• మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల కూడా చర్మం తేమ పోగొట్టుకుని డల్ గా అవుతుందంటారు డెర్మటాలజిస్టులు. దీని బదులు పండ్ల రసం లేదా మంచి నీళ్లు తాగితే చర్మం పాడవకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ ముఖం కాళ్ళు చేతులకు రాసుకోవాలి. పోషకాల కోసం నట్స్ మాంసకృత్పతులు పిండి పదార్ధాలు ఎంచుకోవాలి. ఈ పోషకాలు జుట్టుకే కాదు చర్మానికి మేలు చేస్తాయి. కళ్ళు అలసిపోకుండా కళ్ల పైన కీరా బంగాళా దుంప ముక్కలు ఉంచుకోవాలి. బొప్పాయి కీరా గుజ్జు సమపాళ్లలో టీయూస్కుని అందులో కాస్త సెనగ పిండి కలిపి ముఖం మెడకు పూతలా వేసుకుంటే చర్మం తేమగా తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనె వేడిచేసి తలకు మస్సాజ్ చేస్తూవుంటే జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. శరీరంలో జరిగే ప్రతి చర్య చర్మం పైన జుట్టు పైన ప్రభావం చూపెడుతుందని వత్తిడి టెన్షన్ లు తగ్గించుకునేందుకు కాసేపు ధ్యానం చేయటం అలవర్చుకోవాలంటున్నారు.

    జుట్టు రాలిందంటే మానసిక వత్తిడే

    మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల  సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల  కూడా చర్మం…

  • వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో వయసు వర్రీలు అవసరంవుండదు. అస్తమానం యవ్వనం మాత్రం ఉందనుకోవటం అసహజం. మన కళ్ళముందే ఉదయాన్నే పూసిన పూవు సాయంటానికి కళ తప్పి రాలిపోతుంది. అది ప్రకృతి ధర్మం.ఏజింగ్ ఎక్కువ అవకాశాలు రహదారి వంటిది. దీనికి ఏ విధమైన పరిధిలు వుండవు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని హుందాగా ఎనెర్జీ తో కొనసాగించవచ్చు. పెరిగే కొద్దీ విజ్ఞానం పెంచుకోవాలి. ప్రతి అంశాన్ని చవిచూసిన అనుభూతులతో వాస్తవాన్ని ఆస్వాదించాలి. భర్తతో పిల్లల్తో ఎక్కువ సమయం గడపచ్చు. లేదా జీవితం మొత్తం హడావుడి పరుగులతో సొంతానికి కొద్ది సమయం కూడా చేసుకున్న రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆలా పక్కకుపెట్టిన ఎన్నో పనులు ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. 60 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకున్న పరీక్షలకు కట్టినా కొత్త ప్రదేశాలకు వెళ్లినా ఏదైనా చేసేందుకు సమయం వుందనే పాజిటివ్ దృక్పధంతో ఉండాలి.

    ఈ ఆందోళన అనివార్యమా ?

    వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో…

  • ఎప్పుడూ ఆడవాళ్ళలో ఒక ఆందోళన ..... ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో ......... ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి. ఇలాంటి ఆందోళనలు ఉంటె ఒంటరిగా ప్రయాణాలు చేయండి. కొద్దీ రోజులే. పర్యటనలు మనకు ఆలోచించే సమయం ఇవ్వవు . రైలో ,బస్సో ,విమానమో, దాని టైం ప్రకారం మనం పట్టుకోవాలి. కొత్త చోట మన గురించి మనం బాధ్యత తీసుకోవాలి. అలాంటప్పుడే ధైర్యం వస్తుంది. మనం కొత్త ప్రదేశంలో ఎవ్వరికీ ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వక్కరలేదు. భయపడక్కర్లేదు. ఇలాగే ఒకటి రెండు ఒంటరి ప్రయాణాలు చేయండి. అసలు మనసులో వచ్చే అనేకానేక ఆందోళనలకు, సమస్యలకు, భయాలకు జవాబులు దొరుకుతాయి అంటునాన్రు నిపుణులు. ఒక కొత్త చోటు ,కొత్త మనుషులు, కొత్త నిర్మాణాలు ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ,ఇష్టమైతే గుళ్ళు ,గోపురాలు ఏవైనా సరే వివిధ జీవనశైలులు భాషలు ఆ సమయంలో ఎదురయ్యే చిన్న ఇబ్బందులు మనల్ని దృఢంగా చేస్తాయి నిజం. ఆందోళనలు మాయం కావాలంటే స్థిరంగా ఆలోచించే ధైర్యం కావాలంటే ఒంటరి ప్రయాణాలు చేయండి.

    ఒంటరి ప్రయాణాలలో ఆందోళన మాయం

    ఎప్పుడూ  ఆడవాళ్ళలో ఒక ఆందోళన ….. ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో  ………  ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి.…