సంవత్సరాల కళ్యాణి రాజేంద్ర సిండే ను ఆనియన్ ట్విన్ అని పిలుస్తారు మహారాష్ట్రలోని లాసల్‌గావ్ అనే ఊరిలో పుట్టిన కళ్యాణి ఉల్లి రైతు కూతురే. ఉల్లి కోతకు వచ్చి వాటిని నిల్వ చేయడానికి రైతులు పడే బాధ చూశాక ఇంజనీరింగ్ చదువుతున్న కళ్యాణి రైతుల సమస్యలు క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసే డిజిటల్ ఇంపాక్ట్ స్క్వేర్ కోర్స్ చేసింది. ఆ అధ్యయనం […]

మనని మనం నమ్మాలి

రోమితా మజుందార్ ఒకప్పటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, వెంచర్ కాపిటలిస్ట్. 2021 లో స్కిన్ కేర్ బ్రాండ్ ఫాక్స్ టెల్ ప్రారంభించారు ఇది ప్రస్తుతం భారత దేశంలోని ప్రముఖ D2C స్కిన్ కేర్ బ్రాండ్స్ లో ఒకటి ఝార్ఖండ్ లోని రాంచి లో పుట్టి పెరిగిన రోమిత యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ లో బిజినెస్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్ లో డిగ్రీ చేశారు. ఏ నిర్ణయం తీసుకున్న ముందు మనపై మనకు నమ్మకం ఉండాలని చెప్పే […]

కాస్త కొత్తగా ఆలోచిద్దాం

హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సాధించింది వృషాలి ప్రసాదే.(Vrushali prasade) ఎ.ఐ పవర్ట్ ఫ్లాట్ ఫామ్ కో ఫౌండర్, సి ఈ ఓ కూడా. మార్కెటింగ్ నిర్ణయాలు ఆటోమేట్ చేసేందుకు వివిధ బ్రాండ్స్ కు ఉపయోగపడే ఫ్లాట్ ఫారం ఇది. ఈ పిక్సిస్ తో బ్రాండ్స్ మార్కెట్ చేసుకోవచ్చు. ఎ.ఐ  ఆధారిత వేదిక ఇది. బిట్స్ పిలాని నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వృషాలి నోటి నుంచి ఎప్పుడు రిగ్రేట్ అన్న పదం వినిపించదు. […]

హెల్త్ కేర్ కు ఆమె జీవం

రాధిక అంబానీ ఎన్ కోర్ హెల్త్ కేర్ సి ఈ ఓ వీరేన్ మర్చంట్ కుమార్తె హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్న రాధిక పారిశ్రామిక దిగ్గజం అనంత్ అంబానీ భార్య. ఫ్యామిలీ హెల్త్ కేర్ బిజినెస్ నిర్వహణలో ఆమెదే ముఖ్య పాత్ర ఇన్నోవేషన్ రీసెర్చ్ ఎన్ కోర్ హెల్త్ కేర్ కు ఆమె ఆలోచనలే ప్రాణధారం. న్యూయార్క్ యూనివర్సిటీ లో చదువుకొంది రాధిక. భరతనాట్యం లో కూడా ఆమె చురుకైన కళాకారుని. […]

విజయానికి నిర్వచనం

వ్యాపార కుటుంబం నేపథ్యం ఉన్న అనన్య శ్రీ బిర్లా సింగర్ గా పాటల రచయిత్రి గా ఎంటర్ ప్రెన్యూర్ గా తన ప్రత్యేక శైలిలో ముందుకు పోతూ, సక్సెస్ కు సరైన నిర్వచనం గా హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్నది. 17 సంవత్సరాల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ తో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది అనన్య. గ్రామీణ మహిళలకు సూక్ష్మ రుణాలు అందించే సంస్థ ఇది. అలాగే అనన్య బిర్లా ఫౌండేషన్ […]

అత్యంత ప్రతిభ

28 సంవత్సరాల దేవికా ఘోలప్ ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 2025 లో అతి పిన్న వయస్కురాలైన మహిళా గా మెరిసి పోయింది. డిజిటల్ పాథాలజీ కి సంబంధించిన ఆప్ట్రాస్కాన్ కంపెనీ లో పని చేస్తున్న దేవికా కు వైద్య పరికరాల తయారీ రంగంలో అనుభవం ఉంది కొర్పోరేట్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా కంపెనీ అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయం లో కీలక పాత్ర పోషిస్తోంది.బెక్టన్ డికిన్సన్ లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా,అంతకు ముందు మెడ్‌ట్రానిక్ […]

పాఠాలు నేర్పే స్కిల్ మేటిక్స్

పిల్లలకు పాఠాలు నేర్పే ‘స్కిల్ మేటిక్స్’ కు కో ఫౌండర్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ దేవాన్షి కేజ్రీవాల్. ముంబైలో ప్రారంభమైన ఈ స్కిల్ మేటిక్స్ కో ఫ్రెండ్లీ ఫ్రీ ఎడ్యుకేషనల్ గేమ్స్ క్రియేట్ చేస్తోంది. పిల్లలు పాఠాలు నేర్చుకునే విధానంలో ఎంతో గొప్ప మార్పు తెచ్చింది. స్పెల్లింగ్ గేమ్స్ తో మొదలైన స్కిల్ మేటిక్స్ స్క్రీన్ అవసరం లేకుండా పిల్లలకు నచ్చేలాగా వారి ఆలోచనలకు పదును పెట్టే లాగా పజిల్స్ ను క్రియేట్ చేసింది. ఈ  స్టార్టప్ […]

ఆమె డాన్స్ చాలా స్పెషల్

మోహినియాట్టం మోడరన్ రాప్ ను మిక్స్ చేసి ఎనిమిది మందితో ఒక వినూత్న నృత్యం రూపొందించింది శ్వేత వారియర్. ఈ డాన్స్ వీడియోస్ 13 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. కేరళలోని పాలక్కాడ్ కు చెందిన శ్వేత వారియర్ మూడేళ్ల వయసు నుంచే డాన్స్ నేర్చుకొంది. భరతనాట్యం స్టైల్ మిక్స్ చేసి సృష్టించిన స్ట్రీట్ ఓ క్లాసికల్ సూపర్ హిట్ అయింది. రకరకాల హై బ్రీడ్ డాన్స్ లతో కొత్త డాన్స్ స్టైల్స్ సృష్టించగల ప్రత్యేకమైన నృత్య […]

ఆమె జీవితమే పాఠం

కేరళ లో ఎనిమిదవ తరగతి ఆర్ట్స్ టెక్స్ట్ బుక్ లు ట్రాన్స్ ఆర్టిస్ట్ నేఘా.ఎస్.విజయ గాధ చోటుచేసుకుంది మలయాళ నటి నేఘా 2020లో నటించిన అంతరం చిత్రానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు అందుకుంది నేఘా. ఒక ట్రాన్స్ ఉమెన్ కు ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి.ఆమె సొంత ఊరు తమిళనాడులోని తిరువాయుర్ జిల్లా తీయన్నపురం. విద్యార్థుల్లో జెండర్ అవేర్నెస్ కోసం ఎన్నో ప్రభుత్వ స్కూళ్లలో క్లాసులు తీసుకుంది నేఘా.ఎస్.

అయిదేళ్ళ వయసులో వంద ప్రకటనల తార

ఐదేళ్ల వయసుకే సారా అర్జున్ 100 వాణిజ్య ప్రకటనల్లో కనిపించి తెలుగు,తమిళం హిందీ,మలయాళ చిత్రాల్లో బాల నటిగా నటించింది అవార్డులు అందుకొంది సారా. పొన్నియన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో నందిని గా నటించి ప్రశంసలు అందుకుంది సారా అర్జున్. ఆమె తండ్రి రాజ్ అర్జున్ కూడా నటుడే. ఆమెది ముంబై. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న బాలనటిగా సారా కి గుర్తింపు ఉంది తాజాగా ఆమె రణబీర్ సింగ్ కొత్త సినిమా దురంధర్ […]