Saturday, 27 Jun, 2026

అట్టడుగు ప్రజల కోసం నా రచన

‘చెంగల్ చూళాయిలే ఎంత జీవితం’ పుస్తకం తో పారిశుద్ధ్య కార్మికురాలు ధనుజ కుమారి రచయిత్రిగా ప్రపంచానికి పరిచయం అయింది. కేరళ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాలికట్, కన్నూర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేసింది. ఆమెను రాజ్య భవన్ కు ఆహ్వానించిన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శక్తిమంతమైన మహిళ గా ధనుజ కుమారి ని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు ప్రజల కోసం నేను రాయటం మొదలు పెట్టాను అంటోందీ రచయిత్రి .

మిస్ తెలంగాణ 2024

తెలంగాణ 2024 టైటిల్ విజేత ప్రకృతి కంబం తాజాగా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. గతంలో మిస్ గ్రౌండ్ కర్ణాటక టైమ్స్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు టైటిల్ గెల్చుకున్న ప్రకృతి తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మేలవింపును మిస్ ఇండియా పోటీ వేదికపై పరిచయం చేస్తానని చెబుతోంది. తెలంగాణకు చెందిన ప్రకృతి బెంగుళూరు లో పెరిగింది తల్లి రూప తమిళియన్ కావటంతో అక్కడి ఆచార వ్యవహారాలు క్షుణ్ణంగా నేర్చుకుంది.ఇప్పుడి మూడు రాష్ట్రాల సంస్కృతులను ఒక జీవన విధానంగా […]

అమ్మాయిలు ఉద్యోగాల్లోకొస్తే లాభం

శాప్ ల్యాబ్స్ సంస్థ కు తొలి మహిళ ఎం.డి గా పనిచేస్తున్న సింధు గంగాధరన్ తాజాగా నాస్కామ్ కు చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు.ఈమె సాఫ్ట్‌వేర్ డెవలపర్ సింధు గంగాధరన్ ను టెక్నాలజీ హ్యూమనిస్ట్ అంటారు. ఏ స్థాయిలో ఎదిగేందుకైనా జండర్ అడ్డు కాదు అంటారామె. మహిళా సాధికారత సాధించాలంటే ముందు అమ్మాయిలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకి రావాలి. ప్రస్తుతం నాస్కామ్ ద్వారా గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్ గా మన దేశాన్ని తీర్చిదిద్దేందుకు ఇంజనీరింగ్,ఇలా భిన్నరంగాల మేధావులతో కలిసి పని […]

వృద్ధులకు ఆశ్రయం

స్మిత్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ కేర్ ఫౌండేషన్ స్థాపించి ఇప్పటివరకు 10700 మంది వృద్ధులను ఆదుకొన్నారు యోజన ఘరత్ 2010 లో మహారాష్ట్రలోని పాల్ఘర్  జిల్లా బోయిసర్ లో తానే జిల్లాలోని ఏర్పాటైన ఈ సంస్థ ఠానే జిల్లాలోని భివాండీ లో ప్రస్తుతం నడుస్తోంది. ఇక్కడ వృద్ధులు శాశ్వత ఆశ్రయం పొందవచ్చు. ఈ సేవకు గాను యోజన నారీ శక్తి ప్రతిభ పురస్కారం సావిత్రిబాయి పూలే సత్కారం వంటి అనేక పురస్కారాలు గౌరవాలు పొందారు. శారీరక […]

ఆమె జీవితం అద్భుతం

జులేఖ షేక్ అబుదాబి స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ లో వాలీబాల్ లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం గెలుచుకుంది. ముంబైకి చెందిన జులేఖ అనాధాశ్రమంలో చదువుకుంది.స్పోర్ట్స్ టీచర్ అశోక్ రామచంద్రన్ నాంగ్రా ఆమెకు వాలీబాల్ లో శిక్షణ ఇచ్చారు రాష్ట్ర, అంతర్ రాష్ట్ర స్థాయిలో ఎన్నో గేమ్స్ ఆడింది జులేఖ. అటు తరువాత ఒలింపిక్స్ అవకాశం వచ్చింది. పేమెంట్ల దగ్గర భిక్షాటన చేసిన జులేఖ ఒలంపిక్స్ లో పాల్గొనడం ఎందరికో ఒక […]

ప్రాచీన కట్టడాలకు కొత్త రూపం

భారతీయ చారిత్రక నిర్మాణాలకు తన కళాత్మక శక్తి తో కొత్త రూపం ఇస్తుంది తెలంగాణకు చెందిన మసూమా రిజ్వి. రాష్ట్రపతి భవనం నుంచి అయోధ్య రామ మందిరం నిర్మాణం వరకు ఎన్నో కట్టడాలకు ఇంటీరియర్ డెకరేషన్ చేసిందామె ఆర్కిటెక్ట్. ఆర్టిస్ట్ కూడా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఆమె సృష్టే. బెలిటా డిజైన్స్ పేరుతో ఆమె వృత్తి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అబ్దుల్ కలామ్  రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఆయన భవంతి ఒక వెదురిల్లు నిర్మించి […]

అమెరికన్ జ్యోతిషురాలు

మన దేశంలో లాగే అమెరికాలోనూ జ్యోతిష్యులు ఉన్నారు వారిలో 40 ఏళ్ల అమీ ట్రిప్ అత్యంత ప్రభావవంతురాలైన జ్యోతిషురాలు ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ లో సోషల్ వర్క్ లో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఎంతో ఆసక్తితో జ్యోతిష్య అధ్యయనం చేశారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ వారి ధ్రువీకరణ పొంది సర్టిఫైడ్ ఆస్ట్రాలజీ గా నిలిచారు. అమెరికా రాజకీయాల్లో కమలాహారిస్ శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారని ఆమె ముందే చెప్పారు.

బరువు తగ్గించే టాడ్ పోల్ ?

టాడ్ పోల్ వాటర్ తాగితే బరువు తగ్గిపోతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గోరువెచ్చని నీళ్లలో కాసిని చియా విత్తనాలు నిమ్మరసం కలిపితే దాన్ని టాడ్ పోల్ వాటర్ అంటారు. చియా విత్తనాల్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ. క్యాలరీలు తక్కువ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. వేడి నీళ్లు కొవ్వును కరిగిస్తాయి. ఈ మూడు కలిస్తే బరువు తగ్గిపోతారని ప్రచారం అవుతుంది.

ఈమె నీటి డాక్టర్

నీటి శుద్ధి ప్లాంట్ ల నిర్వహణ బాధ్యత తీసుకుంది మాన్సీ జైన్. ఆమె తన తండ్రి రాజేష్ తో కలిసి స్థాపించిన ‘డిజిటల్ పానీ’ యాప్ ద్వారా ఐ ఓ టి సాంకేతికతలు ప్లాంట్స్ ని సంరక్షిస్తారు ఈ టెక్నాలజీ ని నీటి డాక్టర్ గా చెబుతారు మాన్సీ. భారత దేశంలో 90 వేల నీటి శుద్ధి ప్లాంట్ లు ఉన్నాయి వాటి నిర్వహణ, ఆపరేషన్స్ చాలా కష్టం సరైన నిపుణులు లేకపోవడం సమస్య. డిజిటల్ పానీ […]

థాయ్‌లాండ్ ప్రధాని

37 ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా చరిత్ర సృష్టించింది పెటోంగ్ టార్న్. మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా చిన్న కుమార్తె స్థాపించిన ‘ప్యూ థాయ్ పార్టీకి’ పార్టీకి ఆమె అధినేత బ్యాంకాక్ లో పుట్టి పెరిగిన పెటోంగ్ హోటల్ మేనేజ్మెంట్ చేసింది. 12 కంపెనీ లలో తిరుగులేని ఎంటర్ ప్రెన్యూర్. కమర్షియల్ పైలట్ పిటకా సుక్సావత్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు సంతానం సోషల్లీ లిబరల్ క్యాపిటలిస్ట్ గా తనను తాను అభివర్ణించుకునే పెటోంగ్ […]

ఆమెకు రిటైర్మెంట్ లేదు

మామూలుగా ఎవరైనా ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ తీసుకుంటారు కానీ జపాన్ కు చెందిన యసుకో తమకి మాత్రం 94 ఏళ్ళు వచ్చిన రిటైర్మెంట్ తీసుకోలేదు. సన్ కో  ఇండస్ట్రీస్ కో సంస్థ లో 1956 లో చేరారామె జనరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ అకౌంటెంట్ అకౌంటింగ్ క్లారికల్ పనులు చేస్తుంది. 30 ఏళ్ల కిందటే ఆమెకు రిటైర్మెంట్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికి పని చేస్తారామె. సోషల్ మీడియాలో ఆమె పేరు అందరికీ తెలిసింది. 2021 […]

నక్షత్ర విజ్ఞాన్

విజ్ఞాన్ శ్రీ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా రికార్డ్ సృష్టించారు అన్నపూర్ణి సుబ్రమణ్యం.బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. నక్షత్ర మండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై ఆమె ఎప్పుడూ పరిశోధన చేస్తూనే ఉంటారు. ఆస్ట్రోశాట్ ఆదిత్య ఎల్ 1 ఇన్స్ట్రుమెంట్స్ లో అన్నపూర్ణి పాలుపంచుకున్నారు. కేరళలోని పాలక్కాడ్‌ లో చదువుకున్న అన్నపూర్ణి నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు అది ఆమె వృత్తి,జీవనాశక్తి  జీవిక కూడా.

ఆమె తొలి మహిళ

భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్ గా లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన తొలి మహిళగా ఆమె వార్తల్లో నిలిచారు సాధన సక్సేనా. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కు ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ గా పని చేసిన మొదటి మహిళ కూడా ఆమె. పూణేలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్య రికార్డ్ లతో డిగ్రీ తీసుకున్నారు. భారత రాష్ట్రపతి […]

పెరుగుతున్న లైంగిక వేధింపులు

పని ప్రదేశాలలో ప్రతి సంవత్సరం మన దేశంలో 400కు పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదు అవుతున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక తెలియజేసింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో నివేదిక ప్రకారం సగటున 445 కేసులు నెలకు 35 చొప్పున లైంగిక వేధింపులు కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా 97 కేసులు నమోదైతే, కేరళలో 83, మహారాష్ట్ర 46, కర్ణాటక లో 43 కేసులు నమోదయ్యాయి. 2022-23 లో 1160 లైంగిక […]

రుక్మిణి లక్ష్మిపతి

ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల పోస్టల్ స్టాంప్ లు ప్రభుత్వం గౌరవంగా విడుదల చేశారు.మహిళల త్యాగం పోరాట పటిమ  ప్రతిఫలించే ఈ స్టాంప్ లు ఎంతోమందికి స్ఫూర్తి. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని మధురై లో పుట్టింది రుక్మిణి సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆచంట లక్ష్మీపతి గారి సతీమణి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిన తొలి మహిళల జట్టులో ఒకరు రుక్మిణమ్మ.1946 లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. గాంధీజీ హరిజన సంక్షేమ […]

సరదాగా చేస్తే పతకాలు  

అమెరికాకు చెందిన సైకిల్ రేసర్ క్రిస్టీన్ ఫాల్క్‌నర్ హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాక న్యూయార్క్ లో వెంచర్ క్యాపిటలిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. సరదాగా కాలక్షేపం కోసం సైక్లింగ్ మొదలుపెట్టింది. సాధనతో ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించింది.అమెరికా కు సైకిల్ రేసింగ్ లో ఇంతవరకు పతకం లేని లోటు తీర్చింది క్రిస్టీన్. గత ఆరేళ్లుగా సైక్లింగ్ సాధన చేస్తున్న క్రిస్టీన్ సింగిల్స్ టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు అందుకున్నది.

హర్భజన్స్ మేడ్ విత్ లవ్

చండీగఢ్ కు చెందిన హర్భజన్ కౌర్ కు 97 ఏళ్ళు వంట చేసుకునేందుకు ఎన్నో ఐడియాలు ఇచ్చే ఆమె పోస్ట్ లు లక్షలమంది చూస్తారు. హర్భజన్స్ మేడ్ విత్ లవ్ ఇన్ స్టా పేజ్ లో ఆమె బేసిన్ కి బర్ఫీ అమృత పరి మ్యాంగో పికిల్ షల్గామ్ గాజర్ కా ఆచార్ వంటి అద్భుతమైన వంటకాలు ఎలా చేసుకోవాలో చెబుతోంది. భర్త మరణించాక పిల్లలు ఎవరికి వాళ్ళు జీవించడం మొదలుపెట్టాక 90 ఏళ్ల వయసులో కూతురు […]

ఆమె తొలి మహిళ

నేపాల్ కు చెందిన లక్పా షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.2000 సంవత్సరం నుంచి ప్రారంభించి ఇప్పటివరకు పది సార్లు ఎవరెస్ట్ అధిరోహించింది. ఈ పర్వతారోహకురాలి జీవితం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ప్రశంసలు అందుకుంటుంది.హిమాలయాలు ఎక్కిన అనుభవంతో న్యూ ఇంగ్లాండ్, హిమాలయాల్లో, క్లౌడ్ స్కేప్ క్లైమ్బింగ్ పేరుతో పర్వతారోహకులకు శిక్షణ ఇస్తోంది లక్పా షెర్పా .కొడుకు నిమా,కూతుళ్లు సన్నీ పైనీ లు కూడా తల్లిలాగా పర్వతాలు ఎక్కే వాళ్లే.

అందమైన భుజోడి చీరలు

గుజరాత్,కచ్ ప్రాంతం లోని భుజోడి గ్రామంలో సాంప్రదాయ భుజోడి హ్యాండ్ లూమ్ చీరలు తయారవుతాయి. మగ్గాల పైన నేసే ఈ చీరల్లో 500 ఏళ్ల నాటి చరిత్ర మూలాలున్నాయి. ఆఫీస్ వేర్ గా భుజోడి ఎంచుకోవచ్చు. వీటిని గంజి పెట్టి ఉతికే పని లేదు. మెత్తగా వంటిని హత్తుకొని ఉండే ఈ చీరలు ఆకర్షణీయమైన మోటిఫ్స్ డిజైన్ లు రంగులతో ఉంటాయి. అన్ని కాలాల్లోనూ ఈ చీరలు హాయిగా కట్టుకోవచ్చు.

తల్లి స్ఫూర్తితో తనయ

ఒలంపిక్స్ లో 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్ లో స్వర్ణ పథకాన్ని సొంతం చేస్తుంది సమ్మర్ మెకింతోష్ 17 సంవత్సరాల మెకింతోష్ 400 మీటర్ల వ్యక్తిగత మేడ్లే లో ప్రస్తుత ప్రపంచ రికార్డ్ హోల్డర్ ఒలంపిక్స్ లో రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు గెలుచుకున్న తొలి కెనడియన్ కూడా. ఒలంపిక్ జట్టులో స్విమ్మర్ గా ఉన్న తల్లి జిల్ హార్స్టేడ్ల్ నుంచి స్ఫూర్తి పొందింది మెకింతోష్. ఈమెకు తల్లి తొలి గురువు ఆ తర్వాత కోచ్ ఆధ్వర్యంలో […]