• చిన్ని చిన్ని చిట్కాలు కొన్ని ఆరోగ్యానికి సంబందించిన విషయాలు తెలుసుకుని అమలు పరుస్తూ వుంటే ఇటు అరోగ్యం, అటు సమయం కలిసి వస్తాయి. చిలకడ దుంపలు ఉడికించిన నీటిలో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయని అవి జీవప్రక్రియను ప్రభావితం చేయడం ద్వారా శరీర బరువును నియంత్రిస్తాయి అని పరిశోధకులు చేఅప్పుతున్నారు. గుండె ఆరోగ్యం కోసం ఓట్స్ కన్నా బార్లీ కే సమర్ధవంతంగా పనిచేస్తుందని, బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా ఆహారంలో బార్లీ ని చేర్చుకోవాలి అని సూచిస్తున్నారు. కొంచ ఆవాలుమాడ్చి తేనె తో కలిపి మొటిమల పైన రాసి పావుగంట ఆగి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. కందిపప్పులో చిటికెడు పసుపు వేస్తె త్వరగా ఉడుకుతుంది. అరటి పండు కాగితపు పేపర్లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ కాలం తాజాగా వుంటాయి. టమాటాల్లో ఉప్పు వేసి ప్రేస్సురే కుక్కర్ లో ఉడికించాలి చల్లారక మిక్సిజార్లో వేసి గుజ్జులా చేసి వడకట్టి దీన్ని ఐస్ క్యుబ్స్ ట్రే లో వేసి డీప్ ఫ్రిజ్ లో ఉంచితే వీటిని సూప్స్ లో, కూరల్లో, అత్యవసారంగా త్వరగా వంటఅయ్యేందుకు వాడుకోవచ్చు.

    కొన్నింటి తో ఆరోగ్యం కొన్నింటి తో లాభం

    చిన్ని చిన్ని చిట్కాలు కొన్ని ఆరోగ్యానికి సంబందించిన విషయాలు తెలుసుకుని అమలు పరుస్తూ వుంటే ఇటు అరోగ్యం, అటు సమయం కలిసి వస్తాయి. చిలకడ దుంపలు ఉడికించిన…

  • ఎన్ని నేర్చుకున్నా వంటగదిలో మనకింకా ఎన్నో తెలియని విషయాలు వుంటూనే వుంటాయి. కూరగాయలు మాంసం చేపలు వుడికించే సమయంలో పెరుగు కలిపితే పోషక విలువలు పెరుగుతాయి. పెరుగు కాల్షియం ప్రోటీన్లు విటమిన్ బి 12 కు మంచి ఆధారం పెరుగువల్ల పదార్ధాలకు అదనపు రుచి పోషకాలు దక్కుతాయి. నీళ్లలో వెనిగర్ వేసి స్ట్రా బెర్రీస్ ,గ్రేప్స్ వంటి పండ్లను కడగాలి. బట్ట తో తుడిచి ఆరనిచ్చి మూతవున్న డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెడితే పాడవకుండా ఉంటాయి. చెక్క గరిటలకు నూనె జిడ్డు అంటుకుని వదలకపోతే కాస్త టేబుల్ సాల్ట్ చల్ల టిస్యూ పేపర్ తో తుడవాలి. ఇన్స్టెంట్ కాఫీ పొడి గడ్డ కట్టకుండా వుండాలంటే ఎయిర్ టైట్ డబ్బా లో ఉంచి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. వంట చేసేప్పుడు చేతులకు అయ్యే మరకలు బంగాళా దుంప ముక్కతో రుద్ది కడిగితే పోతాయి. అన్నం పొడి పొడిగా రావాలంటే ఉడికేప్పుడు చెంచా వంట నూనె వేస్తె పొడిపొడిగా అయిపోతుంది . పంచదార డబ్బాకు చీమలు పడుతుంటే అందులో కొన్ని లవంగాలు అందులో వేయండి.

    ఇవి వంటింటి రహస్యాలు

    ఎన్ని నేర్చుకున్నా వంటగదిలో మనకింకా ఎన్నో తెలియని విషయాలు వుంటూనే వుంటాయి. కూరగాయలు మాంసం చేపలు వుడికించే సమయంలో పెరుగు కలిపితే పోషక విలువలు పెరుగుతాయి. పెరుగు…