Saturday, 27 Jun, 2026

నెల తగిలితే ఆరోగ్యం

సాధారణంగా వాకింగ్ కోసం రన్నింగ్ కోసం మంచి షూస్ వేసుకొంటారు. కానీ ఇవేవీ లేకుండా వట్టి పాదాలతో నడవడం,పరుగెత్తడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. నేలపైన వట్టి పాదాలతో నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది.  రిఫ్రెష్ అయిన భావన కలుగుతుంది.పాదాల అన్ని నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఎముకలు లంగ్స్ పాదాల తోనే ముడిపడి ఉంటాయి. కనుక వట్టి పాదాలతో నేలపైన లేదా పచ్చని పచ్చిక పైన నడిస్తే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇది […]

140 భాషల్లో పాటలు    

కేరళ కు చెందిన 18 ఏళ్ల సుచేతా సతీష్ తన గాన మాధుర్యంతో రెండుసార్లు గిన్నిస్ సాధించింది భాషలతో పాటు ఫ్రెంచ్ హంగేరియన్ జర్మనీ వంటి విదేశీ భాషల్లోనూ పాడగలరు. 85 భాషల్లో పాట పాడింది సుచేతా. 2021 లో ఏడు గంటల్లో 120 భాషల్లో గాత్రాన్ని వినిపించి రికార్డు సృష్టించింది సుచేతా 140 భాషల్లో పాడి రెండోసారి గిన్నిస్ లో తన పేరు నమోదు చేసుకుంది. మ్యూజిక్ బియాండ్ బ్యాండ్ రాప్ పేరుతో ఆమె పాటలు […]

విశిష్ఠ గౌరవం

భారతదేశ ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం పరిశోధకురాలు, సంగీత దర్శకురాలు ఉపాధ్యాయుల, రచయిత కూడా పద్మ సుబ్రహ్మణ్యం ప్రముఖ చలనచిత్ర దర్శకులు కె. సుబ్రహ్మణ్యం మీనాక్షి సుబ్రహ్మణ్యం లకు 1943 లో జన్మించారు. సంగీతం లో మాస్టర్స్ చేశారు. నృత్యం లో పి.హెచ్.డి తీసుకున్నారు. 1981 లో పద్మశ్రీ, 2003 పద్మభూషణ్ అవార్డు లు పొందారు. 1983 లో సంగీత నాటక కమిటీ అవార్డు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు ఇచ్చి గౌరవించారు.తాజాగా  పద్మ […]

హరికథకు గౌరవం

ప్రముఖ హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కృష్ణాజిల్లా హుబిలి పట్నంలో పుట్టిన ఉమామహేశ్వరి తెలంగాణ లోని వేములవాడ లో పెరిగారు. 14 ఏళ్ల వయసు లో హరికథ నేర్చుకున్నారు. ఇప్పటివరకు కొన్ని వేల హరికథ ప్రదర్శనలు ఇచ్చారు. దేశం లోని విశ్వవిద్యాలయలు అన్ని ఆమె ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు తో పాటు ఆమె సంస్కృతంలోనూ హరికథ చెబుతారు. 2018 లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. జాతీయస్థాయి కళాకారిణిగా  హరికథ […]

క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్

శక్తివంతమైన హస్కీ గళంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన  నేపథ్య గాయని ఉషా ఉతుప్ ఆమెను క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ గా పిలుస్తారు. హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం తో సహా పలు భారతీయ భాషలలో 1500 పాటలు పాడారు ఉషా. 2011 లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం అందించింది. సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను అనేక అవార్డులు ప్రశంసలు పొందారు. తాజాగా ఆమెను పద్మభూషణ్ వరించింది.

వైజయంతిమాల కు పద్మ విభూషణ్

భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా కీర్తి గణించిన వైజయంతిమాల బాల నృత్య సంగీత కళల్లో ప్రవీణురాలు తమిళ చిత్రం వాఙ్కై తో సినిమా రంగంలో ప్రవేశించారు. నృత్య ప్రధానమైన చిత్రాలలో ఆమెకి ఆమే సాటి. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ పురస్కారాలతో పాటు తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాలు అందుకున్నారు. సినీ సంగీత రంగాలకు ఆమె చేసిన సేవలకు గాను ఈ ఏడాది పద్మ విభూషణ్ అందుకున్నారు.

వ్యాపారవేత్త

జ్యోతి లాబరేటరీస్ అధినేత్రి ఎం.ఆర్ జ్యోతి ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీ మీద కెక్కిన జ్యోతి స్ఫూర్తిదాయక కథనం ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శం.ఉజాలా నీటి మందు ప్రిల్ లిక్విడ్ డిష్ వాషర్, మార్గో సోప్, హెన్కో, మిస్టర్ వైట్ డిటర్జెంట్ మొదలైనవన్నీ జ్యోతి లాబరేటరీ ప్రతిభకు నిదర్శనమే. ఎన్నో బహుళజాతి సంస్థల ప్రొడక్ట్స్ తో పోటీపడి జ్యోతి ల్యాబ్స్ నిలదొక్కుకుంది అంటే కేవలం ఆమె వ్యవహార రక్షణ గానే చెప్పవచ్చు సింగిల్ ప్రోడక్ట్ ఉజాల తో మొదలైన […]

నిద్రలేమి తో సమస్య

రోజు మొత్తంలో ఆరు గంటల నిద్ర తప్పనిసరి అంటున్నాయి అధ్యాయనాలు. నిద్రలేమి ఒత్తిడిని పెంచడమే కాకుండా రక్త ప్రసరణ పై ప్రభావం చూపెడుతుందని ఒక అధ్యయనం చెబుతోంది.రాత్రి వేళల్లో ఆరు గంటల కంటే నిద్ర సమయం తక్కువగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు తప్పనిసరిగా నిద్ర వేల లు నిద్ర వేళలు పాటించమని అధ్యయనకారులు సలహా ఇస్తున్నారు.

శిరోజాలకు బలం

విటమిన్-సి అధికంగా లభించే ఉసరి తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే సమస్య పోయి జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి.గుప్పెడు తులసి ఆకులు టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చుండ్రు పోతుంది అలాగే ఉసిరి పొడిలో నిమ్మరసం కలిపి ఆ పేస్ట్ తో వేసుకున్న చుండ్రు పోతుంది. మెంతి పొడి, ఉసిరి పొడి పెరుగులో కలిపి ఒక రాత్రంతా నాననిచ్చి ఆ […]

నెలసరి శుభ్రత ప్రచారం

ఉజాస్ మెన్ స్ట్రువల్ హెల్త్ ఎక్స్ ప్రెస్ ను తీసుకువచ్చింది అద్వేతషా నెలసరి ఆరోగ్యం శుభ్రతలపై అవగాహన కల్పించేందుకు గాను ఈ వ్యాన్ దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు నగరాల్లో లక్ష కిలోమీటర్లు ప్రయాణించనున్నది నెలసరి పై కొనసాగుతున్న అపోహలను తీరుస్తూ ఉచిత సానిటరీ నాప్కిన్ లు అందిస్తున్నారు.వ్యర్థాలతో తిరిగి వాడుకునేలా రూపొందించిన ఈ నాప్కిన్ లను స్వయంగా తయారు చేసి పంచుతుంది అద్వేతషా బిర్లా

రోడ్ సైడ్ లైబ్రరీలు

అరుణాచల్ సిస్టర్స్ ఎన్గురాంగ్  మీనా రీనా లు మారుమూల ప్రాంతాల్లో కృషి చేస్తున్నారు. అరుణాచల్ అక్షరాస్యతలో వెనుకబడి ఉంది నాణ్యమైన విద్యను అందించేందుకు రోడ్ సైడ్ లైబ్రరీలు ప్రారంభించారు. మొదట్లో పుస్తకాలు ప్రజలు దొంగలించే వాళ్ళు కానీ,తర్వాత ప్రజలే వాటిని కాపాడుకోవటం మొదలుపెట్టారు. అన్ని పల్లెల్లో నూ ఇలాంటి లైబ్రరీలు ఏర్పాటు చేయాలనుకున్నారు మీనా రీనా లు వీరి కృషి ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఢిల్లీ,బెంగళూరు లో ఉన్నత చదువులు చదువుకున్న ఈ అక్క చెల్లెల్లు ఎన్గురాంగ్ […]

మల్టీ టాలెంట్

సాఫ్ట్ వేర్ ఇంజనీర్, రైటర్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆరతి కడవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చింది కార్గో మూవీ.ఈ ఫిలాసఫికల్ సైన్స్ ఫిక్షన్ సినిమాకు ముందు ఆరతి తీసిన టైమ్ మెషిన్ అన్న షార్ట్ ఫిలిం తో,పురాణాల కథలతో సినిమాలు తీయాలని లక్ష్యం ఏర్పరచుకుంది. కార్గో సినిమా తీసిన ఐదుగురు నిర్మాతల్లో ఆరతి కూడా ఒకరు.విల్ ఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది చిత్ర సీమలో కృతిమ […]

జీడిపప్పు తో ప్రమాదం

జీడిపప్పు బలం ఇస్తుందంటారు కానీ వీటివల్ల అనేక దుష్పరిణామాలు ఉన్నాయంటున్నారు పౌష్టికాహార నిపుణులు. జీడిపప్పులో కొవ్వు ఫైబర్ ఉంటాయి. అంచేత అరుగుదల కష్టం అవుతుంది. గుప్పెడు జీడిపప్పు లో 160 క్యాలరీలు ఉంటాయి.జీడిపప్పు తిన్న వెంటనే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు జీడిపప్పు తినకూడదు పచ్చి జీడిపప్పు లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పదార్థం క్యాల్షియం ఐరన్ జింక్ వంటివి శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటుంది అందువల్ల వేయించినవి లేదా నాన్న పెట్టిన జీడిపప్పునే తినాలి.

బీట్ రూట్ బెస్ట్

వాతావరణంలో వేడి పెరుగుతుంది. ఎండలు వచ్చాయంటే ముఖం నల్లబడటం మొటిమలు రావడం మొదలవుతుంది ఈ సమస్య కు బీట్ రూట్ ప్యాక్ వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసం ఒక స్పూన్, ఒక స్పూన్ పెరుగు కలిపి ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తగ్గిపోతుంది.మూడు స్పూన్లు బీట్ రూట్ రసం లో కాస్త నిమ్మరసం కలిపి ముఖం మెడ చుట్టూ రాస్తే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. బీట్ రూట్ రసం తేనే మిశ్రమాన్ని ముఖం పై రాసి […]

లేజర్ షూటర్

చదువు, ఆట రెండు ముఖ్యమే అంటుంది రిథమ్ సాంగ్వాన్ లేడి శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రిథమ్ ను లేజర్ షూటర్ అంటారు హర్యానా కు చెందిన ఈ భారతీయ పిస్టల్ షూటర్ అంతర్జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ ప్రపంచ కప్ ల్లో రాణించింది. గత సంవత్సరం స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్ ల్లో బెస్ట్ యంగ్ అచీవర్ గా నిలిచింది.గత ఆసియా క్రీడల్లో బృంద విభాగంలో స్వర్ణ పథకం అందుకోవటమే కాకుండా 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 29 […]

ఉత్తమ క్యూ రైటర్

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అక్కడి విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు మసూమా రిజ్వీ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన మసూమా పురాతన కట్టడాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ లు ఎన్నో చేపట్టారు. రాష్ట్రపతి భవన్ మానెక్షా సెంటర్, దీన్ దయాల్ మ్యూజియం వంటివి ఆమెకు పేరు తెచ్చాయి ఇప్పుడీ విమానాశ్రయం తో బాల్యం నుంచి అయోధ్య చేరేవరకు రాముడి జీవిత ప్రయాణాన్ని కలంకారీ పట చిత్ర రాజా రవి వర్మ చిత్రాల ద్వారా తీసుకువచ్చారు దేశవ్యాప్తంగా 100 మంది కళాకారులు […]

డాన్స్ అంటే ప్రాణం

డాన్స్ అంటే ఎంతో మందికి చాలా ఇష్టం ఎంతో కృషి చేసి నృత్యం లో పరిణితి సాధిస్తారు ఎంతోమంది. అట్లా డాన్స్ పట్ల ఎంత ఇష్టం అంటే ఏకధాటిగా ఐదు రోజులు పాటు డాన్స్ చేసే అంత అంటుంది సృష్టి సుదీర్.పదహారేళ్ల వయసున్న సృష్టి నిరవధికంగా 127 గంటలపాటు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ విభాగంలో గిన్నిస్ రికార్డు సాధించింది.

అత్యంత పొడవైన జుట్టు

గిన్నిస్ బుక్ లో ప్రతి సంవత్సరం సరికొత్త రికార్డు తో తిరగరాస్తుంటారు. అలా కేవలం తన జుట్టు విషయంలో గిన్నిస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కింది స్మితా శ్రీవాస్తవ. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈమె జుట్టు పొడవు 236. 22 సెంటీమీటర్లు అంటే ఏడు అడుగుల 8 అంగుళాలు. అత్యంత పొడవైన కురులు కలిగిన మహిళగా రికార్డ్ కెక్కింది స్మితా శ్రీవాస్తవ.

ప్రపంచ రికార్డ్

కొంతమంది పుట్టుకతోనే అరుదైన లక్షణాలు కలిగి ఉంటారు. ఇదే వాళ్లకి పేరు తెచ్చి పెడుతుంది. వింటానికి తమాషాగా ఉన్నా ఇది సత్యం అందరికీ నోట్లో 32 పళ్లే ఉంటాయి. తమిళ్ అమ్మాయి కల్పన బాలన్ కు 38 దంతాలు ఉన్నాయి. పై దవడకు రెండు అదనపు పళ్ళు కింద దవడకు నాలుగు అదనపు పళ్ళు కల్పనకు ప్రపంచ రికార్డ్ తెచ్చిపెట్టాయి

పుట్టుకతోనే స్పెషల్

చాలామంది పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకతలతో పుడతారు. అదే వారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతాయి. ఉత్తర ప్రదేశ్ కు చెందిన 16 సంవత్సరాల సిదాక్ దిప్ సింగ్ చాహల్ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు జుట్టు కత్తిరించుకోలేదు అది ఇప్పుడు 146 సెంటీమీటర్ల పొడవు పెరిగింది.ఈ జుట్టుతో గిన్నిస్ బుక్ లో పేరు రికార్డు అయింది.