February 2024
సీజన్ స్టయిల్
వేసవి సీజన్ లో కంఫర్ట్ గా కలర్ ఫుల్ గా కనిపించాలంటే ప్యాచ్ వర్క్ ఎంచుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్.గుజరాతీ రాజస్థానీ హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ డ్రెస్ ల్లో,దుపట్టాల్లో కనిపిస్తుంది. స్టైలిష్ లుక్ కోసం ఈ ప్యాచ్ వర్క్ ను కుర్తీలు, టాప్స్,ఇండో వెస్ట్రన్ డ్రెస్సుల్లో చక్కగా ఉంటుంది.ఏ సీజన్లో అయినా డెనిమ్ వాడకం బాగా పెరిగింది. ఈ డెనిమ్ తో వివిధ షేపుల్లో ప్యాచ్ వర్క్ డిజైన్ లు మార్కెట్లో ఉన్నాయి. అన్ని రకాల […]
పట్టుకు ఎంబ్రాయిడరీ బార్డర్
పెళ్లిళ్లు, వేడుకల్లో మెరిసిపోయేలా పట్టు చీరె అంచుకు ఎంబ్రాయిడరీ బార్డర్ చీరలు మార్కెట్ లోకి వచ్చాయి. బ్లౌజ్ డిజైన్ అందాన్ని చీర పైకి తెచ్చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ అంచుల పట్టుచీర రంగుకు తగ్గట్టు చక్కని బార్డర్ తో వస్తున్నాయి.అసలే పట్టుచీర బంగారు రంగు అంచు, దానిపైన ఎంబ్రాయిడరీ ఇంకో అంచు తో వేసుకున్న నగలతో పాటు చీర కూడా మెరిసిపోతుంది.
కృతిమ తీపి కారకాలు మంచివేనా ?
చక్కెరకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో దొరికే స్టీవియా షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ వంటి కృతిమ తీపి కారకాలను ఎక్కువ వాడకపోవటమే మంచిది అంటారు డాక్టర్లు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ లో క్యాలరీలు ఉండవు. రక్తంలో గ్లూకోజ్ ను పెంచవు కానీ కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే ఇవి అసలు వాడకూడదు. ఈ తీపి ని ఒక మోతాదు వరకే వాడుకోవచ్చు. చక్కెర ప్రత్యాన్మయం అంటారు కానీ ఇది వాడినంత మాత్రానా స్వీట్లు ఆరోగ్యకరమైనవిగా మారిపోవు వాటిని తయారు చేసే నూనె, […]
భజన గాయని అభిలిప్సా
ఒడిశా లోని కిమోంజర్ జిల్లాలో ఉన్న చిన్న పట్టణం బార్బిల్ లో పుట్టిన భజన గాయని అభిలిప్సా పాండా చిన్నతనానే సంప్రదాయ సంగీతం నేర్చుకుంది. హిందుస్తానీ లో గవర్నర్ ట్రోఫీ గెలుచుకుంది. ఒరియాలోని పట రియార్టీ పొలాలో పాల్గొని ఆదరణ సంపాదించుకున్నది. గాయని గా స్థిర పడుతూనే కరాటే బ్లాక్ బెల్ట్ సాధించింది. యూట్యూబ్ లో రాక్ స్టార్ అభిలిప్సా ఛానల్ నిర్వహిస్తోంది. ఆమె పాడిన ఎన్నో భజన గీతాలు ఆధ్యాత్మిక సౌరభంతో శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ముక్కుకు […]
నల్లేరు తో లాభం
ఆకుపచ్చని రంగులో కణుపులతో పొలాల గట్ల నా డొంకల్లో పెరిగే నల్లేరు లో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ నల్లేరు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ నల్లేరు కాడల్లో బీటా- సైటోస్టెరాల్ ల్యూటీ యోలిన్ వంటి ఫ్లేవనాయిడ్లు వాపుల్ని, నొప్పుల్ని తగ్గిస్తాయి. వాటిల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. నల్లేరు ను రొట్టెలు, పచ్చడి రూపంలో తీసుకోవచ్చు.
ఏకాగ్రత పెరిగింది
ప్రకృతి మధ్య నడిస్తే మానసిక ప్రశాంతత వస్తుందని ఆరోగ్యానికి మంచిదనే విన్నాం,కానీ ప్రకృతి ని చూస్తూ నడిస్తే మేధో శక్తి ఆధారభూతమైన ఏకాగ్రత పెరుగుతుందని చెప్తున్నారు పరిశోధకులు. 100 మంది విద్యార్థులకు మెదడు పనితీరు పరీక్షించే ఎలెక్ట్రో ఎన్సెఫాలో గ్రామ్ (ఈ ఈజీ) టోపీలను పెట్టి పరిశోధిస్తే ప్రకృతి మధ్య నడిచే వారిలో ఏకాగ్రత కు అవసరం అయ్యే ఫ్రంటల్ కార్టెక్స్ చురుగ్గా పని చేస్తోందని తేల్చారు.
కబుర్లు మంచివే
ఆఫీస్ ల్లో ఉద్యోగాల మధ్య ఉండే స్నేహాలు కూడా సామర్థ్యాన్ని పెంచుతాయి అంటున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు క్యాంటీన్ లో కాసేపు తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్పుకోవడం చాలా మంచిది అంటున్నారు. ఉదయం నుంచి ఇంటిపని ఆఫీస్ పని తోనే గడిపే ఉద్యోగులకు మానసిక ఒత్తిడి పెరిగి తరచూ అనారోగ్యాలు రావటం, ఒంటరితనం పెరగటం తో వచ్చే మానసిక అసంతృప్తి పోయేందుకు మధ్యలో కాసేపు తోటి వారితో ముచ్చట్లు ఆడితే మంచిదంటున్నారు. పని సామర్థ్యం పెరగాలంటే మధ్యలో […]
18 వేల మందికి చికిత్స
డాక్టర్ ప్రేమా ధనరాజ్ ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో అగ్ని ప్రమాదానికి గురైన ప్రేమ 14 సర్జరీలు జరిగిన తర్వాత కోలుకో గలగారు ప్లాస్టిక్ (రీ కన్ స్ట్రక్షన్) సర్జరీ లో స్పెషలైజేషన్ చేశారు రీ కన్ స్ట్రక్షన్ 2002లో అగ్ని రక్ష అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాలకు గురైన వారికి పునరావాసం కల్పించటం మొదలుపెట్టారు. 18 వేల మంది అగ్ని ప్రమాద బాధితులకు చికిత్స చేశారు 15 […]
అందాల గంజీఫా శారీస్
చూడ చక్కని రంగుల్లో గుండ్రంగా దీర్ఘ చతురంగా కార్డ్స్ లాగా ఉండే గంజిఫా ఆర్ట్ చీరల పైన కనువిందు చేస్తుంది.సంబల్ పూర్ గంజిఫా చీరలు కాస్త ఖరీదైనవే అయినా లేటెస్ట్ ట్రెండ్స్ రామాయణ పాత్రలు, కోటలు, గుర్రాలు వంటి బొమ్మలతో ఈ ఒడిశా కి చెందిన సంబల్ పూర్ గంజిఫా మేళవింపు చీరలు చాలా అందంగా ఉంటాయి. మొగలుల కాలంలో బంగారు వెండితో ఈ గంజిఫా బొమ్మలను పేక ముక్కల్లా వాడేవారు ఈ అందమైన కార్డ్ లే […]
తీస్తే నే నష్టం
కొన్ని కూరగాయలు పండ్లు పై తొక్క తీయకుండానే తింటే పోషకాలను నష్టపోకుండా ఉంటాము అంటున్నారు నిపుణులు.సలాడ్ కోసం ఉపయోగించే జుకిని తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని నేరుగా వాడుకోవచ్చు పియర్స్,యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ క్యారెట్లు బంగాళదుంపల్లో వాటి తొక్కలో పీచు, పొటాషియం ఉంటాయి. కీర తొక్కలో పీచు విటమిన్ కె ఖనిజ లవణాలు ఉంటాయి కాబట్టి కీర పై తొక్కతోనే తినాలి తొక్కల్లో ఉండే పోషకాల కోసం వాటిని […]
సద్గురు చెప్పిన అల్పాహారం
జగ్గీ వాసుదేవ్ చెప్పిన ఈ పోషకాహారం శరీరానికి అంతులేని శక్తి నిస్తుంది అంటున్నారు. గుప్పెడు వేరుశనగ గుళ్ళు నీళ్లలో నాననివ్వాలి నచ్చిన పండ్ల మొక్కలు రుచికి తేనె తీసుకోవాలి. 6 నుంచి 8 గంటల పాటు నానిన వేరుసెనగలు పండ్లు తేనె లో నీళ్లు పోసి మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఈ పానీయం చాలా రుచిగా ఉండటంతో పాటు ఐదారు గంటలు ఆకలి వేయకుండా ఆపుతుంది. దీనిలో ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన కోవ్వులు అవసరమైన […]
గల్లీ రాపర్ సానియా
సానియా మిస్త్రి ఖయాముద్దీన్ ను గల్లి గర్ల్ అంటారు ముంబైలోని ధారవి అనే మురికివాడలో ఉండే సానియా కు ధారావి రాక్ స్టార్ గా పేరు మారుమోగుతోంది. తన చుట్టూ చూసే పేదరికం అక్కడి పండగలు అసమానత్వం సామాజికాంశాల పై రాప్ చేస్తోంది సానియా. ఆమె ఈ మధ్య చేసిన బచ్చా కిస్ కో బోల్ రహా హై అంటూ చేసిన ను ఫిలిం మేకర్స్ జోయ అక్తర్ రీమా కార్గి మ్యూజిక్ కంపోజర్ అంకుర్ తివారి […]
వేసవి వేడుకకు చికన్‌కారి
వేసవిలో పెళ్లిళ్ల హడావుడి ఎక్కువే ఆ వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలి అంటే చికన్‌కారి ఎంచుకోవచ్చు అంటారు ఫ్యాషనిస్ట్ లు. 17వ శతాబ్దపు మొగలుల కాలం నుంచి పరిచయం అయిన ఈ చికన్‌కారి కాటన్, చందేరి, ఆర్గంజా, జార్జెట్, సిల్క్, ఆర్గంజా నెట్ వంటి ఎన్నో రకాల వస్త్రాలపై అందంగా కలిసిపోతుంది. సాంప్రదాయ ట్రెండీ లుక్ ఏది కావాలన్నా చికన్‌కారి సిద్ధం.కుర్తి ,చున్ని,ప్యాంట్లు,బ్లౌజులు,జీన్స్ పైకి ట్రెండీ టాప్స్ దొరుకుతున్నాయి. భారతీయ సాంప్రదాయ కల గా గుర్తింపు పొందిన ఈ […]
అంకురం కాదు మహావృక్షం
మెదడు తనకన్నా ఎక్కువ బరువున్న శరీరాన్ని నియంత్రిస్తోందని మానవ శరీరంలో కీలకమైన నాడీ వ్యవస్థ పైన అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సింప్లీ న్యూరో సైన్స్ అనే అంకుర సంస్థను ప్రారంభించింది చిన్మయి బలుసు.ఈ సంస్థను 142 దేశాల్లోని 44 వేల మంది విద్యార్థులతో అనుసంధానం చేయగలగారు.చిన్మయి ఉత్తర కాలిఫోర్నియాలోని గుడ్లవల్లేరు జిల్లాలో పుట్టి పెరిగింది.ఈ అంకుర సంస్థ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులకు వచ్చే సందేహాలకు నివృత్తి చేస్తారు సంస్థలో ప్రతిభావంతులు ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారు. […]
కేవలం స్త్రీలకే రుణాలు
ఇల్లు కట్టుకోవాలన్న, బాగు చేసుకోవాలన్న, స్త్రీలకు రుణాలు ఇచ్చే ఏకైక సంస్థ ఎవియోమ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ సి ఈ ఓ కాజల్ ఇల్మి. ఇది మా రిలయన్స్ ఎ.పి.ఆర్ డి ఎల్ ఎఫ్ వంటి సంస్థల్లో పని చేశారు. 20 ఏళ్ల పాటు మానవ హక్కుల సంఘాలతో కలిసి పనిచేశారు. ఆడవాళ్లు ఎన్నో సమస్యలకు వాళ్లకు తలదాచుకునే ఇల్లు లేకపోవడమేనని అర్థం చేసుకొని 2016 లో ఈ ఎవియోమ్ సంస్థకు శ్రీకారం చుట్టారు ఇల్లు కట్టుకోవాలన్నా, […]
తొలి మహిళా జడ్జి
తిరువణ్ణామలై లోని గిరిజన గూడెం లో కలియప్పన్ అనే మలయాళ రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన వి.శ్రీపతి సివిల్ జడ్జ్ గా అర్హత పొంది చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు తమిళనాడు లో గిరిజన మహిళ జడ్జి ఒక్కరు కూడా లేరు.కొండ ప్రాంతంలో వ్యవసాయం చేసుకొని జీవించే మలయాళీ తెగ లో ఆడపిల్లలు చదువుకోవటమే విశేషం. లా చదువుకోవడం ఇంకా విశేషం. ఇక సివిల్ జడ్జి కావడం అంటే చరిత్ర సృష్టించటమే శ్రీపతి వయసు 23. గిరిజనులను చైతన్యవంతులను […]
అందాల కలంకారీ
వాతావరణం వేడెక్కుతోంది అంటే సాధారణంగా మెత్తని చీరలపైనే చూస్తారు ఆడవాళ్లు. వయసుతో సంబంధం లేకుండా అందరి దృష్టిని ఆకట్టుకునేవి అందమైన కలంకారీ ప్రింట్ కాటన్ చీరలు తెల్లని కోర బట్టను బాగా ఉతికి కరక్కాయ రసం లో నానబెట్టి ఆ ఆరిన బట్టల పైన బ్లాక్ ల ద్వారా మొదటి డిజైన్ వేస్తారు. ఈ బ్లాక్ లను వివిధ డిజైన్లలో టేకు చెక్కతో చేస్తారు ఇలా డిజైన్ అద్దిన చీరలను బాగా నాననిచ్చి ఉడకబెట్టి ఆరవేస్తే ఎప్పటికీ […]
ఈవిల్ ఐ ఇవాల్టి ఫ్యాషన్
బ్లాక్ థ్రెడ్ యాంక్లెట్ దాన్నే ఈవిల్ ఐ యాంక్లెట్ అని పిలిచే నల్లతాడు ఇవ్వాళ యూత్ ఫ్యాషన్. అమ్మాయిలు ఒక్క కాలుకు లేదా రెండు కాళ్ళకి ఈ నల్ల తాడు కట్టేస్తున్నారు. పూర్వకాలంలో పిల్లలకు దిష్టి తగలకుండా మెడలోను చేతికో ఒక నల్ల తాడు కట్టే ఆచారం ఉండేది. ఆ నల్ల తాడుకు నల్లపూసలు బంగారు గుండు గుచ్చేవాళ్ళు ఈ దిష్టి తాళ్లనే ఇప్పుడు రకరకాల డిజైన్లతో అమ్మాయిలు వాడుతున్నారు. బ్రాస్ లెట్ మాదిరిగా కూడా పెట్టుకుంటున్నారు […]
క్రాప్ టాప్ ఫరెవర్
కార్పొరేట్ లుక్ రావాలంటే క్రాప్ టాప్ ప్యాంటు వేసుకోవాలి అంటారు డిజైనర్లు.ఇవాల్టి రోజుల్లో చీరలు స్కర్ట్ ల పైన కూడా క్రాప్ టాప్ లాంగ్ కోట్ వేసుకుంటున్నారు. అమ్మాయిలకు ఇవి ఇంతగా నచ్చుతున్నాయి కనుకనే ఈ రెండిటిని కలిపేసి కొత్త ఫ్యాషన్ సృష్టించారు ఆధునిక డిజైనర్లు. క్రాప్ టాప్ ప్యాంట్ విత్ కోట్ ఈ డ్రెస్ సంప్రదాయ వేడుకల్లో వేసుకున్న లేదా సాయంకాలపు పార్టీల్లో వేసుకున్న ఆడంబరంగా అందంగా ఉంటుంది. వెడల్పాటి స్కర్ట్ తో కలిపి వేసుకున్న […]
వేరే నగలెందుకు?
అందమైన డ్రెస్సులతోపాటు వాటికి తగ్గ నగలు వెతుక్కోవటం కూడా శ్రమే. అందుకే కుర్తీల పై అందమైన నగల డిజైన్లు చేర్చారు డిజైనర్లు. సాధారణంగా కుర్తీలు, లెనిన్,కాటన్, క్రేప్ వంటి వస్త్రాలతో తయారు చేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల కోసం సిల్క్ పట్టు వస్త్రాల కూడా వాడతారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ కుర్తీల పైన హారాలు డిజైన్ చేశారు. పొడగాటి గొలుసులు నెక్లెస్ లు లాగా దూరంగా చూస్తే అచ్చం నగల్లాగా ఉండే ఈ కుర్తీల డిజైన్లు చూస్తే […]
