• వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల ష్రిమ్కింగ్ మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్ వల్లనే పెదవులు తేమతో నిగనిగలాడతాయి. సూర్య కిరణాలు కూడా కొలాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంచేత ఎండలోకి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెదవులకు కూడా రాసుకోవాలి. పాతిక సంవత్సరాల వయస్సులో మూత్రాశయంలో ద్రవాన్ని ఎంతసేపైనా ఆపి ఉంచుకునే శక్తి ఉంటుంది. 65 సంవత్సరాలు వస్తే మూత్రాశయం ఆ శక్తి పోగొట్టుకుంటుంది . అంచేత బ్లాడర్ నియంత్రణను మెరుగు పరుచుకునేందుకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజులు సహకరిస్తాయి కనుక ముందునుంచే ఏ ఎక్సర్ సైజులు ప్రారంభించాలి . అలాగే వయసు తో పాటే సాగిపోయే చర్మం విషయంలో దెబ్బతినే పలువరస విషయంలో శ్రద్ధ తీసుకుని తీరాలి . రాబోయే వార్ధక్యాన్ని ఆపలేకపోవచ్చు . కానీ ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులను విస్మరించవద్దు.

    వయస్సు తెచ్చే మార్పులు

    వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల  ష్రిమ్కింగ్  మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్…

  • వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో వయసు వర్రీలు అవసరంవుండదు. అస్తమానం యవ్వనం మాత్రం ఉందనుకోవటం అసహజం. మన కళ్ళముందే ఉదయాన్నే పూసిన పూవు సాయంటానికి కళ తప్పి రాలిపోతుంది. అది ప్రకృతి ధర్మం.ఏజింగ్ ఎక్కువ అవకాశాలు రహదారి వంటిది. దీనికి ఏ విధమైన పరిధిలు వుండవు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని హుందాగా ఎనెర్జీ తో కొనసాగించవచ్చు. పెరిగే కొద్దీ విజ్ఞానం పెంచుకోవాలి. ప్రతి అంశాన్ని చవిచూసిన అనుభూతులతో వాస్తవాన్ని ఆస్వాదించాలి. భర్తతో పిల్లల్తో ఎక్కువ సమయం గడపచ్చు. లేదా జీవితం మొత్తం హడావుడి పరుగులతో సొంతానికి కొద్ది సమయం కూడా చేసుకున్న రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆలా పక్కకుపెట్టిన ఎన్నో పనులు ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. 60 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకున్న పరీక్షలకు కట్టినా కొత్త ప్రదేశాలకు వెళ్లినా ఏదైనా చేసేందుకు సమయం వుందనే పాజిటివ్ దృక్పధంతో ఉండాలి.

    ఈ ఆందోళన అనివార్యమా ?

    వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో…

  • తన వందో పుట్టిన రోజునాటికి వందమంది చిన్న పిల్లల్ని సంతోష పెడదాం అనుకుందిట అమెరికా కు చెందిన లిల్లియన్ వెబర్. ఈ వందేళ్ళ భామ్మ టీ.వి చూస్తుంటే లిటిల్ డ్రెస్సెస్ ఫర్ అమెరికా అనే స్వచ్చంద సంస్థ గౌన్లను సేకరించి ఆఫ్రికా దేశాల్లోని ఆడ పిల్లలకు అందిస్తున్నాదాని తెలిసింది. కొన్ని గౌన్లు కుట్టి ఆ సంస్థ కు పంపిందీ వెబర్. ఒక్క సారి ఈ మాత్రం పంచితే ఇంత సంతోషం వస్తే రోజు గౌన్లు కుట్టి ఇవ్వగలిగితే అలా తన వందో పుట్టిన రోజు నాటికీ వెయ్యి గౌన్లు ఇవ్వగలిగితే ఇంకెంత సంతోషం అనుకుంది వెబర్. రోజుకో గౌన్ కుడుతుంది. అదీ ఎదో మూసగా పని చేయడం కాదు. ప్రతీదీ అందంగా ఆకర్షనీయంగా వాటికీ అందమైన పూసలు, గుండిలు కుట్టి ప్రతి గౌను అందంగా తీర్చి దిద్ది తన లక్ష్యం పూర్తి చేసిందిట ఈ వందేళ్ళ భామ్మ. జీవితంలో ఎదో ఒక లక్ష్యం వుంటే, అదీ ఎదుట వాళ్ళకి ఉపయోగ పడి మనకు సంతోషం ఇస్తే ఆ సంతోషం మనకు ఆయుష్షు పోస్తుంది. సందేహమే లేదు. వందేళ్ళ వెబర్ మనస్సులో బీద పిల్లల పట్ల ఎంత ప్రేముందో????????

    వెయ్యి గౌన్లు కుట్టి పేద పిల్లల కిచ్చిన భామ్మ

    తన వందో పుట్టిన రోజునాటికి వందమంది చిన్న పిల్లల్ని సంతోష పెడదాం అనుకుందిట అమెరికా కు చెందిన లిల్లియన్ వెబర్. ఈ వందేళ్ళ భామ్మ టీ.వి చూస్తుంటే…