• చర్మం బావుంటుంది.

    చర్మం పైన శ్రద్ధ తగ్గితే వార్ధాక్య లక్షణాలు వస్తాయి. కళ తగ్గి చర్మమ వయస్సుని పెంచేస్తుంది. అందుచేత చర్మం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం వేసుకున్న…

  • రాత్రి వేళ భోజనం చర్మానికి సమస్య.

    నైట్ డ్యూటీలతో రాత్రీ పగలు నిద్ర వేళలు మారిపోతున్నాయి. రాత్రంతా మేలుకోవడం, ఏ మధ్య రాత్రో తినడం సర్వ సాధారణం అయిపోతుంది. దీని వల్ల చర్మం దెబ్బ…

  • చర్మం గురించి చెప్పేస్తుంది.

    ‘ఎక్కువ మంచి నీళ్ళు తాగడం’, ఎండ నేరుగా మీద పడుతుంది నీడ లోనికి పొండి’ అని క్షణం క్షణం మనం గురించి మన చర్మ పరిస్థితి  గురించి…

  • ఇవి చర్మ సౌందర్య రహస్యాలు.

    మీ అందమైన చర్మ రహస్యం ఏమిటి? అని సినిమా తారలను సాధారణంగా అడుగుతూ వుంటారు. వీళ్ళెం సమాధానం చెప్పినా  మెరుపులీనే చర్మపు రహస్యాలు వంటింట్లో దాక్కుని వున్నాయన్న…

  • సరిగ్గా హైడ్రేట్ చేస్తే ఈ సమస్య వుండదు.

    ఒక్కసారి మొహం పైన వేసిన ఫౌండేషన్ అక్సిడైజ్ అయిపోయి. గ్రేగా మారిపోతుంది. మేకప్ ముందు చర్మాన్ని హైడ్రేట్ చేయక పొతే ఏరకం ఫౌండేషన్ అయినా సులభంగా అక్సిడైజ్…

  • బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి కావాల్సిన నీరు అందితే ఎప్పుడూ ఆరోగ్యంగానే వుంటుంది. అలోవీరా, కాఫీ, విటమిన్- ఇ, విటమిన్-ఎ ల తో కూడిన స్కిన్ లోషన్స్ ఉపయోగించాలి. తాజా అలోవీరా గుజ్జులో కొంచం నిమ్మరసం కలిపి చర్మానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కదిగేయోచ్చు. కల్లుప్పు తో చర్మానికి స్క్రబ్ చేయొచ్చు. చాక్లెట్ పొడి లేదా కాఫీ పొడి తో చర్మం రుద్దితే పునరుత్తేజం వస్తుంది. విటమిన్-ఇ ఆయిల్ తో చర్మానికి మసాజ్ చేసిన చర్మం బిగుతుగా వుంటుంది. కొబ్బరి నూనె కొంచం వెచ్చగా చేసి ఉపయోగించినా మేలే, బాదాం నూనె చర్మానికి మాయిశ్చురైజర్ లా ఉపయోగ పడుతుంది. నూనె వెచ్చ చేసి చర్మం పై నెమ్మదిగా మర్దనా చేస్తే మంచి ఉపయోగం వుంటుంది.

    చర్మం బిగుతుగా ఉండాలంటే………!

    బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి…

  • అంత ఎండకి ఈ మాత్రం జాగ్రత్త కావాలి

    మండే ఎండల్లో చర్మ సంరక్షణ చాలా అత్యవసరం ఇందుకు గానూ కొంత ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. ఎంత తొందర పని వున్నా. ముందుగా సన్ స్క్రీన్…

  • నువ్వుల నూనెలో అనేక ఔషద గుణాలున్నాయి. ఆహార పదార్ధాల తయారీలో నువ్వుల నూనె వాడకం వల్ల రక్తంలో చక్కర స్థాయి, రక్తపోటు నియంత్రణలో వుంటాయి. వేరుసెనగల నుంచి, నువ్వుల లో నుంచి తీసిన నూనెలే గతంలో వాడేవారు. లో ఫ్యాట్ పేరుతో ఇప్పుడు రకరకాల నూనెలోచ్చాయి. శరీరానికి పట్టిన నీటిని తొలగించే శక్తి నువ్వుల నూనెకుంది. బాక్టీరియా నసిమ్పజేస్తుంది. కిళ్ళనొప్పులకు మంచి ఔషదం రక్తంలోని హానికర పదార్ధాలను నశింపజేసే యాంటీ బాడీస్ లభిస్తాయి. ఇది మంచి సౌందర్య కరకం. గోరు వెచ్చని నూనె నెత్తికి పట్టించి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగవ్వుతుంది. చర్మానికి రాయడం వల్ల చర్మం మృదువుగా వుంటుంది.

    సౌందర్యం కోసం నువ్వుల నూనె

    నువ్వుల నూనెలో అనేక ఔషద గుణాలున్నాయి. ఆహార పదార్ధాల తయారీలో నువ్వుల నూనె వాడకం వల్ల రక్తంలో చక్కర స్థాయి, రక్తపోటు నియంత్రణలో వుంటాయి. వేరుసెనగల నుంచి,…

  • ఇది స్వచ్చమైన మాయిశ్చరైజర్

    సాధరణంగా ఏ సీజనయినా మాయిశ్చరైజర్లు తప్పనిసరి. అయితే ఇందుకోసం ఖరీదైన క్రీములు, లోషన్లే అవసరం లేదు. కొబ్బరినూనె, ఆప్రికోట్ ఆయిల్స్ సైతం అత్యంత ప్రభావంతంగా పనిచేస్తాయి. షియా…

  • చక్కెర తింటే మంచిది కాదంటారు కానీ చర్మ రక్షణకు, అందాన్ని ఇవ్వడంలో అంతులేని ఫలితాలు ఇస్తుoదంటున్నారు. షుగర్ స్క్రబ్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా వుంటుంది. నిమ్మరసం, తేనే మిశ్రమంలో చక్కర కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగేస్తే చర్మం కాంతిగా కనిపిస్తుంది. ఇది అద్భుతమైన ఫేస్ మాస్క్. వేడి నీళ్ళలో నిమ్మరసం, చక్కర కలిపి ముఖానికి పట్టించి చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమం చర్మం పైన అప్లయ్ చేస్తే మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా షుగర్ తో స్క్రబ్ చేసుకొంటే వృద్ధాప్య ఛాయలు రానివ్వదు. చక్కెరలోని గైకోనిక్ ఆసిడ్ చర్మం ద్వారా వెళ్లి దుమ్ము వల్ల ఏర్పడే మొటిమలు, మచ్చలు రాకుండా శుభ్రం చేస్తుంది. పెదవులకు లిప్ గ్లాన్ లాగా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ లో కాస్ట్రో షుగర్ వేసి పెదవులపైన సున్నితంగా మర్ధన చేస్తే పెదవులు పొడిబారటం వుండదు. కప్పు వేడి నీళ్ళలో స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ పంచదార కలిపి జుట్టుపైన స్ప్రే చేసి కాసేపాగి స్నానం చేస్తే మెత్తగా నిగనిగలాడుతుంది.

    చక్కెరతో చక్కదనం

    చక్కెర తింటే మంచిది కాదంటారు కానీ చర్మ రక్షణకు, అందాన్ని ఇవ్వడంలో అంతులేని ఫలితాలు ఇస్తుoదంటున్నారు. షుగర్ స్క్రబ్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా వుంటుంది. నిమ్మరసం,…

  • జుట్టుకు మంచి ఉపయోగ పడే మందార పువ్వును రక్త పోటును తగ్గించడానికి సహాయ పడుతుంది అని ఇటీవల పరిశోధనలు రుజువు చేసాయి. మందార పువ్వులతో దాచిన టీ తాగితే తోలి దశలో వున్న రక్త పోటును తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఈ పూవుల్లో అద్భుతమైన ఔశాదాలున్నాయి. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో దొరికే ఈ మందుల షాపుల్లో ఎరుపు రంగు పువ్వుకు ఆయుర్వేదం మందుల్లో ఉపయోగిస్తారు. మందార నూనె తలవెంట్రుకలు రావడమే కాకుండా చర్మ రక్షణకు కూడా ఉపయోగ పడుతుంది. వయస్సు పైబడే లక్షణాలనునిలువరించే శక్తి వంతమైన మొక్క మందారం. అందుకే దీన్ని బొటాక్స్ ప్లాంట్ అని కూడా అంటారు. మందార పూలు ఎండ బెట్టి పొడిగా చేసి వాటిని నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీటిలో మొహం కడుక్కొంటే అలసి చర్మం తేటగా అయిపోతుంది. మందార పూల పొడి, తేనె, పాలు కలిపి పేస్టులా చేసి ముఖానికి మర్దనా చేస్తే మ్రుతకనాలు పోయి చర్మం మృదువుగా అయిపోతుంది. మందారంలోని యాంటీ బక్టిరియల్ గుణాలు మొటిమల్ని, గాయాల తాలూకుమచ్చలు పోగొడతాయి.

    మందార పువ్వులతో ముఖ సౌందర్యం

    జుట్టుకు మంచి ఉపయోగ పడే మందార పువ్వును రక్త పోటును తగ్గించడానికి సహాయ పడుతుంది అని ఇటీవల పరిశోధనలు రుజువు చేసాయి. మందార పువ్వులతో దాచిన టీ…

  • చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని పదార్ధాల వాడకంతో చర్మం ఎప్పుడు తాజాగా కాంతి వంతంగా వుంటుంది. పిండి, తేనె, పెరుగు వంటి మిశ్రమం వంటికి పట్టించి నలుగు పెట్టుకుంటే చాలు చర్మం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే జుట్టు నిర్జీవంగా అనిపిస్తే కోడి గుడ్డు తెల్ల సోన, పుల్లటి పెరుగు, మందారకుల గుజ్జు కలిపి తలకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అలాగే చేతులు కాళ్ళు మెత్తగా మెరిసిపోవాలంటే ముందుగా ఆర బకేట్ నీళ్ళల్లో రెండు చెంచాల షాంపూ వేసి పదాలు అందులో వుంచాలి. ఆ తర్వాత ఫ్యుమిక్ రాయి తో రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోతాయి. అదయ్యాక చెక్కర, సెనగ పిండి, పాలు, తేనె మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఆరాక కడిగేస్తే పదాలు మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తాయి. చేతులకు కూడా ఇదే పూత పుయచ్చు.

    జీవిత కాలపు శ్రద్ధ కావాలి

    చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని…

  • అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే వస్తుంది విటమిన్ ఇ. దీన్ని ఆహారంగానూ తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ ఋతువులోనైనా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివారు విటమిన్ ఇ అండ్ పదార్ధాలు రోజూ తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు చర్మానికి అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది మాత్రలు రూపంలోనూ దొరుకుతుంది. ఏ విటమిన్ తో చర్మంలో సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే కాస్త విటమిన్ ఇ నూనె వంటివి పెటిట్ఞ్చి మర్దనా చేయాలి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మం పొడిబారే సమస్య తగ్గి మృదువుగా మారుతుంది. ముఖ్యంగా కళ్ళ అడుగున మడతలు నలుపుదనం కూడా తగ్గుతుంది. మొటిమలు తగ్గినా వాటితాలూకు మచ్చలు మిగిలుంటే విటమిన్ ఇ నూనె చక్కగా పనిచేస్తుంది. రాత్రిళ్ళు పడుకునేముందర ఆ నూనె రాసుకుని మర్నాడు కడిగేస్తే మురికిపోయి మొహం చక్కగా ఉంటుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండేందుకు కూడా ఈ నూనె బాగా పనిచేస్తుంది.

    విటమిన్ ఇ తో యవ్వనవంతమైన చర్మం

    అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే  వస్తుంది విటమిన్ ఇ. దీన్ని  ఆహారంగానూ  తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ…

  • బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్ వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది . సహజమైన ఏ రసాయనాలు కలపని కొన్ని వస్తువుల్లో బ్లీచ్ కంటే మొహాన్ని తేటగా చేసే మంచి గుణాలుంటాయి. రెండు స్పూన్ల బియ్యం పిండి లో కొద్దిగా తేనె పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకీ మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే మురికి పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. స్పున్ బియ్యంపిండి లో నాలుగైదు చుక్కల ఆముదం కలిపి కళ్ళ కింద పూతలా వేసి కడిగేసుకుంటే వలయాలు మడతలు క్రమంగా మాయం అవుతాయి. పాలు లేదా పాల మీగడలో కొద్దిగా బియ్యంపిండి కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవాలి. పది నిముషాల తర్వాత కడిగేస్తే మురికిపోయి చర్మం శుభ్రపడుతుంది. బియ్యం పిండిలో తేనె ఆలివ్ ఆయిల్ కలిపి స్నానానికి ముందు మర్దన చేస్తే మృతకణాలు పోయి ముఖం కళగా ఉంటుంది. బియ్యం పిండి మినపప్పు పిండి కలిపితే మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయచ్చు.

    ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్

    బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్  వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది…

  • నూనెతో మర్దనా చేస్తే సహజమైన మెరుపు

    ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణం లో వచ్చే ప్రతి మార్పుకు ప్రభావితం అయ్యేది ముఖ చర్మమే. చర్మానికి ఎప్పుడు సహజమైన నూనెలు అవసరం. కొబ్బరి…

  • దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. కాఫీ పొడిలో తేనే పసుపు కలిపి రాసుకుని ఓ అరగంట తర్వాత కడిగేస్తే చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. పాలు కాఫీ పొడి నెయ్యి కలిపి పూతలా వేసి కాస్సేపటికి కాటన్ తో ఆ పూతను తుడిచేస్తే ముఖం పైన మురికి మృతకణాలు పోయి బావుంటుంది . కాఫీ పొడి నిమ్మరసం కలిపి పూతలా వేసుకుంటే చర్మం ముడతలు లేకుండా ఉంటుంది . ఇది ప్రతి రోజు అన్ని చర్మ తత్వాలున్నవాళ్ళు ట్రై చేయచ్చు. ఇక కాఫీ పొడి మెత్తగా దంచిన దాల్చిన చెక్క పొడి పాలు తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేస్తె చర్మం కళగా ఉంటుంది.

    సొగసైన చర్మానికి ఫెస్ ప్యాక్

    దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు  సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు…

  • వయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా డీహైడ్రేషన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచం చెంది నీరు చేరుతుంది. నీరు బాగా తాగకపోతే మొహం ఉబ్బరిస్తుంది. అలాగే శరీరంలో అధిక శాతం ఉప్పుచేరినా ముఖం వస్తుంది. కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్ తాగినా ప్యాకేజీ ఫుడ్స్ తో సోడియం శరీరంలో చేరినా ఈ ప్రాబ్లమ్ కావచ్చు . ఇలా ముఖం ఉబ్బరించుకోకుండా ఉండాలంటే డైట్ లో ఎక్కువ పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి . బొప్పాయిపండు తింటే పొట్ట చిన్న ప్రేవుల ఆరోగ్యం సరిగా ఉంటుంది . ముఖంలో ఉబ్బరింపు ఉండదు విటమిన్ సి బీటాకెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు తినాలి. ఇవి చర్మం లో నీళ్లు నిలిచిపోకుండా సహాయపడతాయి. చర్మం మెరిసిపోతుంది. మొహం తేజోవంతంగా ఉంటుంది.

    ముఖ కాంతి తగ్గినట్లుంటే

    ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా…

  • అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. మొటిమలు వైట్ హెడ్స్ మచ్చలు మొదలవుతాయి. వాటిని నివారించాలంటే ఆవిరి పట్టటం తప్పనిసరి. దీనివల్ల చర్మం గ్రంధులు తెరుచుకుంటాయి. మురికి జిడ్డు మృతకణాలు పోతాయి. వేడి నేతిలో ముంచి పిండిన మెత్తని నూలు గుడ్డతో ముఖం తుడిచేసినా ఫలితం ఉంటుంది. చెంచా దాల్చిన చెక్క పొడి ఓట్స్ పిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో ముద్దగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి కొద్దిసేపు మర్దనా చేసి పావుగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. మొటిమలు వాటి తా తాలూకు మచ్చలు పోతాయి. రెండు చెంచాల సెనగ పిండి లో సరిపోయేంత పెరుగు వేసి ముద్దగా చేసి ముఖానికి రాయాలి. పది నిముషాలు అయ్యాక కడిగేస్తే సరిపోతుంది. ఇందులో పసుపు కలిపితే ఏ సమస్యలు తగ్గటం తో పాటు ముఖం కళగా మారిపోతుంది. అలాగే నిమ్మరసం లోనే ఆల్ఫా హైడ్రాక్స్ ఆమ్లాలు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. నిమ్మరసంలో దూది ముంచి మొహం పైన రాసి పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

    మొటిమలు మచ్చలు నివారణ కోసం

    అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు…

  • కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్ కాటుక వంటి ఉత్పత్తులు జీవిత కాలం ఆరునెలలే. కనుక అంతకుమించి వాడకపోవడం బెస్ట్.అలాగే ఎంత రాత్రైనా మొహం పైన రాసుకునే ఫౌండేషన్ క్రీములు మేకప్ తొలగించే పడుకోవాలి. లేకపోతే ఆ రసాయనాలతో మొటిమలు మచ్చలు ఎదురవుతాయి . కాను బొమ్మల్ని తీర్చిదిద్దుకునే సమయం లేనప్పుడు చాలాసార్లు ఫ్లక్కర్ వంటి చిన్న పరికరం తో లాగేస్తూ వుంటారు. అలా లాగేసి కనుబొమ్మల వెంట్రుకలను తీసేస్తే పల్చగా అయిపోతాయి. దాంతో ,ముఖం పెద్దగా వయసు పైబడినట్లు అయిపోతుంది. వీటికోసం ప్రత్యేకంగా ఉండే జెల్ రాసుకుంటే కనుబొమ్మలు దట్టంగా కనిపిస్తాయి. అలాగే కళ్ళ అలంకరణకు ఉపయోగించే బ్రెష్ లు తరచూ మార్చాలి. వారానికి ఒకసారి షాంపూ తో శుభ్రం చేయాలి. లేకపోతే కళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుంది . మనం చేతి వేళ్ళతో కీ బోర్డు ఉపయోగిస్తాం. అలాగే ఇంట్లో ఎన్నో శుభ్రం చేసే పనులు చేస్తాం. అదే చేతుల్ని మొహం పైన పెట్టేస్తే వేళ్ళపై క్రిములు ముఖం పై చేరి చర్మ రంధ్రాలు మూసేస్తాయి. మొటిమలు వస్తాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా మొహం పై పెట్టుకోకూడదు.

    అయిపోయేదాకా వాడద్దు

    కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్…

  • మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం ఆరు వారాల వ్యవధి కావాలి. మనం తినే ఆరోగ్యాన్ని బట్టే చర్మం ఆరోగ్యాంగా కాంతులీనుతూ ఉంటుంది. బ్రొకోలి , జామ , కివి పండ్లు ఆరెంజ్ బొప్పాయి స్ట్రా బెర్రీలు చిలకడ దుంప నేరేడు కొలెజాన్ ఉత్పత్తికి సహకరిస్తాయి . ఒమేగా 3 ఒమేగా 6 ఈ రెండు అత్యవసర ఫ్యాటీ యాసిడ్లు. ఆయిలీ ఫిష్ అవిసె నూనెలు ఒమేగా 3 లభిస్తుంది. సన్ ఫ్లవర్ కార్న్ ఆయిల్ లో ఒమేగా 6 దొరుకుతుంది. ఉల్లి వెల్లుల్లి లోదొరికే సల్ఫర్ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. లివర్ గుడ్లు పాలు ఆయిలీ ఫిష్ గింజ ధాన్యాలు విటమిన్ ఏ కు మంచి ఆధారం కొత్త చర్మం ఎదగటానికి ఇవి సహకరిస్తాయి. డ్రై ఆప్రికాట్స్ నువ్వుల్లో ఐరన్ బాగా దొరికి స్కిన్ టోన్ మెరుగవుతుంది. చర్మం మెరిసేందుకు విటమిన్ బి 2 చీజ్ గుడ్లు లివర్ లో అధికంగా దొరుకుతాయి. ఇవన్నీ సరైన మోతాదులో వుండేలా హెల్త్ చార్ట్ లో చూసుకోవాలి.

    మెరిసే చర్మం కోసం మంచి ఆహారం

    మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం…