Saturday, 27 Jun, 2026

రోజంతా ఉల్లాసం

వర్షం వస్తే బయటికి వ్యాయామం కోసం ఏ జాగింగ్ కు వెళ్లడం చాలా కష్టం అప్పుడు ఇంట్లోనే చేయగలిగే స్పాట్ జాగింగ్, తాడట, స్ట్రెంత్ ట్రైనింగ్, ప్లాంక్స్ యోగ చేయొచ్చు. ముఖ్యంగా స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే రెండు లీటర్ల వాటర్ బాటిల్ లను నీటితో నింపి రెండు చేతులతో వాటిని ఎత్తి ఉంచాలి. కుర్చీలో కూర్చుని రెండు చేతులతో రెండు బాటిళ్లను పెట్టుకుని పైకెత్తే ఉంచాలి. ఇది ఎముకలను దృఢ పరిచే ఎక్సర్ సైజ్.  రోజు మొత్తంలో […]

ఉమెన్ ఓన్లీ

ఈ ప్రపంచం చుట్టి రావటం నా లక్ష్యం అంటోంది సజ్నా అలి. కేరళలోని తిరువనంతపురం కి చెందిన సజ్నా అలి ఉమెన్ ఓన్లీ ట్రావెల్ గ్రూప్ కు శ్రీకారం చుట్టింది. ఈ ట్రావెల్ గ్రూప్ నుంచి వందలాది మంది మహిళలు వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేశారు. ఇందులో బడ్జెట్ ట్రిప్స్ కు ప్రాధాన్యత ఇస్తుంది సజ్నా అలి. ఇప్పుడు సజ్నా ట్రావెల్స్ కేరళలో అగ్రస్థానంలో ఉంది సోషల్ మీడియా నెట్ వర్క్ తో ట్రావెల్ ప్లాన్స్ ప్రచారం […]

పోషక విలువ అధికం

మొక్కజొన్న లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల ఉడికించిన మొక్కజొన్నల్లో 100 క్యాలరీలు ఉంటాయి. బి3, బి5, బి6, బి9 లు మొదలైన విటమిన్లు, పొటాషియం మ్యాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు మొక్కజొన్న గింజల్లో పేలాల లో లభిస్తాయి. మొక్కజొన్న లాగే బేబీకార్న్ లో కూడా ప్రొటీన్లు, పీచు ఎక్కువే వీటిలోని విటమిన్-సి రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

శాకాహారం లో ప్రొటీన్లు

ఫిట్ నెస్ కోసం వ్యాయామం చేసే సమయంలో మాంసాహారం మాత్రమే కండరాలకు పటుత్వం వస్తుందనుకుంటే పొరపాటే అంటున్నారు అధ్యయనకారులు. శాకాహారం లో ప్రోటీన్ల కోసం గింజలు, ధాన్యాలు, పాల పదార్థాలు, మిల్మేకర్,కొవ్వు తక్కువగా ఉండే చీజ్ అలాగే బ్రకోలీ పాలకూరల్లో కూడా తీసుకోవచ్చు. బాదాం, పిస్తా, వేరుశెనగ, గింజల్లో ప్రోటీన్ ఉంటుంది. పాలు కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ కింద పరిగణిస్తారు.

కటిక చీకటే బెస్ట్

నిద్రపోయే ముందర ఆ గది పూర్తిగా చీకటి గా ఉండాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బెడ్ లైట్ లు ఆల్ ఔట్ లు ఫోన్ల వెలుగు కూడా రానివ్వదు అంటున్నారు. అసలు కాంతి లేని కటిక చీకటిలో పడుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నార్త్ వెస్ట్ పరిశోధకులు. కాంతి ఎంత తక్కువగా ఉన్నా అది శరీరం స్పందిస్తుందని, ఒక రాత్రి డిమ్ లైట్ వెలుగులో పడుకొన్న గుండె వేగం శరీరంలో గ్లూకోజ్ శాతం పెరుగుతాయి అంటున్నారు అధ్యయనకారులు.

పరదాల జలపాతం

ఈశాన్య భారతం లోని మిజోరం లో అసాధారణ జలపాతాలున్నాయి థెంజాల్ పట్టణంలోని ట్యూరి హియావ్ జలపాతాలు చాలా ప్రత్యేకం కొండచరియలు నుంచి 20 అడుగుల ఎత్తులో ఇవి పరదాలు పరిచినట్లు ఉంటాయి దగ్గరగా వెళ్లేందుకు ఎలాంటి జాగ్రత్తలు అక్కరలేదు పక్కనే వందేళ్ల నాటి మర్రిచెట్టు చాలా బావుంటుంది ప్రాచీన గుహలు కొండ గ్రామాలు ప్రత్యేకం ఈ అందమైన జలపాతం చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి.

మాగంటి అన్నపూర్ణాదేవి

1921లో గాంధీజీ బెజవాడలో మహిళా సమావేశానికి హాజరు అయ్యారు. ఆయనను మా ఊరు ఏలూరు రావాలని కోరింది మాగంటి అన్నపూర్ణాదేవి. కాంగ్రెస్ నిధికి తన నగలు ఇచ్చి ఆ విరాళాలు ఇచ్చే సంప్రదాయం మొదలు పెట్టించింది అన్నపూర్ణ. ఆమె తల్లిదండ్రులు కలగర రామస్వామి, పిచ్చమ్మ లు బ్రహ్మ మతాన్ని అనుసరించి అన్నపూర్ణను కోల్కతా లోని బ్రహ్మ బాలిక పాఠశాలలో చదివించారు. బెంగాలి సాహిత్యాన్ని అనువాదం చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో చదువుకున్నది అన్నపూర్ణ. అరవిందుని లేఖలు వంటి […]

సబర్మతీ ఆశ్రమం

అహ్మదాబాద్ లోని సబర్మతీ నదీ తీరంలో వెలసిన గాంధీ ఆశ్రమం ఆయన పాటించిన విలువలకు అద్దం వంటిది. మహాత్ముని పోరాట ఉద్యమం కళ్లకు కనిపిస్తుంది. ఆవులు మూగ జీవాల పెంపకం ఖాదీ తయారు వంటివి ఆయన చేసిన ప్రయోగాలు ఇక్కడే మొదలయ్యాయి 1917 నుంచి 1930 వరకు ఆశ్రమం స్వాత్రంత్య పోరాటానికి వేదికగా నిలిచింది. గాంధీజీ చేతిరాత కథనాలు పెయింటింగ్స్ ఆయన దుస్తులు వాడిన వస్తువులు చూసేందుకు ఈ ఆశ్రమాన్ని వేలాది మంది భారతీయులు సందర్శిస్తారు. ఈ […]

తయ్యాబా బేగం

మూసీ వరదల్లో హైదరాబాద్ చిక్కుకుంటే వరదా లో ఉంటూనే ఎంతోమంది స్త్రీలకు అండగా నిలిచారు తయ్యాబా బేగం.దేశంలో మొదటి ముస్లిం మహిళ మంత్రి తయ్యాబా బేగం. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ సంపాదించిన తొలి ముస్లిం మహిళ గ్రాడ్యుయేట్ జాతీయోద్యమం లో స్త్రీల గొంతుకను సమర్థంగా వినిపించిన యోధురాలు. భర్త ప్రోత్సాహంతో మహిళా విశ్వవ్యాప్త కి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విశేష కృషి చేశారు. అఖిల భారత మహిళా సంస్థ ఉపాధ్యక్షురాలిగా ఎంతో సేవ చేశారు. ప్రస్తుతం […]

దోమలు రావు

వర్షాలకు దోమలు విజృంభిస్తాయి ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచితే దోమలు రావంటున్నారు ఎక్సపర్ట్స్. లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, లెమన్ థైమ్, బామ్,లావెండర్, రోజ్ మేరీ, తులసి,క్యాట్నిప్,(నెపాటా కటారియా) వంటి మొక్కల నుంచి వచ్చే వాసనకు దోమలు మనుషుల ఉనికిని పసిగట్ట లేవు. ఈ మొక్కలు ఔషధ విలువలున్నవీ, పరిమళభరితమైనవి కనుక చక్కగా బాల్కనీలో పెంచుకోవచ్చు.

కళకు పురస్కారం

జపాన్ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ఫారెన్ మినిస్టర్స్ కమెండేషన్స్ అవార్డు గెలుచుకున్నారు గవ్వ రేఖ రెడ్డి. జపాన్ కళ ఇకెబానా కళ లో ఆమె ఎక్సపర్ట్. భారత్-జపాన్ ఆర్థిక సామాజిక సంబంధాలు మెరుగుపరచటం, జపాన్ సంస్కృతి ని విస్తరించటం లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు. ఇకెబానా గురించి మిశ్రణ పేరుతో పుస్తకాన్ని తెచ్చారు రేఖ రెడ్డి. అందులో ఇకెబానా తో పాటు దానికి సంబంధించిన భారతీయ వంటకాలు పరిచయం చేశారు.

ముడి బియ్యం బెస్ట్  

తెల్లని బియ్యాన్ని 50 గ్రాములు తగ్గించి వాటి స్థానంలో ముడి బియ్యం కలిపి అన్నం వండుకుని తింటే మంచిది. డయాబెటిస్ అవకాశాలు కొంతమేరకు తగ్గుతాయి అంటున్నారు అధ్యయనకారులు. ముడి బియ్యం లో నియాసిన్ విటమిన్ బి3 ఎక్కువగా కనిపిస్తాయి. మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకొనే సెలీనియం కూడా అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఉపకరించే గుణాలుంటాయి.

జుట్టుకు కలబంద

జుట్టు పొడిబారిపోవడం నిర్జీవంగా మారడం వంటి సమస్యలకు కలబంధ చక్కని పరిష్కారం.కలబంద గుజ్జుకు స్పూన్ ఆలివ్ నూనె కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే ఈ జెల్ లోని ఎంజైమ్ లు మృత కణాలను తొలగించి జూట్టుకు తేమను అందిస్తాయి. జూట్టు ఎదుగుదలకు కారణమయ్యే సహజసిద్ధమైన నూనెలు కుదుళ్ల నుంచే వెలువడతాయి.వీటిలో ప్రత్యేకమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.అలాటివే ఇరవై రకాల కలబందలోను దొరుకుతాయి.కప్పు కలబంద గుజ్జు లో పావు కప్పు ఉసిరిపొడి […]

ఇల్లంతా సువాసన

నిమ్మ ఎసెన్షియల్ ఆయిల్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి.నిమ్మ నూనె ఎయిర్ డిఫ్యూజర్ దీన్ని గదిలో స్ప్రే చేస్తే సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి.వంట గదిలో నుంచి ఘాటైన వాసన వస్తూ ఉంటే రెండు చుక్కల నిమ్మ, లావెండర్, రోజ్ నూనెలను కలిపి స్ప్రే చేస్తే పోతుంది. నిమ్మ నూనె లో కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి ఫర్నిచర్ తుడిస్తే చక్కగా మెరుస్తాయి. కొన్ని చుక్కల నిమ్మ నూనె దూది ఉండను పై వేసి దానితో వెండి […]

మేని మెరుపు కు మందార 

అందమైన పువ్వుల్లో ఎన్నో సౌందర్య పోషకాలు ఉన్నాయి మందార పూలు మేని మెరుపును పెంచుతాయి. కప్పు నీళ్లల్లో మందార పూలు వేసి మరిగించి ఆ నీటిని రెండు స్పూన్ల తేనె కలిపి క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు.అలాగే ఈ నీళ్లలో ఓ స్పూన్  పెసర పిండి, కాస్త పంచదార కలిపి మొహానికి రాసుకుంటే మృతకణాలు పోతాయి.చామంతి పువ్వులను నీళ్ళలో మరిగించి ఆ నీళ్లలో స్పూన్ తేనె,స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి తర్వాత కడిగేస్తే మొటిమలు మచ్చలు […]

  నిండుగా ఖనిజాలు 

ఈ నెలలో నేరేడు పళ్ళు విరివిగా దొరుకుతాయి.వీటిని ఆయుర్వేదంలో వివిధ రుగ్మతలకు ముందుగా వాడతారు.కుత్రిమ ఇన్స్ లిన్ ను కనుక్కో క ముందు వీటిని మధుమేహానికి చికిత్స లో ఉపయోగిస్తారు.విటమిన్ సి ఫోలిక్ ఆసిడ్ తో పాటు పొటాషియం జింక్ ఇనుము వంటి అనేక ఖనిజాలు నేరేడు పండ్లలో ఉంటాయి.నేరేడు పండ్లకు రంగు రుచి వీటిలో ఉండే ఆంథోసియానిన్ లు, ఫ్లవనోయిడ్లు టెర్పిన్లు అనే రసాయనాలు కారణంగా వస్తాయి. ఇవే నేరేడు పండ్ల కు వృద్ధాప్య నిరోధక […]

మెల్లీ సోలింగర్

మెల్లీ సోలింగర్ ఉప్పల లక్ష్మణరావు గారి భార్య 1898 లో స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో జన్మించిన మెల్లీ హోం సైన్స్ పట్టభద్రురాలు. రెండేళ్ల మెడిసిన్ చదివారు. భారత స్వతంత్ర ఉద్యమం పట్ల ఆమెకు సహానుభూతి ఉంది. 1929లో ఇండియా వచ్చి సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం కృషి చేశారు. మహాత్ముని సబర్మతి ఆశ్రమంలో కాంగ్రెస్ ప్రతినిధులతో కలిసి పనిచేశారు. జీవితాంతం ఖద్దరు ధరించారు  1940లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు జైలు శిక్ష అనుభవించారు. 1942 క్విట్ […]

జూడో లో రజితం

కామన్ వెల్త్ గేమ్స్ లో జూడో లో తూలి కామన్ రజతం సాధించింది 23 సంవత్సరాల తూలిక నాలుగు సార్లు జాతీయ ఛాంపియన్. ఆమె తల్లి ఢిల్లీ పోలీస్ విభాగంలో పని చేస్తోంది. భర్త వేధింపులు భరించలేక మూడేళ్ల తూలిక ను తీసుకొని బయటకు వచ్చిన అమృత తన కుమార్తెను క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది. నాలుగేళ్ల వయసు నుంచి శిక్షణ తీసుకొని దాన్ని కెరీర్ గా మలుచుకుంది తూలిక మాన్. మహిళల 78 కిలోల విభాగంలో ఆమె రజితం […]

మీ పతాకం మాకు పండగ

తమ కలలను నిజం చేసుకోవడం లో పేదరికం, గాయాలు వయసు అడ్డంకి కాదని తేల్చారు ఎందరో క్రీడాకారిణులు కామన్ వెల్త్ గేమ్స్ లు కాంస్యం సాధించింది రేజర్ల్ పూజ గెహ్లాత్ నా దేశ ప్రజలను క్షమించమని అడుగుతున్నా నేను స్వర్ణం సాధించలేకపోయాను అన్ని కన్నీరుమున్నీరైంది పూజ దానికి ప్రధాని స్పందించి పూజా నీ పథకం తో సంబరాలు జరుపుకుందాం మీ ప్రయాణం మాకు ప్రేరణ ప్రతి విజయం మాకు సంతోషం నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని […]

ఎడారిలో స్టార్ హోటల్

ప్రపంచంలోని వింతల్లో చైనా లోని జోంగ్ ప్రాంతంలో ఉన్న డెజర్ట్ స్టార్ హోటల్ ఒకటి. ఈ హోటల్ ఎడారిలో ఉంది. బయట ఎర్రని ఎండ చుట్టూ ఇసుక తెన్నులు నర మానవుడు కనిపించని ఎడారి. ఈ అద్భుతమైన లొకేషన్ లో జీవితకాలపు అనుభవాలు మూట కట్టుకోవచ్చు అంటారు సందర్శకులు. ఎంతో ఖరీదైన ఈ హోటల్లో పూర్తి అద్దాలతో నిర్మాణం చేసిన హోటల్ గదులు ఎన్నో ఆధునిక వసతులు స్విమ్మింగ్ ఫూల్ రాత్రి పగలు మెరిసిపోయే దీపాల కాంతులతో […]