December 2023
చీరె తో వర్క్ వుట్స్
ఉదయపు నడకలో లేదా జిమ్ ఆ వ్యాయామాలకు ఉపయోగపడే డ్రెస్ లే అవసరం అనుకుంటారు కొందరు. డ్రెస్ ధరించేందుకు ఇష్టపడరు. అలాంటి వారి కోసం వ్యాయామం పైన అవగాహన కల్పించడం కోసం చీర కట్టుతో వర్క్ వుట్స్ చేసి చూపించింది పూనే కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు శార్వరి ఇనామ్ దార్ జిమ్ లో చీరతో వర్క్ వుట్స్ చేస్తున్న ఆమె ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.మహిళలు తమ ఆరోగ్యం పైన దాన్ని మెరుగుపరుచుకునేందుకు […]
అమ్మో ఇన్ని శబ్దాలా ?
చుట్టూ ఉన్న శబ్ద కాలుష్యం నుండి ఎలాగో విముక్తి ఉండదు కనుక కనీసం ఇంట్లో అయినా కొన్ని శబ్దాలకు కాస్త దూరంగా ఉండండి. బిపి పెరిగి అలసిపోకుండా ఉంటారు అని చెప్తున్నారు. మిక్సీ వాడెప్పుడూ గోడకు అడుగున్నర దూరంలో పెట్టాలి. టీవీ మ్యూజిక్ సిస్టం సౌండ్ తక్కువ ఉండాలి. చెవులను కప్పి ఉంచే మఫ్స్ వాడటం చాలా మంచిది. చెట్ల వల్ల ధ్వని తగ్గుతుంది కనుక ఇంటి పరిసరాల్లో ఎక్కువ చెట్లు ఉండేలా చూసుకోవాలి.. ఎక్కువ చప్పుళ్ళు […]
స్వేత సౌధం లో ప్రదర్శన
విభా జానకిరామన్ చెన్నైలో పుట్టి పెరిగింది. సంగీతాన్ని కెరీర్ గా ఎంచుకొని బ్యాచిలర్స్ చేస్తుంది.సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం ఈమెది. ఆర్కెస్ట్రాల్ చాంబర్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ లో ప్రదర్శనలు ఇచ్చి స్కాలర్షిప్ అందుకుంది.ప్రధాని మోదీ, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ సమక్షంలో కూడా పాడి వారి మెప్పు ను పొందింది జానకి రామన్. ఈ అమ్మాయి వయసు 17 సంవత్సరాలు.
అంతర్జాతీయ పురస్కారం
కర్ణాటక హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని పాడటంతో పాటు ఎన్నో వాయిద్యాలు వాయించగలదు ఎన్ జె జననీ. మూడేళ్లకే సంగీత సాధన ప్రారంభించిన జననీ సినిమాలతో పాటు ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది.పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లో కలిసి ప్యారిస్ లో జుగల్ బందీ చేసింది. కాంటినెంటల్ మ్యూజిక్ అవార్డ్స్ నుంచి పాప్ విభాగంలో బెస్ట్ ఆఫ్ ఆసియా పురస్కారం అందుకున్నది జనని ఈసారి జానపద విభాగంలో కూడా ఆమెకు పురస్కారం లభించింది.
ఉత్తమ డి.జె
ప్రపంచం లోనే 100 మంది ఉత్తమ డి.జె లో స్నేహల్ షా ఒకరు ఆమె సింగర్ రీమిక్సర్ కూడా డి.జె రింక్ పేరుతో ముంబాయి ఎంతో పాపులర్. ఈ ఏడాది ఆసియాలోనే టాప్ 50 డి.జె ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది.రికార్డ్ లేబుల్ పేరుతో డి.జె స్కూల్ నిర్వహిస్తోంది. ఐ.పి.ఎల్ కు పనిచేసింది స్నేహల్ షా గుజరాత్ లో పుట్టి పెరిగిన స్నేహల్ ప్రముఖ డి.జె ల వద్ద శిక్షణ తీసుకుంది. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ […]
ఫిట్ నెస్ ట్రాకర్
కొత్త సంవత్సరం లేదా ఇతర పండుగలకు ఆత్మీయులకు బహుమతులు ఇస్తాం. సాధారణంగా కొత్త సంవత్సరం అమ్మాయిలు తీసుకునే తీర్మానాల్లో ముందుండేది బరువు తగ్గాలి అనే కదా. అల్లా స్నేహితుల్లో ఫిట్ నెస్ అభిమానులు ఉంటే వాళ్ల కోసం మెటల్ చైన్ ఫిట్ నెస్ ట్రాకర్ బహుమతి గా ఇవ్వచ్చు. స్టైల్ గా అనిపించే ఈ ట్రాకర్ వ్యాయామానికి సంబంధించిన అన్ని వివరాలు అందిస్తుంది.
సైగలతోనే గెలుపు
పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న దీక్ష దాగర్ కు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. తండ్రి నరీందర్ గోల్ఫ్ కోచ్. ఆయన శిక్షణలో 2015 లో లేడీస్ గోల్ఫర్ పోటీల్లో గుర్తింపు తెచ్చుకుంది. రెండు డెఫెలింపిక్స్ లో పోటీపడి రజిత బంగారు పతకాలు పొందింది.ఒలింపిక్స్ లో పోటీపడి తొలి గోల్ఫ్ ఫర్ చరిత్ర కెక్కింది దీక్ష దాగర్. హియరింగ్ ఎయిడ్ తో కొంచెం ఎనగలిగిన దీక్ష కేవలం సైగల సాయంతో ఇంత విజయం సాధించింది.
పరుగుల రాణి పరుల్
ప్రపంచ అథ్లెటిక్స్ లో 11వ స్థానంలో ఉంది పరుల్ చౌదరి. ఉత్తర ప్రదేశ్ లోని బహ్రాలా గ్రామానికి చెందిన పరుల్ స్కూల్ పోటీల్లో గెలిచిన తర్వాత నే పరుగును కెరీర్ గా తీసుకుంది. 2016 వరకు ఎన్నో అపజయాలు చలి చూసిన పట్టు వదలకుండా పరుగు పెట్టి ఐదు సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచింది. 3000,5000 మీటర్ల పరుగులో రాణిస్తూ దేశం మెచ్చిన క్రీడాకారిణి గా నిలిచింది ప్రస్తుతం రైల్వే లో విధులు నిర్వహిస్తోంది.
అందాల హెయిర్ పిన్స్
కేశాలంకరణలో జ్యువెలరీ ఎప్పుడు ప్రత్యేకమే డిజైనర్లు బంగారు, వెండి, డైమండ్ జ్యువలరీ లోహాలతో తక్కువ ధరల తో కూడా తలకట్టు లో అలంకరించే ఎన్నో నగలు చేస్తున్నారు. సిల్వర్ గోల్డ్ ఫాయిల్ పేపర్స్ తో కూడా హెయిర్ క్లిప్స్ చేస్తున్నారు గోల్డెన్ కవర్ ఫ్లవర్స్,బటర్ ఫ్లైస్ మూన్ అండ్ స్టార్స్ వంటి హెయిర్ పిన్స్ తయారు చేస్తున్నారు.క్రిస్టల్స్ సర్వోస్కీ ఇతర స్టోన్స్ ఉన్న పిన్స్ రాత్రివేళ పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.
అలుపెరుగని దివ్య
దివ్యకృతి కి గుర్రపు స్వారీ ధ్యాస శ్వాస కూడా ఆసియా క్రీడల్లో పోటీపడి ఈక్వెస్ట్రియన్ తొలి ర్యాంక్ సాధించింది. ప్రపంచంలో ఆమెది 14వ స్థానం జాతీయ అంతర్జాతీయ పోటీల్లో తన సత్తా చాటింది. 12 సంవత్సరాల వయసులో స్వారీ మొదలుపెట్టిన దివ్య ప్రతిరోజు ఉదయం 5 గంటలకే తన శిక్షణ మొదలు పెడుతుంది.ఆసియా క్రీడల కోసం అందులో గెలవటం కోసం దివ్య తల్లి తండ్రి తన ఒక్కగానొక్క ఇంటిని కూడా అమ్మేసి దివ్య కు శిక్షణ ఖర్చులు […]
ఆమె వోల్వో పైలట్
మన దేశంలో మొదటి మహిళా వోల్వా పైలట్ గా రికార్డు సృష్టించారు సీమ ఠాకూర్. హిమాచల్ రోడ్డు వేస్తే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో తొలి మహిళ బస్ డ్రైవర్ గా నియమితులయ్యారు సీమ. ఆ పర్వత ప్రాంతంలో క్లిష్టమైన రహదారుల్లో డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తారు సీమ.రోహ్రు నుంచి సిమ్లా మీదుగా ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో కేవలం 12 గంటల్లో చేరుకున్నారు సీమా ఠాకూర్.
అత్యంత శ్రీమంతురాలు
3672 కోట్ల సంపద తో దుబాయ్ లో అత్యంత సంపన్న భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించారు జూలేకా దౌడ్. నాగపూర్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన జూలేకా గైనకాలజీ లో స్పెషలైజేషన్ చేశారు.1964 లో ప్రాక్టీస్ కోసం యూ.కె వెళ్లిన తొలి భారత మహిళ వైద్యురాలుగా రికార్డ్ లకు ఎక్కారు.1992లో జులేకా హాస్పిటల్ గ్రూప్ ప్రారంభించి అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సర్వీస్ లు అందిస్తున్నారు.
ఫోర్బ్స్ డిజిటల్ స్టార్
కామెడీ కంటెంట్ క్రియేటర్ గా ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 100 డిజిటల్ స్టార్స్ లో భారత్ లో టాప్ గా నిలిచింది. ధారణ దుర్గ ఆమె యూట్యూబ్ ఛానల్ కు మూడున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాది ప్రకటించిన టాప్ 100 లో గుర్తింపు పొందిన ధారణ దుర్గ నిజజీవితంలో తన ఎదురైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అద్భుతమైన హాస్యం పండించగలదు.
ఆమెది మొదటి స్థానం
ఏడుగురు పిల్లల్ని పెంచటం తో 40 ఏళ్ళు వచ్చేవరకు గడిపిన ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఏళ్ల 65 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన మహిళ గా ఎదిగారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న తండ్రి ఎర్నెస్ట్ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఏంజెలా మెర్కెల్స్ క్యాబినెట్ లో కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆర్కెస్ జర్మనీ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి యూరోపియన్ కమిషన్ కు అధ్యక్షురాలుగా ఉన్నారు. […]
ఇదే ఆమె లక్ష్యం
మనిషి బ్రతికేందుకు అవకాశాలున్నా అంగారక గ్రహం గురించి పరిశోధన చేసేందుకు నాసా ప్రయోగించిన రోవర్ ను ఆపరేట్ చేస్తుంది అక్షతా కృష్ణమూర్తి ఈ ఘనత సాధించిన మొదటి భారతీయురాలు నాసా సైంటిస్ట్ గా ఆమె ప్రతిభ ఆమెకు అంగారక గ్రహంపై రోవర్ ను ఆపరేట్ చేసే అవకాశం ఇచ్చింది. చిన్నతనం నుంచి నాసా లో పని చేయాలని కోరికతో ఏరోనాటిక్స్ ఆస్ట్రోనాటికల్ లో పి హెచ్ డి చేసింది.
మొక్కలతో శాంతి
ప్లాంట్ ఇన్ ఫ్లూయెన్సర్ ఏక్తా చౌదరి ప్రారంభించిన గార్డెన్ ఆప్ యూట్యూబ్ ఛానల్ కు 1.5 మిలియన్ లా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా మొక్కల పెంపకం గురించి చిట్కాలు సలహాలు చెబుతోంది ఏక్తా చౌదరి. గార్డెన్ ఆఫ్ యువర్ వన్ స్టాప్ గైడ్ టు గ్రోయింగ్ ప్లాంట్స్ ఎట్ హోమ్ పేరుతో ఆమె రాసిన పుస్తకం మొక్కల ప్రేమికులు ఎంతో ఇష్టపడ్డారు. పచ్చని మొక్కలు పర్యావరణానికి మేలు చేయటమే గాక మానసిక ప్రశాంతతను […]
మూగ జీవుల పట్ల శ్రద్ధ
మన దేశంలో పబ్లిక్ లిప్టెడ్ ఐటీ సంస్థ నడిపిస్తున్న తొలి మహిళ రోహిణి నాడర్. కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేసిన రోషిని అమెరికా లో వార్తా సంస్థల్లో పని చేశారు. 2020లో తండ్రి శివ నాడర్ కు చెందిన వ్యాపార పగ్గాలు చేపట్టిన రోషిని శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్ట్ కూడా. దేశంలో ఫోర్బ్స్ అత్యంత సంపన్న శక్తివంతమైన జాబితాలో రోషిణి పేరు చోటు చేసుకుంది. ఆమె మూగజీవాల కోసం ఒక ట్రస్ట్ నడిపిస్తున్నారు.
తొలి సంతకం
సోమా మండల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు 1984 లో అల్యూమినియం తయారీ సంస్థ నాల్కో లో ఇంజనీర్ గా చేరారు. 2014లో మొదటి మహిళా డైరెక్టర్ అయ్యారు అంచెలంచెలుగా ఎదుగుతూ సెయిల్ తొలి మహిళా చైర్ పర్సన్ అయ్యారు. ఈమెది భువనేశ్వర్. నెయిల్ లో వ్యాపారాన్ని లక్ష కోట్ల కు చేర్చి శక్తివంతమైన మహిళ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు సోమా మండల్.
అందాల బృగు డిజైన్స్
రాజస్థాన్ జైపూర్ లకు చెందిన బృగూ అద్దకం చీరలు ఇష్టపడని స్త్రీలు ఉండరు. జైపూర్ కాటన్ బృగు చీరలు వైవిద్యమైన మోటిఫ్ లతో ఇండిగో నారింజ, పసుపు రంగులో తయారవుతూ ఉంటాయి. ఈ చీరలు పాత కళాకృతులు పొద్దు తిరుగుడు, గులాబీ ఇతర స్థానిక పువ్వుల డిజైన్లతో ఉంటాయి కొల్హాపురి చెప్పులు ఈ చీరలకు మంచి మ్యాచింగ్.
ఆహార భద్రత లక్ష్యం
ఆహార భద్రత సంరక్షణ కు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తుల్లో కవిత శుక్లా కూడా ఒకరు.హార్వర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్న కవిత పూర్వికులు ఇండియన్ లే. ఫ్రెష్ గ్లో కంపెనీ వ్యవస్థాపకురాలైన కవిత శుక్లా ఆహార పదార్థాలు తాజాగా ఉంచేందుకు ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆమె ఆహార భద్రత గురించి చేసిన ఉపన్యాసాలకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి. ఫోర్బ్స్ 30 అండర్ 30, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ టైమ్ మ్యాగజైన్ ఫైవ్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఉమెన్ […]
