March 2019
తల్లి దండ్రుల్ని నమ్మరు
క్రమ శిక్షణ కోసం పిల్లల్ని కొట్టడం చాలా సహాజంగా చూస్తూ ఉంటాం. అలా కొడితే మన అహాం శాంతిస్తుందేమో గానీ అది పిల్లల మనసులపై శాశ్వసతమైన ప్రభావం చూపెడుతోంది. వాళ్ళని కొట్ట ముందర వాళ్ళు ఎంత బలహీనులు ,మనల్ని తిరిగి కొట్టే సాహాసం చేయకుండా ఎంత నిస్సహాయంగా మనవైపు చూస్తారో ఏడుస్తారో గమనించమంటున్నారు ఎక్స్ ఫర్ట్స్ . అలా తల్లిదంద్రుల చేతుల్లో రిలేషన్ షిప్ సమస్యలు ఎదుర్కోంటారు. తమని కొట్టి దండించిన తల్లిదండ్రులను చిన్న తనంలోనే నమ్మటం […]
ఐదు వేల అడుగులు చాలు
ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా ఎంత మంచి ఆహారం తీసుకున్న రోజు మొత్తంమ్మిద ఐదువేల అడుగులు వేయగలిగితేనే ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.ఈ ఐదు వేల అడుగులు కూడా మెల్లిగా కాకుండా వేగంగా వేయాలని సూచిస్తున్నారు. ఈ అడుగుల సంఖ్యని తెలుసుకోవడానికి ఫిట్ నెస్ యాప్ ఉపయోగించుకోవాలని వారు సూచించారు. ఇలా ప్రత్యేకించి నడవలేకపోతే చిన్ని చిన్ని పనులకు వాహానాలపై ఆధారపడకుండా నడిచి వెళ్ళడం అలవాటు చేసుకోమని చెబుతున్నారు.శరీరాన్ని ఫిట్ నెస్ […]
పంజాబీ జుత్తీ షూస్
ప్రత్యకమైన సందర్బలలో ,ప్రత్యేక దుస్తులతో పాటు మంచి పాదరక్షలు ధరిస్తే నే కాని చక్కని లుక్ ఉంటుంది.కొన్ని పాతరోజుల్లో ట్రేండ్ సృష్టించిన ప్రత్యేక రకాలు మళ్ళీ కోత్తగా కాస్తా ముస్తాబుచేసుకోని పాపులర్ అవుతుంటాయి. పంజాబీ జుత్తీ ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ .ఈ చెప్పలను త్రిడీ ఎంబ్రాయికరీలు,లేస్ లు క్రిష్టల్స్ రకాలలో మోడర్న్ లుక్ తీసుకోచారు డిజైనర్లు. షూలో కొత్త అవిష్కరణలు వస్తాయి. చేత్తో పెయింట్ చేసిన యాంగ్రీ బర్డ్ ,ఆపిల్ అనాస వంటి చిత్రలతో పిల్లలకి నచ్చేస్తున్నాయి.బర్తడేలు […]
ఈ పూల అందం మనోహరం
డిసెంబర్ జనవరి నెలల్లో అగ్ని వంటి ప్రకాశమైన నారింజ రంగు పువ్వులతో నిలువెల్లా పూసే ఆరెంజ్ ట్రంపేట్ క్రొపర్ చాలా తేలికగా పేంచ గలిగే మొక్క. దీని శాస్రీయ నామం బిగ్నానియా వెమస్టా,లేదా పైరా స్టేజియా వెమస్టా అంటారు.గ్రీక్ భాషలో అగ్నితో మనోహరమైది అని అర్ధం.ఇది కంచల మీద ,ప్రహరీ గోడల మీద గ్రౌండ్ కవర్ గాను బాగుటుంది.ఈ తీగ పువ్వులు లేనప్పుడు నిండుగా గా పచ్చని ఆకులతో అడ్డు గోడలా ఉంటుంది.సంవత్సరంలో రెండు మూడు నెలల […]
రిలాక్సాయితే నష్టం
ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలంటే కాస్త ఖాళీ సమయం దొరికినా ఏ టీవీ ముందో రిలాక్సయి పోకుండా ,వ్యయామం కొసం కేటాయిస్తే దాన్నే రిలాక్సషన్ అనుకుంటేనే ఆరోగ్యం అంటున్నాయి అధ్యయానాలు. ప్రస్తుతం జీవన శైలిలో విశ్రాంతిగా కదలకుండా చేసే పనులే ఎక్కువ. ఫొర్ వీలర్ లో ప్రయాణం ,ఏసీ గదుల్లో గంటలకొద్ది ఆఫీస్ పనికి కేటాయించడం శరీరానికి శరీరక శ్రమ లేకుండా పొయింది. వ్యాయమం లేకుంటే రాబోయో అనారోగ్యాలని దృష్టిలో ఉంచుకొని ముందరగా వాకింగ్ తో మోదలు పేట్టి […]
ఎండవల్ల సమస్యా?
ఎండ వత్తిడి రాపిడి వల్ల మోచేతులు ,మోకాళ్ళు నల్లగా అయిపోతాయి. ఈ నలుపు పోవాలంటే అలావూరా గుజ్జు బాగా పట్టించి ఓ అరగంట ఆరాక కడిగేసుకోవచ్చు.ఇలా చేస్తే కొద్దీ రోజుల్లో మోకాళ్ళు,మోచేతులు శరీరపు రంగులోకి మారిపోతాయి. పాలు ,పసుపు ,తేనె కలిపి ఫ్యాక్ వేసినా మంచిదే .పాలు బ్లీచ్ లాగా పని చేస్తే,తేపె చర్మానికి తేమ అందిస్తుంది.పసుపు కర్రిమిసంహారకం కనుక ఈ మూడింటి ఫ్యాక్ తో చర్మం తేటగా అయిపోతుంది. నలుపు వదలాలంటే స్క్రబ్ చేయాలి. ఆలీవ్ […]
కాస్త దూరంగా ఉంచండి
మూడేళ్ళ పిల్లలు కూడా అస్తమానం స్మార్ట్ ఫోన్ తోనే ఆడుతుంటారు. ఆ ఆడే ఆటలే లోకంగా ఉంటే వాళ్ళలో ఎమోషనల్ డెవలప్ మెంట్ తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయితే పక్కన ఉంగే పిల్లలతో మాట్లాడటం తగ్గిపోతుంది. సోషలైజ్ కాకపోతే ఎవరితో ఎలా కలిసి పోవాలో వారికి తెలియదని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్ ,ల్యాప్ టాప్ తెరలపైన హైటెక్ గేమ్స్ ఆడుతోండటం చూసి తల్లిదండ్రులు సంతోషంగా ఫీలవుతున్నారనీ అది […]
బ్రౌన్ రైస్ ఆరోగ్యం
తెల్ల బియ్యం అన్నం కంటే కాస్త రుచి తక్కువగా ఉన్న బ్రౌన్ రైస్ తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే బ్రౌన్ రైస్ వండే ముందర ఒక అరగంట నానబెట్టాలి. కుక్కర్ లో వండటం మంచిది. తెల్లని బియ్యం అంత రుచిగా ఉండదు కనుక వండే ముందర నీళ్ళు మరగనిచ్చి అందులో కాస్త ఉప్పు వేసి తరువాత నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి ఐదు నిమిషాల పెద్ద మంట పైన ఉడికించి తర్వాత […]
హెయిర్ స్టైల్ మార్చితే అందం
చీరెలు, ఓణీలు ,పరికిణీలు,అనార్కలీ,ఇంకా వెస్ట్రన్ కుర్తీలు ఎన్ని రకాల డ్రెస్ లు ఎంచుకొన్న హెయిర్ స్టైల్ ఒకే రకంగా ఉంచితే బావుండదు అంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ లు. ముఖం అందాన్ని పెంచే హెయిర్ స్టైల్ పైన దృష్టి పెట్టలి. ముందుగా జుట్టు పొడి బారకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఆలీవ్ లేదా ఆ కొబ్బరి నూనె తో తలకు మసాజ్ చేసి షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు మృదువుగా పట్టులాగా మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఉంగరాలు తిరిగి […]
అరుదైన గైరవం
అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధికారత కోసం కృషి చేసే పలు రంగాలకు చెందిన సామాజిక వ్యాపార వేత్తలకు ప్రతి ఏడాది వరల్డ్ ఫెలోస్ పేరుతో ఎంపిక చేసి గౌరవిస్తుంది.ఈ ఏడాది 91 దేశాల నుంచి ఎంపిక చేయగా వారిలో మన దేశానికి చెందిన 16 మంది ఉన్నారు.వారిలో ఢిల్లీకి చెందిన నేహా ఉపాధ్యాయ కూడా ఒకరు.ఈమె 2014లో గుణ పేరుతో సంస్థ ప్రారంభించి గ్రామీణ మహిళా రైతులతో సేంద్రీయ ఆహారపదార్థాలు తయారు చేయించింది. […]
సహాయదర్శకురాలిగా అమియాదేవ్
క్రికెట్ స్టార్ కపిల్ దేవ్ కూతురు అమియాదేవ్ సహాయ దర్శకురాలిగా సినీ రంగంలోకి కాలు పెట్టబోతుంది. రణ్ వీర్ సింగ్ నటించిన బాలావుడ్ చిత్రం 83 కు అమియా సహాయదర్శకురాలిగా పని చేయబోతుంది.1983లో వెస్టిండిస్ భారత క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పుడు ప్రపంచ కప్ సాధించిన కపిల్ దేవ్ సినిమా కథ ఇదీ. అమెకు క్రీడా కారుల గురించి చక్కగా తెలుసు . ఆ అనుభవంతోనే మెగా ఫోన్ పట్టుకోనున్నది అమియా దేవ్.
అదృష్టం కృషీ రెండు కావాలి
తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ లో ప్రీతి కేరక్టర్ చేస్తుంది కియారా అద్వాణి.సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే అదృష్టం,కృషి రెండు కావాలంటుంది కియారా. ఏ నటి అయినా విభిన్న తరహా పాత్రలు చేయాలని ఇష్టపడతారు. ఆ విభిన్నత కోసం నేను వెభ్ సిరీస్ ఒప్పుకున్నాను.నా దృష్టిలో సినిమాల కన్నా వెబ్ సిరీస్ కే ఆదరణ ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకుల దగ్గరకు వెళ్లేందుకు ఇదో మంచి అవకాశం అనుకుంటున్నాను. పైగా సినిమా అవకాశాలు కూడా […]
దువ్వెనకే ప్రాధాన్యం
జుట్టు ను బట్టి చక్కని దువ్వెన ఎంచుకొండి.చిక్కులు లేకుండా స్టైలింగ్ చేసుకోవాలన్న ఆ దువ్వెన చక్కగా పనికి వస్తుంది అంటున్నారు సౌందర్య నిపుణులు. వెంట్రుకల తత్వాన్ని బట్టి దువ్వెనలుండాలి.అది నాణ్యమైనదిగా సున్నితమైనదిగా ఉండాలి.జుట్టు పొడవుగా చిక్కులు పడకుండా ఉంటే పాడెల్ బ్రష్ వాడుకోవచ్చు.ఈ దువ్వెనకు పళ్ళు విశాలంగా ఉంటాయి.పైగా పై నుంచి కిందకు నెమ్మదిగా దువ్వితే మాడుకు మర్ధనా జరుగుతుంది. జుట్టుని పార్టిషన్ గా తెగిపోకుండా విడగొట్టటానికి రా టైల్ రకం దువ్వెన కావాలి. జుట్టు పొట్టిగా […]
రత్నాల నగలు ఎంతో ప్రత్యేకం
పచ్చలు,కెంపులు ,వజ్రాలు,పగడాలు ,నీలం ,ముత్యం గోమేధకం వంటి రత్నాలతో నగలు ఇవ్వాల్టి ట్రెండ్. ఇవి పాత తరం నగలే కానీ కొత్తగా ఎన్నో ఆకృతులతో కనువిందు చేస్తున్నాయి. నవ రత్నాలు చాలా ఖరీదైనవి .ఇవి జాగ్రత్తగా ఎంచుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి కూడా. కానీ పెళ్ళి వేడుకల్లో నూ ముఖ్యమైన సందర్భాలలో ఈ నవ రత్నాల నగలు ప్రత్యేక అందాన్నిస్తాయి. టెంపుల్ జ్యువెలరీ గా సింపుల్ గా గొలుసులో లాకెట్ గా వేసుకోన్న ఇవి రకరకాల రత్నాలతో కొన్నింటిని […]
ఫ్రూట్ డిజైన్ నగలు
చెర్రిలు,స్ట్రాబెర్రీలు ,ఆపిల్స్ ,ఫైనాపిల్స్,మనకి ఇష్టమైన పళ్ళ జాబితాలో ముందుంటాయి. ఇప్పుడు ఇవి కాస్త ధగ ధగలాడే నగల వరసలోకి వచ్చాయి.ఈ పండ్లు కాస్త రత్నాలు ముత్యాలు సొగసులద్దుకుకొని అందమైన ఫ్రూట్స్ డిజైన్ కలక్షన్స్ గా మార్కెట్ లోకి వచ్చాయి. పగడపు పూసలు,రత్నాలు కెంపులతో ఎనామిల్ కోబెంట్ లతో అచ్చు ఆయా రూపంలో వచ్చేట్లు అనేక ఆకులు కొమ్మలు వచ్చేట్లూ ఆకర్షణీయంగా తీర్చి నిపుణులు ఈ పండ్ల డిజైన్ నగలు చెవులకు దిద్దులు మెడలో పెండెంట్లుగా ,ఇటు సంప్రదాయ […]
సౌందర్యాన్నిచ్చే ఓట్స్
ఓట్స్ చాలా ఆరోగ్యం,ఓట్స్ ఇటు శిరోజాలను చర్మాన్ని కూడా మెరిపించగలవు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఓట్స్ లోని పోషకాలు శరీర సౌందర్యానికి ఉపయోగపడతాయి. ఓట్స్ ని కాసేపు నానబెడితే తెల్లని పాలలా అవుతాయి. ఆ పాలలో దూది ముంచి ముఖంపైన అద్దుతూ శుభ్రం చేస్తే సహజమైన క్లెన్సర్ లాగా పని చేస్తాయి. ఓట్స్ ని నానబెట్టి అందులో నిమ్మ రసం ,ఆపిల్ సిడార్ ,వెనిగర్ ఆలీవ్ నూనె కలిపి తలకు పట్టించి కాస్సేపాగి కడిగేస్తే చుండ్రు తగ్గిపోతుంది. […]
ఆరోగ్యాన్నిచ్చే చదువు
చక్కగా చదువుకొంటేనే మంచి ప్రవర్తన ,మంచి వ్యక్తిత్వం ,మంచి ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చని ఇటీవలే ఒక అధ్యయనం వెల్లడైంది.చదువు మధ్యలో ఆపేసిన మూడు లక్షల మంది జీవన శైలి పైన ఒక అధ్యయనం చేశారు డిగ్రీ చదివిన వారి కన్న ఇంటర్ తో ఆపేసిన వారే పలు ఆరోగ్య సమస్యలతో బాధపుడుతున్నారు .వారిలో ఒత్తిడి ఎంతో ఎక్కువగా ఉంది. చాలా మంది గుండె పోటుకు అంచునే ఉన్నారు. తక్కువ చదువు ,తక్కువ సంపాదన జీవితంలో అభద్రతకు […]
గుడ్డుతో గుండెకు ముప్పు
ఒక అధ్యయనం ప్రతి రోజు గుడ్డు తినటం అంత ఆరోగ్యకరం కాదంటోంది . గుడ్డులోని పచ్చ సొన కొలెస్ట్రాల్ పెరగటానికి దారి తీస్తుందనీ చివరకు అది గుండె పోటుకు కారణం అవుతోందని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. ప్రతి రోజు గుడ్డు తింటే గుండె వ్యాధుల ముప్పు 21శాతం ఎక్కువవుతోందని వారు చేసిన అధ్యయనాలు చెపుతున్నాయి. అమెరికా బ్రిటెన్ దేశాల్లో 30 సంవత్సరాల పాటు 30 వేల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని కనిపెట్టారు. షాప్స్ […]
పుచ్చకాయ బెస్ట్
ఈ వేసవికి నిజమైన రక్షణ ఇవ్వగలిగేది పుచ్చకాయ,ఇందులో 50 శాతం నీరు దాహాం తీర్చేందుకు ఉత్తమంగా పని చేస్తుంది. చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.పుచ్చకాయలో ఎర్రని భాగంలో ఎన్నో పోషకాలు ఉంటాయి ,తెల్లని భాగంలోనూ సగానికి పై గానే ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గా కాన్సర్ నిరోధకంగా పని చేసే లైకోపెన్ అనే రసాయనం మిగతా పళ్ళ కూరగాయలతో పోలిస్తే పుచ్చకాయలో చాలా ఎక్కువ. పుష్కలంగా ఉండే సి విటమిన్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కొలెస్ట్రాల్ […]
అబద్దాలకు కుంచిస్తుంది
మెదడు అద్బుతమైన కంప్యూటర్ వంటిది. అబద్దలు నిజాలు మద్యలో వ్యత్సాసం. అది అర్ధం చేసుకొని సోంతంగా రియాక్ట్ అవుతుంది అంటున్నారు పరిశోధకులు. అవసరం కొద్ది అబద్దం ఆడినా దాన్ని మెదడు భిన్నంగా నమోదు చేసుకుంటుంది.మెదడులోని వ్యతిర్యేక భావోద్వేగాల కేంద్రం అమైగ్టాలా స్పందిస్తుంది. ఆ స్పందన మోదటి సారి తీవ్రంగా ఉంటుంది.ఆ తర్వాత అబద్దాలు ఆడిన అమైగ్టాలా స్పందించదు.ఒక వేళ అబద్దాలు ఆడటం అలవాటై ,ఎప్పుడు అబద్దాలే మాట్లడుతుంటే అమైగ్టాలా భాగం స్పందిచక పోగా అది పరిమాణంలో తగ్గిపోతుంది.కుంచించక […]
