• నిమిషం తీరిక లేని జీవన శైలి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతీ పెరిగే ఒత్తిడీ కారణం తో శరీరం ఎదో ఒక సమస్య కు లోనవుతూనే ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యం వయసులో ఆరోగ్యాంగా ఉన్నవాళ్లు కూడా ఏదీ తిరగటం లేదనో గుండెల్లో మంట అవో చెపుతూ వుంటారు. సరైన నిద్ర లేకపోవుటం వల్ల కూడా ఆమ్లాలు రిఫ్లెక్ కావటం జరుగుతుంది. యాంటాసిడ్ వాడటం కంటే గృహవైద్యమే బెస్ట్ గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం పరగడుపున తాగటం మంచి పరిష్కారం. ప్రతిరోజు రెండు స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకోవచ్చు. భోజనం తర్వాత యాపిల్ తినాలి. బోర్లా పడుకున్నా కుడివైపుకు తిరిగి పడుకున్న అదనపు ఒత్తిడి తో నెప్పి ఉండచ్చు. ఎడమ వైపుకె తిరిగి పడుకోవాలి. దానికి సరైన పరిష్కారం ఫాస్ట్ ఫుడ్స్ జాకీకి వెళ్ళక పోవటం సాధ్యమైనంత వరకే ఇంటిపంట పైనే ఆధార పడటం ఒక్కటే. కుటుంబాలకు దూరంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైనా కనీసం పెరుగన్నం ఇంట్లో ప్రపోజ్ చేయటం నేర్చుకున్న సమస్య నుంచి బయట పడతారు .

    మసాలాలు లేకుండా పెరుగన్నం తినండి చాలు

    నిమిషం తీరిక లేని జీవన శైలి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతీ పెరిగే ఒత్తిడీ కారణం తో శరీరం ఎదో ఒక సమస్య కు లోనవుతూనే ఉంటుంది. అన్నింటికంటే…

  • ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం ఇలాంటి ఔషధ గుణాలున్న అనేక పదార్ధాలు మూలికా ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆ క్రమంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ముందు నిలబడింది. మేలు జాతి సైడర్ ఆపిల్స్ రసాన్ని పులిసేలా చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేస్తారు. ఈ వెనిగర్ లో బీటా కెరోటిన్ ,విటమిన్స్ , మినరల్ ఎంజైమ్స్ కావలిసినన్ని పోషకాలు దొరుకుతాయి. దీన్ని అనేక కాంబినేషన్స్ లో తీసుకోవచ్చు. తేనె నిమ్మరసం ,వెల్లులిరసం , అల్లం రసం ,సలాడ్స్ ,కూరలు ,ఫ్రైలు ,మాంసాహార వంటకాల్లో వాడుతుంటారు. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ సర్వరోగ నివారిణి అంటుంటారు. ఎన్నో ఔషధ విలువలున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ వెనిగర్ గురించి మీ డాక్టర్ గారితో మాట్లాడండి. ఎందుకంటే బరువు తగ్గేందుకు ఈ వెనిగర్ బ్రహ్మాండంగా పని చేస్తుందని ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి.

    బరువు తగ్గించే దివ్యౌషధం

    ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం…