November 2021
ఒక్క రాత్రిలో ఫలితం
చర్మం పొడిబారకుండా కొబ్బరి నూనె రాస్తుంటారు చలి గాలులు నుంచి రక్షణ ఇచ్చే ఈ కొబ్బరినూనెతో ఒక రాత్రిలోనే మెరిసే దంతాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. రాత్రి పడుకునే ముందు పళ్ళ కు కొబ్బరి నూనె పూయాలి. ఉదయం బ్రష్ చేసుకుంటే తెల్లని దంతాలు చూసుకోవచ్చు అంటున్నారు. అలాగే గోళ్లు మెరవాలంటే కూడా గోరువెచ్చని కొబ్బరి నూనె గోళ్ళకు పట్టించి మృదువుగా మర్దన చేయాలి. ఆ నూనె చేతులకు పట్టిస్తే, చేతులు, గోళ్లు మెరుస్తాయి. పాదాల […]
సులువైన వ్యాయామం
కదిలే పని లేకుండా డెస్క్ జాబ్ చేసే వాళ్లను మెడ, నడుము భుజాల నొప్పులు వేధిస్తాయి. బయట వ్యాయామం చేసే సమయం దొరక్క పోతే కనీసం డెస్క్ ఎక్సర్ సైజ్ చేయమంటున్నారు ఎక్సపర్ట్స్. నడుము నొప్పి గా ఉంటే కుర్చీలో కూర్చునే ఇరుపక్కల స్ట్రెచ్ చేయాలి. కుర్చీలో నిటారుగా కూర్చొని పాదాలను నేలకు ఆన్చి చేతులను మోకాళ్లపై ఉంచాలి ఇప్పుడు భుజాలు గుండ్రంగా తిప్పాలి. కాసేపు గడ్డం ఛాతికి తగిలేలా వంగి కాసేపు అలాగే ఉండాలి. వీటిని […]
పిల్లలకు ఆశ్రయం
ఆశ్వాస భవన్ ఏర్పాటు చేశారు సిస్టర్ ఫాబియోలా ఫాబ్రి ఇటలీ లోని ఫ్లోరెన్స్ లో పుట్టిన సిస్టర్ ఫాబ్రి సేవా కార్యక్రమాలు చేయడం కోసం కేరళ వచ్చింది కొచ్చి చుట్టుపక్కల ఉన్న మురికివాడల్లో అనాధ పిల్లల కోసం 2005 లో స్థాపించిన ఆశ్వాస భవన్ లో ఇప్పుడు 70 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రాన్ని మూడు విభాగాలుగా పిలుస్తారు హోమ్ లో శిశువులు, గర్ల్స్, హోమ్ లో ఆరు నుంచి 18 సంవత్సరాల బాలికలు, […]
ఎం.ఎ ఇంగ్లీష్ చాయ్ వాలీ
నేను ఉపాధి వెతుక్కోవటం కాదు, వ్యాపార రంగంలో దిగి, సక్సెస్ అయి, నలుగురికీ ఉపాధి చూపించాలనుకొన్నాను అంటుంది 26 ఏళ్ల తుక్తుకి దాస్ నవంబర్ 2021 హబ్రా రైల్వే స్టేషన్ లో కొంతమంది మిత్రుల మధ్య ఎం.ఎ ఇంగ్లీష్ చాయ్ వాలీ దుకాణం తెరిచింది. తుక్తుకి దాస్. 2020 లో రవీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. పేరు కొత్తగా ఉండటం, తన రోజు వారీ అనుభవాలు వీడియో తీసి బ్లాగ్ […]
ధైర్యమే ముందు
కోవిడ్ కారణంగా తలెత్తిన మానసిక వత్తిడి మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసిందని చెబుతున్నారు నిపుణులు. ఎడిన్ బర్గ్ లో జరిగిన సొసైటీ ఫర్ ఎండోక్రినాలజీ వార్షిక సరస్సులో ,కోవిడ్ సమయంలో ఎదురైన మానసిక వత్తిడి మహిళలకు నెలసరి క్రమాన్ని దెబ్బతీసిందని ఇది సంతానోత్పత్తి సామర్ధ్యం పై తీవ్రంగా పడిందని నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో నిద్రలేమి, ఒత్తిడి,ఆహార నియమాలు గతి తప్పటం హార్మోన్లను ప్రభావితం చేశాయి. ఇవి నెలసరి క్రమాన్ని నిపుణులు అభిప్రాయపడ్డారు డబ్లిన్ కు చెందిన […]
ఇది కుర్తాల కాలం
కుర్తా లు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. కొత్తగా వస్తున్న డిజైన్స్ మరింత సౌకర్యంగా ఉంటున్నాయి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. గతంలో ఫ్యాషన్ అయిన టైట్ ఫిటెడ్ కుర్తాలు రూపం మార్చుకుని లూజ్ ఫిటెడ్ కుర్తాలోచ్చాయి. లేత, ముదురు రంగుల్లో ఈ కుర్తాలను యూత్ ఎంతో ఇష్టపడుతున్నారు. అలాగే అసిమెట్రిక్ డిజైన్స్, లూస్ ఫిట్టింగ్ విశాలమైన స్లీప్స్ తో కఫ్తాన్ కుర్తా లు, ప్రింటెడ్ ఎంబ్రాయిడరీ చేసిన లాంగ్ స్ట్రెయిట్ కుర్తాలు కాస్త పొడవు తక్కువగా టాప్ […]
కొవ్వు కరిగించే పానీయం
శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవాలంటే ఈ లెమన్ డ్రింక్ ప్రయత్నించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. రెండు నిమ్మకాయలు ఒక అల్లం ముక్క తో ఒంట్లో ఫ్యాట్ కరిగించే పానీయం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకటిన్నర లీటర్ నీటిని మరిగించి నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసి విత్తనాలు తీసేసి అందులో వేయాలి. అందులో అల్లం ముక్క కూడా వేసేయాలి. నీళ్లు మరుగుతూ పొంగులా వస్తే నిమ్మకాయ రసం అల్లం రసం నీళ్ళలో కరిగి పోయి నట్లు అనుకోవాలి. ఈ వేడి […]
ఇలాంటి ప్రయాణాలు అవసరం
కొచ్చి నుంచి కాశ్మీర్ వరకు 17 వేల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేశారు డాక్టర్ మిత్రా సతీష్. కొచ్చి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ మిత్ర 10 ఏళ్ళ కొడుకు నారాయణ్ తో పాటు చేసిన ఈ ప్రయాణంలో 28 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు కవర్ చేశారు జమ్మూ, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, జైపూర్, ఉజ్జయిన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా మీదుగా కేరళ చేరుకున్నారు. ఈ ప్రపంచంలో భౌగోళిక చారిత్రక […]
మలసార్ బాలిక సంగవి
మలసార్ తెగకు చెందిన గిరిజన అమ్మాయి సంగవి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకున్నది. ఈ తెగలో పదో తరగతి చదవటమే గొప్ప. టెన్త్ వరకు ఎలాంటి కుల సర్టిఫికెట్ లేకుండా చదువుకున్న సంగవి పాలిటెక్నిక్ చదవడం కోసం కుల సర్టిఫికెట్ ఇమ్మని అడిగింది అధికారులు అంగీకరించకపోవడంతో సంవత్సరంపాటు సర్టిఫికెట్ కోసం తిరిగింది. ఆమె పోరాటం తెలుసుకొన్న తమిళనాడు మంత్రి సెల్వరాజ్ స్వయంగా ఆమెను కలిసి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదవాలి అనుకుంటోంది […]
జేమ్స్ బాండ్ నవలలో స్త్రీవాదం
ఇప్పటివరకు గూఢచారి జేమ్స్ బాండ్ నవలలను ఆరుగురు రచయితలు రాశారు. వారి సరసన చేరారు రచయిత్రి కిమ్ షెర్వుడ్ ఆమె రాసిన టెస్ట్ మెంట్ నవల బాత్ నోవెల్ అవార్డు అందుకుంది. ఆ నవల ద్వారా కిమ్ షెర్వుడ్ బాండ్ నవలలు రాసే అవకాశం దక్కించుకున్నారు పాత జేమ్స్ బాండ్ 007 అయితే రాయబోయే నవలలో 00 ఏజెంట్స్ ఉంటారు ఇప్పటివరకు బాండ్ నవలల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం తక్కువ. ఈ నేపథ్యంలో ఈ యువ మహిళా […]
ఇద్దరూ ఒక్కరే
నీలగ్రీవో విలోహితం అనే వేద మంత్రం పరమేశ్వరుడు సూర్యుడు ఒక్కరే అని చెబుతోంది. శివుని కంఠంలో నీలిరంగు మచ్చ ఉంటే సూర్య బింబాన్నితా తేరిపార చూస్తే నీలిరంగు లోనే బింబం కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు ఎర్రని రూపంలో ఉంటాడు శంకరుని శరీరపు రంగు కూడా ఎరుపే కానీ ఆయన శరీరం మొత్తం నిండుగా, ఎరుపు రంగు కనిపించకుండా విభూతి ధరించడం వల్ల ఆయన తెల్లని వాడుగా కనిపిస్తూ ఉంటాడు.
నేనే మొదటిదాన్ని
తొలి మహిళా ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా నన్ను గుర్తించటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది జీవజాతుల పై అమితమైన ప్రేమ గల వారు మాత్రమే ఇటు రాగలరు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న వారే అడవిలో అడుగు పెట్టాలి అంటుంది రాధిక రామస్వామి. 17 సంవత్సరాల నుంచి ఆమె ఎన్నో క్రూర మృగాలు అద్భుతమైన పక్షుల ఫోటోలు తీశారు. తమిళనాడులోని తేని జిల్లా పశ్చిమ కనుమల దగ్గర […]
వీటితో టమోటా రుచి
టమోటా ధరలు పెరిగిపోయి కొనాలంటే భయం వేస్తోంది చాలామందికి ప్రతి కూరల్లోనూ టమోటాలు వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటప్పుడు టమోటాకు ప్రత్యామ్నాయంగా కొన్ని పదార్థాలు ఉపయోగించుకోవచ్చు. కూరల్లో పచ్చిమామిడికాయ పొడిని వేస్తే అచ్చం టమోటా రుచి వస్తుంది. ఎండిన ఉసిరి ముక్కల్ని నీళ్లలో నాననిచ్చి మెత్తగా పేస్ట్ చేసి కూరలో వాడుకోవచ్చు. కాస్త పుల్లగా ఉన్న పెరుగు వేసినా టమేటా రుచి ఉంటుంది. కూర ఉడికే సమయంలో కాస్త చింతపండు గుజ్జు వేస్తే టమేటా […]
ఆల్ విమెన్ పార్ట్ నర్ డెలివరీ స్టేషన్లు
లాజిస్టిక్ రంగంలో అమ్మాయిల ప్రాధాన్యత పెంచటంతో పాటు వారి పరిధులు విస్తరించే ఉద్దేశంతో ఆల్ విమెన్ పార్ట్ నర్ డెలివరీ స్టేషన్లు ప్రారంభించామని చెబుతుంది అమెజాన్. ఈ మధ్యకాలంలో సరుకుల దగ్గర నుంచి కూరగాయల నుంచి ప్రతి వస్తువు కొనేందుకు ఈ కామర్స్ వెబ్ సైట్స్ పైనే ఆధారపడటం మామూలైపోయింది. డెలివరీ బాయ్స్ వాతావరణంతో దూరాల తో సంబంధం లేకుండా వస్తువుల్ని డెలివరీ చేస్తున్నారు. కానీ ఈ విషయంలో అమ్మాయిలు తీసిపోరని చెబుతూ ప్రత్యేకంగా డెలివరీ స్టేషన్ […]
అన్ని రోజులు మంచివే
మంచి తిధులు మంచి రోజులు అంటూ ఉండవు. గడుస్తున్న కాలం అంతా మంచిదే. నిజాన్ని గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జన్మించింది షష్టి రోజు. దుర్గాదేవికి అష్టమి ప్రీతికరం, శివుడికి బహుళపక్షం ఇష్టం అందులోనూ ఎంతో ఇష్టం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తమ పిల్లలు షష్టినాడో అష్టమి నాడో అమావాస్య రోజునో ఇలా దుష్ట తిథుల్లో జన్మిస్తే తమ సంతానానికి ఏ కష్టనష్టాలనైనా వస్తాయని తల్లిదండ్రులు దిగులు పడిపోవటం దండగే. అలా భయపడే అవసరమే లేదు దానికి కారణం జాతకాలు, […]
ఆ ఇల్లే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం
ఐశ్వర్యాన్ని ప్రసాదించే భగవతి తెల్లని పూలదండల అలంకారాలతో ఉంటుందట. ఆ తల్లికి ఇష్టమైనవి కాయల్లో కొబ్బరికాయ, ఆకుల్లో మారేడు, నూనె జాతుల్లో నువ్వుల నూనె, ఆవునెయ్యి, రంగుల్లో తెల్లని తెలుపు. జలాల్లో గంగాజలం, పువ్వులలో పద్మం, వృక్షాల్లో చందన వృక్షం. గృహిణి సూర్యోదయానికి ముందే స్నానం చేసి చక్కని సాంప్రదాయపు తీరులో వస్త్రాలను ధరించి మెడలో మాంగల్యం మెట్టెలు తలలో పువ్వులు ధరించి ఆమె ప్రధాన ద్వారం నుంచి చూస్తూ ఉంటే తులసి కోట కనబడుతూ ఉంటే […]
రోజంతటికీ శక్తి
ఉదయపు వేళ ఇంట్లో ఎంతో హడావుడి ఉంటుంది పనుల జాబితా వత్తిడి కలిగిస్తూ ఉంటుంది. ఉదయం 9 గంటలకు కొన్ని పనులు పద్ధతిగా చేస్తే వత్తిడి ఉండదంటున్నారు నిపుణులు. సూర్య కిరణాలు భూమిని చేరక ముందే నిద్ర లేవాలి మెడిటేషన్ కనీసం పది నిమిషాలు చేసినా చాలు అది పాజిటివ్ ఎనర్జీ ని పెంచి రోజంతా చురుగ్గా ఉంచుతుంది. ఉదయాన్నే నీళ్లు తాగాలి జీర్ణశక్తి బాగా ఉంటుంది. కనీసం పది నిమిషాలు వాకింగ్ అవసరం. ఏ పనులు […]
అందాన్ని పెంచే మసాజ్ లు
ఖరీదైన విలాసవంతమైన ఉత్పత్తుల కంటే సహజ సిద్ధమైనవి, ప్రకృతిలో దొరికే వాటితోనే సౌందర్య పరిరక్షణ చేసుకోండి అంటారు ఎక్సపర్ట్స్ . మొహం, మెడ మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఈ తేలికపాటి మసాజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ తో ఇంట్లోనే చేసుకోవచ్చు. మునివేళ్లతో మృదువుగా కదిలిస్తూ చేసుకునే మసాజ్ వల్ల రక్తప్రసరణ బాగుంటుంది. ఆహారంలో విటమిన్ లను చేర్చుకోవడం ద్వారా చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఆహారం ద్వారా శరీరానికి అందే విటమిన్ ద్వారా శిరోజాలు, చర్మం, […]
క్షీర సముద్ర రాజ తనయ
లక్ష్మీదేవిని క్షీర సముద్ర రాజ తనయ అని పిలుస్తారు. అంటే సముద్రాల లోకెల్లా గొప్పదైన పాల సముద్రం నుంచి జన్మించినది అని అర్థం అయితే పాలసముద్రం పెరుగు సముద్రం ఉంటాయా అంటే, ఉండవు, సముద్రం మన కళ్ళకు కనబడే తీరును బట్టి ఈ పేర్లతో పిలుస్తారు సూర్యకిరణాలు ఏటవాలు తనంతో సముద్రం పైన పడుతూ ఉంటే అక్కడి సముద్రం ఒక చోట తెల్లగా పాల వలె కనిపిస్తుంది దీన్నే క్షీర సముద్రం అన్నారు. ఇలా ఏడు తీరులుగా […]
పుట్టుకలో పరమార్థం
శ్యామ వర్ణం తో ఉండే కృష్ణుడు అష్టమి నాడు జన్మించాడు. ప్రతి మాసంలో శుద్ధ పక్షం, కృష్ణ పక్షం అనే రెండు ఉంటాయి. పూర్ణిమ రాబోతున్న పదిహేను రోజుల్ని శుద్ధ లేక శుక్ల పక్షం అంటారు. అలాగే అమావాస్య రాబోతున్న15 రోజులను కృష్ణ, లేదా బహుళ పక్షం అంటారు. కృష్ణుడు ఈ రెండింటిలోనూ బహుళ పక్షాన్ని తాను పుట్టేందుకు అనువైనదిగా నిర్ణయించుకున్నాడు బహుళ పక్షంలో 8వ తిధి అంటే అష్టమినాడు జన్మించారు. ఓ వ్యక్తి పూర్ణిమ వైపు […]
