Thursday, 26 Nov, 2026

ఫైటర్ గా రైతుబిడ్డ

పొలంలో కష్టపడి పనిచేసి,తనకి ఇష్టమైన బాక్సింగ్ లో నిరూపించుకుని 2026 లో జరిగిన డాకర్ యూత్ ఒలింపిక్స్ లో మహిళల 48 కిలోల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పథకం సాధించి,యూత్ ఒలింపిక్స్ బాక్సింగ్ చరిత్రలో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా బాక్సర్ గా చరిత్ర సృష్టించింది గుంజన్ యాదవ్. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె కఠోర పరిశ్రమ తో ఈ ఘనత సాధించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. బాక్సింగ్ అంటే ఇష్టంతో తండ్రి హర భగవాన్ చెప్పినట్లు పొలంలో కష్టపడి పని చేసి తానేమిటో నిరూపించుకుని ఆ తర్వాత నే బాక్సింగ్ రింగ్ లోకి అడుగు పెట్టింది గుంజన్. కూతురి కోరిక మన్నించి కుమారుడు కుమార్తెతో కలిసి హర్యానా లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు సుమన్. మంజిత్ లోహాన్ బాక్సింగ్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు.ఎంత కష్టపడినా బాక్సింగ్ వదిలి పోవాలని అనుకోలేదు గుంజన్.స్కూల్ టీచర్ గా పని చేస్తున్న సుమన్ ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ కూడా కూతురు లక్ష్యానికి దగ్గర అయ్యేలా సాయపడింది.ఆమె కష్టానికి తగిన ఫలితం అందించింది గుంజన్ యాదవ్.

Leave a Reply