Saturday, 28 Nov, 2026

ఈ ఆందోళన అనివార్యమా ?

వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో వయసు వర్రీలు అవసరంవుండదు. అస్తమానం యవ్వనం మాత్రం ఉందనుకోవటం అసహజం. మన కళ్ళముందే ఉదయాన్నే పూసిన పూవు సాయంటానికి కళ తప్పి రాలిపోతుంది. అది ప్రకృతి ధర్మం.ఏజింగ్ ఎక్కువ అవకాశాలు రహదారి వంటిది. దీనికి ఏ విధమైన పరిధిలు వుండవు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని హుందాగా ఎనెర్జీ […]

జుట్టు చికిత్సలు పనిచేస్తాయా ?

జుట్టు పల్చబడి పోకుండా ఎన్నో చికిత్సలున్నాయి. ఎంతో ఖరీదైనవి కూడా. ప్రకటనల్లో కూడా ఎన్నో మందులు ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా రాలకుండా ఈ చికిత్సలు ఉపయోగపడతాయా అంటే ఈ మందులో ఎండార్ఫిన్లు బ్లాక్ చేయటం లేదా హార్మోన్లకు బ్లాక్ చేయటం పై ఆధారపడి ఉంటుంది. విటమిన్ బి 6 జంక్ సప్లీమెంట్స్ ఈవెనింగ్ ఫ్రమ్ రోజ్ ఆయిల్ లు S- అల్ఫాను  అడ్డుకోవటానికి సహకరించేవీలుంది. […]

మసాలాలు లేకుండా పెరుగన్నం తినండి చాలు

నిమిషం తీరిక లేని జీవన శైలి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతీ పెరిగే ఒత్తిడీ కారణం తో శరీరం ఎదో ఒక సమస్య కు లోనవుతూనే ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యం వయసులో ఆరోగ్యాంగా ఉన్నవాళ్లు కూడా ఏదీ తిరగటం లేదనో గుండెల్లో మంట  అవో  చెపుతూ వుంటారు. సరైన నిద్ర లేకపోవుటం వల్ల కూడా ఆమ్లాలు రిఫ్లెక్ కావటం జరుగుతుంది. యాంటాసిడ్ వాడటం కంటే గృహవైద్యమే బెస్ట్ గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం పరగడుపున తాగటం మంచి పరిష్కారం. […]

విలువైన పోషకాలున్న వాల్ నట్స్

ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం  వాళ్ళ ఇన్ఫలమేషన్  మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్ ను చెర్రీలు గ్రీన్ టీ వంటి వాటితో కలిసి టీ  మరింత ఎక్కువగా ఉంటాయి . వాల్ నట్స్  ఇతర ఆరోగ్య వంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవటం వల్ల  దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వీటి వల్ల  ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ వృక్ష సంబంధిత ఒమేగా -3 […]

స్కిన్ టాగ్స్ తో చిరాకు

కారణం తెలియకుండా శరీరం పై వచ్చే స్కిన్ టాగ్స్ తో మహిళలు చాలా చిరాకు పడుతుంటారు. చర్మానికి న్వారోగా వుండే స్టార్ ద్వారా అంటుకునట్లు పెరుగుతాయి. చర్మం ఒకదానికొకటి రబీ అయ్యే ప్రదేశాల్లో ఇవి ఎక్కువ. రాపిడిఎక్కువ వుండే ప్రదేశాల్లో వస్తాయి కనుక ఇరిటేషన్ గావుంటుంది. అసలు రాపిడి వల్లనే చర్మ కణాలు అసాధారణంగా పెరిగి టాగ్స్ ఏర్పడతాయి. వీటివల్ల ఏ ప్రమాదమూ ఉండదు. ఒక్కసారై దుస్తులు వదిలేసినా పర్లేదు. సాధారణంగా నొప్పి  కూడా ఉండదు. ఒక్కసారి […]

ఇరువురి ప్రేమతోనే ఆత్మవిశ్వాసం

పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే మెన్షన్ చేస్తాం. కానీ పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ వంటి కష్టమైనా సబ్జెక్టు లలో రాణించాలంటే తండ్రి ప్రేమ బాగా అవసరం అనేది నిపుణుల అభిప్రాయం. అలాగే అబ్బాయిలకు భాషా  పరిజ్ఞానం వృద్ధి చెందాలంటే తండ్రి సాహచర్యం కావాలి. సాధారణంగా పబ్లిక్ వుండే తండ్రి వెంట […]

పవర్ఫుల్ లవంగ మొగ్గ

కేరళ తమిళ నాడుల్లో విస్తృతంగా  పెరిగే లవంగ చెట్టు  నుంచి తీసే ఎండు  మొగ్గ లవంగం. ఒక్క లవంగం నోట్లో వేసుకుంటే ఘాటుగా కారంగా వుండే ఆ రుచి వాసన చాలా బావుంటుంది. ఈ లవంగం ప్రయోజనాల గురించి ఆయుర్వేద గ్రంధాల్లో  పెద్ద రెసెర్చే వుంది. ఎనో మందుల కోసం వాడే దినుసుల్లో ఈ లవంగం తప్పకుండా  ఉంటుంది. వాతావరణ సంబంధిత విషతుల్యత నివారణలు అమోఘంగా పనిచేసే ఈ లవంగంలో మాంగనీస్ కాల్షియం ఒమేగా 3 ఫ్యాటీ […]

ఇలా చేయటం ఉపయోగం

బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు వెండి పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ అధ్యయనాల రిపోర్టు కరెక్టే. అందులో వుండే సలహాలు మెళకువలు కరక్టే. మనం వాటిని దీర్ఘకాలం పాటించే ఓపిక లేక వదిలేస్తాం కనుక వాతై ప్రభావం దక్కకుండా పోతుంది. అత్యధిక కొవ్వు పదార్ధాలు తినేటప్పుడు కలిగే దుష్ప్రభావాలు నోరు పుల్లగా తియ్యగా వుండే ద్రాక్ష పళ్ళు రక్షిస్తాయి. క్రమం తప్పకుండ తినాలి వీటిని . ఇవి క్యాలరీల మోతాదు అత్యధికంగా వుండే […]

మెళకువలు తెలిస్తే షాపింగ్ ఈజీనే

ఈ మధ్యని జరిగిన ఒక అధ్యయనంలో ఇంట్లో కూర్చుని ఎంచక్కా ఇంటర్నెట్ లో షాపింగ్ చేయటంలో ఆడవాళ్లే  స్మార్ట్ గా ఉన్నారట. ఎన్నో వెరైటీస్ చూసి ఎంచుకుని చివరకు  వంటపైన వేసుకుంటే ఏ డ్రెస్ ఎలా ఉందో  చూసుకునే యాప్ లు వచ్చాయి. కనుక డ్రెస్ లతో సహా నెట్ లోనే షాపింగ్ చేస్తున్నారు . ఇందులో కొన్ని మెళకువలు తెలుసుకో పెద్ద నష్టాలేవీ లేవు. ఏదైనా కొనాలనుకుంటే ఇతర వెబ్ సైట్స్ తో సరిపోవు చూపించి […]

ప్రోటీన్లు విటమిన్ల సమాహారం పెండలం

ఇప్పుడు ప్రపంవచం నలుమూలలా పాండే కాయగూరల్ని అందరికీ చేరుతున్నాయి. కనుక దుంపల రకాలు పెద్దగా వాడినట్లు కనిపించదు . కర్రపెండలం దుంప మార్కెట్ లో అరుదుగానే దొరుకుతున్నాయి . పెండలం సన్నముక్కలుగా కట్ చేసి వేయిస్తే అన్నం సాంబారులకు  మంచి కాంబినేషన్ పెండలం ఫ్రై సన్నపొడుగాటి పుల్లలుగా వేయించి ప్యాకెట్లలలో దొరుకుతున్నాయి . కార్పొరేట్ మార్కెట్ దేన్నీ మరచిపోదు. అది వేరే విషయం. కానీ మనం వాడుకోవటం మానేస్తున్నారు. కార్బోహైడ్రాట్స్ పొటాషియం ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ యాంటీ […]

ఇంతపేరు ఓవర్ నైట్ రాలేదు

పింక్ తర్వాత తాప్సీ  కెరీర్ ఊపందుకున్నట్లే. తాప్సీ  మటుకు ఇంతపేరు ఒక్క సినిమాతోనే రాలేదు. దీని వెనక ఏడు సంవత్సరాల కృషి ఉందంటుంది. ఇప్పుడీ సక్సెస్ నా బాధ్యత ను పెంచింది. ఇప్పుడు ప్రత్యేకించి నా గురించి మాట్లాడుతున్నారు కనుక ఆ గుర్తింపు కాపాడుకోవాలనుకుంటున్నాను .  గతంలో లాగా కధ ఎలా వున్నా న అపాత్ర గురించి కూడా కనీసం ఆలోచించకుండా వప్పుకునే దాన్ని ఇక ఇప్పుడు కధలు వింటున్నా. నా పాత్ర ఎలా ఉంటుందో చూసుకోవటం […]

మొగ్గలోనే తుంచకపోతే మనకే నష్టం

నీహారికా , స్నేహంలో ఎంత జాగ్రతగా ఉంటున్నా ఎందుకో ఎదో ఒక మాటకు అపార్ధాలు వస్తుంటాయి. నేను కరెక్ట్ గానే మాట్లాడననుకుంటాను. అన్నావు. సరే అవతలివాళ్ళు అలాగే అనుకుంటారు కదా నీహారికా. మానవ సంబంధాలలో మంచిని గుర్తించి వప్పుకోకపోతే వ్యతిరేకాంశాలే కదమ్మా మిగిలేవి. ఈ వ్యహాతిరేకాంశాలను ఎప్పటికపుడు బలహీనపరచాలి. ఆలా మొగ్గలోనే తుంచకపోతే చివరకి సంబంధ మూలాలనే తినేస్తాయి. పరిషారం మన మనసులోనే ఉంది. మనసుని ఎప్పుడైతే అద్దం లా ఉంచుకుని మనసు తలుపులు తెరచి ఎదుటివాళ్ళు […]

మధ్యలో ఆపేస్తే ప్రయత్నం వృధా

ఎంతోమంది ఆడవాళ్ళ ప్రాబ్లమ్ ఇది. బహుశా ఇందులో స్త్రీ పురుష బేధం ఉండకపోవచ్చు. వర్కవుట్స్ ఆహారం విషయంలో చాలా బోర్ కొట్టేస్తూ వుంటుంది. ఈ ప్రోగ్రామ్స్ కోస్టిక్ అవలేకపోతున్నామంటున్నారు. కానీ అవసరం కదా. నచ్చే యాక్టివిటీ ని ముందుగా ఎంచుకుని ప్రోత్సాహకరంగా ఉండటం కోసం ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకోవాలి. ముందసలు మొదలంటూ పెట్టాక ఒక యాడాది పాటు స్టిక్ అయివుంటేనే ఫలితం కనిపిస్తుంది. మార్పు కోసం వెరైటీలు ప్రయత్నించటమే కర్తవ్యం. సాధించగల వాస్తవికమైన చిన్న లక్ష్యాలనే […]

భేషైన బొప్పాయి

మనం తినే పండ్ల జాబితాలో బొప్పాయి తప్పనిసరిగా వుండి తీరాలంటారు ఎక్స్పర్ట్స్. ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.. బొప్పాయి పండు ఎ సి విటమిన్లు మంచి ఆధారం చిన్న బొప్పాయిపండు ముక్క తిన్న విటమిన్ సి లో 150 శాతం లభించినట్లే. తక్కువ క్యాలరీలు కొవ్వు కొలెస్ట్రాల్ ఉండదు . పొటాషియం ఫోలేట్ పీచులకు మంచి ఆహారం. అత్యధిక విటమిన్లు పోషకాల వల్ల  బొప్పాయి రోగనిరోధిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొంచెం చిరు చేదుగా వుండే బొప్పాయి గింజల్లోనూ […]

కుకింగ్ పద్ధతుల్లోనే అసలురహస్యం

మనం ఏం తింటున్నామని ఎంత ప్రధానమో ఎలా తింటున్నామన్నదీ అంతే ముఖ్యం. ఇందులో వంట వండే  పద్ధతులదే ప్రధాన పాత్ర. సాధారణంగా మనం వండే వంట ఇబీటి అలవాట్లు సంస్కృతి ఆధునికమైన వస్తువులని వాడుకునే విధానం పైన ఆధారపడి ఉంటుంది. సరైన పద్దతైలో వండితే పోషకాలు పోకుండా ఉంటాయి. ఒక్కో రకానికి ఒక్కో పద్దతి మేలుగా ఉంటుంది. ఆహారాన్ని ఆవిరి పై ఉడికించటం ఆరోగ్యవంతమైన పద్దతి. బీన్స్ క్యారెట్లు బీట్స్ చిలకడదుంపలు చేపలు స్టీమ్ చేస్తే పోషకాలు […]

డబ్బు విలువ వాళ్ళని తెలుసుకోనివ్వండి

పిలల్ల డిమాండ్స్ భరించలేనంతగా ఉంటున్నాయని వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అర్ధం కావటం లేదని తల్లులు బాధపడుతూవుంటారు నిజమే. ఒక వస్తువు కొనిపెట్టగానే ఇంకో వస్తువు లిస్ట్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఒక వీడియో గేమ్ కొనిస్తే సరిగ్గా ఇంటి గడపైనా ఎక్కకముందే ఇంకో ప్లే స్టేషన్ అంటారు. బడ్జెట్ గురించి వాళ్లకు ఎలాంటి అవగాహన ఉండదు. డబ్బు లేవురా అని ఓ తల్లి నచ్చజెప్పబోతే పోనీ డబ్బులు కొనూ  అన్నాట  పిల్లవాడు. ఇలాగె ఉంటుంది వ్యవహారం […]

మూడ్ ఫుడ్

శోధిస్తుంటే మంచి విషయాలు దొరుకుతాయి. చాక్లేట్లు అందరికీ ఇష్తమే. మానసిక ఒత్తిడి తగ్గుతోంది ఒక చాక్లేట్ ముక్క తినండి అని డాక్టరు సలహా ఇస్తే ఎంత బావుంటుందీ.. స్తబ్దంగా ఉన్నా మూడ్ డల్ గా అనిపించినా మనస్సు మళ్ళీ ఉత్తేజం పొందాలంటే పంచదార తో చేసిన ఎదో ఓక  పదార్ధం  చాక్లేట్ ఐస్ క్రీమ్  తీసుకుంటే సరైన క్యాలరీలు శరీరానికి అంది ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందిట. బంగాళా దుంపలు బఠాణీ  పుట్టగొడుగుల్లాంటివి వండుకుని తినటం వల్ల […]

అసలు సిసలు అందం ఇదే

ఇన్ని ఫ్యాషన్స్ గురించి డ్రెస్ కోడ్ గురించి ఎన్నెన్నో చదువుతూ వుంటాం. కానీ అసలు ఆడవాళ్లు ఎలా కనపడితే బావుంటారు అన్న దాని పైన ఓ చిన్న సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది. 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉండే చదువుకున్న ఉద్యోగంలో ఉన్న కార్పొరేట్ రంగంలో ఉన్న మహిళలు సమాధానాలు ఇచ్చిన తీరును బట్టి ఫ్యాషన్ స్టేట్మెంట్ ని నిర్ణయించి రిపోర్ట్ ఇచ్చారు. నీట్ గా చక్కని డ్రెసింగ్ తో ఉండాలి. పరిశుభ్రంగా […]

ఫెడవుతూ ఫామ్ లో కొస్తాయి ఫ్యాషన్స్

ఎత్నిక్ గానూ స్టయిల్ గానూ వుండే డ్రెస్సింగ్ ఎపుడూ కలర్ కాంబినేషన్ పైనే ఆధారపడి వుంటుంది. ఒకప్పుడు నిండు రంగు చీరల అందం అని ఉండేది. వెంకటగిరి కోయంబత్తుర్ గుంటూరు జరీ నేత చీరలు ఇవన్నీ  గాఢమైన రంగుల్లోనే వుండేవి ఇప్పుడు బోల్డ్ కలర్ఫుల్ వస్త్రధారణ అందరూ మెచ్చుకుంటున్నారు. చిలకపచ్చ కుర్తీలు బంగారు ప్రింట్స్ సింపుల్ గా వుండే తెల్లని చుడీదార్లు నేటి ఫ్యాషన్ పోకడలు. బీజ్ రెడ్ కాంబినేషన్లు పార్టీలు ఫంక్షన్ వేర్ గా ఉంటాయి. […]