Saturday, 27 Jun, 2026

కృషికి గుర్తింపు

అమెరికా లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ ఈ అవార్డు ఈ సంవత్సరం ఏక్తా కపూర్ కు వచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా 1995 లో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన ఏక్తా ఇప్పటి కి 134 సీరియల్స్ తీసింది. 17000 గంటల టెలివిజన్ కంటెంట్ అందించింది.45 సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ట్రెండింగ్ లో దిష్టి చుక్క

పాత తరం, పిల్లల బుగ్గల పైన అరికాళ్ళలో దిష్టి చుక్క పెట్టే వాళ్ళు.ఆ ట్రెండ్ ఇప్పటికీ మారలేదు నవతరం కోసం ఎవిల్ ఐ జువెలరీ వచ్చేసింది. నీలం రంగులో చిన్న లాకెట్ లా ఉండే ఈ దిష్టి గొలుసు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అంటున్నారు. ఈ ఏమోజి ని నగలు గా ధరించే వారిలో ఇండియా రెండో స్థానంలో ఉంది. భాగస్వామితో మనస్పర్థలు, ప్రమోషన్ లు ఆలస్యం ఎ పని తలపెట్టిన ఆటంకాలు రావడం, వీటన్నిటికీ ఇతరుల […]

మంచి ఉపాధి

గేమింగ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి చూపెడుతుంది. ఈ గేమింగ్ లో తన వ్యాపార రక్షత చూపెట్టింది ముంబైకి చెందిన లక్ష్మీ కావోల్కర్ ఇంటరాక్టివ్ ఇ లెర్నింగ్ చిల్డ్రన్స్ కంటెంట్ డిజైన్ చేయడం ద్వారా గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. సొంతంగా గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అపార్ గేమ్స్ ప్రారంభించింది.

నాకు నేను తెలుసు

సింపుల్ లైఫ్ స్టయిల్ నా సూత్రం జీవన శైలిలో ఆకస్మిక మార్పులు చేయను. నటన నా ఫ్యాషన్ ప్రేక్షకులకు సంతోషం ఇవ్వటం నాకున్న విలువైన పని అంటుంది సాయి పల్లవి. విభిన్నమైన పాత్రలతో తనకు ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్న సాయి పల్లవి మెటీరియల్ అంశాలకు నేను కనెక్ట్ కాలేను. ఏది తప్పు, ఏది ఒప్పు అని తేల్చి జడ్జిమెంట్ లు ఇవ్వలేను కానీ నాకు ఏది ఉత్తమంగా ఉంటుందో నాకు తెలుసు అంటుంది డాక్టరమ్మ.

ఇది షాల్ ట్రెండ్

ఈ చలి రోజుల్లో స్టయిల్ గా కనిపించే షాల్ తో ట్రెండ్ సృస్టించమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఉలెన్ సూట్ తో షాల్ చున్నీలా వేసుకోవచ్చు. పష్మీనా షాల్స్ కశ్మీర్ ఊలుతో తయారు చేస్తారు. వెచ్చదనాన్ని,వేసుకొన్న డ్రెస్ కు అందాన్ని కూడా ఇస్తాయి ఈ షాల్స్.  సూట్ షాల్స్ అయితే షల్వార్‌ కమీజ్‌ కు మ్యాచింగ్‌ చున్నీల్లాగా ఉంటాయి. అలాగే సల్వార్ సూట్ తో స్టోల్ కూడా. షాల్ లాగా కలిపి వేసుకొంటే ఎంతో అందంగా ఉంటుంది.

నాణ్యమైన కొబ్బరి పువ్వు

ఈ మధ్య కొబ్బరి పువ్వులు అమ్మకానికి ఉంటున్నాయి. ఈ కొబ్బరి పువ్వు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా పారసైట్ పెరగనివ్వదు. చక్కెర వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఎముకలు దృఢంగా ఉంచి తక్షణ శక్తిని ఇస్తుంది.

శీతాకాలపు ఫలం

ఎన్నో పోషక విలువలు ఉన్నా సీతాఫలాలు ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి. వాటిలో ఐరన్, ఫాస్పరస్ జి6, జి3 లతో పాటు మెగ్నీషియం ఫైబర్ విటమిన్లు సి, ఎ పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల పండ్ల గుజ్జు లో 1.6 గ్రాములు కొవ్వు 26.7 క్యాలరీల శక్తి 2.4 గ్రాముల పీచు ఉంటుంది. ఒక పండు 50 బాదం పప్పు తో సమానం. చర్మానికి కాంతిని ఇస్తుంది. మధుమేహం ఉన్న ఈ పండు హాని చేయదు.

వాము టీ బెస్ట్

ఉదర సంబంధిత సమస్యలు నివారించే వాము నీరు పరిగడుపునే తాగమంటున్నారు ఆయుర్వేద వైద్యులు. కొద్దిగా వాము వేసి అందులో కాస్త తేనె కలుపుకొని తాగచ్చు. రెండు కప్పులు మరగే నీళ్లలో ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర వేసి పది నిమిషాలు మరగనిచ్చి దాన్ని వడగట్టి తేనె కలుపుకొని తాగాలి. కప్పు మరగే నీళ్లలో టీ స్పూన్ వాము గింజలు వేసి వాము టీ  కూడా తాగచ్చు. వాము మంచి ఎప్టైజర్.అలాగే  ఊపిరితిత్తులకు ఎంతో మేలు […]

అందాన్నిచ్చే బంతి  

అందమైన బంతి పువ్వు ప్రకృతి ఇచ్చిన బహుమతి యాంటీ భమోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గల ఈ బంతి పువ్వుతో చేసే మేరీ గోల్డ్ ఫేస్ ప్యాక్ సౌందర్యాన్ని పెంచుతుంది. మొటిమలు మచ్చలు పోగోడుతుంది. సౌందర్య ఉత్పత్తులు మసాజ్ నూనెలు లోషన్లు, సబ్బులు మొదలైన ఉత్పత్తులు బంతిపూలు ఉపయోగిస్తారు.

ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉపాధి  

ప్లాస్టిక్ వ్యర్థాలతో వస్తువులు తయారు చేస్తారు రాజీబెన్ వాన్కర్  హ్యాండ్ బ్యాగ్ లు, షాపింగ్ బ్యాగ్లు, యోగా మ్యాట్లు, మొబైల్ కవర్లు, పర్సులు, కాలిపట్టలు, చాపలు ఇట్లా ఎన్నో రకాల వస్తువులు ప్లాస్టిక్ వ్యర్థాలతో తీసిన దారాలతో తయారుచేస్తారు. ఈ తయారీని మహారాష్ట్రలోని 600 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు రాజీబెన్ రాష్ట్రపతి అవార్డ్ తో సహా స్వచ్ఛ సుజాల్ శక్తి సమ్మాన్ వంటి పురస్కారాలు అందుకున్నారు ఈ వస్తువుల తయారీ ద్వారా వందల మంది గ్రామీణ […]

అరకోటి మందికి సాయం

మళ్ళీ బడికి (తిరికే స్కూలిల్) పేరుతో 50 లక్షల మంది మహిళలకు ఆర్థిక పాఠాలు చెప్పారు కేరళలోని కుడుంబాశ్రీ మహిళ స్వయం సహాయక బృందం కేరళలోని 14 జిల్లాల్లోని రెండువేల స్కూళ్లలో మహిళలకు ఆర్థిక ప్రణాళిక మైక్రో ఫైనాన్స్ డిజిటల్ లిటరసీ వంటి వాటిపై శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణతో ఎంతోమంది మహిళలు సొంత వ్యాపారాలు మొదలుపెట్టి ఆదాయం పొందుతున్నారు.

పక్షుల సంరక్షణ ఒక బాధ్యత

వందల జాతుల పక్షులకు సంబంధించి పక్షి జల పేరుతో చక్కని పుస్తకం రాశారు శుభ బట్ బెంగళూరులోని ఐ ఐ ఎస్ సి క్యాంపస్ లో వచ్చి వాలే వందలాది పక్షులను చూస్తూ వాటి జీవితాలను అధ్యయనం చేశారు శుభ బట్.పక్షుల దాహం తీర్చేందుకు ప్రతి ఇంటి ముందు నీళ్లతో నిండిన మట్టి పాత్రలు ఉంచండి అంటారు శుభ బట్.అంతరించిపోతున్న అనేక పక్షి జాతులను కాపాడుకోమని పిలుపునిస్తున్నారు శుభ బట్.

పిల్లల కోసం వోబుల్ పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్ ల తోనే ఆడటం చూసి దాని పరిష్కారం గా 2022 లో ‘వోబుల్’ వ్యాపారం మొదలు పెట్టాం నేహా శర్మ సౌమ్య జగన్నాథ్, పిల్లల కోసం ఒక కిట్ తయారు చేశారు. అందులో టాస్క్ లతో కూడిన కథలు, రంగుల పుస్తకాలు, చెవులకు హాని కలిగించని హెడ్ సెట్ లు ఉంటాయి. డబ్బు కట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి ప్రతి వారం వందల్లో కథలు టాస్క్ లు […]

విద్య వైద్యానికి సాయం

సుస్మితా బాగ్చి ఒడియా రచయిత్రి ఢిల్లీ విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా పనిచేశారు. భర్తతో కలిసి మైండ్ ట్రీ స్థాపించారు. తమ సంపాదనలో కొంత విద్య,వైద్యం కోసం ఖర్చు చేయాలని ఈ భార్యాభర్తలు ఆలోచన. భువనేశ్వర్ లో 750 పడకల క్యాన్సర్ ఆస్పత్రి పాలియేటివ్ కేర్ కోసం తమ 20 ఎకరాల భూమిని రాసి ఇచ్చారు. బెంగళూరులోని ఐ ఐ ఎస్ సి కి 832 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం 425 కోట్ల విరాళం ఇచ్చారు.2023 […]

గొప్ప పుస్తకం

ప్రొఫెసర్ నందిని దాస్ రాసిన కోర్డింగ్ ఇండియా ఇంగ్లాండ్. మేఘాల ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ పుస్తకం ప్రతిష్టాత్మకమైన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023 గెలుచుకుంది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ లో నందిని దాస్ ప్రొఫెసర్ యూరోపియన్ల హింస ధోరణి గురించి చెప్పిన కోర్టు ఇండియా పుస్తకాన్ని ది పవర్ ఆఫ్ గుడ్ రైటింగ్ గా విశ్లేషకులు కీర్తించారు.

సంపన్న దాత

ప్రపంచవ్యాప్తంగా ఈమెయిల్ సర్వీసెస్ అందించే సంస్థల్లో ఒకటైన జోహో  కార్పొరేషన్ లో రాధా వెంబు కీలక పాత్ర పోషించారు. అన్న శ్రీధర్ వెంబు తో కలిసి ప్రారంభించిన జోహో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి సంస్థ. ఈ ఏడాది సామాజిక సేవ కోసం 13 కోట్లు  ఖర్చు చేసి ఫిలాంత్రి ఫిస్ట్ ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

ఆన్ లైన్ లో మొక్కలు

డెలివరీ యాప్ ద్వారా మొక్కల వ్యాపారం చేస్తున్నారు ఆకాంక్ష గుప్తా. కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న ఈ వ్యాపారం లో ఫుడ్ డెలివరీ ఇచ్చినట్లుగానే మొక్కలు, విత్తనాలు, ఎరువులు ఆర్డర్ ఇచ్చిన గంటల్లో కష్టమర్స్ కు అందుతాయి. 2021లో ఉర్వాన్.కామ్ కంపెనీ స్థాపించారు ఆకాంక్ష. నర్సరీ నిర్వాహకులతో కలిసి పనిచేసే యాప్ ద్వారా మొక్కలను ఇష్టపడే ఎంతోమంది చక్కని మొక్కలు,మంచి సలహాలు పొందుతున్నారు.

అరటి తొక్కతో నీళ్లు శుభ్రం

తాగునీటిలో అధిక ఫ్లోరైడ్ ను తొలగించేందుకు కాల్షియం పుష్కలంగా ఉన్న అరటి తొక్క తో ప్రయోగాలు చేశారు డాక్టర్ సుస్మితా సేన్ గుప్తా.తక్కువ ఖర్చుతో రసాయనాలు వాడకుండా అరటి తొక్కల పొడి నీటిలో కలపటం ద్వారా నీటిని కాలుష్య రహితంగా మార్చారు సుస్మిత. ఈ విధానాన్ని డీఫ్లోరైజేషన్ అంటారు. సుస్మిత అస్సాం లోని డిచి కళాశాల లో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

చక్కెర వల్లే సమస్య

పని తొందర తో ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ జామ్ తింటారు.మార్కెట్ లో దొరికే బ్రెడ్ అధిక భాగం మైదాతో చేస్తారు. మల్టీ గ్రైన్స్ లేదా గోధుమపిండి తోనూ తప్పనిసరిగా చక్కెర వేసే బ్రెడ్ తయారు అవుతుంది. జామ్ లో పంచదార అధికం కనుక బ్రెడ్ తో పాటు క్యారెట్,టమాటా, కిరా ముక్కలు గుడ్డు ఆమ్లెట్ తోను చక్కెర కలపని పాలతోనూ తీసుకుంటే తగినన్ని పోషకాలు అందుతాయి.

నేనెప్పుడూ పర్ ఫెక్ట్

పర్ఫెక్షన్ అన్న పదానికి ఒక ప్రమాణికత లేదు అంటుంది విద్యాబాలన్. తన ఫ్యాట్ లుక్ తోనే ఎన్నో హిట్స్ ఇచ్చి ట్రెండ్ మార్చేసింది. లావు కదా, మోడ్రన్ డ్రెస్ ల్లో బావుండవు, నీకు సినిమా లేమిటి అని వెక్కిరింతలు వస్తే చీరల తోనే కనిపిస్తూ తిరుగులేని నటిని అనిపించుకుంది. నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. హార్మోన్స్ అసమతుల్యత వల్ల సమస్యలు ఉన్నాయి. అవన్నీ నేను మేకప్ సర్జరీ ల జోలికి వెళ్లలేదు. నన్ను నేను తీర్చుదిద్దుకున్నాను అంటుంది […]