October 2020
ఇన్ ఫెక్షన్లు వస్తాయి జాగ్రత్త
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల నేల తడిగా ఉండటం వల్ల కూడా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.వ్యక్తిగత శుభ్రత పాటించాలి అలాగే ధరించే దుస్తులు,లో దుస్తులు శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి ఎవరి వస్తువులు వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇతరులతో పంచు కోవటం వల్ల ఇన్ ఫెక్షన్లు వస్తాయి. డైట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇన్ ఫెక్షన్లు రాకుండా మసాలాలు వేసిన ఫుడ్ మానేయాలి. దాహం గా లేకపోయినా శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. చర్మ వ్యాధులు […]
ఎక్కువ కడిగినా నష్టమే
మొఖం చల్ల నీళ్ళతో కడిగితే చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. కానీ అదే పనిగా నీళ్లతో కడిగితే మాత్రం చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం పోతుంది.ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తే చర్మం పొడిబారి పోతుంది. చర్మం తేమగా తాజాగా కనిపించాలి అంటే స్నానం చేసే ముందు బాదం నూనె ముఖానికి పట్టించాలి అలా పట్టించి ఓ గంట పాటు వదిలేస్తే తేమను చర్మ గ్రంథులు పీల్చుకుంటాయి.ఆ తర్వాత గిన్నెలో నీళ్ళు మరిగించి వేడి నీటి ఆవిరిపట్టాలి. […]
తృణ ధాన్యాల సాగు చేస్తా
మా సొంత ఊరు ఎం కె పురం అక్కడే మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను రైతులు కళాకారులు విద్యార్థులు ఎన్జీవోలు వ్యవసాయ నిపుణులు అందరినీ ఇన్ వాల్వ్ చేశాను.నిపుణులు సాయంతో రసాయనాలు వాడని ఆర్గానిక్ మెన్యూర్ తయారీ ఇక్కడ నేర్చుకోవచ్చు.మిల్లెట్స్ పండిస్తే పోషకాహారలోపం తీరు తోందని నిపుణులు చెపుతూనే ఉన్నారు.రైతులకు తృణధాన్యాల సాగు దిశగా మలిస్తే బావుంటుందని మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను అంటోంది చిత్తూరు జిల్లా ఎం కె పురానికి చెందిన విశాల […]
లిప్ బామ్ కంటే మెరుగు
పెదవులు పగలకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సీరమ్ పనికొస్తుంది.దీన్ని చాలా తేలికగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఒక టీస్పూన్ నెయ్యి, సగం టీస్పూన్ పసుపు కలిపితే లిప్ సీరమ్ తయారవుతుంది. రాత్రివేళ నిద్రపోయే ముందు లేదా ఉదయాన్నే ముఖం కడుక్కున్న తర్వాత ఈ లిప్ బామ్ ను పెదాలకు రాసుకోవాలి.ఈ సీరమ్ పెదవుల మీద పగుళ్ళు గీతను తొలిగించి మృదువుగా మారుస్తుంది ఇది లిప్ బామ్ కంటే మెరుగయింది. స్క్రబ్బింగ్ తర్వాత కొద్దిగా లిప్ సీరమ్ రాసుకుంటే పెదవులకు […]
ఇవే ముఖ్యం
జీవితంలో మూడు విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి శ్రద్ధ విశ్వాసం ప్రేమ ఇవి మనిషి ఉన్నతమైన పధం చేర్చేందుకు సోపానాలు శ్రద్ధ తో ఏదైనా సాధించవచ్చు. సూర్యకిరణాలను ఒక బిందువు దగ్గర బూతద్దంలో కేంద్రీకరిస్తే అక్కడ అగ్ని ప్రజ్వరిల్లినట్లు శ్రద్ధ ద్వారా సమస్త శక్తులను ఏకం చేయవచ్చు. దేనికైనా శ్రద్ధతో నేర్చుకోవాలి అలాగే చేస్తున్న పని పట్ల విశ్వాసం ఎంత కఠినమైన కార్యాన్నైనా సరళం చేస్తుంది. ఆ పని పట్ల ప్రేమ దాన్ని సులభంగా సాధించేలా చేస్తుంది. […]
అత్యంత సుందరం
నమెగో వ్యాలీ జపాన్ లోని టెంకవా పర్వతాల్లో ఉంది. ఎటుచూసినా పచ్చదనంతో నిండిన కొండలు మధ్య మధ్యలో పూలదండలతో అలంకరించినట్లు కనిపించే ఈ వ్యాలీ కన్నుల పండుగగా ఉంటుంది. మొత్తం ఈ కొండలన్నీ ఆకుపచ్చరంగులో ఉంటాయి. శిఖరాలు మాత్రం వేరే వేరే రంగులతో ఉంటాయి. కొండల అంచున చెర్రీ వృక్షాలు వాలు పైన వరసల్లో కొనిఫెర్ చెట్లు ఉంటాయి. రుతువులు మారితే చెర్రీ ఆకుల రంగు మారుతుంది. కనుక ఆ ప్రదేశం రంగుల పూల దండలు అమర్చినట్లు […]
ఇంగువ పంట ఇక్కడే
వంటలకు మంచి రోజే ఇంగువ శాస్త్రీయ నామం అసోఫోటోడియా ఉల్లి వెల్లుల్లి కి లాగే రుచి వాసన కోసం ఇంగువ కూడా వంటకాల్లో వాడతారు.ఇంగువ మొక్కలు అత్యంత చల్లని ప్రదేశాలలో పెరుగుతాయి ఈ మొక్కలు రెండు గజాల ఎత్తు వరకూ పెరుగుతాయి.విత్తు నాటక ఈ మొలకలు మంచులో కప్పబడి దీర్ఘకాలం అలాగే ఉండిపోతాయి.అప్పుడు కలిగే మార్పుల వల్లే శ్రేష్టమైన ఇంగువ దొరుకుతోంది. ఈ మొక్కల వేళ్ల పైన గాట్లు పెడితే జిగురు వంటి పదార్థం వస్తుంది.ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, […]
కరోనా డైట్
కరోనా నియంత్రణకు ఇమ్యూనిటీని పెంచే డైట్ తీసుకోవటం చాలా అవసరం.నిత్యం బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అల్పాహారం లో నిమ్మజాతి కమలా పండు, నిమ్మ, ద్రాక్ష పండ్లు ఉండాలి.బొప్పాయి చాలా మంచిది ఇందులోని ఫ్యాటీ న్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి పెరుగులో ప్రొటీన్లు చాలా ఎక్కువ రోగనిరోధకశక్తి పెంపుదల లో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది పసుపు, వేపాకులు, వెల్లుల్లి, పాలకూర, అల్లం, బ్రొకోలీ, ఓట్ మీల్, తేనె వంటివి ఆహారంలో చేర్చుకోవాలి బాదం, పల్లి […]
నిరంతరం పని వల్లే ఆ సమస్య
నిరంతరం ఏదో పని చేస్తూ సబ్బు వాడుతూ రసాయనాలతో సింక్ లు శుభ్రం చేస్తూ ఉంటే చేతులు చాలా గరుగ్గా ఉంటాయి.చల్లని ఋతువుల్లో మీ చేతులను మరింత పొడిబారి పగుళ్లు కూడా వస్తాయి రెండు స్పూన్ల ఆలీవ్ నూనె లో పంచదార కలిపి అర చేతులకు రాసుకుని బాగా రుద్దాలి .తర్వాత కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి అలాగే ఓట్స్ ని కొద్దిగా మెత్తగా పిండిలా అయ్యేలా చేసి ఆ పిండిలో ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని […]
మాకిది గొప్ప అవకాశం
స్కూళ్ళ ఆధునికీకరణ లో భాగంగా గోడలపైన మ్యూరల్స్ వేయటం మాకు దొరికిన ఒక మంచి అవకాశం. 30 అడుగుల ఎత్తైన గోడలు గోడలపైన బొమ్మ గీయడం నాకు చాలెంజ్ ఎప్పుడూ ఆడ పిల్లల బొమ్మలు స్కూలు గోడలపైన గీస్తూ ఉంటాను. ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం గోడ పైన 40 అడుగుల గోడ పైన పి.వి సింధు బొమ్మ గీయటం నాకు గొప్ప సంతృప్తి కలిగించింది అంటుంది స్వాతి విజయ్.భార్యాభర్తలు ఇద్దరూ […]
వెంటనే వద్దు
ఫేషియల్ చేయించుకున్నాక చర్మం చక్కగా మెరుస్తుంది కానీ కొన్ని పొరపాటు చేస్తే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు ఎక్సపర్ట్స్ .ఫేషియల్ తర్వాత వెంటనే ముఖం కడగకూడదు.నాలుగైదు గంటల తర్వాత నీళ్ళతో కడుక్కుంటే చాలు.ఫేషియల్ తో పాటు ఫేస్ వాక్సింగ్ చేయించుకోకూడదు ఇలా చేస్తే మచ్చలు దద్దుర్లు వస్తాయి. వెంటనే మేకప్ వేసుకోకూడదు చర్మానికి గాలి తగిలేందుకు కొంత సమయం ఇవ్వాలి. అలాగే ఫేషియల్ తరువాత ఒకటి రెండు రోజులు ఫేస్ ప్యాక్ వేసుకోకూడదు. స్కిన్ గ్లో […]
ఇల్లు ఇరుకై పోతుందా ?
ఇల్లంతా సామాన్లతో నిండిపోతూ ఉంటుంది. అవసరం లేనివి తీసి వేయలేకపోతే ఇరుకై పోతుంది అలాగని ఏ వస్తువు పనికిరానిది అనిపించాక పారేస్తూ ఉంటారు అలా పారేయలేము అనుకున్న వస్తువులను ఒక చక్కని అట్టపెట్టెలో పెట్టి అలా ఒక పక్కన పెట్టేయాలి. ఆర్నెల్లకు కూడా వాటిలో ఒక వస్తువు తో కూడా అవసరపడకపోతే వాటిని మనస్ఫూర్తిగా తీసివేయవచ్చు తీసి పారేయడం ఒక్కసారి ఇంటిని పరిశుభ్రంగా ఖాళీగా ఆర్గనైజ్ చేసుకోవాలి అనిపిస్తే నెమ్మదిగా అనవసరమైన వాటిని వదిలించుకునే ఆలోచన కలుగుతుంది.అలా […]
ఒరిస్సా పత్యేక పట్ట చిత్రాలు
అనేక వందల సంవత్సరాలుగా ఒరిస్సా లో సహజీవనం గా నిలిచింది పట్ట చిత్ర కళ పూరి జగన్నాథుడే స్ఫూర్తిగా పురాణ గాధలను బట్టలపైన ప్రకృతి సహజమైన రంగులతో తీర్చి దిద్దుతారు కళాకారులు.సముద్రతీరంలో దొరికే కొన్ని రాళ్ళను హరికళ అని పిలుస్తారు ఆరాళ్ల పొడిని,సముద్రం లోపల దొరికే శంకు గవ్వలను కూడా బొమ్మలుకు వేసే రంగుల గా వాడతారు . విష్ణు పురాణం, దశావతారాలు భాగవత కథలు, మహాభారతం, రామాయణ ఘట్టాలు ఇలా పట్ట చిత్రాలన్నీ పురాణ కథా […]
ఒకే భావోద్వేగాలు
రంగు లేని ప్రకృతి ఊహించటం అసాధ్యం కొన్ని వందల వేల రకాల రంగుల్లో పూలు, చెట్లు, ఆకాశం అన్ని రంగులమయం.కళ్ళని ఆకర్షించేది వస్తువుల రంగులే రంగులో ఉండే ఆకర్షణ శక్తి అమోఘం. రంగులు జాతీయ, ప్రాంతీయ భేదాలు లేకుండా ఒకే రకమైన భావోద్వేగాలు కలిగిస్తాయి అంటున్నారు అధ్యయనకారులు ఒక్క రంగులో ఒక రకమైన భావోద్వేగాలు అందరిలో ఒకే రకంగా ఉన్నాయని అధ్యయనాలు తేల్చాయి. ఎరుపు రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పసుపు వర్ణం ఆనందాన్ని ఇస్తుందని ఈ […]
మనో ధైర్యాన్నిచ్చే స్నేహబాంధవ్యం
స్నేహ బాంధవ్యం మహిళలను మానసికంగా, శారీరకంగా దృడంగా వుంచగలన్నది శాస్త్రీయంగా రుజువైంది. ఒక మహిళ తాను ఇష్టపడే ఇంకో మహిళ నుంచి ఎంతో మనోధైర్యాన్ని అందుకుంటుంది. వయసు, మతం, కులం, వంటివి స్వచ్ఛమైన స్నేహానికి అడ్డు కావు.మహిళల మధ్య ఉండే ఇంటరాక్షన్ మానసిక పరమైంది. సామాజిక ప్రయోజనాలతో కూడుకుని ఉన్నది ఇలాంటి స్నేహాల వల్ల ఆక్సిటోసిన్, కోపమైన వంటి హార్మోన్లు ఉద్దప్తం అయి మహిళలకు ఆనందం ఇస్తాయి. మగవాళ్లతో పోలిస్తే స్నేహితుల విషయంలో మహిళలు ఆప్యాయత అనురాగాలతో […]
తెలుగు అమ్మాయిలకు నో ప్లేస్
కలర్ ఫోటో సినిమా సక్సెస్ నన్నెంతో ఆనందపెడుతుంది. నాకెరీర్ లో ఈ సినిమా ఒక ప్రత్యేకం… నాకు చాలా ఇష్టమైన పాత్ర లభించింది అంటోంది చాందినీ చౌదరి. నేను చదువుకొనే రోజులలో షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇప్పుడు దాన్ని చూస్తే ఇంకా బాగా చేయచ్చు,అనుకొంటాను. కానీ దాన్ని చూసే నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ అవన్నీ కార్యరూపంలోకి వచ్చేసరికి చాలా కాలం పట్టింది. హౌరా బ్రిడ్జి సినిమా తరువాత నాకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అంటోంది […]
రూపాయల దండలతో దేవి
కరెన్సీ నోట్లతో ఒరిగామి కళతో పూవుల దండాలు చేసి దుర్గ దేవికి హారాలుగా అలంకరించారు భక్తులు 1,11,11,111 రూపాయిల విలువైన ఈహారాలను తెలంగాణా,గద్వాల్ జిల్లాలోని జోగులాంబ గుడిలో దేవిని అలంకరించారు. ఈ రూపాయిల హారాలను ధరించిన ధన లక్ష్మి స్వరూపాన్ని భక్తులు దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొన్నారు.
ధర్మానికే విజయం
ధర్మం గెలుస్తుందని ఈ ప్రపంచంలో ఎన్నో సార్లు రుజువు అయ్యింది.ధర్మ మార్గం తప్పని వారు ఎప్పుడూ బలమైన వారే వారికి నైతిక శక్తి. ఆ శక్తి ముందు ఎటువంటి బలమైన అస్త్రాలైనా తలదించక తప్పదు రామావతారం ద్వారా విష్ణువు అందించక సందేశం ఇదే. రావణుడు బలశాలి శక్తివంతుడు విశేషమైన సైన్యాలు కలిగినవాడు అయినా రామ రావణ యుద్ధంలో అంతిమ విజయం రాముడిని వరించింది ఆసం గ్రామంలో రాముడే గెలుస్తాడని రామబాణవు దెబ్బతిని ప్రాణాలతో బయట పడిన మారీచుడు,రామదండు […]
తేమతో సమస్య
వర్షాకాలంలో ఇంటి గోడలు, పగుళ్లు మీదుగా నీళ్లు కారి ఇల్లు తేమగా ఉంటుంది.కలపతో చేసిన తలుపులు వానకు బిగుసుకుపోతాయి.వాటి నట్లు సరిగ్గా బిగించాలి వార్నిష్ చేయటం సాండ్ పేపర్ ఉపయోగించిన ఫలితం ఉంటుంది.లేదా తలుపులు ఊడదీసి మళ్ళీ బిగించాలి ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు వైరు సరిగ్గా పని చేయకపోవటం వర్షాల్లో చూస్తూ ఉంటాం.వైర్లను సరిగ్గా పూర్తిగా కప్పి వేయడం వల్ల భద్రత ఉంటుంది.కబోర్డ్ లో నీరు తేమ వల్ల నాచు పెరగటం,కీటకాలు ఉండటం కనపడుతుంది. నాఫ్థలిన్ బిళ్ళలు,వేపాకులు […]
తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం అర్మాన్
అంతర్జాతీయ మూడో గైనకాలజిస్ట్ గా పేరు పొందిన అపర్ణ హెగ్డే ఆర్మాన్ సంస్థ ఏర్పాటు చేశారు. 16 రాష్ట్రాల్లో లక్ష మంది ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనిచేస్తుందీ సంస్థ ముంబైలోని కామా ఆస్పత్రి లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తారామె వైద్య సేవలు అందని మారుమూల ప్రాంతాలకు మొబైల్ తో వైద్యాన్ని చేరువ చేయాలనుకున్నారు అపర్ణ.మొబైల్ మిత్ర అనే ఉచిత ఫోన్ కాల్ సర్వీస్ ఏర్పాటు చేశారు. 2018లో ఆర్మాన్ సంస్థ పుట్టింది 43 స్వచ్ఛంద […]
