• కేరళ తమిళ నాడుల్లో విస్తృతంగా పెరిగే లవంగ చెట్టు నుంచి తీసే ఎండు మొగ్గ లవంగం. ఒక్క లవంగం నోట్లో వేసుకుంటే ఘాటుగా కారంగా వుండే ఆ రుచి వాసన చాలా బావుంటుంది. ఈ లవంగం ప్రయోజనాల గురించి ఆయుర్వేద గ్రంధాల్లో పెద్ద రెసెర్చే వుంది. ఎనో మందుల కోసం వాడే దినుసుల్లో ఈ లవంగం తప్పకుండా ఉంటుంది. వాతావరణ సంబంధిత విషతుల్యత నివారణలు అమోఘంగా పనిచేసే ఈ లవంగంలో మాంగనీస్ కాల్షియం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కె . సి విటమిన్లతో పాటు పూర్తి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగివుంటాయి. లవంగ నూనె ఎన్నో ఆరోగ్య సమస్యలకు సహజ పరిష్కారం. లవంగ నూనె లో కొద్దిగా దూది ని ముంచి ఉపశమనం కలుగుతుంది. లవంగం పొడితో చిగుళ్లు మసాజ్ చేస్తే వాపునొప్పి దుర్వాసన పోతాయి. నీళ్లతో లవంగాలు వేసి మరిగించి రోజు తగైతే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. డైయాబెటిక్ యాంటీ పాస్మోడిక్. పునరుత్తేజ లక్షణాలు కలిగి ఉంటుంది. దగ్గు ఆస్తమా చికిత్స లో బాగా పనికొస్తుంది.

    పవర్ఫుల్ లవంగ మొగ్గ

    కేరళ తమిళ నాడుల్లో విస్తృతంగా  పెరిగే లవంగ చెట్టు  నుంచి తీసే ఎండు  మొగ్గ లవంగం. ఒక్క లవంగం నోట్లో వేసుకుంటే ఘాటుగా కారంగా వుండే ఆ…

  • నెమ్మదిగా విండో షాపింగ్ తో నడక మొదలుపెట్టండి తర్వాత గబగబా నడవటం అదే అలవాటవుతుంది అంటారు నిపుణులు. కొద్దిపాటి ప్రాక్టీస్ తో ప్రతి అడుగులో ఎంతో కొంత ఫలితాన్ని చూపిస్తుంది. స్పీడ్ వాక్ జాగింగ్ కంటే కూడా స్పీడ్ వాకింగ్ జాయింట్ల పై సులువుగా ఉంటుంది. జాగింగ్ కంటే సగం ఫోర్స్ చాలు స్పీడ్ గా నడిచేందుకు చక్కని వాకింగ్ షూ తో నడకను కొవ్వు కరిగించేదిగా కండరాలను టోనింగ్ చేసేదిగా మలుచుకోవాలి. చిన్న అడుగులు పెద్దవాటికంటే సమర్ధవంతంగా తక్కువ అలసటగా ఉంటాయి. సరైన పోశ్చర్ చాలా అవసరం. చుబుకం పైకెత్తి తిన్నగా ముందుకు చూస్తూ నడవాలి. ముందుకి వెనక్కి చేతులు బాగా కదిలిస్తూ నడవాలి. ఇలా చేతులు ఊపటం ద్వారా క్యాలరీలు ఖర్చవుతాయి. పై భాగం శక్తి పెరుగుతుంది. వేళ్ళ వాపులు కావు. ఉదర కండరాలు సరైన పొజిషన్ లో వుంటాయి. కాళ్ళ కండరాలకు నడక ఇంజన్ వంటిది. నడిచేటప్పుడు కండరాలు బిగించేలా నడవాలి. నడక వేగంగా కొనసాగించలేకపోతే మధ్యల;ఓ ఇంటెర్వెల్స్ తీసుకుంటూ ఉండచ్చు. త్వరగా సాగటానికి ఫిట్నెస్ కు ఇదే ఉపయోగం. క్యాలరీలు భారీగా ఖర్చు చేసే అవకాశం ఉన్న ఈ స్పీడ్ వాక్ తో శరీరం లోకోవ్వూ శుభ్రంగా కరిగిపోతుంది. నడక ఆరంభించి సూచనలు అనుసరిస్తూ వీలైనంత వేగం పెంచుకుపోతే ఏ అడుగుల సవ్వడి తగ్గే బరువుతో పెరిగే ఫిట్ నెస్ కనబడుతుంది.

    ఇది పవర్ వాక్

    నెమ్మదిగా విండో షాపింగ్ తో నడక మొదలుపెట్టండి తర్వాత గబగబా నడవటం అదే అలవాటవుతుంది అంటారు నిపుణులు. కొద్దిపాటి ప్రాక్టీస్ తో ప్రతి అడుగులో ఎంతో కొంత…