Saturday, 27 Jun, 2026

ఇండో వెస్ట్రన్ నయా ట్రెండ్

ఫ్యాషన్ ప్రపంచం ఎంత శరవేగంతో మారుతున్న ఒక్కసారి కొన్ని రిపీట్ అవుతూనే ఉంటాయి .సాంప్రదాయ అందానికి ఆధునిక సోగసులు అద్దిన ఇండో వెస్ట్రన్ బ్లౌవుజులు మాత్రం ఎప్పటికీ మారని ఫ్యాషన్ అమ్మాయిలు ఇప్పుడు నూలు చీర దగ్గర నుంచి పట్టుచీర వరకు ఏది కట్టుకున్నా రఫుల్,పెప్లమ్ బెల్ జాకెట్, బోట్ నెక్ బ్లవుజు లే ఎంచుకుంటున్నారు. అట్లా ఎంచుకోవటం ఇప్పుడు హాటెస్ట్ ట్రెండ్ మెడ కొంచెం వెడల్పుగా ఉంటే కుచ్చిళ్ళతో చైనీస్ కాలర్ నెక్ వంటివి నప్పుతాయి. […]

మరి పెళ్లి కొడుక్కి ఆభరణాలు వద్దా ?

పెళ్లి అనగానే ఎప్పుడు వధువే చక్కని రత్నాలు ఆభరణాలతో వెలిగి పోవటం కనిపిస్తుంది .మరీ అంత అలంకరణతో వధువు మెరుస్తూ ఉంటే పక్కనే వరుడు వేలవేల పోతే ఎలా ? అందుకే ఈ మధ్యకాలంలో వరుడి అలంకరణలో కూడా నగలు భాగం అవుతున్నాయి .వరుడి మెడలో చంద్రహారం వేసే సాంప్రదాయం ఉండేది .ఇప్పుడు ఆ సంప్రదాయం కొనసాగుతోంది .సదా చంద్రహారం వేసిన దానికి ఎమరాల్డ్, పెండెంట్ ఉంటే మరింత శోభాయమానంగా ఉంటుంది. అంత భారీ ఆభరణం వద్దనుకుంటే […]

ఒత్తిడి తగ్గించే గార్డెన్ మెడిటేషన్

లాక్ డౌన్ లో వర్క్ ఫ్రం హోమ్ లతో ఒత్తిడి గురవుతున్న యువతను గార్డెన్ మెడిటేషన్ చేయండి కాస్త విశ్రాంతి గా చురుకుగా ఉంటారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కాసేపు అలా పెరటి తోటలోనో, ఇంట్లోనో సిటవుట్లో ఉండే పది పూల కుండీల మధ్య కాసేపు గడప మంటున్నారు .హైటెక్ జీవితంలో వేగాన్ని వత్తిడిని తట్టుకునేందుకు మనస్సును శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుకునేందుకు ఈ గార్డెన్ మెడిటేషన్ చాలా ఉపయోగం .కాసేపు కళ్ళు మూసుకొని పచ్చని పచ్చిక […]

మేడ పైన అందాల అడవి

అది 1500 చదరపు అడుగుల నివాసగృహం మరో 400 అడుగుల ఇంటి ఆవరణ ఇంకో 400 అడుగులు బయట ఆవరణ అంతా కలిపి బెంగళూరు నగరంలో ఉన్న ఈ ఇల్లు ని ఇప్పుడు ఆశ్రమ గార్డెన్స్ గా పిలిచే ఒక అడవి లా మార్చారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నటరాజ్. బెంగళూరులోని బనశంకరి ప్రాంతంలో ఉండే ఈ ఇంటి పైన చుట్టూ కొన్ని వందల చెట్లు ఉంటాయి. పొదలు,తీగలు మొత్తం కలిపి రెండు వేల రకాలుంటాయి ఇల్లు […]

ముద్దొచ్చే పాపాయికి అందాల చీరె డ్రెస్

ఎప్పుడు జీన్స్, లెహంగాలు, గాగ్రాలు, ఫ్రాక్ లు వంటి ఓల్డ్ మోడల్ దుస్తులేనా! వెరైటీగా పాపాయికి చీరెకట్టు కొంటే చక్కని పట్టుచీరలు, జారీ బార్డర్ లతో అమ్మ ముస్తాబైతే అమ్మాయి ఉరుకుంటుందా.ఇలాంటి అలాగే పాపాయిల కోసం అందమైన ‘మినిట్ రెడీ మేడ్ శారీస్’  వచ్చేశాయి వీటిని గౌను వేసుకొన్నంత సులభంగా క్షణాల్లో తొడిగేసుకోవచ్చు. కుచ్చిళ్ళు, పైటకొంగు, బ్లౌజూ కుట్టేసి వచ్చే ఈ చీరె  డ్రెస్సులు,పిల్లల వయసుకు ఎత్తు కు తగ్గట్టుగా వివిధ సైజుల్లో వచ్చేస్తూ పెద్ద వాళ్ళ […]

కదలని పల్లెటూరు

దేశం లో చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ఉత్సవ్ రాక్ గార్డెన్ .ఈ రాక్ గార్డెన్ లో ఒకప్పటి సాంప్రదాయ జీవన విధానాన్ని కళ్లకు కట్టేలా చూపించే అందాల బొమ్మలున్నాయి . చక్కని తోట ఆ మధ్యలో అందమైన పల్లెటూరు అక్కడ ఓ సంత కూరగాయలు, దినుసులు అమ్మే వర్తకులు కొనుక్కుంటున్నా పల్లెటూరి ప్రజలు ఇలా ప్రతి దృశ్యాన్ని కళ్ళకు కట్టేలా సృష్టించిన కళాకారుడు టి బి సోలబక్కనవర్. ఈ రాక్ గార్డెన్ […]

ఎలాంటి వంటయినా చేస్తా !

పురాణాలు ఇతిహాసాల ప్రకారం వంటల్లో చేయి తిరిగిన వాళ్ళు మగవాళ్లే .నలుడు, భీముడు పేరు వినబడుతోంది కానీ ఆడవాళ్ళ పేర్లు ఎక్కడా లేవు. అలా తీరిక దొరికితే చాలు ఈ నలభీముల్ని మరిపిస్తారు మన స్టార్స్. ఉప్మా నుంచి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, దోశలు ఏవైనా అద్భుతంగా వండగలను అంటారు చిరంజీవి .నాకు అయిదేళ్ళ వయసప్పుడు మా అమ్మ వంట చేస్తుంటే దగ్గరే ఉండి చూసేవాడిని ఆమెకు వంటలో సాయం చేస్తూ అన్నీ నేర్చుకున్నా .పెద్దయ్యాక సినిమాల్లో […]

ఇట్లా దాచండి

శుభకార్యాలకు ప్రత్యేక సందర్భాలకు వేల రూపాయల ఖరీదైన చీరెలు కొంటుంటారు .అది వెంటనే ఉతికి కట్టుకుంటే మెరుపు, కొత్తదనం రెండు పోతాయి. వాటిని సరైన విధంగా భద్రం చేయాలి .పట్టు చీరెలు వేల ఖరీదు అవి కట్టుకొని వెంటనే ఉతక నక్కరలేదు. రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఆరేసి ఉంచి చక్కగా మడతలు పెట్టాలి. వీటిని మెత్తని వస్త్రంతో చుట్టి పెట్టుకోవచ్చు .కోరా, ఆర్గాంజ్, చందేరి వంటి చీరెలు చుట్టేందుకు ప్రత్యేకమైన చక్క కర్రలు బజార్లో […]

ఇవే మేకప్ సూత్రాలు

కరోనా కొత్త జీవిత విధానాన్ని తెచ్చిపెట్టింది. ఇదివరకు లాగా బ్యూటీ క్లినిక్ కో, జిమ్ కో,అలా వెళ్లి పోయే అవకాశం పోయింది. కాస్తయినా మేకప్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్లు ఇంట్లోనే ట్రయ్ చేయవలసి వస్తుంది. కొన్ని మెలుకువలు తెలుసుకుంటే ఈజీగా మేకప్ వేసుకోవచ్చు మేకప్ కు ముందు రెండుసార్లు క్లెన్సర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి .మొదటిసారి జిడ్డు వదిలిపోయి, రెండోసారి చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. టోనర్ అయ్యాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి ఇక మేకప్ ప్రైమర్ […]

ఫ్యాషన్ సరే…అవి అనారోగ్యం

అమ్మాయిలు ఫ్యాషన్ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. చూసేందుకు ముచ్చటగానే ఉంటారు కానీ. కొన్నింటి వల్ల అనారోగ్యాలు వస్తాయి అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా .శరీర ఆకృతి చక్కగా ఉండేందుకు యూత్ వాడే బాడీ షెపర్ ల వల్ల ఎంతో ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్. వీటిని వాడితే కీళ్ల సమస్యలు వస్తాయి. నరాలపైన ఒత్తిడి పడుతుంది. వెన్నెముక పనితీరు పైన తీవ్ర ప్రభావం కనిపిస్తుంది నిజానికి శరీరాకృతి కోసం ఇలాటి కృత్రిమమైన వాటిని వాడే కంటే […]

మిక్సిడ్ ప్రింట్స్ ఇవ్వాల్టి ట్రెండ్

ఏ సందర్భానికి అయినా సరిపోయే డిజైన్ ఒక్క మిక్సిడ్ ప్రింట్స్ అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్ .జామెంట్రీ కల్ డిజైన్ లలో పూలు గళ్ళు కలిసి వచ్చే  క్రాప్ టాప్స్ రోజు వారి డ్రెస్ గానే కాదు సాయం కాలపు వెళల్లో బయటకు వెళ్లేందుకు బావుంటాయి. లేత వర్ణాల్లో పూలు ,గళ్ళు  ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి .జీన్స్ పైకి మోకాళ్ల వరకు వచ్చే మిడీ లకు నప్పుతాయి. నిలుపు లేదా అడ్డగీత పూలుండే డిజైన్స్ ఇప్పుడు క్రాఫ్ […]

కాలం చెల్లని అపురూప రత్నాలు

అందానికి మెరుగులు దిద్దే ఆభరణాల చరిత్ర 40 వేల సంవత్సరాల నాటిది.ఆభరణాలలో వెండి ప్లాటినం, ముత్యాలు,విలువైన రాళ్లు లోహాలు అన్ని కలిసి జ్యువెలరీ అయింది. ఈ నగలో విరివిగా ఉపయోగించే విలువైన రాళ్ళు నవరత్నాలు వీటిని అత్యంత శక్తివంతమైనవి గా భావిస్తూ ప్రాచీన చక్రవర్తులు రాజులు ధరించే వాళ్ళు తొమ్మిది విలువైన రాళ్ల సమాహారమే నవరత్నాలు వజ్రం కెంపు, నీలం, పగడం, ముత్యం, పచ్చ, వైఢూర్యం, పుష్పరాగం, గోమేధకం, కలిపి నవరత్నాలు అంటారు. ఈ విలువైన రాళ్ళను […]

ఆ ఆకాశానా సూర్యుడు ఉండడు

ఈ ప్రపంచంలో ప్రతి రోజు తెల్లవారుతుందీ అంటే సూర్యుడు కనిపించటం .సూర్యుని వెలుగు కిరణాలతో రోజు మొదలు కావటం. కానీ ఈ జగత్తు కాంతి వెలుగులు పంచే సూర్యుడు కొన్ని ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది .ఇటలీ లోని వెగనెల్లా  గ్రామం లో మూడు నెలల పాటు సూర్యుడు కనిపించాడు.ఈ గ్రామం చుట్టూ ఎత్తయిన పర్వతాలు ఉన్నాయి మూడు వందల జనాభా వున్న వెగనెల్లా గ్రామం ఓ పెద్ద పర్వతం కింద భాగంలో […]

ముందస్తు చర్యలు చాలా ముఖ్యం

వర్షాలు మొదలయ్యాయి . వాతావరణంలోని మార్పులు ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులకు కారణమై జలుబు,దగ్గు ఇతర సీజనల్ వైరస్ లకు దారి ఇస్తుంటారు.ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ సరేసరి.జలుబు, ఫ్లూ వంటి వాటిని అడ్డుకునేందుకు సమతులాహారం, తీసుకునే ఇతర ముందస్తు జాగ్రత్త చర్యలు కలిసి అనారోగ్యం బారి నుంచి కాపాడటం లో సహకరిస్తాయి. ఈ సీజనల్ లో వచ్చే రుగ్మతులు దృష్టిలో ఉంచుకుని అందరూ అనుగుణమైన ఆహారం తీసుకోవాలి.ప్రోబయోటిక్స్ ఉండే ఆహారం, అంటే పులియబెట్టిన పదార్థాలు పెరుగు, మజ్జిగ […]

పోషకాల గని మొక్కజొన్న

వర్షం పడుతుంటే నిప్పుల పైన కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినటం అందరికీ ఇష్టమే .న్యూట్రీయంట్లు సమృద్ధిగా ఉండే మొక్కజొన్నలో విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. వయసుతో పని లేకుండా అందరికీ మొక్కజొన్న శక్తి దాయిని గానే పనిచేస్తుంది. ప్రపంచంలో గోధుమ వరి కన్నా ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న ఇది ధాన్యం వంటి పంటే. పసుపు రంగు మొక్కజొన్న దాదాపు అన్ని దేశాల్లోనూ పండిస్తారు అయితే ఎరుపు,ఆరెంజ్, వంగపండు రంగు ,నీలం, తెలుపు, నలుపుల్లో కూడా పండిస్తున్నారు. […]

లోలాకుల్లో ఇవి ప్రత్యేకం

అమ్మాయిలు ఇష్టంగా ధరించే చెవి లోలాకులు బుట్టల దే హవా. నవ్వినా,మాట్లాడిన, తల ఊపిన అందంగా ఊగాడే బుట్ట లోలాకులు అమ్మాయిలకు కొత్త అందం ఇచ్చేస్తాయి. ఏనాడో  అమ్మలు, అమ్మమ్మల కాలం నాటి బుట్టల లోలాకులు ఇప్పటికీ కాలం చెల్లలేదు అంటే అసలా తయారీ లోనే ఒక ప్రత్యేకత .బోర్లించినట్లు గుండ్రని బుట్టలు దీనిచుట్టూ ముత్యాలు లేదా చిన్న బంగారు గుండ్లు బుట్ల చేసిన డిజైన్ అయితే ఇప్పుడు టెంపుల్ నక్షీ, స్టోన్, సాచీ,పోల్కి, ఫిలిగ్రీ, తవ,తుషీ […]

స్త్రీల రక్షణ కు కొత్త ప్రాజెక్ట్

గృహహింస,వరకట్న వేధింపులకు చెక్ పెట్టేందుకు కేరళ ప్రభుత్వం పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది.ఈ ప్రాజెక్ట్ ప్రకారం కేరళలో ఇక పింక్ కార్లు కనిపిస్తాయి.లేడీ డ్రైవర్,లేడీ కానిస్టేబుల్,లేడీ ఇన్స్ పెక్టర్,వాళ్లే ఉంటారు.ఈ పింక్ కార్లు 24 గంటలు రోడ్లపైన పరిగెత్తుతూనే ఉంటాయి .ఏదైనా సమస్య వస్తే తమ కోసం ఈ వాహనాలు ఇలా వెంటనే పరిగెత్తుకు వస్తాయి అన్న నమ్మకాన్ని స్త్రీలకు ఇచ్చేందుకే ఈ ప్రాజెక్ట్ .ఇప్పటికే అక్కడ స్త్రీల రక్షణ కు వివిధ మహిళా పోలీస్ […]

మహిళలకు మంచి ఫుడ్

ఇంట్లో సభ్యులందరికీ చక్కని పోషకాహారం అందించే గృహిణులు తమ ఆరోగ్యం దగ్గరకు వచ్చే సరికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు .ఎన్నో పనులతో శారీరకంగా, మానసికంగా అలిసిపోయే స్త్రీలకు కీలకమైన పోషకాలు తప్పనిసరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఆమె తీసుకొని తీరాలి. ఆమెకు సరైన డైట్ అవసరం కూడా .మహిళలు తమ ఆహారం లో ఆలివ్ ఆయిల్ ను  చేర్చుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో ఆరోగ్యవంతమైన మెనో అన్ సాచురేటెడ్ […]

ఆ మూడింట్లో నెయ్యి బెస్ట్

బరువు తగ్గడం కోసం కూడా ఎంతో కొంత కొవ్వు ఆహారంలో ఉండాలి అంటారు ఎక్స్ పర్ట్స్. మరి ఆ కొవ్వు ఏ నూనెలో ఎంచుకోవాలి ఆలివ్, వెన్న, నెయ్యి ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలి .మూడు ఆరోగ్యమే కానీ వాటిలోని పోషకాలు క్యాలరీల ద్వారా అనువైన కొవ్వుని ఎంచుకోవాలి. కీటో డైట్ లో ప్రధాన పాత్ర పోషించే వెన్న, నూనె కు చక్కని ప్రత్యామ్నాయం. పరిమితంగా తీసుకుంటే చక్కని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పాల నుంచి తీసే […]

సాగర మధ్యంలో అందాల గ్రామం

అందమైన ప్రకృతి చుట్టూ నీళ్లు మధ్యలో నివాస గృహాలు ! ఈ ఊహే బాగుంది కదా .అసలు ఒక ఇసుక రేణువు అంతా నేల కూడా అక్కడ లేకుండా కట్టిన ఫ్లోటింగ్ విలేజ్ ‘ko panyi’ ఇది థాయిలాండ్ లో ఉండే సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం ఇండోనేషియా నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు సముద్రం మధ్యలో కర్రల సాయంతో ఇల్లు కట్టుకుని చేపలు పట్టడాన్ని వృత్తిగా చేసుకుని ఇక్కడే నివసించడం మొదలుపెట్టారు .నెమ్మదిగా […]