Saturday, 27 Jun, 2026

దాండియా క్వీన్

దేవీ నవరాత్రులు వస్తే ఫాల్గుణి పాఠక్ పేరు గుర్తు తెచ్చుకుంటారు దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా గా పేరు తెచ్చుకున్న ఈ 56 ఏళ్ల గాయని తన పాటలతో నృత్యాలతో పండుగ కు సంగీత శోభ తీసుకువస్తారు. స్టేజ్ షో లతో పాపులర్ అయినా ఫల్గుణి 1999 లో విడుదల చేసిన మైనే పాయల్ హై ఛంకై, పాట హిట్ అయింది. నవరాత్రి షోలలో ఈ పాటకు ఎంతో డిమాండ్ వచ్చింది. నవరాత్రుల్లో ఆమె పాటలు వినాలంటే […]

చిత్రంలో ఆమె ఒక భాగం

ఢిల్లీలోని బికనీర్ హౌస్ ‘రూట్స్ టు రివర్స్’ పేరుతో ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు రమణి మైలవరపు. హైదరాబాద్ కు చెందిన రమణి లండన్ లో కాంటెంపరరీ ఆర్ట్స్ లో టెక్నిక్స్ నేర్చుకున్నారు గ్రామీణుల జీవితాలను అన్నదాతల కష్టాలను పర్ఫామెన్స్ ఆర్ట్ గా మార్చారు. అంటే వేయాలనుకున్న చిత్రంలో ఆమె కూడా భాగంగా ఉంటారు. వాయిస్ ఆఫ్  వేవ్స్ తో ఉప్పాడ మత్స్యకారులు,ఇన్విజిబుల్ రూట్ లలో అరకు గిరిజనులు, “మోనాలిసా విత్ మాస్క్” పేరుతో బోడో గిరిజనుల జీవితాలు […]

కనికట్టు చేసే నగలు

సరికొత్త స్టైల్ తో కనికట్టు చేస్తూ ఉంటారు ఫ్యాషన్ జ్యువెలరీ కళాకారులు. ఇప్పుడు వాళ్లు చేసిన ఇన్విజిబుల్ చైన్ దే ఇవ్వాల్టి ట్రెండ్. గొలుసు కానీ కనిపించనంత అతి సన్నగా ఉంటుంది పెండెంట్ అద్భుతంగా మెరిసిపోతుంది. చీర పైన క్లాసిగా ఉంటుంది. అందమైన గౌన్ పైన గ్లామరస్ గా కనిపించే ఈ గొలుసు చుసేందుకు క్యూట్ లుక్ తో అదరగొట్టేస్తోంది ఈ ఇన్విజిబుల్ చెయిన్ ని చక్కని పెండెంట్ తో ధరిస్తే అసలు రుపే మారిపోతుంది.మార్కెట్ గోల్డ్, […]

శక్తి రూపాల సమ్మేళనం ఈ దేవి

మహిషాసుర మర్దిని విశ్వరూపం చూడాలనుకుంటే ఉత్తరప్రదేశ్ లోని బృందావనం వెళ్లాలి అమ్మ శక్తి రూపాలన్ని ఏకమై అవతరించిన మాత వైష్ణో దేవి. 141 అడుగుల నిలువెత్తు విగ్రహం చూడొచ్చు. అలాగే విగ్రహం కింద గుహ వంటి అమ్మ వారి మందిరంలో నవదుర్గలను చూడొచ్చు. నవరాత్రుల్లో వేలాది భక్తులు దర్శించే ఈ జగన్మాత గుడిలో పండుగ అట్టహాసంగా జరుగుతుంది.

వెదురే ముడి సరుకు

వేగంగా పెరిగి, ఏ రూపంలోకి మలుచుకోవాలన్న వీలుగా ఉండి మట్టిలో కలిసిపోయే వెదురుతో పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు అనుకున్నది అశ్విని షిండే.భర్తతో కలిసి బ్రష్ లు గరిటలు, ఇయర్ బడ్స్ వంటి చిన్న వస్తువులే కాదు కార్పొరేట్ గిఫ్టింగ్ లని వెదురుతో రూపొందిస్తున్నారు. వీరి ఇద్దరి ఆలోచన ఉపాధి కల్పిస్తోంది. ఇద్దరూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా నుంచి పెట్టుబడి అందింది.ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ద్వారా వ్యాపారం చేసే అశ్విని షిండే తయారు చేసే […]

ఎదురులేని వెదురు నగలు

అస్సాం లోని తేజ్ పూర్ కు చెందిన నీరా శర్మ న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. సామాన్యుల కల్ప వృక్షం గా పిలిచే వెదురు ఎంతో మందికి ఉపాధి కల్పించగలదని ఆమె నమ్మరు. చిన్నప్పుడు తాను తండ్రి నుంచి నేర్చుకున్న కళను మరింత గా వృద్ధి చేసుకొని వెదురుతో అందమైన నగల తయారీ మొదలుపెట్టారు. రూరల్ లైవ్లీహుడ్ మిషన్ సాయంతో ఈ నగల తయారీని స్థానికులకు నేర్పారు. మార్కెటింగ్ అవకాశాలు పరిచయం చేశారు. ఉత్తర ప్రదేశ్,మేఘాలయ లోని గిరిజన […]

నిజమైన ఛాంపియన్

బ్యాడ్మింటన్ ఛాంపియన్ గుత్తా జ్వాల నవజాత శిశువులకు ప్రాణాధారమైన తల్లిపాలను డొనేట్ చేయటం లో కూడా ఛాంపియన్ అనిపించుకున్నారు. ఆమె 30 లీటర్ల తల్లిపాలు దానం చేశారు. మొన్నటి ఏప్రిల్ లో ఆమెకు పాప పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన చనుబాలు 30 లీటర్లు డొనేట్ చేశారామే.నేను ఎప్పుడూ మంచి వ్యాయామం మంచి ఆహారం తీసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను ఏనాడు జంక్ ఫుడ్ తినలేదు అందుకే నాకు పాలు సమృద్ధిగా పడ్డాయి పాప కడుపు […]

ధాన్యంతో ఆభరణాలు

ధాన్యంతో వివిధ ఆభరణాలు తయారుచేసి విదేశాల్లో కూడా ఆదరణ పొందుతున్నారు కోల్‌కతాకు చెందిన పుతుల్ దాస్ మిత్ర. గోవిందా భోగ్ అనే ఒక రకం వరి ధాన్యం పశ్చిమ బెంగాల్ లో సాగు చేస్తారు అశ్వయుజ పూర్ణిమను లక్ష్మీదేవి పుట్టినరోజు గా అక్కడి ప్రాంతవాసులు జరుపుకుంటారు ఆ సందర్భంలో గోవింద్ భోగ్ ధాన్యంతో దండలు అల్లుతారు ఇళ్లలో అలంకరణకు ఉపయోగించే ఈ దండలు ఎక్కువ కాలం చక్కగా మన్నుతాయి. పుతుల్ దాస్ ఈ ధాన్యంతో దిద్దులు జూకాలు […]

పెయింటింగ్స్  మన ఇమోషన్స్

ఆర్ట్ కనెక్ట్ అని ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది మిహికా దగ్గుబాటి. ప్రముఖ నటుడు రాణా భార్య. పెయింటింగ్స్ అన్నవి జీవిత కాలం మనతో ఉండే ఇమోషన్స్ అంటుంది. ప్రజలకు కళాకారులకు ఒక వంతెన నిర్మించాను అలాగే కొత్త కళాకారులను సుప్రసిద్ధులైన చిత్రకారులతో కలిపాను అంటారామె.దేశంలో ఉండే ఎంతోమంది చిత్రకారుల కళాకృతులను తన ఆర్ట్ కనెక్ట్ ఎగ్జిబిషన్స్ తో ప్రజల దగ్గరకు తీసుకువస్తోంది. మిహికా భూములకు భవంతులకు ఎంత విలువ ఉందో అలాగే పూర్వకాలం నుంచి వస్తున్న కళారూపాలకు కూడా […]

ఒకటే లక్ష్యం

ఢిల్లీ లోని వసంత విహార్ సబ్ కలెక్టర్ గా పని చేస్తున్నారు ఆయుషి సుడాన్. ఆమె దృష్టిలోపం. ఢిల్లీలోని రాణి ఖేరా ప్రాంతంలోని ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయుషి కి చూపు లేదని తెలిశాక ఆమె తల్లి తాను చేస్తున్న సీనియర్ నర్సింగ్ అధికారిణి బాధ్యతల నుంచి స్వచ్ఛంద విరమణ పొందారు.ఆయుషి చక్కగా చదివి ఎం ఎ హిస్టరీ చేసి బియిడి రాసి ముందుగా చరిత్ర లెక్చరర్ అయ్యారు తర్వాత ఐఏఎస్ కోసం ప్రయత్నించి 48 […]

అందరూ స్త్రీలే

సి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాల్లో అధికశాతం ఆడవాళ్లే ఉంటారని మెరైనా ప్రోడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చెబుతోంది. ఏటా దేశవ్యాప్తంగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రొయ్యలు వివిధ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటే అందులో ఒడిశా నుంచే 1. 2 లక్షల మెట్రిక్ టన్నులు వెళతాయి. ఇక్కడ మహిళలే తడి వాతావరణం లో రొయ్యల పొట్టు వలిచి గ్రేడింగ్ చేసి ప్యాకేజింగ్ కు పంపిస్తారు. దశాబ్దాల నుంచి పేద మహిళలు ఈ ఉపాధి […]

కర్ర పెండలం గౌను కు అవార్డు

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లు వాడే సింథటిక్ ఈ సి జి ఎలక్ట్రోడ్స్ రీసైకిల్ చేయట కూడా చాలా కష్టం.కొచ్చి కి చెందిన మాళవిక బైజు కర్ర పెండలం రూపాలతో ఏకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రోడ్స్ తయారు చేసింది.ఈ సి జి పరీక్షల సహాయంతో దుస్తులు తియ్యకుండా ఈ ఎలక్ట్రోడ్ లు అమర్చిన గౌను ధరించవచ్చు. మెల్ క్రో సెక్యూర్డ్ జేబులు,పౌచ్ లతో ఉండే ఈ గౌనులో స్పెన్సర్స్ ను నేరుగా శరీరానికి అంటించవచ్చు. ఈ వినూత పరిష్కారానికి గౌను […]

అందమైన ఐరన్ మ్యాన్  

ఎంతో క్లిష్టమైన ఐరన్ మాన్ 70.3 రేస్ పూర్తి చేసిన మొదటి భారతీయ నటి గా సయామీ ఖేర్ చరిత్ర సృష్టించింది.ఐరన్ మాన్ రేస్ ను వరల్డ్ ట్రయాథ్లాన్‌ కార్పొరేషన్ డబ్ల్యూ టి సి నిర్వహిస్తోంది.ఇందులో 12 మైళ్ళ స్విమ్మింగ్,56 మైళ్ళు సైకిలింగ్,13.1 మైళ్ళు రన్నింగ్ ఉంటాయి.మొత్తం కలిపి 70.3 మైళ్ళు.2015 లో ‘రేయ్’ చిత్రంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన సయామీ విలక్షణమైన ఎన్నో పాత్రల తో సినిమాల్లో నటించింది.సెయింట్ జేవియర్ కాలేజ్ లో డిగ్రీ తీసుకున్న సయామీ […]

ఈ రగ్గు కు చక్కని అవార్డ్

కేరళ కు చెందిన జామియా జోసెఫ్,’గిల్డెడ్ ఒయాసిస్’ పేరుతో రూపొందించిన ఒక రగ్గు పర్యావరణహిత కేటగిరి లో యూరోపియన్ ప్రోడక్ట్ డిజైన్ అవార్డుకు ఎంపికైంది.నిఫ్ట్ కన్నూర్ లో డిజైనింగ్ చదివిన జామియా, తూర్పు ఆఫ్రికా నుంచి మెటీరియల్ తెప్పించి టెన్సిల్,వూల్, సీసాల్ కలయికతో హ్యాండ్ టఫ్టింగ్ టెక్నీక్ వాడి ఈ రగ్ తయారు చేసింది.గతంలో ఈమె కేరళ లోని పడవ పందాలు,వరి పొలాలు వంటివి చిత్రించిన ‘వల్లంకలి’ రగ్ కూడా డిఎన్ఏ పారిస్ డిజైన్ అవార్డుకు ఎంపికైంది.

కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025

వృద్ధులు ఆన్ లైన్ మోసాలకు గురి కాకుండా ‘షీల్డ్ సీనియర్స్’ అనే వెబ్ సైట్ రూపొందించి టైమ్స్ మ్యాగజైన్ వారి కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025 ఘనత సాధించింది తేజస్వి మనోజ్. ఈ ఇండియన్ అమెరికన్ అమ్మాయి తేజస్వి వయసు 17 సంవత్సరాలు మోసానికి గురైతే ఏం చేయాలి, దగ్గర నుంచి తీసుకోవలసిన జాగ్రత్తలు వరకు తన వెబ్ సైట్ ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తోంది తేజస్వి సీనియర్స్ సిటిజన్స్ ఈ షీల్డ్ సీనియర్స్ వెబ్ […]

చదవాల్సిన మంచి పుస్తకం

ప్లాట్ ఫామ్ టికెట్ పుస్తకం రాశారు సంగీత వల్లట్.రైల్వే డిపార్ట్మెంట్ లో కమర్షియల్ క్లర్క్ గా 14 సంవత్సరాలు ఉద్యోగం చేశారు సంగీత. చెన్నై రైల్వే స్టేషన్ లో 70 మంది ఉద్యోగులు పనిచేసే రోజుల్లో ఆమె ఒక్కరే మహిళా ఉద్యోగి రైల్వే డిపార్ట్మెంట్ లో ఆమె అనుభవాలే అంత చక్కని బుక్ రాసే స్ఫూర్తి ఇచ్చాయి. రైల్వే స్టేషన్ లో కనిపించే విభిన్న వర్గాల జీవన దృశ్యాలే కాదు భారతీయ రైల్వే వ్యవస్థ విశ్వరూప దర్శనం […]

నేపాల్ ప్రధాని సుశీల కర్కీ

నేపాల్ తొలి మహిళా న్యాయమూర్తి సుశీలా కర్కీ నేపాల్ పగ్గాలు అందుకున్నారు. అవినీతి వారసత్వం వివక్షలకు వ్యతిరేకంగా నేపాల్ జెన్ జీ లు మొదలుపెట్టిన పోరాటంలో ప్రభుత్వం పడిపోయింది. టీచర్ గా కెరీర్ మొదలు పెట్టి న్యాయవాది వృత్తి లోకి వెళ్లిన సుశీలా కర్కీ స్వచ్ఛమైన వ్యక్తి గా యువత భావించి ఆమెకు ప్రధాని పదవికి ఎంపిక చేసుకున్నారు.ఎలాంటి రాజకీయ వతుళ్ళను లొంగని అవినీతి లేని వ్యక్తి గా సుశీలా కర్కీ అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయి.

నేపాల్ లో మహిళా నాయకత్వం  

నేపాల్ లో జరిగిన జెన్ జీ ఉద్యమం మహిళా నాయకత్వానికి దారి తీసింది ప్రధానిగా ఎంపికైన సుశీలా కార్కి ప్రభుత్వ అటార్నీ జనరల్‌ గా సబితా భండారీ నియమించారు. సబితా ఖాట్మండు కు చెందిన  ప్రముఖ న్యాయవాది కృష్ణా భండారీ కుమార్తె.సబితా న్యాయవాదిగా పనిచేస్తూనే నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో ఐదేళ్లపాటు కమిషనర్ గా సేవలు అందించారు. నేపాల్ బార్ అసోసియేషన్ ట్రెజరర్ కూడా. మహిళా సాధికారత కోసం పనిచేసే విమెన్ లీడ్ సంస్థ కు వైస్ […]

సైన్యంలో చేరిన అందాల రాణి

ఉల్హాసనగర్ (Ulhasnagar) ముంబై కి చెందిన కాషిష్ మెత్వాని 2023 లో మిస్ ఇంటర్నేషనల్ గా ఎంపిక అయింది. అందాల వేదిక మీద నుంచి ఆర్మీ లోకి వచ్చి చేరింది మెత్వాని. ఒకప్పుడు ఆమెకు అందాల పోటీలే ఫ్యాషన్ సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ నుంచి బయో టెక్నాలజీ లో మాస్టర్ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పి హెచ్ డి చేసే అవకాశం వచ్చిన ఆమె సైన్యంలో చేరేందుకు నిశ్చయించుకుంది. దీనికి స్ఫూర్తి ఆమె తల్లి […]

అంబులెన్స్ డ్రైవర్ గా విసువస

తమిళనాడు లోని మేళపుతుక్కుడి కి చెందిన విసువస మేరీ ఇంగ్లీష్ లిటరేచర్ లో పిజి చేసింది. ఆమెకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం బైకు,కారు అన్ని వాహనాలు నడపడం నేర్చుకుంది. అంబులెన్స్ డ్రైవర్ కావాలని ప్రకటన చూశాక వెంటనే చేరి పోయేందుకు సిద్ధమైంది. రాత పరీక్ష తో పాటు అంబులెన్స్ నడిపే పరీక్షలోనూ ఉత్తీర్ణురాలై ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం చేస్తోంది. ఇది ఉద్యోగం కాదు మానవాళికి చేసే సేవ అంటుంది మేరీ.