April 2024
పుస్తకాల గురించి ప్రచారం
సోనా లీన్ బుక్ క్లబ్ పేరుతో గత ఏడు సంవత్సరాలుగా పుస్తకాల గురించి ప్రచారం చేస్తుంది సోనాలి బింద్రే. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రచారం చేయటం ఈ బుక్ క్లబ్ లక్ష్యం. కేరళ కు చెందిన రియా జార్జ్ కుటు బుక్ యు అనే స్టార్టప్ ద్వారా పుస్తక పఠనం గొప్పదని ప్రచారం చేస్తూ ఉంటే సోనాలి కూడా ఆమెతో కలిసి పనిచేస్తుంది.కుటు బుక్ అంటే పుస్తకాల పురుగు అని అర్థం. పుస్తకాన్ని మీ […]
పొడవైన కురులు
తన పొడవైన కురులతో స్లోవాకియాకు చెందిన అలియా నసిరోవా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. 8 అడుగుల 5.3 అంగుళాల పొడవున్న జుట్టుతో ప్రపంచంలోనే అతి పొడవైన శిరోజాలు ఉన్న మహిళ ఆలియా. రోజు జుట్టు దువ్వుకోలేను వారానికి ఒకసారి దువ్వెందుకు జడ వేసుకునేందుకు గంట పైగా సమయం పడుతుంది. ఇక తల స్నానం చేస్తే తడి ఆరెందుకు 24 గంటలు పడుతుంది అని చెబుతున్నా ఆలియా వృత్తి రీత్యా పెయింటర్ తన పొడవైన […]
సెలబ్రిటీ స్టయిలిస్ట్
ఏకా లఖానీ కాస్ట్యూమ్ డిజైనర్ న్యూయార్క్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ చేసింది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ సభ్య సాచి అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించింది ఏకా లఖానీ. బాలీవుడ్ లో సెలబ్రెటీలకు స్టయిలిస్ట్ కూడా. సంజు పొన్నియిన్,సెల్వమ్,షేర్ షా, జుగ్ జుగ్ జియో వంటి సినిమాల్లో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసింది. కరణ్ జోహార్ రణబీర్ లకు పర్సనల్ స్టయిలిస్ట్ కూడా.ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ స్టయిలిస్ట్ అంటారు.
అత్యంత ప్రతిభాశాలి
ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఆలియా భట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రసిద్ధ టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన 100 మంది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024 లిస్ట్ లో ఆమె పేరు చోటుచేసుకుంది.ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దికి పైగా ఆమె ఎంతో చక్కని చిత్రాల్లో తన ప్రతిభ నిరూపించుకుంది వ్యాపారవేత్త కూడా.
మహిళలే పూజారులు
రామ్ ఘాట్ ప్రాంతంలో సరియు నది తీరాన ఉండే శ్రీరామ్ జానకి మందిర్ లో పూజాదికాలు, నిర్వహణ అంతా మహిళలే మాయి బడా ఆశ్రమం గా పిలిచే ఈ జానకి బాగ్ లో 120 మంది స్త్రీలు ఆశ్రయం పొందుతున్నారు. పూజలకు పురుషులను అనుమతించారు. ప్రధాన అర్చకులు కృష్ణరాసి. వితంతువులు, అనాధలు, కుటుంబాలకు దూరమైన స్త్రీలు ఈ మాయి బడా ఆశ్రమంలో ఉన్నారు.
ప్రొఫెషనల్ కార్ రేసర్
చిత్రలహరి, పాగల్, ధమ్కీ వంటి సినిమాల్లో నటించిన నివేత పేతురాజ్ ప్రొఫెషనల్ కార్ రేసర్ కూడా. 2017 నుంచి ఛాలెంజర్ స్పోర్ట్స్ కారు కొని రేసింగ్ ప్రాక్టీస్ చేసింది.క్రమంగా ఫార్ములా వన్ రేసింగ్ పైన పట్టు సాధించింది. ఇప్పుడు ప్రొఫెషనల్ ఎఫ్1 కార్ రేసర్ చక్కగా బ్యాడ్మింటన్ ఆడుతుంది. మధురై లో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో మిక్స్డ్ డబల్ కేటగిరిలో కప్ సాధించింది నివేతా తెరపైన నటనే కాదు ఇన్ని టాలెంట్స్ ఉండటంపై సర్వత్ర ఆమె […]
చక్కని కళాకారిణి
పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అంటుంది నభా నటేష్.చిన్నతనంతోనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు సాధించింది. కాన్వాస్ పెయింటింగ్,ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్స్ తో ఎలాంటి కష్టమైనా చిత్రాన్నైనా నాలుగైదు గంటల్లో వేయగలదు. ఈ మధ్యకాలంలో ఆమె గీసిన చార్లీ చాప్లిన్ బొమ్మకు సోషల్ మీడియాలో ఎంతో స్పందన లభించింది.స్క్రీన్ పైనే కాదు కాన్వాస్ పైన కూడా మ్యాజిక్ చేస్తుందని నెటిజన్లు ఆమెను మెచ్చుకున్నారు.
నటనతో పాటు పాటలు కూడా
కొందరు తారలు కేవలం నటించటం మాత్రమే కాదు ఇతరత్రా ఎన్నో టాలెంట్స్ కలిగి ఉంటారు కేవలం అందంగా నటించటం తోనే కాదు తన అద్భుతమైన గొంతుతోను అభిమానులను అలరిస్తోంది రాశి కన్నా. ఇప్పటికే మలయాళంలో ఒకటే తెలుగులో ఐదు పాటలు పాడేసింది. షూటింగ్ లేకపోతే చాలు ఎంచక్క పాటలు పాడడం నేర్చుకోవడం తోనే గడిపేస్తా అంటుంది రాశి కన్నా. చక్కగా గిటార్ వాయించగలదు కూడా.
స్త్రీల రక్షణ కు పింక్ స్క్వాడ్
చెన్నై లోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ మెట్రో స్టేషన్ లో తొలిసారి గా విమెన్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. పింక్ స్క్వాడ్ గా పిలిచే ఈ దళం లో 23 మంది మహిళలు మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన వాళ్లు. ఎయిర్ పోర్ట్, మెట్రో స్టేషన్లలో మహిళల పట్ల ఎలాంటి అవాంచిత ఘటనలు జరగకుండా ఈవ్ టీజింగ్ కు గురికాకుండా ఈ స్క్వాడ్ కాపలా కాస్తుంది. లక్షల మంది ప్రయాణం చేసే మెట్రో లో మహిళలను కాపాడుతుంది […]
చిన్నారి బాహుబలి
9 ఏళ్ల వయసున్న అర్షియా గోస్వామి వెయిట్ లిఫ్టింగ్ లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది వెయిట్ లిఫ్ట్ తో అరుదైన ఘనత సాధించింది. ఆరేళ్ల వయసులోనే 45 కేజీల డెడ్ లిఫ్ట్ ప్రదర్శించిన ఈ చిన్నారి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. అదే సంవత్సరం 35. 8 కేజీల బరువు ఎత్తిన అతి చిన్న వయసు గల బాలికగా ఆరేళ్ళ వయసులోనే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ తన పేరు నమోదు […]
అఖండ విజయం
ఇండె వైల్డ్ హెయిర్ ఆయిల్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. తల్లి సంగీత ఖోస్లా ఇచ్చిన ఫార్ములా తో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసింది. దీపా ఖోస్లా.గ్లోబల్ ఇండియన్ ఎంటర్ ప్రెన్యూర్ గా దీప ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి ఆమె తయారు చేసిన బ్యూటీ బ్రాండ్ హెయిర్ ఆయిల్ సహజ పద్ధతుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చేది. లా చదువుకున్న దీప ఆ తర్వాత మల్టిపుల్ బ్రాండ్ డీల్స్ తో సక్సెస్ ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ […]
మహిళా గేమర్
గేమ్స్ ఆడుతూ వాక్యానం వినిపిస్తూ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా 35 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న పాయల్ ధారే మహిళ గేమర్. వీడియో గేమ్స్ ఆడుతూ వాక్యానాలు చెప్పే గేమర్స్ మన దేశంలో 15 వేల మంది ఉన్నారు. 23 ఏళ్ల పాయల్ కు పాయల్ గేమింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. మధ్యప్రదేశ్ లోని చింద్వారా అనే పల్లె లో పుట్టిన పాయల్ తన గేమింగ్ ద్వారా మంచి ఫాలోయింగ్ పొందింది. ఈ మధ్యకాలంలో […]
స్త్రీల చేతుల్లో బిగుల్
ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ లో ఉమెన్ బిగులర్ ప్లేయర్స్ గా నిలిచారు మహిళా కానిస్టేబుల్స్ శివాని,శ్వేతా,నిషు అధికారిక కార్యక్రమాలు వాయించే వాయిద్య పరికరం బిగుల్ .అమరవీరులకు నివాళి ఇచ్చేటప్పుడు జెండా వందనానికి ఈ బిగుల్ తప్పనిసరిగా వాయిస్తారు. ఇప్పటి వరకు పురుషులే వాయించే ఈ వాయిద్యాన్ని మహిళలకు కూడా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలన్న నిర్ణయంతో శిక్షణ ఇప్పించింది.నాలుగు నెలల కోర్స్ ముగించి ఈ ముగ్గురు విధుల్లోకి వచ్చారు.
పిల్లలకు రక్షణ
ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించి చైల్డ్ ట్రాఫికింగ్ నిరోధానికి కృషి చేశారు పల్లవి ఘోష్. అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, భూటాన్,బంగ్లాదేశ్, మయన్మార్ తో సహా దేశవ్యాప్తంగా పదివేల మంది పిల్లలను రక్షించగలిగారు.చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా బెదిరింపులకు లొంగకుండా ఎన్నో వర్క్ షాప్ లు నిర్వహించి ఈ సమస్య పై అవగాహన కల్పించారు. 75 వేల మంది ఈమెతో కలిసి పనిచేస్తున్నారు. అస్సాం లోని లుమ్డింగ్ పట్టణంలో పుట్టిన పల్లవి ఢిల్లీ కి […]
అత్యంత సాహసికులు
తాషి,నుంగ్షి మాలిక్ అన్న కవలలు ఎవరెస్ట్ తో సహా ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాల తో పాటు రెండు దృనామి పైన కాలు పెట్టి అడ్వెంచర్ స్లామ్ పూర్తి చేశారు. గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించుకున్నారు. హర్యానా లోని సోనీ పట్ లో పుట్టిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు అత్యంత అసాధ్యం అని భావించే ఎత్తైన పర్వతం విన్సన్ మాసిఫ్ ఎక్కేశారు. భారత ప్రభుత్వం వీరిద్దరిని టెంజింగ్ నార్కే నేషనల్ అడ్వెంచరస్ అవార్డుతో సత్కరించింది. […]
నెయిల్ జ్యువెలరీ ట్రెండ్
ప్రాచీన చైనా,ఈజిప్ట్ రాణులు ఇష్టంగా ధరించే నెయిల్ క్లాసికల్ జ్యువెలరీ ఆధునికమైన రూపంలో మార్కెట్లోకి వచ్చింది. బంగారం వెండి ఇతర లోహాల తో ఈ జ్యువెలరీ సంప్రదాయం, ఆధునికతల కలబోతగా కనిపిస్తోంది. లోహపు డిజైన్లతో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్ వంటివి జతచేసిన డిజైన్లు ఎంపిక.ఇప్పుడు అలంకార జాబితాలో పై ఎత్తున ఉంది.
అందంగా లాంగ్ గౌన్స్
శాటిన్,నెటెడ్, సీక్వెన్ ఎంబ్రాయిడరీ, ఇట్లా ఎన్నో వెరైటీ లతో లాంగ్ గౌన్ లు వచ్చాయి. సింపుల్ గా ఎలిగేంట్ గా కనిపించాలి అంటే లాంగ్ గౌన్ ఎంచుకోండి అంటారు ఎక్సపర్ట్స్. ఎక్కువ లేయర్ల లు ఉండే లాంగ్ గౌన్ చూసేందుకు భారీగా కనిపించిన ధరించేందుకు కంఫర్ట్ గా ఉంటుంది.ఈవినింగ్ పార్టీల్లో సింపుల్ గా అందంగా కనిపించేందుకు లాంగ్ గౌన్స్ శాటిన్ తో సహా ఎన్నో రకాల వస్త్ర శ్రేణులు వస్తున్నాయి.
ఈమె తోనే మొదలు
భారతదేశానికి సంబంధించిన మొదటి మహిళా షిప్ సర్వేయర్ పూజ ఛతోత్ ఒక నౌక తయారీ మొదలైనప్పటి నుంచి అది సముద్రం పైన ప్రయాణం చేసే వరకు అన్ని ప్రమాణాలు పాటించేలా చేసే ఉద్యోగం ఈ షిప్ సర్వేయర్. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత సముద్రయాన సంస్థ లాయర్స్ రిజిస్టర్ లో షిప్ సర్వేయర్ గా పనిచేస్తుంది పూజ ఛతోత్. ఆమెది కేరళ లోని కన్నూర్ జిల్లా కొచ్చి లో నావెల్ ఆర్కిటెక్చర్ 2020 లో పూర్తి చేసిన […]
స్టార్టప్ లకు సాయం
రిచా బాజ్‌పాయ్ విద్యార్ధినిగా ఉన్నపుడే గూడేరా స్టార్టప్ బాగా నిలదొక్కుకున్నాక క్యాంపస్ ఫండ్ ప్రారంభించింది. ఎన్నో భారతీయ స్టార్టప్ లకు సాయం చేస్తోంది. ఈమె సంస్థ పెట్టుబడి మెంటరింగ్ వంటి అంశాల్లో స్టార్టప్ లకు సాయం చేస్తోంది. తన ఆలోచన శక్తితో ఫోర్బ్స్ ఇండియా ఆసియా ఎ ఐ టి ఇన్నోవేటర్ సహా ఎన్నో జాబితాలో చోటు సంపాదించింది రిచా బాజ్‌పాయ్.
ఈమే ఒక ఊహ
వర్చువల్ ఇన్ ఫ్లుయెన్సర్ ఐతానా లోపెజ్ ను,ఆమె నిజం కాదని తెలిసిన మూడు లక్షల మంది అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. ఈ వర్చువల్ మోడల్ తన దినచర్య వ్యయామం ట్రెక్కింగ్ ప్రకృతి లో గడిపే ఫోటో లు పోస్ట్ చేస్తుంది. ఎన్నో సంస్థ లకు ఈమె ప్రచారకర్త ఎక్కువ సంపాదన కలిగిన ఇన్ ఫ్లుయెన్సర్స్ గా ఐతానా ఎదిగింది.
