• కాస్త తింటే చమటోడ్చాలి.

    ఫిట్ నెస్ విషయంలో ఆహారం పానీయాలే కీలాక పాత్ర వహిస్తాయి అంటోంది. సోనాక్షి సిన్హా. అందంగా కనిపించి ఫిట్నెస్ మెయిన్ చేయడం కోసం నోరు కట్టేసుకోవాలి లేదా…

  • స్లిమ్ గా వుండాలంటే నిద్రపోండి.

    హాయిగా నిద్రపోతే చక్కగా బరువు తగ్గిపోతారు అంటున్నారు పరిశోధకులు. లీడ్స్ ఇన్ స్టిట్యుట్ ఆఫ్  కార్డియో వస్క్యులర్ అండ్ మెటబాలిక్ మెడిసన్ కు చెందిన పరిశోధకులు రెండు…

  • సమస్యంతా ఒత్తిడి తోనే.

    డైట్ చార్ట్ ని చుసుకుంటూనే తింటున్నాను. అన్నం మానేసాను సెరల్స్ తీసుకుంటున్నాను అయినా ఇలా బరువు పెరిగి పోతున్నాను అని వాపోయే వాళ్ళు చాలామంది. అయితే అధ్యాయినాలు…

  • మితమైన భోజనం తోనే చక్కని శరీరాకృతి.

    సన్నగా చక్కగా వుండాలని అమ్మైలందరి కోరిక. కానీ అలా సన్నగా వుండేందుకు వ్యాయామంతో చమట చిందిస్తారు. కానీ తీసుకొనే భోజనం మాటేమిటి. ముందర శరీర ఆకృతి కోసం…

  • వెయిట్ లాస్ మంత్రాలివే.

    వెయిట్ లాస్ కు ప్రత్యేకమైన దగ్గరి దార్లో, చిట్కాలు, ట్రిక్కులు ఏవీ వుండవు. మెటబాలిక్ రేట్ పై ఓ కన్నేసి ఉంచడమే చురుగ్గా లేనప్పుడు మనం ఉపయోగించుకునే…

  • ఏరోబిక్స్ చేస్తూ వుంటే మంచి ఫిజిక్ తో ఉండొచ్చని, ఉదరం చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని కళలు కంటే ప్రయోజనం దక్కడం కష్టమే నంటున్నారు. ఉదరం చుట్టూ పేరుకొన్న బరువు తగ్గాలంటే వెయిట్ ట్రైనింగ్ కీలకమని హార్వార్డ్ పరిశోధకులు తగు అధ్యాయిన్నాల్లో గుర్తించారు. వెయిట్ ట్రైనింగ్ తీసుకోవడం లేదా దీన్ని ఎరోబిక్స్ వ్యాయామాల తో కలపడం వల్ల కొవ్వు ఈజీగా పోగొట్టుకోవచ్చు అని అధ్యాయినకారులు చెపుతున్నారు. లేదా ఈ కొవ్వు తగ్గించే ప్రయత్నం చేయకుండా వదిలేస్తే గుండె సంబందిత రుగ్మతలకు, డయాబెటీస్, బోన్ లాస్ ఎముక సాంద్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని చెప్పుతున్నారు. వారానికి 150 నిమిషాల ఇంటెన్సిటీ ఎక్సర్ సైజ్ కార్యక్రమాన్ని వెయిట్ ట్రైనింగ్ తో కలిపి ఆరంభిస్తే ప్రయోజనాలు సంపూర్ణంగా దక్కుతాయని పరిశోధకులు చెప్పుతున్నారు.

    కొవ్వు కరగాలంటే వెయిట్ ట్రైనింగ్ బెస్ట్.

    ఏరోబిక్స్ చేస్తూ వుంటే మంచి ఫిజిక్ తో ఉండొచ్చని, ఉదరం చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని కళలు కంటే ప్రయోజనం దక్కడం కష్టమే నంటున్నారు. ఉదరం…

  • బరువు తక్కువగా ఉన్నా మానసిక అశాంతే

    సన్నగా ఉంటె ఎంతో బావుంటారని, లావుగా వుండటం వల్లనే సమస్యలనీ ఒక భ్రమలో ఉంటారు కానీ అసలు సన్నగా ఉన్న వాళ్లలోనే డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని…

  • బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి కావాల్సిన నీరు అందితే ఎప్పుడూ ఆరోగ్యంగానే వుంటుంది. అలోవీరా, కాఫీ, విటమిన్- ఇ, విటమిన్-ఎ ల తో కూడిన స్కిన్ లోషన్స్ ఉపయోగించాలి. తాజా అలోవీరా గుజ్జులో కొంచం నిమ్మరసం కలిపి చర్మానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కదిగేయోచ్చు. కల్లుప్పు తో చర్మానికి స్క్రబ్ చేయొచ్చు. చాక్లెట్ పొడి లేదా కాఫీ పొడి తో చర్మం రుద్దితే పునరుత్తేజం వస్తుంది. విటమిన్-ఇ ఆయిల్ తో చర్మానికి మసాజ్ చేసిన చర్మం బిగుతుగా వుంటుంది. కొబ్బరి నూనె కొంచం వెచ్చగా చేసి ఉపయోగించినా మేలే, బాదాం నూనె చర్మానికి మాయిశ్చురైజర్ లా ఉపయోగ పడుతుంది. నూనె వెచ్చ చేసి చర్మం పై నెమ్మదిగా మర్దనా చేస్తే మంచి ఉపయోగం వుంటుంది.

    చర్మం బిగుతుగా ఉండాలంటే………!

    బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి…

  • తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు తగ్గించుకోవడం రెండూ వెర్వేరు విషయాలంటారు శిక్షకులు. ఎనభై శాతం ఆహారపు అలవాట్లు బరువు తగ్గించే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. వ్యాయామం కేవలం ఇరవై శాతమే పనిచేస్తుందిట. జిమ్, జాగింగ్, వర్కవుట్స్ ఏవైనా కానీ బరువు తగ్గించే ప్రక్రియలో ఉపయోగ పాడేది ఇంతే. శరీరంలో జీర్ణక్రియలు అత్యంత చురుకుగా ఉంచేందుకు అద్భుతమైన పద్దతి రోజుకు ఐదు నుంచిఆరు సార్లు కొద్ కొద్దిగాది తినడం, భోజనం చేస్తున్నప్పుడు టీవి చూస్తున్నామా అదుపు కాస్త తగ్గినట్లే, ఫోన్ మాట్లాడామా ఇంకొంత బాటింగ్, కబుర్లు ఎదో ఒక్కటి చేస్తూ ఆహారం తింటే అన్ లిమిటెడ్ గా కడుపులోకి పంపిస్తున్నట్లే. బరువు తగ్గాలంటే తగ్గించి తింటేనే, రుచికి ప్రాధాన్యత తగ్గిస్తేనే, వర్కఔట విషయంలో బద్దకించక పోతేనే ఫలితం దక్కేది.

    మూడు విషయాల్లో కఠినంగా వుండాలి

    తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు…

  • డైటీషియన్లు మన కోసం ఇచ్చే చార్ట్ చుస్తే గుండె జారి పోతుంది. అవన్నీ తయారు చేసుకోవడం కోసం రోజంతా కష్టపడ్డా సరిపోదు. అప్పుడిక రెండో పని లేక ఎలాగో సన్నగానో, ఇంకాస్త బరువుగానో అయిపోతాం. ఈ టిప్స్ పనికొస్తాయేమో చూడండి. భోజనం చేసే ముందర ఆర లీటర్ నీళ్ళు తాగి చూడండి చూడండి. తక్కువ క్యాలరీలే తినగాలుగుతాం. ఎగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే కొవ్వు కలుగుతుంది. చక్కెర కలపని కాఫ, లేదా బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాఫీలోని కెఫెన్ జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు తోడ్పడుతుంది. ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. కాఫీలో చెక్కర కలపొద్దు. కొద్ది శాతంగా కెఫెన్, యాంటీ ఆక్సిడెంట్స్ వుండే గ్రీన్ టీ తాగితే ఖచ్చితంగా బరువు పెరిగే ప్రసక్తే లేదు. వంటకాల్లో కొబ్బరి నూనె ఉపయోగించ గలిగితే ఇందులో స్పెషల్ ఫ్యాట్స్ తో జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. పిచు పదార్ధమైన గ్లూకోమనవ సప్లిమెంట్ వల్ల కుడా బరువు తగ్గించేందుకు ఇంతకంటే టిప్స్ ఇంకేం లేవు.

    ఈ కొంచెం చేయగలిగితే చాలు

    డైటీషియన్లు మన కోసం ఇచ్చే చార్ట్ చుస్తే గుండె జారి పోతుంది. అవన్నీ తయారు చేసుకోవడం కోసం రోజంతా కష్టపడ్డా సరిపోదు. అప్పుడిక రెండో పని లేక…

  • టీనేజర్స్ అమ్మాయిలు బరువు తగ్గించుకోవడం చాలా సులభం. వర్క్ అవుట్స్, డాన్స్, తినే పదార్ధాల పైన అదుపు, ఆమంచి ట్రైనర్ వుంటే రెండు మూడు నెలల్లో కావాల్సిన వెయిట్ తాగొచ్చు అంటున్నారు నిపుణులు. ముంజేతులు, పిరుదులు, దైస్ బరువు తగ్గాలి అంటే జింమ్ కు వెళ్ళడం బెటర్. క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీసు వల్ల లీన్ లుక్ వస్తుంది. అలాగే డాన్స్ కూడా రొటీన్ కు అదనంగా ప్రయోజనం కలుగ జేస్తుంది. యోగా డాన్స్ వల్ల శరీరానికి ఫ్లేక్సిబిలిటీ వస్తుంది. బరువు తగ్గే క్రమంలో ట్రైనర్ పర్యవేక్షణ చాలా అవసరం. అన్నింటికంటే సేఫ్టీ ముఖ్యం. ఏ వర్క్అవుట్ వల్ల ఏ ప్రయోజనం వుంటుందో ట్రైనర్ చెప్పాలి. అలాగే శరీర సామధ్యం విస్మరించవద్దు. ఇంట్లో సొంత వర్క్ ఔట్స్ వల్ల అంట త్వరగా లక్ష్యం చేరుకోరు. జిమ్ లేదా ట్రైనర్ సహాయం తో వర్క్ అవుట్స్ చేయాలి. కొవ్వు స్పైసి పదార్ధాలు తినకుండా ట్రైనర్ సుచించినవే తీసుకోవాలి. డాన్స్, యోగా, ఇతర వ్యాయామాలతో అనుకున్న బరువు తగ్గడం కష్టం కాదు.

    మంచి ట్రైనర్ అద్వర్యం లో బరువు తగొచ్చు

    టీనేజర్స్ అమ్మాయిలు బరువు తగ్గించుకోవడం చాలా సులభం. వర్క్ అవుట్స్, డాన్స్, తినే పదార్ధాల పైన అదుపు, ఆమంచి ట్రైనర్ వుంటే రెండు మూడు నెలల్లో కావాల్సిన…

  • శారీరక కొలతలు పిడికెడు పెరిగినా, కాస్త బరువు తగ్గినా, పెరిగినా, ఇంక ఈ విషయం గురించి ఆలోచిస్తూ మనస్సు పడు చేసుకునే అమ్మాయిలు అనేక మంది. ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళ విషయం మరీ అధ్వాన్నం గా వుంటుంది. ఇంక ఇదే చింత అయితే ఒక చిన్న వ్యూహం పాటించ మంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు బరువు చూసుకుంటూ వుంటే కొన్నాళ్ళకు ఫలితం అర్ధం అయిపోతూ వుంటుంది.ప్రతి రోజు బరువు చూసుకుంటూ చార్ట్ పైన ఫలితాలు చెక్ చేసుకుంటూ వుంటే బరువు తగ్గే క్రమం లో ఫలితం బాగుంటుంది అంటున్నారు. ఇలా ప్రతి రోజు చెక్ చేసుకునే వాళ్ళు బరువు పెరగకుండా మెయిన్ టైన్ చేసుకో గలుగుతారు. అదే భోజనం విషయం లోను పరిపూర్ణ ఆరోగ్యం చూసుకోవాలని, ఆహార పానీయాలు సక్రమంగా అనుసరించ మంటున్నారు. తినే వాటిని సరిగ్గా ఎంచుకుని స్థిమితంగా భోజనం చేయాలని నిపుణులు చెప్పుతున్నారు.

    రోజు బరువు చెక్ చేసుకోవడం కరెక్ట్ పద్దతి

    శారీరక కొలతలు పిడికెడు పెరిగినా, కాస్త బరువు తగ్గినా, పెరిగినా, ఇంక ఈ విషయం గురించి ఆలోచిస్తూ మనస్సు పడు చేసుకునే అమ్మాయిలు అనేక మంది. ఇక…

  • అద్దం ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి మన బద్ధకం మాత్రమే కారణం . అందంగా అంటే ఆరోగ్యంగా అని అర్ధం చెప్పుకోవాలి ముందు మనసుకి. ఇప్పుడు మనసు డిసైడ్ చేస్తుంది తప్పనిసరిగా వ్యాయామం చేయి. ప్రతి పూట చూస్తున్నాం. ఈ ఫలాన్ని సినిమాలో హీరో ఓ సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగి మళ్ళీ వెంటనే 40 కిలోల బరువు కేవలం ఫిట్ నెస్ శిక్షకుడి ఆధ్వర్యంలో కష్టపడి తగ్గించుకున్నాడని మనం మాత్రం అందులో ఐదో వంతైనా చేయలేమని నెట్ లో వెతికితే పెద్దగా బరువులో వత్తిడి ఆయాస పడనక్కర్లేదని తేలికైన వ్యాయామాలు ఉంటాయి. అవన్నీ ఒక ఆటలాగా సరదాగా ప్రేమగా మొదలుపెడితే చాలు. ఐదు నిముషాలు నుంచి మొదలు పెట్టి అరగంట వరకు సాగదీయచ్చు. అంతెందుకు మన శరీరం లో వచ్చే మార్పులు చెమటోడిస్తే మోహంలో కనబడే మెరుపు మనకు తప్పనిసరిగా ఉత్సాహం ఇస్తాయి . ఓ నెలయ్యాక ఎవరో ఫ్రెండ్ ఎదురై ఎంత బావున్నావో కాస్త తగ్గావు మోహంలో ఎదో సమ్ థింగ్ స్పెషల్ కనిపిస్తోంది. అన్నారనుకోండి ఇంకా ఉత్సాహమే ఉత్సాహం !!

    ఇదే నిమిషాలతో మొదలెట్టండి

    అద్దం  ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి…

  • మనకు కొంత రిలీఫ్ ఇచ్చే ఒక అధ్యయనం రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కాస్తంత తిండి తిని అది శరీరం లోంచి ఆవిరైపోయేదాకా వ్యాయామం చేస్తే బరువు తగ్గిపోతాం అనే భ్రమలో ఉంటాం కదా. కొత్త పరిశోధన ఇదంతా మీ ఆశే గానీ బరువు తగ్గటం అన్నది జన్యువుల పైన ఆధారపడి ఉంటుందని డి. ఎన్. ఎ టెస్టుల ద్వారా తేల్చారు. 35 నుంచి 65 సంవత్సరాల లోపు స్త్రీ పురుషులపైన ఈ పరిశోధన చేసారు. వీరికి మంచి డైట్ ఫుడ్ కొందరికి మంచి పుష్టికరమైన ఆహారం ఆ తరువాత రెండు గంటల వర్కవుట్స్ చేయించారు. బరువు తగ్గటంలో ఎన్నో అసమానతలు కనిపించాయి. ఇందుకు జన్యుకణాలు కారణమని తేల్చుకున్నారు. అంచేత బరువు పెరిగే గుణం మన జన్యువుల్లో ఉంటే తిండి మానేసినా గంటలకొద్దీ చెమటలు చిందించి వ్యాయామం చేసినా పైసా ఉపయోగం లేదని తేలింది . చాలా మందికి ఇది మంచివార్తే. ఎంత చేసినా తగ్గం లెద్దూ అని మంచి భోజనానికి రెడీ అవ్వచ్చు.

    బరువును పెంచే జన్యువులు

    మనకు కొంత రిలీఫ్ ఇచ్చే ఒక అధ్యయనం రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కాస్తంత తిండి తిని అది శరీరం లోంచి ఆవిరైపోయేదాకా వ్యాయామం చేస్తే బరువు తగ్గిపోతాం…

  • బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు వెండి పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ అధ్యయనాల రిపోర్టు కరెక్టే. అందులో వుండే సలహాలు మెళకువలు కరక్టే. మనం వాటిని దీర్ఘకాలం పాటించే ఓపిక లేక వదిలేస్తాం కనుక వాతై ప్రభావం దక్కకుండా పోతుంది. అత్యధిక కొవ్వు పదార్ధాలు తినేటప్పుడు కలిగే దుష్ప్రభావాలు నోరు పుల్లగా తియ్యగా వుండే ద్రాక్ష పళ్ళు రక్షిస్తాయి. క్రమం తప్పకుండ తినాలి వీటిని . ఇవి క్యాలరీల మోతాదు అత్యధికంగా వుండే పదార్ధాల ప్రభావాన్ని రివర్స్ చేస్తాయి. తర్వాత బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తాయ్. వీటిలో వుండే విటమిన్ ఏ .సి లో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. లికోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు తగ్గించగలుగుతాయి. ఇటువంటి ప్రభావమే కమలా నారింజ వంటి సిట్రస్ ఫ్రూట్ ల ద్వారా కుడా దక్కుతుంది. కాబట్టి ప్రతి రోజు ఎదో ఒక సిట్రస్ పండు తింటే ఆరోగ్యం మన గుప్పెట్లో వున్నట్లే.

    ఇలా చేయటం ఉపయోగం

    బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు వెండి పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ అధ్యయనాల రిపోర్టు కరెక్టే. అందులో వుండే సలహాలు మెళకువలు కరక్టే.…

  • పంజాబీ యువతి పరిణీతి చోప్రా తన నటనతో కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందర 86 కిలోల బరువున్న ఈ అమ్మాయి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ద్వారా కఠినమైన నియమాలతో చూడ చక్కని రూపాన్ని ఎలా సాధించుకుందో సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి ఎంతో మంది యువతులు స్పందించారు. తాను చేసిన వర్కవుట్స్ గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ ఫుడ్ లవర్ గా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాం తనకి కఠిన పరీక్షేనన్నది. ఫాస్ట్ ఫుడ్ ఎంత ఇష్టమైనా నూరు కట్టేసుకున్నాననీ పాలు బ్రౌన్ బ్రెడ్ బటర్ ఎగ్ వైట్ జ్యూస్ గ్రీన్ సలాడ్ బ్రౌన్ రైస్ వెజిటబుల్స్ అదీ చాలా తక్కువ పరిమాణంలో తీసుకున్నానంటోంది. నూనె లేని ఆహారం, తీపి లేని గ్లాసు పాలు చాకొలేట్ షేక్ తోనే సరిపెట్టుకొన్నా నంది. తర్వాత రొటీన్ గా వెళ్లే జిమ్ తో పాటు కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరియా పట్టు కూడా నేర్చుకున్నానంది. ఇది నన్ను మరింత సామర్ధ్యంగా శక్తిమంతంగా తీర్చిదిద్దింది. అంటూ చెప్పుకొచ్చింది పరిణీతి. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన వీడియోలకు సందర్సకులు వెల్లువెత్తారు.

    పరిణీతి వెయిట్ లాస్ వీడియోస్ ఒక సంచలనం

    పంజాబీ యువతి  పరిణీతి చోప్రా తన నటనతో కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందర 86 కిలోల బరువున్న ఈ అమ్మాయి…

  • ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా లో కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహారం తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది బరువు తగ్గిపోవటం ఖాయం. లో ఫ్యాట్ డైట్ వల్ల ఆరోగ్యానికి అపకారమే జరుగుతుందంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా వుండాల్సిందే. అలాగే కార్బోహైడ్రాట్స్ తగ్గిస్తునామ్ము కదా అని మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం కూడా కష్టమే. కార్బోహైడ్రాట్స్ లో కూడా 46 శాతం క్యాలరీలు ఉంటాయి అయినా కొవ్వు కరిగించే విషయంలో కార్బోహైడ్రాట్ వల్లనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు అధ్యయనాలు. ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా కేవలం లో కార్బోహైడ్రాట్ తీసుకుంటే జీవన శైలిలో మార్పులు అంటే ఉదయాన్నే వాకింగ్ కొద్దిపాటి వ్యాయామం చేస్తే ఆరు నెలలు ఒక కిలో నుంచి నాలుగు కిలోలు బరువు తగ్గిపోతారు అంటూ చెపుతున్నారు పరిశోధకులు.

    బరువు తగ్గటం గ్యారెంటీ

    ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా…

  • మనకి 20 మంది స్నేహితులంటే 19 మంది మనల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా మాటల్లో వచ్చే విషయం డైట్. బరువు తగ్గటం కొన్నాళ్ల పాటు తగ్గాను ఇప్పుడేం చేసినా ఇక తగ్గటం లేదంటూ వుంటారు. డాక్టర్ ఎంత తగ్గించినా బరువు తగ్గటం లేదంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి . థైరాయిడ్ ఫంక్షన్ విటమిన్ మినరల్ తో పాటు ఉన్నాయేమో చూడాలి . క్రమశిక్షణా పూరితమైన డైట్ నిరంతర వ్యాయామం జీవన శైలి గమనించుకోవాలి . శరీరం డైట్ విషయంలో వ్యాయామాల విషయంలో రొటీన్ గా అయిపోతుంది . అన్నీ మార్చాలి . అలాగే పోషకాలు తగ్గించేస్తే దీర్ఘ కాలంలో దాని ప్రభావం శరీరం పైన చూపెడుతుంది. మంచి బ్రేక్ ఫాస్ట్ తేలిగ్గా లంచ్ ఓ మోస్తరు గా డిన్నర్ మధ్యలో చాలా తక్కువ పరిమాణంలో స్నాక్స్ తినాలి. ఒకేసారి పొట్ట నిండుగా కాదు మంచి నీళ్లు బాగా తాగాలి. ఎర్లీ మార్నింగ్ వ్యాయామాలు నడక అస్సలు మానరాదు. ఆ సమయంలో శరీరం రెస్ట్ లో ఉంది మెటబాలిక్ రేట్ శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు వర్కవుట్లు మానకూడదు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి కొత్తవీ జీవన శైలిలోకి తీసుకు రాకూడదు.

    డాక్టర్ చేతికి వదిలేయటం బెస్ట్

    మనకి 20 మంది స్నేహితులంటే 19 మంది మనల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా మాటల్లో  వచ్చే విషయం డైట్. బరువు తగ్గటం కొన్నాళ్ల పాటు తగ్గాను ఇప్పుడేం చేసినా…

  • చలిలో ఉదయాన్నే లేవడం కొంచం కష్టమే కానీ వాళ్ళు చెమటలు పట్టేలా ఆ సమయంలో జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజలున్నాయంటాన్నారు నిపుణులు. కొవ్వు కరిగించడంలో జిమ్ లు డాక్టర్లు చేయలేని పనులు జాగింగ్ చేస్తుంది. ఎముకులు, కండరాళ్ళు ఫిట్ గా అవుతాయి. దీనికి తోడు హెల్ది డైట్ మెయిన్టేనెంస్ చేస్తే బరువు తగ్గిపోతారు. మాములుగా నడిచినా సరే రక్త కణాలు చురుకుగా కదులుతాయి. మెదడుకు చురుకుగ్గా రక్తం సరఫరా అయి శక్తి వంతంగా పని చేస్తుంది. మంచి నిద్ర పడుతుంది. ఉదయం వయామం రాత్రి నిద్రను తీసుకు వస్తుంది. పైగా ఆటో మేటిక్ గా ఉదయం లేస్తాం కూడా డయాబెటిస్ వున్న వాళ్ళ లో షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి జాగింగ్ కు మించిన అవుషదం లేదు.

    చలి అనకండి లాభాలున్నాయి

    చలిలో ఉదయాన్నే లేవడం కొంచం కష్టమే కానీ వాళ్ళు చెమటలు పట్టేలా ఆ సమయంలో జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజలున్నాయంటాన్నారు నిపుణులు. కొవ్వు కరిగించడంలో జిమ్ లు…

  • నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు. నీరు శక్తిని పెంచుతుంది. అలసట దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరే కనుక నీరు తాగితే ఆలోచన పెరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. భోజనం ముందు నీరు తాగాలి. శరీరంలోని వ్యర్ధాలు బయటకి పంపుతుంది. చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. అరుగుదల, జీర్ణ ప్రక్రియకు నీరే అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సహజసిద్దమైన తలనొప్పి నివారిణి. బెనుకులు రాకుండా ఆపుతుంది. మంచి మూడ్ లో ఉంచుతుంది. ఇన్ని మంచి లక్షణాలు వున్న నీటిని ప్రతి రోజు ఒకటి రెండు గ్లాసుల నీటిని తాగడం మొదలు పెట్టాలి. కావలసినంత నీరు వుంది. జీవనానికి నీరే మూలం. మన శరీర కండరాలలో 75 శాతం నీరే. పోషకాలను శరీరం అంతటికీ సరఫరా చేసే రక్తంలో 82 శాతం నీరే. నీటిని అపురుపంగా వినియోగించుకొండి.

    అపురూపమైన పానీయం నీరు

    నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు.…