• పిల్లల పెంపకానికి కూడా ఎంతో శిక్షణ కావాలి ఒక్క చిన్న మొక్క కుదురుగా పెరగలంటేనే దాన్ని ఎంత వరకు ఎలా పెంచాలో తలుసుకోవాలి, ఇక పిల్లల విషయం మాటలా? పెరిగే పిల్లల మెదడు ఎంతో చురుకుగా వుంటుంది. దాదాపు వంద బిలియన్లు న్యురాన్లు చురుకుగా ఉంటాయట. ఎన్నో తలుసుకోవాలనే కుతూహలం వందల ప్రశ్నలు, ఎన్నో పరిశోధనలు, ఆ వయస్సులో వాళ్ళకు 'నో' అన్న పదం వినిపించ కూడదు అంటారు పేరెంటింగ్ ఎక్స్ పర్ట్స్. తల్లి దండ్రులు బిజీగా వుండి. ఇప్పుడు కాదు పో, విసిగించకు పో, ఆడుకో పో అంటూ వుంటారు. అలాగే, పరుపులెక్కి తొక్కొద్దు, కుర్చీ లో నుంచి దూకొద్దు, కిటికీ లో నుంచి చూడొద్దు, అలా ఎగరోద్దు, పరుగెత్తోద్దు, ఇక ఇలా అన్ని ఆంక్షలే. ఇక స్మార్ట్ ఫోనో, టీ.వి నో అలవాటు చేస్తారు. తీరాదానికి అలవాటు పడి అదే పనిగా చూస్తుంటే అదీ తప్పంటారు. మరి పిల్లల సంగతి ఏమిటి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళతో కబుర్లు చెప్పండి, ఆడండీ, వాళ్ళకు ఎం కావాలో తెలుసుకోండి, సందేహాలు తీర్చండి. బయటకు తీసుకు పోయి ఆడించండి. డబ్బు కాదు వాళ్ళకోసం ఇవ్వాల్సింది సమయం అంటున్నారు. తల్లి దండ్రులు ఆలోచించాలి మరి.

    ‘నో’ అని చెప్పడం చాలా తప్పు

    పిల్లల పెంపకానికి కూడా ఎంతో శిక్షణ కావాలి ఒక్క చిన్న మొక్క కుదురుగా పెరగలంటేనే దాన్ని ఎంత వరకు ఎలా పెంచాలో తలుసుకోవాలి, ఇక పిల్లల విషయం…

  • పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే మెన్షన్ చేస్తాం. కానీ పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ వంటి కష్టమైనా సబ్జెక్టు లలో రాణించాలంటే తండ్రి ప్రేమ బాగా అవసరం అనేది నిపుణుల అభిప్రాయం. అలాగే అబ్బాయిలకు భాషా పరిజ్ఞానం వృద్ధి చెందాలంటే తండ్రి సాహచర్యం కావాలి. సాధారణంగా పబ్లిక్ వుండే తండ్రి వెంట టీనేజ్ పిల్లలుంటే వాళ్లకు ఎంతో మందితో మాట్లాడే పరిశీలించ గలిగే అవకాశం వస్తుంది. తల్లి ఎంత చదువుకున్నదైనా ఆఫిసరైనా ఆమెకు ఉండే పనుల భారం తో ఇల్లు ఆఫీస్ సమర్ధించుకుంటూ పిల్లల అవసరాలు చూసేసరికి సమయం గడిచిపోతూ ఉంటుంది. పిల్లలు తల్లితో పాటు తండ్రి తో కలిసి మెలిసి తిరిగితేనే వాళ్ళు అన్నింటా రాణిస్తారని ఆత్మవిశ్వాసంతో వుంటారని నిపుణుల అభిప్రాయం.

    ఇరువురి ప్రేమతోనే ఆత్మవిశ్వాసం

    పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే మెన్షన్ చేస్తాం. కానీ పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి…

  • ఎదిగే వయసు పిల్లల్ని డీల్ చేయటం అంత ఈజీ టాస్క్ కానే కాదు. అప్పటిదాకా అల్లరిగా ముందుగా గోల చేస్తూ అమ్మని నాన్నని గారాబంగా అడుగులు ఏడ్చే పిల్లలు 16 ఏళ్ళు వచ్చేసరికి కామ్ గా అయిపోతారు. వాళ్ళు పర్సనల్ గా ఉండాలనుకుంటారు ఇక తమ నుంచి ఎదో దాస్తున్నారని భావన కొంత మంది తల్లితండ్రుల్లో కలుగుతుంది. ఏమడిగినా సరిగా సమాధానం లేకుండా దాటేస్తూ వెళ్ళటం ఇందుకు కారణం. అస్తమానం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ప్రతి విషయాన్నీ నిశితంగా గమనించే వాళ్లలో ఇలాంటి భయాందోళనలు చోటు చేసుకుంటాయి. కానీ పిల్లలో తమపైన ప్రాధాన్యతలు అభిరుచులు ఇష్టాలు ఏర్పడుతున్నాయని గ్రహించలేకపోతారు. ఒక రకంగా ఎదిగే పిల్లలో ఇది సహజమే. పిలల్లు కోరుకునే స్వేచ్ఛ తల్లితండ్రుల నియంత్రణ ఘర్షణ కు దారి తీస్తూవుంటాయి. స్వేచ్ఛ కోరే పిల్లలు ఏది పడితే దాన్ని కోరుకోవచ్చు. అని నిర్ణయించటమూ అది నిరంతరం తప్పని పెద్దవాళ్ళు ఖండించటం రెండూ తప్పే. పిలల్లకు ఏది మేలు చేతుందో దాన్ని అనుభవంతో చెపుతున్నారని పెద్దవాళ్ళు పిల్లలతో అర్ధమయ్యేలా మాట్లాడగలిగినప్పుడే సమస్యలు పోతాయి. అలాగే పిల్లలు తమ పరిమితులు తెలుసుకుని ప్రవర్తించాలి కూడా ఇద్దరి మధ్య సమన్వయం కుదిరేలా ఒక మంచి వాతావరణం కల్పించే బాధ్యత ఖచ్చితంగా పెద్దలదే.

    పిల్లలు స్వేచ్ఛ కోరటం చాలా సహజం

    ఎదిగే వయసు పిల్లల్ని డీల్ చేయటం అంత ఈజీ టాస్క్ కానే కాదు. అప్పటిదాకా అల్లరిగా ముందుగా గోల చేస్తూ అమ్మని నాన్నని గారాబంగా అడుగులు ఏడ్చే…