April 2019
గీతోపదేశం కథలు
సీనియర్ రచయిత్రి దూర్వాసుల కామేశ్వరీ గారి కథల సంకలనం ఈ గీతోపదేశం పుస్తకం.ఇందులో 17కథలు ఉన్నాయి. ఇవన్నీ స్త్రీల జీవితాలకు సంబంధించిన కథలు.అధిక శాతం మధ్యతరగతి జీవితాలకు ,దిగువ మధ్యతరగతి బతుకులకు సంబంధించినవి. మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పుల, అమెరికాతో ముడిపడుతున్న సంబంధాలు అమ్మాయిల జీవన విధానంలో ఆలోచనల్లో ప్రవర్తనల్లోని వైవిద్యాలు,వైరుద్యాలు వయోధికులైన తల్లిదండ్రుల పట్ల కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రేమ పేరిట మోసపోయినా స్త్రీల అగచాట్లు, మారని మగబుద్ధితో ఇప్పటికీ స్త్రీలపై సాగుతున్న అత్యాచారాలు […]
సెల్ఫీలే అడుగుతారామే
నేను యాక్టర్ అయ్యాక డాక్టర్ గా ప్రాక్టీస్ చేయటం మరిచి పోయాను అంటుంది సాయిపల్లవి.నేను ప్రాక్టీస్ చేయాలంటే తప్పని సరిగా చదివింది రివిజన్ చేయాలి. మెడిసిన్ లో చాలా విషయాలు మరిచిపోతున్నాను. కష్టపడి చదివింది మరిచిపోతున్నందుకు ఎంతో బాధపడుతున్నాను . అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆధునిక పరిశోధనలు వస్తాయి .అవన్నీ స్టడీ చేయటం వృత్తిలో భాగం అయినా ,ఇప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టినా నన్ను మందుల చీటి గురించి అడిగే వాళ్ళకంటే సెల్ఫీ అడిగే వాళ్ళే […]
ప్రతి దినం కోత్త అనుభవం
పగలంతా షూటింగ్ ,ఓ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. సాయంత్రం పేకప్ చెప్పగానే నాలోకి నేను రావాలి. ఇది నటిగా నాకెదురైన గొప్ప సవాల్ అంటుంది అనుపమా పరమేశ్వరన్ . రోజంతా పని చేసి మరో కోత్త పాత్రకు సంబంధించిన ఊహాలలో ఉంటాను. అది నాకెంతో సంతోషం ఇస్తుంది . ఒక పాత్రకు తగ్గుట్టు మమ్మల్ని మేము మార్చుకొంటూ ప్రయాణం చేయాలి.అదో దిన చర్య అంటూ ఒక నటి జీవిత విధానం గురించి చెప్పుకొచ్చింది అనుపమా పరమేశ్వరన్.
కోకోలో విటమిన్ డి2
కోకో లో ఉండే కోకోబటర్ ,కోకోబీన్స్, కోకో పౌడర్ ,డార్క్ చాక్లెట్స్ విటమిన్ డి ని పుష్కలంగా ఇస్తాయని పరిశోధకులు చెపుతున్నాయి. విటమిన్ డి రెండు రకాలుగా అందుతుంది. విటమిన్ డి3 సూర్యకిరణాల ద్వారా శరీరానికి అందుతుంది. కోకో ఉత్పత్తులు డి2ను ఇస్తాయి. కనుక వీటిని తీసుకొంటే శరీరానికి డి2 అందుతుంది.
సన్ కేర్
వేసవి ఎండలు ముదిరితే వచ్చే సమస్యల్లో ఒకటి సన్ ర్యాష్ .మెడ,ఛాతీ దగ్గర చిన్న చిన్న పొక్కులుగా ఎర్రగా దురదతో కూడి ఉంటాయి. ఆ వేసవి సన్ ర్యాష్ ఆల్ట్రావయెలెట్ కిరణాల వల్ల వస్తుంది. ఎండకు ఎక్స్ పోజ్ కాకుండా ఉంటే ,లేదా వీలైనంత వరకు సూర్య కిరణాలు సోకకుండా పరిమితంగా ఉంటే చాలు . చర్మాన్ని కవర్ చేసే తేలికైన వస్త్రధారణ ,15 ఎస్ పిఎఫ్ గల సన్ స్ర్కీన్ రాస్తే సరిపోతుంది. రోజులో అవకాశం […]
జీవనశైలి కీలకం
డయాబెటిస్ ను జీవనశైలి మార్చుకోవటం ద్వారా నివారించుకోవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. అనారోగ్యకర ఆహారపదార్థాలు అధిక బరువు ,ఒత్తిడి మొదలైనవి కారణాలుగా చెపుతున్నారు. ఇది జెనటిక్స్ తో ముడిపడి ఉన్నప్పటికీ కుటుంబం వ్యక్తులకు లేకపోయినా వస్తుంది. 30 నుంచి 50 శాతం అవకాశాలను జీవనశైలి మార్చుకుంటే నివారించుకోవచ్చు. పైగా స్థూలకాయం ఒక్కటే డయాబెటిస్ కు కారణం అనుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొవ్వు నిల్వలు ఉండవచ్చు. వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
నేనెంతో లక్కీ
అదృష్టం వచ్చి వరిస్తుంది అని రష్మికా మండన్నా గురించి అనవచ్చు.పరిశ్రమకు రాగానే అవకాశాలు ఒక్కొక్కటిగా అందుకున్న లక్కీ నేను అంటుంది రష్మిక. నేనెప్పుడు అవకాశాల కోసం ఎదురుచుడలేదు. అదినా అదృష్టం .చిత్ర పరిశ్రమలో అవకాశం ఎంత గొప్పదో దాన్ని నిలబెట్టుకోవటం అంతే ముఖ్యమైనది. ప్రతి పాత్ర గురించి ఎంతో కష్టపడి పని చేస్తున్న నాదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్న అంటుంది రష్మికా మండన్నా.
ప్రకృతి పిలుస్తుంది
జాక్ లండన్ అనువాదం:కొడవటిగంటి కుటుంబరావు జాక్ లండన్ ,దికాల్ ఆఫ్ ది వైల్డ్ కు తెలుగు అనువాదం ప్రకృతి పిలుపు. ఇది బక్ అన్న ఒక జాతి కుక్కకథ. ఒక భూస్వామి ఇంట్లో ఉన్నా బక్ అన్న కుక్క బంగారం తవ్వకం కోసం మంచు ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళ చేతులో పడి ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. సుఖంగా ఉన్న ఇంటి వాతావరణంలోంచి ఎన్నో చేతులు మారుతూ ఎన్నో అనుభవాలు పొందుతూ బక్ మనుషులకుండే జిత్తులన్ని నేర్చుకొంటుంది. బక్ […]
లోపలి వయసు వేరు
క్యాలెండర్ వయసు ,శరీరరక వయసు ఒకేలా ఉండవు అంటారు అద్యాయనకారులు. 1972-73 సంవత్సరాల్లో పుట్టిన 100మంది పై తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో కొందరి కాలెండర్ వయసు 38ఏళ్ళుగా ఉన్నట్లు ,లోపల వయసు కొందరిలో 30గానూ ఉన్నట్లు మరికోందరికి 60 గానూ ఉన్నట్లు కనిపెట్టారు. కొందరికీ శరీర అంగాలు చాలా త్వరగా వార్థక్యా లక్షణాలు సంతరించుకుంటాయి. రక్త స్థితి గుండె ఆరోగ్యం కంటి చూపు ,దంత ఆరోగ్యం మొదలైన విషయాలను బట్టి లోపల వయసు అంచన వేశారు. […]
బ్యాగ్ కొత్తగా
అన్ని విధాల ఉపయోగపడే చక్కని హాండ్ బాగ్ కాస్త ఖరీదు ఎక్కువే.కానీ కోద్దిపాటి జాగ్రత్తలతో దాన్ని ఎక్కువ కాలం మన్నెలా చేయచ్చు. సాధారణంగా బ్యాగ్ కు జిడ్డు మరకలు పడిపోతూ ఉంటాయి. బేబీ పౌడర్ దాని పైన చల్లి రాత్రంత వదిలేసి ఉదయాన్నే దులిపేస్తే మరకలు పోతాయి. మురికి పట్టి పాత బ్యాగ్ లా అనిపిస్తే ఒక బ్రడ్ స్లయిస్ తో దాన్ని తుడిస్తే మురికిపోయి కొత్తగా కనిపిస్తుంది. బ్యాగ్ ఆకృతి బావుండాలంటే అవసరాన్ని మించి వస్తువులతో […]
అంటిస్తే పరిమళం
చక్కని సువాసన వాతావరణాన్ని ఉత్సాహంతో నింపుతుంది. మల్లెలు ,జాజులు,సంపెంగల వాసన ఎవరినైన మత్తులో ముంచెత్తుతోంది. మరి ఇలాంటి పరిమళంతో పచ్చబోట్టు వస్తే ,వంటి పైన అతికించగానే ఏ పువ్వు అంటిస్తే ఆ సువాసన వస్తే లేదా ఏ ఆకుని టాటూగా అతికిస్తే ఆ వాసన గుబాళిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. టెంపరరీ సెంటెడ్ టాటూలు ఇలాంటి సుగంధభరిదమైన సువాసనను వెదజల్లుతాయి. ఈ వేసవిలో ఇలాంటి టాటూ ఒకటి వెంటుంటే చుట్టు పరిమళమే కదా!
దుప్పటి పైన మన ఇష్టం
కష్టమైజ్డ్ బ్లాంకెట్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇష్టమైన వాళ్ళ ఫోటోలు సైట్లో పెట్టెసి ఇలా ప్రింట్ చేసి ఇవ్వమని ఆర్డర్ ఇస్తే చాలు దంపతుల పెళ్ళి దృశ్యం ,పాపాయి కొంటే పనులు లేదా పుట్టిన రోజు జరుపుకొనే స్నేహితుల బొమ్మలు ఇలా సెలక్ట్ చేసి ఆర్డర్ ఇస్తే దుప్పట్లో ఆ బొమ్మలతో ఇంటికి వస్దాయి.కష్టమైజ్డ్ బ్లాంకెట్స్ వెబ్ సైట్స్ చూస్తే ఎన్నో మోడల్స్ కూడా కనిపిస్తాయి.
నడక తీరే చెపుతుంది
మనం నడిచే పద్దతిబట్టి మన వ్యక్తిత్వం ఏమిటో చెప్పగలం అంటున్నారు పరిశోధకులు.వేగంగా నడిచే వారు కలివిడిగా,ఆత్మవిశ్వాసంలో కొత్త అనుభవాలను అన్వేషించే గుణంతో జీవనోత్సాహాంతో ఉంటారనీ అలాగే నెమ్మదిగా నడిచే వాళ్ళలో విచారం ,ముభావం కోపం చిరాకు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెపుతున్నారు. కానీ ఇలాంటి మనస్థత్వం అలవరుచుకోవటం కోసం నడక తీరు మార్చుకోవద్దనీ,స్వభావం ఎంత మాత్రం మారదనీ అయితే నడక తీరు ఎలా ఉన్నా ఆ వ్యక్తుల్లో బలాలు,బలహీనతలు ఉంటాయని పరిశోధకులు వివరించారు.
కఠిన శిక్షణ ఇవ్వాలి
సమంత ఒక వీడియోలో దాదాపు 102.25 కిలోల బరువు ఈజీగా ఎత్తటం కనిపిస్తుంది. ఇది ఆమె శరీరబరువు కు రెట్టింపు.ఇప్పటి యువత వెండి తెర వేల్పులే రోల్ మోడల్స్ ఇంత బరువు ఎత్తేందుకు ఆమె మానసికంగా శరీరకంగా తయారైంది అన్నాడు ఆమె శిక్షకుడు. ఎవరైన ఇలా సాధించగలరు నాజుగ్గా మారాలని కాకపోయినా శరీరం ధృఢంగా ఉంచుకోనేందుకు వ్యాయామంపై దృష్టిపెట్టింది అంటారు నిపుణులు. రోజుకోగంట అదినడక, యోగానా ,సైకిల్ తో శరీరానికి కఠిన శిక్షణ ఇవ్వాలి. తేలికపాటి వ్యాయామం […]
చర్మం రంగులో ఉండాలి
ఫౌండేషన్ అలంకరణకు తప్పనిసరి. అయితే దాన్ని ఎంచుకునే ముందర దవడ కింద భాగంలో రాసుకుని చూసుకుంటే అది చర్మం రంగులో కలిసిపోవాలి. అలాగే మేకప్ వేసుకునేందుకు ఫౌండేషన్ ముందు కొద్దిగా మాయిశ్చరైజర్ ముఖానికి రాసుకోవాలి. అప్పుడే ఇద్ది చక్కగా పరుచుకుంటుంది. కళ్ళ అడుగున మాత్రమ కన్సిలర్ బ్రష్ తో అద్దుకుంటే కళ్ళ కింద నళ్ళని వలయాలు కనబడకుండా ఉంటాయి. పౌండేషన్ కు వేళ్ళతో కాకుండ బ్రష్ తో రాసుకుంటే మంచిది. ముఖమంతా చిన్ని చిన్ని చుక్కల్లా పెట్టుకుని […]
మన కోసం రెండు నిమిషాలు
వ్యాయామం ముందు వామప్ చేసినట్లు ఉదయం లేవగానే ఏదో ఒక పనిలో పడిపోకుండా ఒక నిమిషం రిలాక్స్ గా తాజా గాలిని ఆస్వాదించి ఈ రోజు చేయవల్సిన పనుల గురించి ఆలోచిస్తూ కూర్చోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదయం నిద్రలేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవ్వాల కలుసుకోవల్సిన వ్యక్తులు పనులు వరుసగా పెట్టుకుని సాయంత్రం వరకు ఎంత బిజీగా గడుపుతారో లెక్కవేసుకోవచ్చు. తర్వాత మనసుకు నచ్చిన పాట వింటునో పదిని మిషాలు ఆరుబయట పచ్చికలోను అపార్ట్ మెంట్ లోనో ఉంటే […]
ఒంటరి మహిళలకే ప్రాధాన్యం
చిన్నారుల దత్తతకు సంబందించి దంపతులు ఒంటరి పురుషులు మహిళల వరసలో ఒంటరి మహిళలకే ప్రాధాన్యం ఇస్తామంది.కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ పరిధిలోని సెంట్రల్ అడాప్షన్ రిసెర్చి ఎజెన్సీ. ఈ నిర్ణయం వెనక కారణం చాలా సంతోషాన్నిచ్చేదిగా ఉంది.మన దేశంలో మహిళలకి ఎంతసంపాదన ఉన్న పెళ్ళి,పిల్లల విషయాలు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అలాంటిది ఏదో కారణాల చేత ఒంటరిగా మిగిలిన స్ట్రీలు తమకి తోడుగా ఒక పాపనో బాబో ఉండాలని నిర్ణయం తీసుకోగలిగారంటే అది చిన్న […]
ఈ నొప్పికి మందులెందుకు
చాలామందికి నడుం నొప్పే సమస్య. ఈ ఇబ్బంది తలెత్తగానే హాస్పిటల్ కు ప్రదక్షిణలు,ఆపరేషన్లు అయిపోతున్నాయి.లేదా మందులు మింగడం వెన్నుపూసకు ఇంజక్షన్లు చేయించుకోవడం. కానీ ఇది జీవనశిలి సమస్య అంటున్నారు.ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.అదే పనిగా కూర్చుని ఉండటం టీవి చూడటం ఊబకాయం వంటివి ఈ వెన్ను నొప్పికి కారణంగా చెబుతున్నారు.ఆ సమస్యలన్ని తగ్గించుకుంటే వెన్నునొప్పి తగ్గిపోతుంది అంటున్నారు.అలాగే ఎక్కువసేపు ఇంట్లో అయినా అటు ఇటు నడుస్తూ ఉండటం చిన్నపాటి వ్యాయామాలు చేయడంతో ఈ సమస్య తగ్గించుకోవచ్చు అంటున్నారు.
పువ్వుల్లో ప్రశాంతత
తలలో పూలు పెట్టుకోవడం మన సంప్రదాయంలో భాగం పండగకు ప్రత్యేకమైన సందర్భాల్లో పూలతోరణాలు కట్టడం గుమ్మాలకు పూలదండలు వేలాడదీయడం ఎప్పటినుంచో వస్తుంది. ఇలా తల్లో పూలు ధరించడం ఇల్లు పూలతో అలంకరించడం వల్ల కళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటాయి అంటారు నిపుణులు.మూడ్ మార్చే శక్తి పువ్వులకు ఉంది అంటారు.బంతి,చామంతి,గులాబీ,మల్లె,లిల్లీ,పొద్దు తిరుగుడు ఈ పూలతో ఫ్లవర్ వాజ్ ల్లో భారీగా అలంకరిస్తారు.ఈ పూలను అలంకరించడం ఎప్పుడో ప్రాచీనమైన అలవాటేనని పువ్వుల్లో ఉండే మహిమను కనిపెట్టే ప్రతిరోజు దేవునికి ఈ […]
ఎన్ని కోట్లిచ్చినా నో
రెండు కోట్ల రూపాయల ఆఫర్ వదులుకుందట సాయిపల్లవి.అది ఒక ఫేస్ క్రీం యాడ్.ఆ యాడ్ గనుక వచ్చిఉంటే జనాలకు తన పై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని పైగా అలాంటి ఫేస్ క్రీమ్ తాను అసలు వాడనుఅని దాదాపు సినిమాల్లో కూడా మేకప్ లేకుండా ఉన్న కొద్దిపాటి మేకప్ తో కనబడే తాను ఈ యాడ్ చేయలేనని చెప్పేసింది.ఇప్పటికే ఈ యాడ్ పేరు మోసిన హీరోయిన్లు నటించేందుకు ఆసక్తి చూపించారట.ఎంత డబ్బు వచ్చినా తన మనస్సుకి వ్యతిరేకమైన పనిచేయనని […]
