Saturday, 27 Jun, 2026

అజ్రక్ ప్రింట్ ఇదే ట్రెండ్

అజ్రక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ లో ఒక రకం అరబిక్ భాష నుంచి వచ్చిన అజ్రక్ అన్న పదానికి బ్లూ లేదా ఇండిగో అని అర్థం. మొదట్లో ఈ రెండు రంగుల్లోనే అజ్రక్ ప్రింట్స్ వచ్చేవి. ఇప్పుడు అన్ని వర్ణాలు కనిపిస్తున్నాయి. చేతితో చెక్కిన అన్ని రకాల డిజైనర్ బ్లాక్ లను రంగుల్లో మంచి వస్త్రాలపై చేత్తో అద్దకం వేస్తారు సిల్క్ కాటన్ ఏ ఫాబ్రిక్ పైన అయినా ఈ పురాతన చేతి కళ చక్కగా ఒదిగిపోతుంది. […]

అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి    

అంతరిక్ష యాత్ర చేసే అవకాశం దక్కించుకుంది జాహ్నవి దంగేటి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన జాహ్నవి ఆస్ట్రోనాట్ అవ్వాలన్న లక్ష్యంతో చదువుకుంది. 2023 లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ లో చేరే అవకాశం తెచ్చుకుంది అక్కడ సిమ్యులేషన్స్, ఫ్లైట్ ఎక్సర్ సైజెస్, మిషన్ డ్రిల్స్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కి ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా […]

అత్యుత్తమ అవార్డ్

మెటీరియల్ సైంటిస్ట్ గా రసాయన సెన్సార్లు నానో స్ట్రక్చర్డ్ పదార్థాల పై పరిశోధన చేసిన ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్ మనోరమ సుంకర ను భారతీయ ప్రభుత్వం ప్రతిష్టాత్మక సుంకర రాజా రామన్న చైర్‌ (ఆర్ ఆర్ సి) అవార్డ్ కు ఎంపిక చేసింది. ఆమె ఈ 30  ఏళ్లుగా ఫర్టిలైజర్స్ లో పనిచేసే వారి శరీరంలో చేరే అయోనియన్ పసిగట్టే మెటీరియల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈమె తయారు చేసిన స్పెన్సర్లు విషపూరితమైన ప్రమాదకరమైన […]

అరుదైన గౌరవం

దేశంలో ఆంగ్ల భాష విభాగంలో డాక్టరేట్ అందుకుని, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా  నియమితురాలైన తొలి ట్రాన్స్ జెండర్ గా అరుదైన గౌరవం పొందింది జెన్సీ తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి లో ఒక గ్రామంలో పుట్టింది జెన్నీ. చెన్నై లోని అంబేద్కర్ ఆర్ట్స్ కాలేజీ లో ఎంఏ.ఎంఫిల్ లో గోల్డ్ మెడల్ సాధించింది ఒక ట్రాన్స్ జెండర్ గా తోటి పిల్లలు, సమాజం నుంచి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూనే చదువుకుంది. చెన్నై లయోలా కాలేజ్ లో డాక్టరేట్ తీసుకొని […]

చీరలకు పెయింటింగ్ అందాలు

అందమైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కు మంచి రోజులు మళ్లీ వచ్చాయి సింథటిక్, కాటన్, జుట్ వంటి చక్కని చీరల పైన ఈ ఫ్యాబ్రిక్ డిజైన్లు తాజాగా కనిపిస్తున్నాయి లేత రంగుల్లో చిన్న డిజైన్ ఉన్న కాటన్ చీరలు బాగుంటాయి. రంగుల మధ్య కాంట్రాస్ట్ ఉండేలా చూసుకోవాలి. లేత ఆకుపచ్చ గులాబీ నీలం తెలుపు నలుపు ఎరుపు వంటి రంగుల సమ్మేళనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చీరలకు యాంటిక్ జ్యువలరీ చక్కగా మ్యాచ్ అవుతుంది. జర్మన్ సిల్వర్ టెర్రకోట […]

పెద్దలకు పాఠాలు

నిరక్షరాస్యులైన వయోధికులకు చదువు నేర్పిస్తున్నారు బీనా కలాథియా. 50 నుంచి 80 ఏళ్ల వయసు వాళ్ళు  ఇప్పటికే కొన్ని వందల మంది ఆమె దగ్గర చదవడం, రాయడం నేర్చుకున్నారు. సూరత్ కు చెందిన బీనా,  సీనియర్ సిటిజన్స్ సెంటర్ లో బడి నడుపుతోంది. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు వరకు ఇక్కడ స్కూల్ నడుస్తుంది. ఉదయం నుంచి తన  అక్కాచెల్లెళ్లతో కలిసి వ్యాపారం చేసుకునే బీనా సాయంత్రం స్కూల్ టీచర్ అయిపోతుంది. జీవితానుభవం తో పండిపోయిన […]

తొలి కమాండో ప్రియాంక

ప్రియాంక పన్వర్‌ యు పి లో స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్ లో తొలి కమాండర్ ఆమె స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్ లో చేరేనాటికి అది కేవలం పురుషులకే పరిమితంగా ఉండేది. కమాండోల, ఎంపిక శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఆ పరీక్షల్లో నెగ్గి కమాండో గా ఉద్యోగం ప్రారంభించింది ప్రియాంక. ఆమె స్ఫూర్తి ధైర్యం  వృధా కాలేదు. ఆమె తర్వాత ఎంతోమంది యువతలు కమాండో లుగా మారారు. ఎప్పుడు ఒక తొలి అడుగు పడ్డాక […]

కార్టూన్ పాత్రలతో పాఠాలు

సింగపూర్ లో ప్రీ స్కూల్ నడిపే ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా గేమింగ్ ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టి క్రియేటివ్ గెలీలియో పేరుతో ఒక స్టార్టప్ ను ప్రారంభించారు మూడు నుంచి ఎనిమిదేళ్ల పిల్లలకు విద్యను అందించేందుకు ఉపయోగపడే ఈ స్టార్టప్ కంపెనీ ఉత్పత్తులతో, ఎడ్యుకేషన్ వీడియోలు, ఆడియో లుక్ లో ఇంటరాక్టివ్ గేమ్ లు వంటివి ఎన్నో ఉన్నాయి. లిటి  సింగమ్ యాప్ కూడా ఈ స్టార్టప్ తో పాటు తీసుకువచ్చింది ప్రేరణ. దీన్ని కోటి మందికి పైగా […]

సామాన్యుల సమస్యలే ఆమె సర్వం

ఇన్‌స్టా రీల్స్ తో కనిపించే కావ్య కర్ణాటక్ మిగతా కంటెంట్ క్రియేటర్స్ కంటే భిన్నం. ప్రజా ప్రయోజన అంశాలతో లక్షల మందిని ఆలోచింపజేసే కావ్య కేకే క్రియేటివ్ పేరుతో ఒక కంపెనీ స్థాపించింది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు 27 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రజల జీవన స్థితిగతుల పై ఆమె దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడి ప్రధాన సమస్యలపై వీడియోలు తీశారు ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన జాబితాలో 2025 -30 […]

ఇవ్వాల్టి ఫ్యాషన్ గౌన్స్

మోకాలి పొడవుగా ఉండే గౌన్లు పూలు లతల డిజైన్లతో చూడముచ్చటగా ఉన్నాయి కాటన్ జాకెట్ లెనిన్ స్పన్ ఇట్లా ఎన్నో రకాల వస్త్రాలతో తయారవుతున్న గౌన్లు ఎలాంటి ఆభరణాలు లేకున్నా సింపుల్ గా ఉంటాయి లేదా జర్మన్ సిల్వర్ ఆభరణాలు చాలు. మిగతా యాక్సెసరీస్ విషయానికి వస్తే పర్స్ లకు బదులుగా స్లింగ్ బ్యాగ్స్ గౌన్లకు నప్పుతాయి. చేతులకు బ్యాంగిల్స్ బదులుగా పెద్ద డయల్ ఉన్న వాచీలు, బ్లంట్ హిల్స్ పెన్సిల్ హిల్స్ ధరిస్తే ఈ గౌన్లకు […]

వరల్డ్ ఛాంపియన్ దివ్య  

వరల్డ్ బ్లిట్జ్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ లో వరల్డ్ నెంబర్ వన్ హౌ యిఫాన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది దివ్య దేశ్‌ముఖ్ 19 ఏళ్ల చదరంగా తార నాగపూర్ కు చెందిన దివ్య ఐదేళ్ల వయసు నుంచే చదరంగం లోకి వచ్చింది. 2011- 12 లో అండర్ 7 బాలికల విభాగంలో జాతీయస్థాయిలో స్వర్ణ పతకం తో తన విజయ యాత్ర ప్రారంభించింది దివ్య. 2021లో పదహారేళ్లకే భారతదేశం లో 21వ మహిళా గ్రాండ్ మాస్టర్ హోదా […]

పిల్లల కోసం స్కిల్‌మాటిక్స్

న్యూయార్క్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న దేవాన్షి కేజ్రీవాల్ పిల్లల స్కిల్ సమయం తగ్గించేందుకు 2017 లో స్కిల్ మాటిక్స్ ప్రారంభించారు.ఆ ప్రాజెక్ట్ లో ధ్వనిల్ షేత్ సహా భాగస్వామి.2018 లో గెస్ ప్లే కార్డ్స్ తీసుకొచ్చారు.ఈ కార్డ్స్ లో మూడు వందల కోట్ల మందికి దగ్గరయ్యారు ప్రస్తుతం 295 రకాల ఉత్పత్తులు తయారు చేసింది కంపెనీ.ఇవి 15 దేశాల్లో అందుబాటులో ఉన్నయి.ఈ సంస్థ సి ఇ ఓ దేవాన్షి, 28 ఏళ్ల దేవాన్షి తాజాగా హరూన్ ఇండియా […]

క్రీడా ఫోటోగ్రాఫర్

అస్సాం గుహవాటి కి చెందిన ఫోటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ ఒలంపిక్స్ కవర్ చేసే అవకాశం పొందింది. 2006 లో ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన గితికా ఎన్నో మీడియా సంస్థల్లో పనిచేసింది 2007 లో నేషనల్ గేమ్స్.కామాన్యుల్స్ గేమ్స్ పిఫా మహిళల ప్రపంచ కప్ లు,  సౌత్ ఏషియన్ గేమ్స్ వంటివి కవర్ చేసి పేరు తెచ్చుకుంది. 2020 లో టోక్యో ఒలంపిక్స్ 2024లో పారిస్ ఒలంపిక్స్ లో ఎన్నో ఫోటోలు తీసింది గీతిక ఆమెకు […]

ఫ్యాబ్రిక్ పువ్వులు

గులాబీ పువ్వు ఆకృతి వచ్చేలా బ్లౌస్ స్లీవ్స్ డిజైన్ చేయటం ఇవాల్టి స్పెషల్ స్టైల్ గులాబీ పువ్వులు లేయర్ లుగా మంచి ఆకృతి వచ్చేలా నెట్, ఆర్గంజా, షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్స్ తో తయారు చేస్తారు. ఇండో వెస్ట్రన్ డ్రెస్ ల్లో ఫ్యూజన్ గౌన్లు, క్రాప్ టాప్ లు షరారి ల్లో ఇలాంటి గులాబి పూలు చాలా ఫ్యాషన్ వెస్ట్రన్ స్టైల్ లో సింగిల్ షోల్డర్ ఫ్రాక్ కు ఒక వైపు గులాబి పువ్వు చాలా అందంగా […]

ఆకాశంలో రీడింగ్ క్లబ్

ఒడిశా కు చెందిన వాకింగ్ బుక్ ఫెయిర్ సంస్థ, ఇండియా వన్ ఇయర్ లో కలిసి రాజా పర్భ పండుగ సందర్భంగా ఆకాశంలో రీడింగ్ సెషన్ నిర్వహించారు సాహిత్యానికి ఆదరణ పుస్తక పఠనానికి పునర్జీవనం తెచ్చేందుకు గాను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రౌండ్ కార్వాన్ అని తొమ్మిది సీట్ల సింగిల్ ఇంజన్ విమానంలో ఈ తొమ్మిది మంది మహిళా పాఠకులు ప్రయాణం చేశారు. ఈ విమానాన్ని విమెన్ పైలెట్లు నడిపారు. ఏ రీడింగ్ లిస్ట్ లిటరరీ […]

రాష్ట్రపతి సహాయకురాలు

భారత సర్వ సైన్యాధికారి అయినా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు సహాయకురాలిగా నియమితురాలైనారు. ఈమె నావికాదళానికి చెందిన సమన్వయకర్తగా లెఫ్టినెంట్ కమాండర్ రాష్ట్రపతికి వివిధ ప్రభుత్వ విభాగాలకు సమన్వయకర్తగా ఉంటూ అధికారిక సమావేశాలు కార్యక్రమాలు మిలిటరీ ప్రోటోకాల్స్ స్వయంగా చూసే బాధ్యత లో యశస్వి సోలంకి ఉన్నారు. రాష్ట్రపతికి మొత్తం ఐదుగురు ఏ డి సి లు ఉంటారు. ఆర్మీ నుంచి ముగ్గురు, ఎయిర్ ఫోర్స్ నేవీ ల నుంచి చెరో కొరిని ఎంపిక చేశారు. వారిలో […]

ఈమె మొదటి డ్రైవర్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో మొట్టమొదటి మహిళా డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది వాంకుడోత్ సరిత. యాదాద్రి జిల్లా సీత్యాతండా లో వ్యవసాయ కుటుంబంలో పుట్టింది సరిత. ఒక స్వచ్ఛంద సంస్థ సాయంతో ఢిల్లీలో డ్రైవింగ్ శిక్షణ తీసుకొని హెవీ వెహికల్ లైసెన్స్ తెచ్చుకుంది సరిత. పదేళ్లపాటు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేసింది. హైదరాబాద్ జె బి ఎం విద్యుత్ బస్ నడిపే అవకాశం తెచ్చుకుంది. ఈ హైదరాబాద్ ఉద్యోగం తో నా […]

నిఘా విభాగానికి మహిళ బాస్ 

యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన విదేశీ ఇంటలిజెన్స్ ఏజెన్సీ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎమ్.ఐ6 బ్లేజ్ మెట్రెవెలి అనే 47 ఏళ్ల మహిళను చీఫ్ గా ఎంచుకుంది 116 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్రిటిష్ ఏజెన్సీ లో ఈమె 18వ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటుంది. 1999 లో కేస్ ఆఫీసర్ గా ఇంటలిజెన్స్ సేవలో అడుగుపెట్టింది మెట్రెవెలి. ప్రస్తుత సేవల సాంప్రదాయ ప్రకారం మెట్రెవెలి’సి’ అనే పేరును ఉపయోగించుకోబోతోంది. ఈమెకు పడవ నడపటం హాబీ […]

కల నిజమాయగా

ఇషితా సంగ్వాన్ ఇప్పుడు ఫైటర్ పైలట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ మహిళ క్యాడెట్ లలో ఆమె కూడా ఒకరు. హర్యానా కు చెందిన ఇషితా ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంది ఎన్డీఎ లో అవకాశం లేదనటం తో ఇంజనీరింగ్ చదవాలనుకుంది. 2021 లో అమ్మాయిలను చేర్చుకోవచ్చునని కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రవేశ పరీక్ష రాసి ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ క్యాండిడేట్ లకు అవసరమైన కంప్యూటరైజ్డ్ పైలెట్ సెలక్షన్ సిస్టం పరీక్ష […]

మృత్యువును జయించింది

జర్మనీ కి చెందిన జూలియన్ కోయెప్కే ప్రపంచం అదృష్టవంతురాలిగా కీర్తించింది. 1971 లో జరిగిన విమాన ప్రమాదంలో జూలియన్ విమానంలోంచి సీట్లు ఊడిపడి పై నుంచి దట్టమైన అమెజాన్ అడవిలో పడిపోయింది. 3000 మీటర్ల ఎత్తు నుంచి పడటం తో కాలర్ బోన్ విరిగి గాయపడింది. ఆ గాయాలతో అమెజాన్ అడవుల్లో నడుస్తూ 11 రోజుల పాటు నడిచి అడవిలో కలప కొట్టే సిబ్బందిని చేరుకుంది వాళ్లే ఆమెను విమానంలో ఆస్పత్రికి పంపటం తో బతికి బయటపడింది.ఆ […]