• రుచి ముఖ్యమా? పోషకాలా?

    ఎక్కువకాలం నిల్వ  ఉండేందుకు గానూ ప్రిజర్వేటివ్స్  కలుపుతారు రుచి కోసం, తీపి పెంచేవిగా కంటికి ఇంపుగా ఉండేందుకు, రంగులు, సువాసన ఇచ్చే  ఇతర పదార్ధాలు చిక్కదనాన్ని  ఇచ్చేవి,…

  • సాధారణంగా మనం చౌకగా దొరికే ఏ వస్తువు పైనా మనసు పెట్టం. అది ఖరీదినదైతేనే బాగా పనిచేస్తుందనో మన్నికగా వుంటుందనో అనుకుంటాం. కానీ ఎంతో ఖరీదైన విదేశీయ పండ్ల కంటే కాపు జామపండు ముక్కల్లో 112 కేలరీలు వుంటాయని రోజుకు సరిపడా పీచు అందులో ఉంటుందనీ సహక చక్కెర తో ఉండటం తో కడుపు నిండిన భావన కలుగుతుందనీ డైటింగ్ చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్స్ పెర్ట్స్ చెపుతున్నారు. అలాగే దాల్చిన చెక్క పొడిని పాలల్లో కానీ టీ లో మరిగించి గానీ తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయంటున్నారు . బరువు తగ్గాలనుకుంటే తినే ఆహారంలో సగంలో కాలీఫ్లవర్ వుండేలా చూసుకోమంటున్నారు. కప్పు కాలీఫ్లవర్ లో రెండే గ్రాముల పీచు 27 క్యాలరీలు ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది. ఈ పోషకాలు బరువు అదుపు చేస్తూ జీవ క్రియ రేటును సమతుల్యం చేస్తాయి. కప్పు పచ్చి బఠాణీ లో పీచు విటమిన్లు మాంసకృత్పతులు ఉంటాయి. పుల్కా చపాతీలలో వీటిని తీసుకుంటే బఠాణీ లో వుండే పోషకాలు బరువు తగ్గిచేస్తాయి.

    చీపనుకుంటాం కానీ ఇవే బెస్ట్

    సాధారణంగా మనం చౌకగా దొరికే ఏ వస్తువు పైనా మనసు పెట్టం. అది ఖరీదినదైతేనే బాగా పనిచేస్తుందనో మన్నికగా వుంటుందనో  అనుకుంటాం. కానీ ఎంతో ఖరీదైన విదేశీయ…

  • అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు ఉడికించి ముందర అందులో వేసే కొన్ని దినుసుల్ని కలిపి నానబెడతాం. ఇలా మెరినేట్ చేయటం వల్ల ఉప్పు కరం మసాలాలు ముక్కలకు బాగా పడతాయని త్వరగా ఉడుకుతుందనుకుంటాం. కానీ మాంసాహారాన్ని ఇలా దినుసులతో నానబెట్టి వండటం వల్ల అందులోని కార్సినోజన్ల ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. గ్రిల్ల్డ్ మీట్ లో హెటేరో సైక్లిక్ ఎమెన్లు అనే కార్సిజెనిక్ ఉత్పత్తి అవుతుంది. అయితే మాంసాన్ని రోజ్ మేరీ వెల్లుల్లి వంటి ఇతర హెర్బ్స్ స్పైస్ లతో కొద్దిసేపు నానబెట్టి గ్రిల్ చేస్తే కార్సిజెనిక్ ప్రభావం 87 శాతం తగ్గిపోయిందని శాస్త్ర వేత్తల రిపోర్ట్. ఆహారం లోని కార్సినోజెన్స్ అనేక రకాల కాన్సర్ లకు దారితీసే అవకాశాలున్నాయట. ఆవటుగానో రుచిగా వుంటుందనో ఈ నానబెట్టే ప్రక్రియ మొత్తానికి ప్రయోజనకారమే నాని తేలింది.

    నానబెట్టి వండటం వల్లనే ఈ ప్రయోజనం

    అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు…

  • నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో బోలెడన్ని ప్రోటీన్స్ పొటాషియం మాంగనీస్ జింక్ విటమిన్ కె వంటి నిల్వలు పుష్కలంగా వున్నాయి. కనుక ప్రతి రోజు ఆహారంలో తినండి అంటున్నారు. పీచు విటమిన్ సి విటమిన్ బి6 ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పండ్లు కూరగాయల్లో సెలెనియం ఖనిజం అంతగా దొరకదు. సెనగల్లో పుష్కలంగా దొరికే సెలీనియం కాన్సర్ లు రాకుండా కాంతులు పెరగకుండా కాపాడుతుందంటున్నారు. అలాగే డిఎస్ఏ తయారీకి కారణమయ్యే ఫోలేట్ కూడా ఉంటుంది. నిద్రకీ కండరాల కదలికకు అధ్యయనానికి జ్ఞాపక శక్తికీ ఎంతో అవసరమైన కొలీన్ కూడా ఉంటుంది. కనుక సెనగల్ని పచ్చిగా అంటే నానబెట్టి లేదా ఉడికించి రెగ్యులర్ గా కూరల్లో వేసి ఎదో రకంగా ప్రతి రోజూ తినమంటున్నారు.

    విటమిన్లు ఖనిజాల నిండుగా వుండే సెనగలు

    నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో…