• జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకో ఇమేజ్ సృష్టించుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ లో తనదైన ఓ స్టయిల్ లో సాగుతోంది. హెయిర్ స్టయిల్ వస్త్రాలంకరణ మార్చేస్తూ రూపంలో రోజుకో ప్రత్యేకత చూపిస్తోందామె. చక్కని చర్మం విల్లులా వంగిన కనుబొమ్మలు చక్కని కనురెప్పలు ఆమె ప్రత్యేకత. ఈ మధ్య కాలంలోని కొన్ని డ్రెస్ లు ఆమె ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్లు ఫిష్ టెయిల్ జడను స్టయిల్ గా అల్లేసి భుజాలపైకి వదిలేస్తే ఇంకో రోజు ఎల్లో కలర్ స్ట్రాప్ లేస్ జార్జెట్ గౌన్ ను పోనీతో ఎర్రని పెదాలతో అన్ మ్యాచ్డ్ అయినా డోంట్ కేర్ అన్నట్లు చూస్తోంది. డీప్ చాక్లేట్ బ్రౌన్ లిప్స్ మెటాలిక్ గ్లాస్ మెరుపులా జుట్టుతో అదే కలర్ డ్రెస్ తో స్టన్నింగ్ గా కనిపిస్తోంది. వస్త్రధారణకు అనువుగా హెయిర్ స్టయిల్ మేకప్ ఎలా చేసుకోవాలో మెళుకువలు తెలిస్తే ఎవరైనా అందాల కొండల్లాగే వుంటారు. ప్రియాంక ఫ్యాషన్ ఐకాన్. ఎవరైనా ఆమె సీక్రెట్ ను తెలుసుకోవచ్చు. అంటే తాము ఎలా వుంటారో గుర్తించ గలిగితే తమకేది మ్యాచ్ అవుతుందో తెలుసుకోగలుగుతారు.

    అందానికి ప్రతిబింబం ప్రియాంక

    జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకో ఇమేజ్ సృష్టించుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ లో తనదైన ఓ స్టయిల్  లో సాగుతోంది. హెయిర్ స్టయిల్ వస్త్రాలంకరణ మార్చేస్తూ…

  • ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ సౌందర్యవతిగా ఐశ్వర్య రాయ్ కు తిరుగేలేదు. బహుశ ఈ ట్యాగ్ దక్కించుకున్న ఏకైక భారతీయురాలు కూడా ఐశ్వర్యానే. 1994 లో విశ్వసుందరి కిరీటం ధరించాక ఇరువది చిత్రం ఇదే తెలుగులో ఇద్దరుగా వచ్చిన సినిమాల్లో మెరిసిపోయాక జార్ ప్యాక్ హోగయా తో హిందీ చిత్రసీమకు వెళ్లిపోయి అన్నీ బ్లాక్ బస్టర్లే సాధించి అవార్డులు తీసుకుంది . అందంతో అభినయంతో బ్రహ్మాండమైన కీర్తితో పాటు పద్మశ్రీ అవార్డు తీసుకుంది బ్రేడ్ అండ్ ప్రెజుడీస్ ది మిసెస్ ఆఫ్ మ్రిసెస్ ,ప్రహాక్ట్ లాఫ్ట్ లెజియన్ పింక్ ఫాందర్ 2 వంటి అద్భుతమైన చిత్రాలున్నాయి. పెళ్లియినా పాపాయికి తల్లయినా ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని ఎవళ్ళూ అందుకోలేదు. అంతర్జాతీయ మేకప్ బ్రాండ్ లోరియల్ లో ఆమెను చుస్తే లోరియల్ కొనాల్సిందే. ఇక క్వీన్స్ చిత్రోత్సవాలు ఆమె అందం గురించి మాటల్లో చెప్పలేనంత ప్రశంసలు. ప్రపంచ సినిమాలో భాగం అయిన ఐశ్వర్య అందం చెక్కు చెదరలేదంటే ఆ రహస్యం ఏమిటోమరి .

    ప్రపంచ సినిమా లో భాగం ఐశ్వర్య

    ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం  కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ  సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు…

  • నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమెను మించినవాళ్ళు లేరు అంటారు. ప్రపంచ ప్రసిద్ద ఫ్యాషన్ డిజైనర్లు మనీష్, అరోరా, గౌరవ గుప్తా. నమ్రతా జోషిపురా మొదలైన అందరికి ఫ్యాషన్ డిజైనింగ్ లో సలహాలు సూచనలు ఇస్తుందామె. ప్రతి రోజు డ్రెస్ అప్ డేనే అంటారామె. ప్రసిద్ధ మాగజైన్ సర్వే బెస్ట్ డ్రెస్ లిస్టులో చోటు దక్కించుకున్నారు ఆకాంక్షానందా మన దేశంలో పేరొందిన స్టైల్ ఐ కాన్ గా కీర్తిస్తారు ఫ్యాషన్ డిజైనర్లు. ప్రతి నిమిషం ఫ్యాషన్ ప్రపంచంలో ఎం జరుగుతుందో ఇలాంటి డిజైన్లు వస్తున్నాయో తలుసుకుని ఆమె కొన్ని డిజైన్లు సెలక్ట్ చేస్తే అవే బ్రాండ్స్ మార్కెట్ లో కి విడుదల అవుతాయి. ఆమె సెలబ్రిటీలకే సెలబ్రిటి.

    ఫ్యాషన్ ట్రెండ్స్ పరిచయం చేసే ఆకాంక్షానందా

    నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని…