Friday, 27 Nov, 2026

ప్రపంచ బాలలకు స్ఫూర్తి

రూబీ బ్రిడ్జెస్ అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త .పాఠశాల విభజనకు వ్యతిరేకంగా వచ్చిన కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నిరసనలు బెదిరింపులు మధ్య ఫెడరల్ మార్షల్స్ రక్షణలో ఆమె పాఠశాలకు వెళ్ళింది.1960లో అమెరికాలో జాతి వివక్ష తీవ్రంగా ఉన్న సమయంలో శ్వేత జాతీయుల పాఠశాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ విద్యార్థిగా ఆమె నిలిచింది. బయట నిరసనకారులు బెదిరింపులు ద్వేషపూరిత నినాదాల మధ్య ఆమె ప్రతిరోజు ధైర్యంగా పాఠశాలకు వెళ్ళింది. ఈ చిన్నారి చూపిన ధైర్యం విద్యావ్యవస్థలో సమానత్వానికి ఒక అద్భుతమైన రహదారి వేసింది. ఆమె ధైర్యాన్ని పూర్తిగా తీసుకొని కళాకారుడు నార్మన్ రాక్‌వెల్ ‘ది ప్రాబ్లం వి ఆల్ లివ్ విత్’ అనే ప్రసిద్ధ చిత్రాన్ని గీశారు. సమానత్వం సహనం పెంపొందించడానికి 1999 లో ఆమె రూబీ బ్రిడ్జెస్ ఫౌండేషన్ స్థాపించింది. త్రూ మై ఐస్ వంటి పుస్తకాలు రాసింది.

Leave a Reply