• ఇంటి వైద్యం పాటిస్తే మేలు.

    మెడచుట్టూ, మోచేతులు, మోకాళ్ళు నల్లగా కనిపిస్తాయి. ప్రాచీన వైద్యం ఎం చెప్తుందంటే కలబంద గుజ్జుని రెగ్యులర్ గా రాస్తే తప్పని సరిగా తగ్గిపోతుందనిఅంటుంది. వైద్యులు స్కిన్ లైటనింగ్…

  • వంట్లో కలిగే ప్రతిచిన్న అనారోగ్యానికి పరిగెత్తుకుంటూ షాపుకు వెళ్లి ఎదో ఒక ఉపశమనం మాత్రం తెచ్చుకోవద్దు. గృహ వైద్యం చేయండి. మరీ తగ్గకపోతే డాక్టర్ ను చూడండి అంటున్నారు నిపుణులు. మైగ్రేన్ తో బాధపడేవారికి కాఫీ ఒక ఉపశమనం ఒక పెయిన్ కిల్లర్. ముందు వేడిగా కాఫీ తాగి మరీ సమస్య గా ఉంటే ఎలా వుంటారు కదా దాల్చిన చిక్కని మెత్తగా నూరి అందులో తేనె కలిపి నొప్పులున్న చోట రాసి మస్సాజ్ చేస్తే మంచిది. నోటిలో పుండ్లు గొంతు నొప్పికి తేనె చక్కగా పనిచేస్తుంది ఆవాలు వాపును బ్రహ్మాండంగా తగ్గిస్తాయి. శరీరంలో నొప్పులు వాపులకు ఆవ నూనెతో మర్దనా చేసుకోవచ్చు. భోజనం ముందు ఒక గ్లాస్ లో ఆపిల్ సిడార్ వెనిగర్ రెండు మూడు స్పూన్ల వేసుకుని తాగితే ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు కొంచెమైన ఉపశమిస్తాయి. టొమాటో జ్యూస్ లో కండరాలు పట్టుకోవటం నొప్పి పోతాయి. గొంతు ఇన్ఫెక్షన్ వస్తే ఉప్పు నీటిలో పుక్కిటపడితే సమస్య తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది .

    ఇవన్నీ ఉపశమనం కోసమే

    వంట్లో కలిగే ప్రతిచిన్న అనారోగ్యానికి పరిగెత్తుకుంటూ షాపుకు వెళ్లి ఎదో ఒక ఉపశమనం మాత్రం తెచ్చుకోవద్దు. గృహ వైద్యం చేయండి. మరీ తగ్గకపోతే డాక్టర్ ను చూడండి…

  • తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే ఇలా చేసి చుస్తే ఫలితం ఉండచ్చు. పుష్కలంగా యాంటీ ఫంగల్ గుణాలున్న పెరుగులో నల్ల మిరియాల పొడి కలిపి అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ఆయిలీ హేయిర్ ఉన్నవాళ్లు పండిన టమాటో గుజ్జుతో ముల్తానీ మట్టి చేర్చి తలకు పట్టించి ఆరాక స్నానం చేసేసినా ఫలితం ఉంటుంది . నానబెట్టిన మెంతులు ఉదయాన్నే పేస్ట్ లాగా రుబ్బి తలకు పెట్టేస్తే ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జులో ఉండే యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు కూడా ఫంగస్ ను తొలగిస్తాయి. నిమ్మరసం తేనె కలిపి పట్టించినా మంచిదే. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రు తొలగిస్తుంది. తేనె జుట్టుకు కావలిసిన మాయిశ్చరైజర్ అందిస్తుంది. రెండు స్పూన్ల సెనగపిండి పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట ఆగాక కడిగేసినా సమస్య తీరిపోయినట్లే. వీటిల్లో కొన్నయినా ట్రై చేయండి. ఇవి ఇంటి చిట్కాలు గనుక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు.

    ఈ చిట్కాలతో చుండ్రు మాయం

    తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే  ఇలా చేసి చుస్తే ఫలితం…

  • అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల మృత కణాలు పూర్తిగా పోయి శరీరం శుభ్రపరుస్తుంది. మంచి మెరుపు నిగారింపు పటుత్వం వస్తుంది. ఇదే బియ్యపిండి పాలు మిశ్రమానికి అలొవెరాని కలిపి పెదవులు ఎండిపోకుండా తేమతో మెరిసిపోయేందుకు వాడతారు. తాజాగా ఉన్న బియ్యపిండి రైస్ బ్రాన్ నూనె లో రకరకాల పదార్ధాలు కలిపి రకరకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఆర్గానిక్ కొబ్బరి షియా బటర్ లతో కలిపి డ్రై స్కిన్ కు అధిక తేమను ఇచ్చేందుకు వాడతారు. బియ్యం పిండి శరీరానికి రుద్దుకొనే సబ్బు లాంటిది. బియ్యం పిండి తేనె పాలు మిశ్రమం ఫేస్ ప్యాక్ గా చక్కగా ఉంటుంది. ఈ మిశ్రమాన్నే బాడీ స్క్రబ్బర్ లాగా ఉపయోగిస్తారు.అయితే శరీరానికి దీన్ని మృదువుగా అప్లయ్ చేయాలి. బియ్యం వండి తినేందుకే కాదు మంచి బ్యూటీ ట్రీట్ మెంట్ కూడా.

    బియ్యంతో అద్భుత సౌందర్యం

    అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్…