• నిమిషానికొ మూడ్ లో వుంటావు. నీ చిరాకు పరాకులకు అంతులేకుండా ఉంటోంది. కాసేపు శాంతంగా వుంటావు. మమల్ని వుండనీయవు ఇవిగో ఈ కంప్లయిట్స్ అన్ని ఒక పేజ్ లో వుండే ఆడవాళ్ళ పైన ఇంట్లో వాళ్ళు ఇచ్చేవి. ఆడవాళ్ళలో ఉండేవి ఈ ఇన్ బాలన్స్ అంతా హార్మోన్స్ అసమతుల్యత వల్లె. ఇందుకు ఒక్క పద్దతిగా ఆహారం తీసుకుంటే కొంత వరకు సమస్య తగ్గుతుంది అంటున్నాయి అద్యాయినాలు. ఎర్రని కండి పప్పు, సోయాబీన్స్, భటానీలు, ఎస్ట్రోజిన్ వుంటుంది. అలాగే ముదురు రంగు చాక్లేట్లు, వేరు సెనగలు, మాంసం, పీతలు వంటి వాటిలో జంక్ సమృద్దిగా వుంటుంది. ఆలివ్ నూనె, ఒమేగా-3 ఫ్యాటి ఆసిడ్స్ అందె చేపలు, పాల ఉత్పత్తులు, ఆకు పచ్చని కూరగాయలు, పాలకూర, మెంతి , క్యాబెజీ వంటివి ఆహారంలో ఎదో రూపంలో ఎదో రూపంలో తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యతకు అడ్డు కట్ట వేయిచ్చు. తృణ ధన్యాలన్ని కలిసిన పిండి తో సాయంత్రపు ఆహారాన్ని సిద్దం చేసుకో వచ్చు. ఇది తేలికగా అరుగుతుందివీటి తో పాటు ఉదయపు వేళ నడక కూడా చాలా ఉపయోగ పడుతుంది.మందుల తో కాకుండా ఆహారం తో నెమ్మదిగా స్వాంతనతో వుండండి అని చెపుతున్నాయి అధ్యాయినాలు.

    ఆకు పచ్చని కాయగూరలతో ఒకింత స్వాంతన

    నిమిషానికొ మూడ్ లో వుంటావు. నీ చిరాకు పరాకులకు అంతులేకుండా ఉంటోంది. కాసేపు శాంతంగా వుంటావు. మమల్ని వుండనీయవు ఇవిగో ఈ కంప్లయిట్స్ అన్ని ఒక పేజ్…

  • శరీరానికి పోషకాలు విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆరోగ్యం అందం కోసం పోషకాలు శరీరానికి అందాలి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ఇది లోపిస్తే శారీరికంగా నొప్పులు ఎక్కువవుతాయి . కూర్చోవటం మెట్లెక్కటం కూడా చేయలేక పోతారు. పాలు జున్ను పుట్ట గొడుగులు ఆరెంజ్ జ్యూస్ పెరుగు గుడ్డు సోన వంటి వాటిలో డి విటమిన్ ఉంటుంది. అలాగే ఐరన్ లోపిస్తే రక్త హీనత వచ్చే ప్రమాదం వుంది . పాలకూర ఎర్ర కందిపప్పు ఓట్స్ చేపలు బీన్స్ నుంచి ఇనుమును అత్యధికంగా పొందవచ్చు. నిమ్మజాతి పండ్లు ఆకుకూరల తో విటమిన్ సి శరీరానికి లభిస్తుంది. మాంసకృతులు శరీరంలో కొత్త కణాల అభివృద్ధి కి తోడ్పడతాయి. గుడ్లు మాంసం నట్స్ డైరీ పదార్ధాల నుంచి మాంస కృతులు అందుతాయి. బరువు పెరుగుతామనే భయంతో కొవ్వుల్ని దగ్గరకు రానివ్వడు కానీ ప్రతిరోజు ఇరవై శాతం కేలరీలు కొవ్వుల నుంచే లభించాలి. విటమిన్ బి లోపిస్తే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుడ్లు పాలు బీన్స్ మాంసాహారం రోజు తీసుకోవాలి. ఇవన్నీ సరైన నిష్పత్తి లో అందితే శరీరంలో అందం ఆరోగ్యం రెండు భద్రంగా ఉంటాయి.

    వీటితో ఆరోగ్యం అందంరెండు భద్రం

    శరీరానికి పోషకాలు విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆరోగ్యం అందం కోసం పోషకాలు శరీరానికి అందాలి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ఇది లోపిస్తే శారీరికంగా…

  • వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో వయసు వర్రీలు అవసరంవుండదు. అస్తమానం యవ్వనం మాత్రం ఉందనుకోవటం అసహజం. మన కళ్ళముందే ఉదయాన్నే పూసిన పూవు సాయంటానికి కళ తప్పి రాలిపోతుంది. అది ప్రకృతి ధర్మం.ఏజింగ్ ఎక్కువ అవకాశాలు రహదారి వంటిది. దీనికి ఏ విధమైన పరిధిలు వుండవు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని హుందాగా ఎనెర్జీ తో కొనసాగించవచ్చు. పెరిగే కొద్దీ విజ్ఞానం పెంచుకోవాలి. ప్రతి అంశాన్ని చవిచూసిన అనుభూతులతో వాస్తవాన్ని ఆస్వాదించాలి. భర్తతో పిల్లల్తో ఎక్కువ సమయం గడపచ్చు. లేదా జీవితం మొత్తం హడావుడి పరుగులతో సొంతానికి కొద్ది సమయం కూడా చేసుకున్న రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆలా పక్కకుపెట్టిన ఎన్నో పనులు ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. 60 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకున్న పరీక్షలకు కట్టినా కొత్త ప్రదేశాలకు వెళ్లినా ఏదైనా చేసేందుకు సమయం వుందనే పాజిటివ్ దృక్పధంతో ఉండాలి.

    ఈ ఆందోళన అనివార్యమా ?

    వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో…

  • కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం తాగే కాఫీ కాంబినేషన్ బెస్ట్ అంటారు. కాఫీ లో వుండే కెఫిన్ అన్న పదర్ధానికి పంచదార జాడిస్తేనే రెండూ కలిసి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. ఈ రెండు పదార్ధాలు మెదడు లోని రెండు ముఖ్య భాగాల పైన ప్రభావం చూపెడతాయి. ఒకటి జ్ఞాపక శక్తికీ రెండవది దృష్టి కేంద్రీకరించటానికీ ఉపయోగపడతాయి. అలాగే పాలు కమలాఫలం రెండూ ఒకేసారి తినటం తాగటం తప్పు. అది ఉదయం వేళ అయితే శరీరం ఆమ్లాలను గ్రహించలేదు కనుక జీర్ణక్రియకు ఇబ్బంది చేస్తుంది. అరటి జామ కలిపి తినకూడదు. బొప్పాయి నిమ్మ మంచి కాంబినేషన్ కాదు. నారింజ క్యారెట్ కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అదే తేనె నిమ్మరసం అల్లంరసం కలిపి తీసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతుంది. కొన్ని పదర్ధాలు వుండే రసాయనాలు ఇంకో దానికి జోడిస్తే ప్రమాదం.

    కొన్నింటిని కలిపి తేనే మంచిది

    కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం…

  • మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం శాతం, ఇష్టం ఇవన్నీ మన భాష లోనే తలిసిపోతాయి. మన మాటల్లో నిత్యం వండర్ ఫుల్, ఫ్రెండ్స్, బావున్నాం, బావున్నారా, సంతోషం, ఎంత చెక్కని పాట, ఎంత అందమైన ప్రకృతి వంటి భావజాలాలకు సంబందించిన మాతలుంటే మనం ఆశావాద దృక్పదంతో ఉన్నట్లు అర్ధం. అలా శాతంగా వుండే వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు పరిశోధకులు.

    శాంతంగా ఉంటేనే ఆరోగ్యం

    మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో…