June 2018
చర్మకాంతి
చర్మం యవ్వనకాంతితో మెరిసి పోవటం అందరికీ ఇష్టమే. పుడ్ ఆఫ్ ది గాడ్స్ గా పేరు పొందిన చాక్లెట్ ఈ అందాన్నీ ఇవ్వగలుగుతోంది. వారంలో రెండు మూడు చాక్లెట్స్ చొప్పున తింటువుంటే సూర్య కిరణాల వల్ల చర్మానికి కలిగే సమస్యపోతుంది.వీటిలో ఉండే ఫ్లేరోనాల్ యాంటీ ఆక్సీ డెంట్ ఒత్తిడి హార్మోన్ విడుదలను తగ్గిస్తుంది.ఈ హార్మోన్ చర్మం కొలాజెన్ బ్రెన్ డెడ్ కు కారణం అవుతోంది.చర్మంలో రక్త సరఫరా మెరుగు పడటంతో చర్మం మెరిసిపోతుంది. డార్క్ చాక్లెట్స్ లు […]
ఎన్నెన్నో లాభాలు
అన్ని రకాల నూనెలతో పాటు నెయ్యినీ వంటకాల తయారీలో వాడమని సిఫార్స్ చేస్తున్నారు వైద్యులు. వంటనూనెల కన్నా నెయ్యికి పోగవచ్చే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ .250 డిగ్రీల సెంటిగ్రేడ్ కి చేరితే కానీ నెయ్యి మాడటం జరగదు. ప్రీ రాడికల్ ప్రభావం నుంచి కాపాడుతోంది నెయ్యి. అమెరికన్ డైటరీ గైడ్ లైన్స్ లో ఆరోగ్యంగా జీవించేవారికి కొవ్వులు ,కొలెస్ట్రాల్ ,ఆహారపదార్థలు ఎలాంటి ప్రమాదం కలిగించవని చెపుతోంది. కొన్నీ తాజా పరిశోధనలు భారతీయులు ఉపయోగించే నెయ్యి ఇతర సంప్రదాయ […]
వర్షాకాలపు భోజనం
వర్షాల్లో హెల్త్ అప్ సెట్ అవూతూ ఉంటుంది. ఎలర్జీలు ఇన్ ఫెక్షన్లు వస్తాయి. వాతావరణంలో ఏర్పడిన హ్యూమినిటితో ఆహారం జీర్ణం కాక ఎసిడిటి పెరుగుతుంది.పెరుగులో పంచదారా ,ఉప్పు కొద్దిగా ఉసిరి పొడి కలుపుకొని తినటం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది.రోడ్డుపక్కన దొరికే ఆహారం కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ,కంద చిలకడ దుంప వంటకాలు గుమ్మడి వంటివి తినాలి.ధాన్యాలు బియ్యం గోధుమతో తయారు చేసే తేలికైన తాజాగా ఉండే ఆహరం తీసుకోవాలి. వేడివేడి సూపులు మొలకెత్తిన సూప్ లు […]
వెలుగుని ఆహ్వానించాలి
అపార్టుమెంట్ కల్చర్ తో తలుపులు వేసే వుంచాలి. ఉండేదే ఒక్క వాకిలి ,ఒక్క సిట్టింగ్ ఏరియా అన్ని తలుపులు వేసుకొని దీపాల కింద కాలక్షేపం ,ఇక ఆఫీస్ లో సెంట్రల్ ఎ.సీ.లో ఒక్క సూర్య కిరణం కూడా తాకకుండా పని చేస్తాం. రాత్రి కాగానే నిద్ర రావటం ,వెలుతురు మీద పడగానే లేవటం అన్నది ప్రకృతి సహాజమైన జీవ గడియారం పని తీరు. మరి ఆ అవకాశం దూరం చేసుకొని రాత్రి పగలు తేడా లేని విద్యుద్దీపాల […]
పాదాలు భద్రం
పాదాలు పాపం చిన్నగానే ఉంటాయి కానీ మనల్నీ నిరంతరం మోయటం ,నడవటం వంటి ఎన్నో బరువైన పనులతో అలసి పోతాయి.పాదాల ఆరోగ్యం పరి రక్షించుకోవాంటే కొన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాలు పొడిగా ,శుభ్రంగా ఉంచుకోవాలి. లోషన్లు, క్రీములతో కాస్త తేమను అందించాలి.గోళ్ళు చక్కగా కత్తిరించుకోవాలి. పాదాల నొప్పులు నిర్లక్ష్యం చేయవద్దు. వట్టి పాదాలతో నడటం వద్దు మంచి సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి. అలసిన పాదాలను ఓ బక్కెట్ గోరు వెచ్చని నీళ్ళలో ముంచి కాసేపు రిలాక్స్ […]
రెండూ తప్పే
సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ,నిత్య వ్యవహారాలను స్నేహితలతో షేర్ చేయటం ,సెల్ఫీలు దిగటంతో ఉత్సహంగా ఉండటం ఇవన్నీ మేలే కానీ ఆహరపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఆహారంగా శారీరక రుగ్మతలు కూడా ఎక్కువవుతున్నాయని తాజా రిపోర్టు చెపుతుంది.22 రేట్లు మాములు కంటే ఆహారం ఎక్కువ తీసుకొంటున్నారని అలాగే అతి తక్కువ ఆహారం తీసుకుంటున్నారని తేలింది.శరీరం బరువులో ఆహారంతో విపరీతమైన మార్పులు వచ్చినట్లు తాజా పరిశోధనలు చెపుతున్నాయి. మూడువేల మందికాలేజీ విద్యార్థులపై ఈ పరిశోధన సాగింది.గంటలకొద్దీ […]
మళ్ళీ మొదలెట్టండి
కొంత కాలం క్రితం ఆయిల్ పుల్లింగ్ అందరూ చాలా ఇష్టంగా ఫాలో అయ్యారు.మళ్ళీ ఎందుకు ఈ ఉత్సహం పోయింది .కానీ కొత్త అధ్యయనాలు దంతక్షయ నివారణకు కొబ్బరి నూనే వాడటం చాలా మంచిది అంటున్నారు .ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూలమైన దంతక్షయం టూత్ పేస్ట్ బదులు కేవలం కొబ్బరి నూనే వాడినా తగ్గిపోతుందంటున్నారు.టూత్ పేస్ట్ తో పళ్ళు కడగటం అయ్యాక కొబ్బరి నూనేతో చాలా పుక్కిలించి ఉమ్మేయటం వల్ల నోటిలో క్రిములు నశిస్తాయంటున్నారు .ఈ మధ్య కాలంలో […]
ఇవే ట్రెండ్
టియా భువ భారతీయా మూలాలున్న ఎన్నారై.ఆహార రంగంలో పని చేస్తుందీ అమ్మాయి.చీరెట్టులో ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది.ఒక అందమైన చీరెను తన కాన్ కాన్ స్కర్ట్ పైన కట్టుకొని ఇన్ స్ట్రా గ్రాంలో పోస్టు చేసింది.ఎన్నో చీరెలతో ఈ కాన్ కాన్ శారీ స్టయిల్ ప్రయోగాలు చేసి అవన్నీ ఇన్ స్ట్రాగ్రాం,ఫేస్ బుక్ ,ట్విట్టర్ ఎక్కడ చూసిన ఈ శారీ కట్టు పోస్టులు పెట్టేసరికి అది కాస్తా అమ్‌మాయిలు ఇష్టపడే ట్రెండ్ అయిపోయింది.
అందమైన డిజైన్ లు
ముంబైకి చెందిన త్రిశ్లీ సురానా ఆరోగ్యనికి ,హుందాగా కనబడేందుకు తగిన చెప్పులు తయారు చేస్తున్నారు.ఈమె వృత్తి రిత్యా గ్రాఫిక్ డిజైనర్. కలర్ మీ మ్యాడ్ పేరుతో వెబ్సైట్ తయారు చేసి చెప్పులకు సంబంధించిన డిజైన్స్ తయారు చేసి సాధారణ చెప్పులను ఆ డిజైన్ లతో అందంగా చేసి ఇచ్చేదే. తర్వాత కీళ్ళ నొప్పులు,వెన్ను నొప్పులు ఉన్న వారికి కార్క్ చెప్పులను తయారు చేయటం మొదలుపెట్టారు. సాధారణంగా డాక్టర్స్ సూచించిన చెప్పులు సాధారణంగా ఉంటాయి. అవే చెప్పులను ఫామ్ […]
అవినీతి తక్కువే
ప్రభుత్వాల్లో మహిళల భాగాస్వామ్యం వల్ల అవినీతి తగ్గుతోందని అధ్యయనాలు చెపుతున్నాయి.ప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు తీసుకుకోవటంలో మహిళలు ,పురుషుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు. అలాగే మహిళా నేతలు,కుటుంబం ,మహిళల రక్షణ ,పిల్లల అంశాల పట్ల ఎక్కువ ఆసక్తిగా ఉంటారని ,ఆ ప్రభావం సాంస్కృతిక ,వ్యవస్థగతమైన అంశాలపైన కూడా ఉంటుందని అధ్యయనాల రిపోర్టులు తేల్చాయి. మహిళలు ఎక్కువగా ఉన్న చోట అవినీతి తక్కువగా ఉంటుందంటున్నారు.సంస్థల్లో మహిళలు ఎక్కువగా ఉన్న చోట్ల లంచం ఇవ్వవలసిన అవసరం తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో […]
ఈ జ్యూస్ మంచి ఆరోగ్యం
అవకాడోని ఎంతో పోషకభరితమైన పండు అంటారు. వీటిలో ఉండే అత్యవసర ఫ్యాటీ యాసిడ్స్ ఇతర పండ్లలో ఉండవు. బరువు తగ్గిపోవాలనుకుంటే అవకాడో జ్యూస్ ఎంతో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి,ఇ పుష్కలంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థను గట్టిగా ఉంచుతాయి. పోటాషియం రక్తపోటు స్థాయిల్నీ అదుపులో ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికం . అవకాడోని పండక ముందు ఫ్రిజ్ లో ఉంచ కూడదు. బాగా పండాక ఫ్రిజ్ లో పెడితే వారం వరకు నిల్వ ఉంటాయి. ఆర్టిఫిషియల్ […]
అందం రెట్టింపు
కళ్ళే కాదు కనుబొమ్మలు కూడా అందాన్నీ రెట్టింపుగా చూపెడతాయి.కను బొమ్మలకు కూడా పోషకాలు అందాలి.వీటికి ఆముదం సరైన మందువంటిది.ఇందులో ప్రోటీన్స్ విటమిన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ,ఆంటీ ఆక్సీడెండ్స్ ఉంటాయి. ఇవి వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడతాయి. గుడ్డులో దొరికే కెరోటిన్ ప్రోటిన్ కూడా కనుబొమ్మమల వెంట్రుకలకు మంచిదే .గుడ్డులోని పసుపు సొనను కనుబొమ్మలపై రాసి పావగంట తర్వాత కడిగేస్తే చాలు.ఆలివ్ ఆయిల్ కూడా మంచిదే
వలయాలు మాయం
సరిగ్గా నిద్ర లేకున్న కంటి కింద వలయాలు వస్తాయి.ఒత్తిడీ,ఎలర్జీ కారణమూ కావచ్చు .ఈ సమస్య పోవాలంటే ఏదో ఒక నూనెలో కంటి చుట్టు మర్ధన చేయాలి. నిద్ర పోయే ముందర మాయిశ్చరైజర్ రాసుకొని అండర్ ఐస్ క్రీం పూత వేసుకోవాలి రసాయనాలు వద్దనుకొంటే బంగాళదుంపల గుజ్జులో నిమ్మరసం,గులాబీ నీళ్లు చేర్చీ కళ్ళకింద పూతలా వేయాలి. ఓ గంట ఆగి కడిగేస్తే చాలు.గ్రీన్ టీ బ్యాగ్లు ఫ్రీజ్ లో ఉంచి ఆ చల్లని బ్యాగ్ లను కళ్ళపైన ఉంచుకోవచ్చు […]
నిర్లక్ష్యం చేయద్దు
నెలసరి విషయంలో చిన్న సమస్య ఎదురైన దాన్నీ నిర్లక్ష్యం చేయవద్దంటారు డాక్టర్లు. ప్రతి సారి 21 రోజుల కంటే ముందే వచ్చిన 35రోజుల పాటు ఆలస్యంగా వచ్చిన వెంటనే డాక్టర్ సలహా అడగాలి.కొందరికి నెలసరి వచ్చాక ఏడు రోజులు దాటిన ఇంకా రక్త స్రావం తగ్గదు.ఇది అధిక రక్తస్రావానికి సంకేతం. దీని గురించి తెలుసుకోవాలి. నెలసరి నెల మధ్యలో వచ్చిన అకారణంగా రక్త స్రావం అవుతున్న నొప్పి,జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులతో మాట్లాడుకొవాలి.వీటిని నిర్లక్ష్యం చేయవద్దు […]
అన్ ఫినిష్డ్
ప్రియాంక చోప్రా ఆత్మకథ అన్ ఫినిష్డ్ అనే పేరుతో రావబోతుంది. ఈ పుస్తకం కవర్ పేజీ ఇన్ స్ట్రా గ్రామ్ లో పెట్టింది ప్రియాంక.నేను ఎప్పటి నుంచో పుస్తకం రాయలనుకున్నాను కానీ చాలా పనుల్లో త్వరగా పూర్తి చేయలేకపోతున్న .సాధించవలసింది చాలా ఉంది.జీవించవలసింది కూడా ఉంది.నేను ఒక పబ్లిక్ పర్సనాలిటీని ,నన్ను చూసి నేను గర్వించేంతగా పని చేశాను. కథ ముగింపు లేనిది కదా, జీవితంలో గొప్ప పాఠాలు ప్రయాణం సాగుతున్నప్పుడే నేర్చుకొంటాం,తెలుసుకొంటాం అంటోంది ఈ పుస్తకంలో […]
నిర్మాతగా శృతి
శృతిహాసన్ కేవలం నటి మాత్రమే కాదు సంగీతం,పాటలు చిత్రలేఖనం ఇలా చాలా రంగాల్లో తనని తాను నిరూపించుకొంటూ ఉంటుంది. పాటల ఆల్బమ్స్ వచ్చాయి,అన్నింటిలోనూ ఆమె దైన ప్రత్యేక ముద్ర ఉంటుంది. ఇప్పుడు శృతిహాసన్ నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టాబోతుంది.జయ్ ప్రకాశ్ రాధకృష్ణన్ దర్శకత్వంలో వస్తున్నా ‘ది మస్కిటో ఫిలాసఫీ’అన్న చిత్రానికి ఆమె సహానిర్మాతాగా వ్యవహారిస్తుంది. తమిళ,మళయాల భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
సమస్య అవుతుంది
కొన్ని అలవాట్లు తెలియక చేసే పనులు దీర్ఘకాలంలో శరీరాక సమస్యలు తెచ్చిపెడుతాయి. ఒక పరిశోధన రిపోర్టు ప్రకారం చాలా మంది అమ్మాయిలు బ్యాగ్ ను ఒక భుజానికే తగిలించుకొంటారు. దీనితో ఆ భుజం కండరాలపై ప్రభావం పడుతుంది.కొందరు మంజేతికి అదీ ఒక వైపే తగిలిస్తూ ఉంటాయి.అప్పుడూ మోచేతిలో నొప్పి వస్తుంది. బ్యాగ్ కు ఉండే రెండు పట్టీలు ఉపయోగించి ఆ బరువు రెండు భుజాలపైన ఉండేలా వేసుకొంటే అప్పుడు కంఫర్టుగా ఉంటుంది. అలాగే బ్యాగ్ లో అనవసరం […]
అందంగా మాథాపట్టి
చిన్నచిన్న ఫంక్షన్స్ కోసం అమ్మాయిలు పాపిడి బిళ్ళప్లేస్ లో మాథాపట్టీని అలంకరించుకొంటున్నారు. కుందన్ ,అన్ కట్ మాథాపట్టీలు ఇవ్వాల్టి ఫ్యాసన్ .వీటిని లాంగ్ లెహాంగాలు,క్రాప్ టాప్ లపైకి కూడా ధరిస్తే బావుంటాయి.కొంచెం ఖరీదైన ఇది నెక్లెస్ గా వేసుకొన్న అందంగానే ఉంటుంది. వెడల్ప్ గా ,భారీగా ఉంటాయి. మధ్యలో వేలాడే హుక్ ని తీసేసి నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు .రాళ్ళతోనే కాకుండా వట్టి బంగారంతో చేసిన మాథాపట్టీలు కూడా వచ్చాయి.
దివ్యమైన మందు
కొబ్బరి పాలతో జుట్టుకు పోషకాలు అంది,ఆరోగ్యంగా ఉంటాయని తెలసిందే. ఇంకా ఈ పాలతో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొబ్బరి పాలల్లో కొంచెం పసుపు కలిపి ముఖానికి చేతులకు రాసి ఓ అరగంట అలా వదిలేసి వేడి నీళ్ళతో కడిగేస్తే జీవం లేని పొడి చర్మానికి చక్కని నిగారింపు వస్తుంది. వారంలో నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాగే కొబ్బరి పాలలో గంధం పొడి కలిపి మొహానికి ప్యాక్ చేస్తే చర్మం పైన మచ్చలు […]
నీరసం అందుకే
శరీరం ఎప్పుడు చురుగ్గా ఉత్సహాంగా ఉండాలి . అలా ఉంటేనే మెదడు చైతన్యంతో చురుగ్గా ఉంటుంది. సృజనాత్మాకమైన ఆలోచనలు వస్తాయి. ఆ చురుకు దనం తగ్గి నిస్సత్తువుగా ,నిస్తేజంగా అనిపిస్తే శరీరంలో జీవక్రియలు తగ్గుతాయని అర్ధం చేసుకొండి అంటున్నారు డాక్టర్లు. సమయం లేకనో, బరువు పెరుగుతారన్నా భయంతోనో ఆహారం సరిగ్గా తీసుకోకుండా జీవక్రియలు కుంటుపడుతాయి.సులువుగా జీర్ణమయ్యే అధిక శక్తిని ఇచ్చే ఆహారం ఎంపిక చేసుకోవాలి. నిద్రపోవాలి,మంచి నీళ్ళు ,మజ్జిగా ఏదో ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలి అప్పుడే […]
