February 2025
చరిత్ర సృష్టించిన సినిమా
‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ చిత్రం 40వ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్ లో జాన్ కసావెట్ అవార్డు గెలుచుకుంది శుచి తలాటి రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిమాలయన్ బోర్డింగ్ స్కూల్లో చదివే మీరా అనే టీనేజర్ ఆలోచనలు పరిచయం చేస్తుంది. జాన్ కసావెట్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా గర్ల్స్ విల్ బి గర్ల్స్ చరిత్ర సృష్టించింది ప్రముఖ నటులు రిచా చద్దా ఆలీ ఫజల్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫోర్బ్స్ మెచ్చిన ప్రీతి పాల్
ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ కు చెందిన ప్రతిపాల్ పుట్టుకతోనే సెలబ్రిల్ పాలీస్. కాళ్లు బలహీనంగా వంకరగా ఉన్నాయి. కుటుంబం ఆమెకు చికిత్స చేయించారు ఐదో ఏటనే కాలిపర్స్ పెట్టారు పెరిగి పెద్దయ్యాక పారా స్పోర్ట్స్ లోకి అడుగు పెట్టింది ప్రీతి. పరుగులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది పారా ఒలింపిక్స్ లక్ష్యంగా గత సంవత్సరం పరుగులో రెండు కాంస్య పతకాలు సాధించింది. ఈ క్రీడలో రెండు పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్ గా […]
ఆమె జీవితం ఓ అద్భుతం
కొందరి జీవితాలు కథల కంటే చిత్రంగా అనిపిస్తాయి ఇందుకు ఒక బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పూణే లోని ఒక చెత్తకుండీలో దొరికిన పాప ను ఒక అనాధాశ్రమ నిర్వాహకుడు చేరదీశాడు. న్యూ హరేన్ అనే దంపతులు అమెరికా నుంచి ఒక బిడ్డను దత్తత తీసుకునేందుకు ఇండియా వచ్చి ఆశ్రమంలో ఉన్న పాపను దత్తత తీసుకున్నారు లీసా అనే పేరు పెట్టుకున్నారు సిడ్నీ లో స్థిరపడిన ఆ దంపతులు తమ కుమార్తెకు క్రికెట్ నేర్పించారు. ఆమె ఇప్పుడు […]
అందంగా హ్యాండ్ ఫ్రీ చీరలు
నాలుగైదు స్టెప్స్ పెట్టుకుని అందమైన పిన్ను పెట్టుకునే పాత కాలపు స్టైల్ కాస్త పోయి కొంగును సింగిల్ స్టెప్ తరహాలో చేతి మీదుగా వేలాడే కొత్త ఫ్యాషన్ చీరలు వచ్చాయి ఈ చీరలను ఎలాంటి అసౌకర్యం లేకుండా నేలపైనే జీరాడకుండా ఉండేలా హాండ్స్ ఫ్రీ చీరలు డిజైన్ చేశారు. చీర కట్టు లోనే చేతిని దూర్చేలా ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఈ చేతి చుట్టూ క్రస్డ్ మెటీరియల్ అందమైన డిజైన్ చేశారు ఎక్సపర్ట్స్. ఈ హ్యాండ్ ఫ్రీ […]
కాపాడే దేవత
నైజీరియా ప్రాంతంలో దుష్టశక్తి ఉన్న శిశువులుగా ముద్రపడి వీధుల పాలైన పసిబిడ్డలను కాపాడి తాను స్థాపించిన ల్యాండ్ ఆఫ్ హోప్ అన్న సంస్థ లో చదివిస్తోంది డెన్మార్క్ కు చెందిన అన్జా (పూర్తి పేరు Anja Ring grew Loven) నైజీరియా లో విచ్ చిల్డ్రన్ అని ముద్ర పడ్డ చిన్నారులు ఎంతోమంది దిక్కు లేక రోడ్లపైనే పడి ఉంటారు ఈ దురాచారానికి వ్యతిరేకంగా అన్జా ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది ఆమె కాపాడిన పిల్లలు ఆ స్వచ్చంద […]
ఆల్ విమెన్ స్కూబా టీమ్
కేరళ అగ్నిమాపక దళం మనదేశంలో మొదటి మహిళ స్కూబా టీమ్ ను సిద్ధం చేసింది. ఈ ఆల్ విమెన్ స్కూబా డైవింగ్ స్కూల్ ఉన్నాడు పేరు గన్నెట్స్.ఉత్తర అట్లాంటిక్ తీరం లో సముద్రపు లోతుకు దుసుకుపోయి చేపల వేట చేసే పక్షుల పేరే గన్నెట్స్ సహాయ సహకారాలు అందజేస్తారు. వీరి సంఖ్య 17.భారత దేశం లో అందరు మహిళలే ఉన్న స్కూబా రక్షణ దళం ఇదే.
హాస్పిటల్ ఆన్ వీల్స్
రుద్ర హాస్పిటల్ ఆన్ వీల్స్ పేరుతో రైలు పెట్టేనే క్లినిక్ గా మార్చి ఊరూరు తిరుగుతూ వైద్య సేవ చేస్తున్నారు ఇటి పాండే. మహారాష్ట్ర భూసావాల్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఇటి పాండే. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి సైకాలజీ లో గోల్డ్ మెడల్ సాధించారామె. రైల్వే లో 26 సంవత్సరాల అనుభవంతో రైల్వే హాస్పిటల్ వైద్య సిబ్బంది తో రైల్లో గ్రామాలకు ప్రయాణం చేసేలా ఏర్పాటు చేసింది ఇటి పాండే. ఒక్కో రోజు ఒక్కో రూట్ ఒక్క గ్రామానికి […]
మహిళా భగీరథ
కర్ణాటక లోని శిరశి కి చెందిన గౌరీ నాయకి ని మహిళా భగీరథ అని పిలుస్తారు.నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కల కోసం ఈమె భూమి లోతుల్లోంచి నీళ్లను పైకి తెచ్చారు. కోవిడ్ లో ఒక బావి, తరువాత పిల్లల కోసం ఇంకొక బావి, ఎప్పుడు మహాకుంభమేళా పేరుతో 40 అడుగుల లోతులో ఇంకో బావి తవ్వింది గౌరీ నాయకి. ఆమె వయసు 58. ఈ బావుల తవ్వకం వంటి చేత్తో పూర్తి చేశారామె. ఆర్థిక స్తోమత లేకపోవడం […]
అత్యంత మేలైన ఆహారం
మెడిటరేనియన్ ఆహారం అత్యుత్తమమైనది చెబుతున్నారు వైద్యులు. ఆరోగ్యంతో పాటు ఆయుష్ ను పెంచుతుంది ఆహారం ఫిజీషియన్స్ కాబట్టి ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్ చేపట్టిన ఒక అధ్యయనం లో, అవిశలు, నట్స్, కూరగాయలు, కొమ్ము శనగలు, పుట్టగొడుగులు, ఓట్స్, గోధుమ చిరుధాన్యాలు పప్పులు, వీగన్ తో కూడిన మెడిటరేనియన్ ఫుడ్ లో చేపలు చికెన్ పాల ఉత్పత్తులు కూడా కలిసి ఉంటాయి.. ఈ డైట్ గుండె ఆరోగ్యం పెంచుతుంది గుండెపోటు పక్షవాతం మధుమేహం ఫ్యాటీ లివర్ డిసీజ్ ల […]
నొప్పి తగ్గించే సంగీతం
నొప్పి నివారణకు సంగీతం మంచి మందు అనే పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి. పార్కిన్సన్స్ , పక్షవాతం గుండెపోటుకు సంగీతం తో చికిత్స అందిస్తున్నారు. కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీ పరిశోధకులు శరీర తత్వాన్ని బట్టి మందులను కష్టమైజ్ చేసినట్లే సంగీతాన్ని కూడా చేయవచ్చు అని తేల్చారు గుండె కొట్టుకునే వేగం లో లయలో కొన్ని మైక్రో సెకన్ల తేడా ఉంటుందట. ఎవరికి వారికే ఉండే ప్రత్యేకమైన కు దగ్గరగా ఉండే టెంపో వేగం తో ఉండే సంగీతాన్ని […]
సమయం దాచుకోండి
ఓపిక ఉన్నప్పుడు కాస్త డబ్బులు సంపాదించుకొని దాచుకున్నట్లు ఓ నాలుగు గంటలు సమయాన్ని కూడా భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు అంటుంది టైమ్ ని కూడా భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు అంటుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా (TBI) రకరకాల కారణాల వల్ల ఒంటరిగా ఉండే వృద్ధులు తమకు కాస్త పనులు చేసే వాళ్ళ కోసం చూస్తుంటారు. ఆస్పత్రికి తీసుకుపోయే వాళ్లు, ఇతర సాయం చేసేవాళ్లు చాలా అవసరం అలాంటి ఆప్తులను వెతికి తెస్తుంది రాజస్థాన్ లోని టి బి […]
అందాల బగ్రు ప్రింట్లు
కాటన్ దుస్తుల్లో బగ్రు ప్రింట్ కు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది రాజస్థాన్ లోని బగ్రు ప్రాంతానికి చెందిన ఈ ప్రింట్లు బ్లకులతో డిజైన్లు చేసి ముద్రిస్తారు. ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ వస్త్రాల పైనే ముద్రిస్తారు. మొక్కలు, మట్టి సేంద్రియ పదార్థాల నుంచి సేకరించిన రంగులతో భిన్నమైన ప్రింట్లు తో ఈ బగ్రు కుర్తీలు చాలా అందంగా ఉంటాయి. ఎక్కువగా ముదురు రంగులే ఉపయోగించే ఈ బగ్రు దుస్తులు టెరికోట ఆర్ట్ డైజెడ్ జ్యువెలరీ లతో […]
అపురూప విజయం
24 సంవత్సరాల ప్రియాంక ఇంగ్లే మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ గెలిచిన జట్టు సారధి గా దేశంలో గుర్తింపు పొందింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ప్రియాంక ఐదో తరగతి లోనే ఖోఖో ఆడటం మొదలు పెట్టింది.ఖోఖో నే తన ప్రపంచంలో సాగిపోతున్న ప్రియాంక ఎన్నో అపురూప విజయాలు సాధించింది రెండేళ్ల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం రాణి లక్ష్మీబాయి అవార్డుతో పాటు శివ చత్రపతి స్టేట్ స్పోర్ట్స్ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. అంతకుముందు సచ్ జూనియర్ జాతీయ […]
స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్
దీర్ఘకాలం స్మార్ట్ ఫోన్ నాతోనే సమయం గడుపుతుండే వారిలో స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ తలెత్తుతోంది. కళ్ళను దెబ్బతీసే ఈ సమస్య అరికట్టాలి అంటే ఎక్కువ సమయం ఫోన్ చూడటం తగ్గించాలి స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల 60 శాతం మేరకు కళ్ళు ఆర్పటం తగ్గుతుంది. కనుకనే కళ్ళు మంటలు, పొడిబారే సమస్య వస్తుంది. కంటి దగ్గర గా ఫోన్ ఉంచడం వల్ల కంటి కండరాల పైన ఒత్తిడి పెరుగుతుంది కళ్లపైన ఒత్తిడి పెరిగి తలనొప్పి, అలసట, […]
కంప్లైంట్ ఇవ్వండి
మన దేశంలో 75 కోట్ల మందికి పైకాశామాజిక మధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారని ఒక సర్వే. అయితే ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతుంది మాత్రం మహిళలే ఆడవారి శరీరాలపై జరిగే ట్రోలింగ్ తో వారు నిరాశ, ఆందోళన ఆత్మ న్యూనత తో కృంగిపోతున్నారట ఇలాంటి వ్యతిరేక ప్రచారాలు జరుగుతూ ఉంటే వెంటనే సైబర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆంధ్ర తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగాలతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో […]
లవ్ బ్రేస్ లెట్
లవ్ బ్రేస్ లెట్ ని కార్డియాక్ అనే ఆభరణాలు తయారీ ఈ గోల్డ్ ప్లేటెడ్ బ్రేస్ లెట్ సాలిడ్ సాలిడ్ గోల్డ్ 18 క్యారెట్ లలో ప్లాటినమ్ తో కూడా తయారు అవుతోంది.బ్రేస్ లెట్ చోటా వజ్రాన్ని పోలిన రోడియం ఫినిషింగ్ అసలైన జాతి వజ్రాలు ఇతర విలువైన రాళ్లు పొదుగుతారు. హాలీవుడ్ నటులు ఎలిజబెత్ టేలర్ రిచర్డ్ బర్టన్, స్టీవ్ మెక్విన్ లు ధరించడంతో ఇది కాస్త పాపులర్ అయ్యింది న్యూయార్క్ లో డిజైన్ చేసిన […]
ఐ వాంట్ టు టాక్
ఇన్ఫ్లుయెన్సర్ అర్జున్ సెన్ రచించిన నిజ జీవిత కథ ‘రైజింగ్ ఏ ఫాదర్’ ఆధారంగా తీసిన ఐ వాంట్ టు టాక్ అనే సినిమాను దర్శకుడు సర్కార్ తీశారు అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన ఈ సినిమా లో అభిషేక్ బచ్చన్ నటించాడు. క్యాన్సర్ వచ్చి 100 రోజుల్లో చనిపోతావని డాక్టర్లు చెప్పేశాక అర్జున్ సేన్ అంతులేని ఆత్మశక్తితో 20 ఆపరేషన్లు చేయించుకుని బతికి బయటపడటం సినిమా కధ ది గ్లామర్ పాత్రలో తన నటనతో […]
తొలి గౌరవం ఆమెకే
శాస్త్ర సాంకేతిక ఆదర్శప్రాయాలుగా చెప్పుకునే మహిళల జాబితాకు అంతులేదు. అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళా ఎలిజబెత్ బ్లాక్‌వెల్ డాక్టర్ గా వైద్యరంగంలో ఎంతో కృషి చేశారు. ఒక ప్రమాదంలో ఆమె కంటి చూపు కోల్పోయి,సర్జన్ కావాలనే కల వదులుకోవలసి వచ్చింది. కానీ ఆమె కాలంలో వైద్యం వైద్య కళాశాల ప్రారంభించి ఎంతో మంది బాలికలు వైద్యులుగా మారెందుకు సహాయం చేసింది.
యంగ్ లుక్ చాలా ఆరోగ్యం
మహిళలు తమ వయసు కంటే చిన్నవారిగా కనిపించేందుకు ప్రయత్నించడం, అలా కనిపించడం మంచిదే అంటున్నాయి అధ్యయనాలు. జర్నల్ ఆఫ్ జెరంటాలజీ అనే వైద్య జర్నల్ లో నమోదైన పరిశోధనలు ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి తన వయసు కంటే తక్కువ వయసు వారిలా కనిపించే వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారని వారిలో హై బీపీ,పక్షవాతం, గుండె జబ్బులు వంటి అనారోగ్యాలు రావడం చాలా తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.
మొదటి మహిళా వ్యోమగామి
అంతరిక్షం లోకి ప్రయాణం చేసిన తొలి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు సాలీ రైడ్. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో సైన్స్ బోధించారు. ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారామె. ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను ఆ తర్వాత కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ రైడ్ బాలికలకు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు దోహదపడే కార్యక్రమాలు రూపొందించారు.
