• మధ్యలో ఆపేస్తే ప్రయత్నం వృధా

    ఎంతోమంది ఆడవాళ్ళ ప్రాబ్లమ్ ఇది. బహుశా ఇందులో స్త్రీ పురుష బేధం ఉండకపోవచ్చు. వర్కవుట్స్ ఆహారం విషయంలో చాలా బోర్ కొట్టేస్తూ వుంటుంది. ఈ ప్రోగ్రామ్స్ కోస్టిక్…

  • ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా లో కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహారం తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది బరువు తగ్గిపోవటం ఖాయం. లో ఫ్యాట్ డైట్ వల్ల ఆరోగ్యానికి అపకారమే జరుగుతుందంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా వుండాల్సిందే. అలాగే కార్బోహైడ్రాట్స్ తగ్గిస్తునామ్ము కదా అని మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం కూడా కష్టమే. కార్బోహైడ్రాట్స్ లో కూడా 46 శాతం క్యాలరీలు ఉంటాయి అయినా కొవ్వు కరిగించే విషయంలో కార్బోహైడ్రాట్ వల్లనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు అధ్యయనాలు. ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా కేవలం లో కార్బోహైడ్రాట్ తీసుకుంటే జీవన శైలిలో మార్పులు అంటే ఉదయాన్నే వాకింగ్ కొద్దిపాటి వ్యాయామం చేస్తే ఆరు నెలలు ఒక కిలో నుంచి నాలుగు కిలోలు బరువు తగ్గిపోతారు అంటూ చెపుతున్నారు పరిశోధకులు.

    బరువు తగ్గటం గ్యారెంటీ

    ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా…

  • నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారనీ వీరిలో క్యాలరీల ఖర్చు తక్కువగా ఉంటుందనీ చెపుతున్నారు. కావలిసిన దాని కన్నా ఎక్కువ ఆహరం తీసుకోవటం లేదా నిద్రపట్టక సమయం గడవక ఎదో ఒక చిరుతిండి తినటం వల్ల ఊబకాయం వస్తోందనీ తేలుతోంది. లండన్ లోని కింగ్ జార్జ్ యూనివర్సిటీ పరిశోధకులు 172 మంది పైన పరిశోధన చేసారు. సరిపడా నిద్ర పోయేవారికి ఒక నియంత్రణ తో కూడిన జీవన పద్ధతి ఉందనీ వారు సరైన వేలకు తినటం నిద్రపోవటం వల్ల అధికమైన క్యాలరీలు శరీరంలో చేరటం ఖర్చు కాకపోవటం జరగదని నిద్రలేమి చాలా అనర్దాలకు కారణం అవుతుందని పరిశోధకులు తేల్చారు.

    నిద్రలేమితో అనర్ధం

    నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ…

  • ఒక్కోసారి ప్రపంచం మరీ ముందుకు పరుగు తిస్తుందేమో. మనమే వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది కొన్ని ప్రకటనలు, లేదా కొన్ని వస్తువులు చూస్తుంటే. మనుషుల జీవన వేగాన్ని బట్టి కొత్త డిజైనర్ వస్తువులు వస్తున్నాయి. తీరైన ఆకృతి కోసం జిమ్ కు పోవడం బద్ధకం. పోనీ బట్టలు ఉతకడం బద్ధకం. ఈ రెండు బద్దకాలు పోగోట్టేందుకు వచ్చింది 'బివా' అంటే బైక్, వాషింగ్ మిషన్ లో బట్టలు పడేసిఫెడలింగ్ చేస్తే లోపల మీషన్ వాటిని ఉతికేస్తుంది. ఎంత శుభ్రంగా ఉన్నామో తెరపైన కనిపిస్తూ వుంటుంది. పూర్తయ్యాయి ఇక దిగండి అని మిషన్ సంకేతం ఇస్తుంది. ఈలోగా తొక్కి తొక్కి జిమ్ కష్టం కూడా పూర్తయి పోతుంది. ఒకే మీషన్ రెండు లాభాలు.

    ఒక మిషను రెండు లభాలూ

    ఒక్కోసారి ప్రపంచం మరీ ముందుకు పరుగు తిస్తుందేమో. మనమే వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది కొన్ని ప్రకటనలు, లేదా కొన్ని వస్తువులు చూస్తుంటే. మనుషుల జీవన వేగాన్ని బట్టి…

  • ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం ఇలాంటి ఔషధ గుణాలున్న అనేక పదార్ధాలు మూలికా ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆ క్రమంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ముందు నిలబడింది. మేలు జాతి సైడర్ ఆపిల్స్ రసాన్ని పులిసేలా చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేస్తారు. ఈ వెనిగర్ లో బీటా కెరోటిన్ ,విటమిన్స్ , మినరల్ ఎంజైమ్స్ కావలిసినన్ని పోషకాలు దొరుకుతాయి. దీన్ని అనేక కాంబినేషన్స్ లో తీసుకోవచ్చు. తేనె నిమ్మరసం ,వెల్లులిరసం , అల్లం రసం ,సలాడ్స్ ,కూరలు ,ఫ్రైలు ,మాంసాహార వంటకాల్లో వాడుతుంటారు. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ సర్వరోగ నివారిణి అంటుంటారు. ఎన్నో ఔషధ విలువలున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ వెనిగర్ గురించి మీ డాక్టర్ గారితో మాట్లాడండి. ఎందుకంటే బరువు తగ్గేందుకు ఈ వెనిగర్ బ్రహ్మాండంగా పని చేస్తుందని ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి.

    బరువు తగ్గించే దివ్యౌషధం

    ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం…

  • ఇప్పుడు ఇరవై ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు పెరిగి అప్పుడు తీరైన శరీరం కోసం కష్టపడిన ప్రయోజనం ఉండదు. పెద్దగా బాద్యతలు బరువులు లేని ఇరవయ్యేళ్ళ వయస్సులో చేసె వ్యయామానికి శరీరం చక్కగా సహకరించడమే కాకుండా వ్యయామం జీవితాంతం జీవన శైలిలో భాగంగా ఉంటుంది. ఈ వయసులో ఏ రకమైన వ్యయామం అయిన చేయవచ్చు. ఈ వయసులో వ్యయామం వల్ల కండరాలు చక్కగా వృద్ది చెందుతాయి. కోవ్వు దరి చేరకుండా ఉంటుంది. నడకతో పాటు పుష్ అప్స్,చిన్ అప్స్ ,స్క్వాట్స్ మంచి వ్యయామం అంటున్నారు ఫిట్ నెస్ ట్రైనర్స్.

    ఇరవైల్లొనే వ్యయామం బెస్ట్

    ఇప్పుడు ఇరవై  ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు…