Saturday, 28 Nov, 2026

రిస్క్ లేనిదే జీవితమే లేదు

సౌదామినీ,  అందరూ ఒకేలాగా చదివి ఒకే డిగ్రీ తీసుకుంటారు. కానీ ఎవరో ఒకళ్ళే వేళల్లో ఒక్కళ్లుగా  నిలబడతారు. ఇది జతకపు  ప్రభావమేనా అన్నావు. జూకర్ బెర్గ్ ఏమంటాడంటే రిస్క్ తీసుకోకపోవటమే మనం చేస్తున్న పెద్ద రిస్క్. కరెక్ట్. రిస్క్ లేనిదే జీవితం లేదు. అంతేకానీ జాతకం కాదు. మనం పాకేదశ  నుంచి ప్రతి దశలో మనకు తెలియకుండానే రిస్క్ తీసుకుంటాం. సైకిల్ తొక్కటం రద్దీగా ఉండే రహదార్లలో  వేగంగా ప్రయాణించటం అన్నీ రిస్క్ కదా. ఒక్క రోజులో […]

మందుల ఖజానా ఉసిరి

పూర్వం ఒక ఋషి ఒక ఔషధ పదర్ధాన్ని తిని యవ్వనాన్ని పొందాడు. దాన్నేమంటారో తెలుసా చవన ప్రాస. అదే ఉసిరి బేస్డ్ ఔషధ లౌహ్యం. సులువుగా బరువు పెరిగే వారికీ మెటాబాలిజమ్ తక్కువగా ఉంటుంది. మెటబాలిజమ్ ఉంటే కొవ్వును కరిగించే నాజూగ్గా ఉంటే శరీర సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఇదిగో ఉసిరి మెటాబాలిజాన్ని మెరుగుపరిచే మందుల ఖజానా. ఇది ఉసిరి కాయల సీజనే. ఒక ఉసిరికాయ తిన్నా చాలు. ఉసిరి హేయిర్ ఆయిల్ తో కలిపితే జుట్టు దృఢంగా […]

పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లాగా ఉండాలనుకోను

నా వయస్సు 30 అని చెప్పుకునేందుకు నేను గర్వపడతా. పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లా ఉండాలని నాకెప్పుడూ ఉండదు. ఉదయం లేస్తూనే బెడ్ పైన ఊడిన వెంట్రుకలు చూసి కళ్ళ కింద వలయాలు చూసుకుని నిట్టూర్పులు విడిచే మామూలు అమ్మాయిని అంటోంది. గోవా అమ్మాయి ఇలియానా. దక్షిణాది కోటి రూపాయల పారితోషకానికి శ్రీకారం చుట్టిన మొదటి తార గా క్రెడిట్ పొందిన ఇలియానా ఇప్పటికీ ఇన్ని సినిమాలు చేసినప్పటికీ టాలీవుడ్ లోనో బాలీవుడ్ లోనో సెటిలయ్యాననుకొను […]

తెల్లని బియ్యమే సగం ప్రాబ్లమ్

హైద్రాబాద్ లో గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ ఇండియన్ ఆరిజన్ ఏడవ వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు కు హాజరైన జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులందరి ఏకాభిప్రాయం ప్రకారం పాలిష్ చేసిన తెల్లని బియ్యం స్వీట్లు జంక్ ఫుడ్ మద్య పాణం వంటి అలవాట్ల వల్లనే ఆరోగ్యం దూరమవుతుందని ఒక విలేకరుల సమావేశంలో తేల్చి చెప్పారు. ఆహారంలో దంపుడు బియ్యం జొన్నలు వుండి  తీరాలన్నారు. ఇక మధుమేహం వున్నవాళ్ళైతే పుల్కాలు జొన్న  రొట్టెలు టీయూస్కుంటే […]

ఈ చేతుల్లోంచే తెర పైని సౌందర్యం

తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల  కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. ఇప్పటిదాకా ఏడు భాషల్లో 375 చిత్రాలకు పనిచేసిందామె. రజినీ కాంత్ విక్రమాదిత్య బాలీవుడ్ భాషల్లో మొహంజేదారో  రుద్రమదేవి ఇవన్నీ ఆమె సృష్టించిన మాయాజాలమే. గౌతమీ పుత్రలో హేమ మాలినీ శ్రేయ ల కోసం ఆరుకంటే ఎక్కువ గజాల చీరలు నేయించారట  నీతూ… కూరగాయల […]

ఓంకార మొక శబ్ద శక్తి

ఓం కార నాడు ఎన్నో లాభాలున్నాయని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోజూవారీ ధ్వనానికి  విలువ ఉందని తేల్చారు. మంత్రం శక్తి ని నవీన శాస్త విజ్ఞానంగా వివరించే ప్రయత్నం చేస్తున్న సైంటిస్టులు మంత్రం అనేది రెండు సంస్కృత పదాల  సమ్మేళనమనీ మన్ అంటే మనసనీ త్రం అంటే తరంగాలు మానసిక తరంగాలు శబ్ద శక్తి ద్వారా ప్రభావితం చేయమనీ స్పష్టంగా చెప్పారు. నవీన శాస్త్రం మంత్రం అనేది ధ్వని శక్తి  రూపంగా అంగీకరించింది . […]

హాలీవుడ్ చేరిన బాలీవుడ్ బ్యూటీ

ప్రపంచంలోని అన్ని రంగాల కంటే సినిమా రంగానిదే హవా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక కంపెనీ సీఈఓ అయినా ఆ కంపెనీ వరకే పరిమితం. ఈ సినిమా దేవతలు ప్రపంచం మొత్తం పరిచయం. ఉత్తరాది దక్షిణాది మధ్యనే సరిహద్దు గీతాలు ఏనాడో చెరిచేసి ఇప్పుడు హాలీవుడ్ కు పరుగులు పెట్టిన దీపికా పడుకునే వెండితెర సంచలనం. 2017 లో విడుదలవుతున్న ది రిటర్న్ ఆఫ్ క్యాండర్ కేజ్ లో దీపికా పోషించిన పాత్ర పెద్దదే. జాతీయ స్థాయి […]

కొన్నింటిని కలిపి తేనే మంచిది

కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం తాగే కాఫీ కాంబినేషన్ బెస్ట్ అంటారు. కాఫీ లో వుండే కెఫిన్ అన్న పదర్ధానికి పంచదార జాడిస్తేనే రెండూ కలిసి ఒకదాన్ని  మరొకటి ప్రభావితం చేస్తాయి. ఈ రెండు పదార్ధాలు మెదడు లోని రెండు ముఖ్య భాగాల పైన ప్రభావం చూపెడతాయి. ఒకటి జ్ఞాపక శక్తికీ రెండవది దృష్టి […]

సిద్దార్థ స్పందించిన తీరు అమోఘం

WHO IS  GOING TO  PROTEST WOMEN IN  INDIA FROM US  WE ARE AMONG THE  WORST అంటూ సినీ హీరో సిద్దార్ధ పెట్టిన ట్వీట్ సంచలనం. మగాళ్ల నుంచి  మహిళలను ఎవరు కాపాడతారు. ఈ భూమి మీద ఉండే చెత్త మగాళ్ళం మనమే అంటూ సిద్దార్ధ  న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెంగుళూరు లో మహిళల పై జరిగిన లైంగిక దాడుల పట్ల రీసెంట్ గా తన స్పందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. […]

సక్రమమైన డైట్ తో ఈ ప్రాబ్లమ్ పోతాయి

నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మహిళల సైకిల్ ఫంక్షనింగ్ స్మూత్ గా సాగేందుకు అవసరం అయిన హార్మోన్ లను  ఉత్పత్తి చేసేందుకు ప్రోటీన్స్ అవసరం. విటమిన్ సి ,ఇ  వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్రామ్ప్స్ లను తొలగిస్తాయి. ఆకుకూరలు బ్రొకోలీ బొప్పాయి కాలీఫ్లవర్ […]

అసూయ అడవిలో కార్చిచ్చు ఎంతో

నీహారికా , ఈ లోకం లో  ప్రమాదకరమైన దేదీ అని అడిగావు కదా అది జెలసీ . అసూయ అడవిలో పుట్టే కార్చిచ్చు తో సమానం. ఇది బాధ పడేవారిని బాధకు కారణమైన వారినీ సమానంగా దహిస్తుంది. ఈ లోకం లో ఆనందం లేకపోవటనికి ఎన్నో కారణాలు. కోరికలు అంచనాలు అవసరాలు బులపాటం  అసంతృప్తి అత్యాశ అన్నింటికంటే ప్రధానం ప్రమాదం అసూయ. అసూయాపరులకు  రెండే చింతలు తనకులేదని ఇతరులకు ఉందనీ. మానసిక శాస్త్ర పరంగా చుస్తే ఈ […]

పెళ్లి చూపులు రీమేక్ లో తమన్నా

ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్నారు, చాలా అందమైన చక్కని సినిమాగా తెలుగులో మార్మోగిన పెళ్లి చూపులు తమన్నా స్టార్ డమ్  తోడైతే బావుంటుందంటున్నారు గౌతమ్ మీనన్. తమన్నా కూడా ఈ సినిమా తోనే  గానూ అసలు సినిమాల్లో కథానాయికల కిచ్చిన స్థానంలోనే తన సంతోషం అంటోంది. స్టార్ […]

ఆ సర్వ సాక్షి ఆరాధనకు ఈ అష్టదళ పద్మాలు

భగవంతుడిని పూజించటం గురించి కోట్లమంది చెప్పి  వుంటారు. కనే దేవుడిని పూజించే పుష్పాల్లో ఇవి ఉండాలంటారు. హింసించకుండా ఉండటం ఒక పుష్పం. ఇతరులకు గాయపరచకుండా తొలినాడకుండా ఉండటం కూడా భగవంతుడికి అర్పించే ఒక పువ్వులాగా జీవించటం. పుష్పంఇంద్రియ నిగ్రహం పలుక కూడని మాటలను పెదవులు పలకకపోవటం నాలుకను చూపును ఘ్రణ  శక్తినీ అదుపులో పెట్టుకోవటం ఇంకో పుష్పం. ఎదుటివారికి కష్టం వస్తే మనకే వచ్చిందని భావించటం. ఓర్పు కలిగి ఉండటం. జ్ఞానంతో ఉండటం సత్య గుణంతో ఉండటం […]

విటమిన్స్ మంచి ఫ్రెండ్

శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం  కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్ ఆప్రికాట్స్ లో ఫ్యాట్ మిల్క్ విటమిన్ ఎ కు  మంచి ఆధారం. ఇవి చర్మ కణాల పునరుత్తేజానికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్ విటమిన్లు స్కిన్ ఫుడ్స్ ఈ విటమిన్ లోపిస్తే పెదవుల చివరలు మిగిలిపోతాయి. బి .కె లోపిస్తే చర్మం కమిలిపోతుంది. బి 6 లోపిస్తే చర్మం పైన […]

అలసట వస్తుంది జాగ్రత్త

ఈ సీజన్ చల్లగా హాయిగా ఉంటుంది కానీ శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కనుక అలసట అనిపిస్తూ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత మేనేజ్ చేయటానికి జీవక్రియ పెరుగుతుంది. దీనివల్ల చలిఅనిపించినప్పుడు  వణుకు వస్తుంటుంది. శరీరం ఉషోగ్రతను ఉత్పత్తి చేసుకునే మార్గం ఇది. అలసటగా ఉందీ అంటే శరీరం త్వరగా వేడి ఉత్పత్తి కోసం క్యాలరీలు దాచుకునే ప్రయత్నం అన్నమాట. అంతేకాక వేసవితో  పోల్చితే కండరాలు లిగమెంట్లు టెండాన్లు ఎక్కువ సఫర్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఈ […]

నానబెట్టి వండటం వల్లనే ఈ ప్రయోజనం

అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు ఉడికించి ముందర అందులో వేసే కొన్ని దినుసుల్ని కలిపి నానబెడతాం. ఇలా మెరినేట్ చేయటం వల్ల ఉప్పు కరం మసాలాలు ముక్కలకు బాగా పడతాయని త్వరగా ఉడుకుతుందనుకుంటాం. కానీ మాంసాహారాన్ని ఇలా దినుసులతో నానబెట్టి వండటం వల్ల  అందులోని కార్సినోజన్ల ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. […]

తలగడల్లో దుమ్మే సగం కారణం

తలకింద మెత్తని తలగడ వుంటేనే  నిద్ర సుఖంగా హాయిగా పడుతుంది. దిండు లేకపోతే ఎదో అసఔకర్యంగానే ఉంటుంది. మంచి నిద్ర లకు ఇదెంత అవసరమో దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమో అంతే  ఉంటుంది. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరమూ అంతే వుంటుంది. ఆర్నెల్లు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు ఎలర్జీలకు ఆ దిండే కారణం అవుతుంది. పాతబడుతున్న దిండ్ల పై తల అదిమి పెట్టుకోవటం వల్ల వాటిలోని దుమ్ము జిడ్డు మృతకణాలు వంటివన్నీ […]

ప్రపంచ సినిమా లో భాగం ఐశ్వర్య

ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం  కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ  సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ సౌందర్యవతిగా ఐశ్వర్య రాయ్ కు తిరుగేలేదు. బహుశ ఈ ట్యాగ్ దక్కించుకున్న ఏకైక భారతీయురాలు కూడా ఐశ్వర్యానే. 1994 లో విశ్వసుందరి కిరీటం ధరించాక ఇరువది చిత్రం ఇదే తెలుగులో ఇద్దరుగా వచ్చిన  సినిమాల్లో  మెరిసిపోయాక జార్ ప్యాక్ హోగయా తో హిందీ చిత్రసీమకు […]

కలలకు ప్రపంచ భాష

కళలు అందరికీ వస్తాయా ? వస్తే అన్నీ గుర్తుంటాయా ? అసలు కలంటే ఏమిటి ? ఫ్రాయిడ్  ప్రకటించిన స్వప్న విశ్లేషణ గ్రంధం ప్రకారం కళలంటే  అంతకుముందు మన జీవితంలో జరిగిన సంఘటనల జ్ఞాపకం అది మనసుపై వేసిన ముద్ర మనకే తెలియని మనసులో అచేతనంగా ఉన్న విషయాలు ఇవన్నీ కలిస్తే కల అంటాడు. ఈ కాలనీ సరిగ్గా విశ్లేషించగలిగితే మంసేహి వక్తిత్వాన్ని సరిగ్గా అంచనా వేయచ్చు. అంటాడు  ఫ్రాయిడ్ .అసలు పైకి  చెప్పం కానీ మన […]

హాయిగా ప్రశాంతంగా నిద్ర

శరీరాన్ని ఆరోగ్యాన్ని ముడిపెట్టి వుంచే   బంగారు జలతారు లాంటిది నిద్ర. పడుకునే ముందర గ్లాసు పాలు తాగాలి. మెదడులోని ట్రెప్టోపాన్ అనే ఎమినో యాసిడ్ ను ఉపయోగించుకోవటానికి  పాలు సాయపడతాయి. ఈ యాసిడ్ తేలికపాటి నెగిటివ్ ఎఫెక్ట్ కలిగి మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మెలటోనిన్ నిద్ర  మేలుకునే సైకిల్ ను నియంత్రిస్తుంది. మెలటోనిన్ స్థాయిలు సాయంత్రం వేళలో పెరగటం మొదలై ఉదయాలు తగ్గిపోతాయి. పాలలోని కాల్షియం సహజ మజిల్ రిలాక్సెంట్ గా పనిచేస్తుంది. అలాగే భారతీయ వంటకాల్లో […]