• సరైన విధంగా తింటేనే లాభం.

    కూరగాయలు హెర్బ్స్ వంటి పోషక పదార్ధాలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రుగ్మతల్ని దూరంగా ఉంచవచ్చని ఇలా తినడం వల్ల టాబ్లెట్లు,  సప్లిమెంట్స్,  టాఎక్కులకు దూరంగా ఉండచ్చని…

  • ఒక్కరే ఇంట్లో వుంటే బోర్ కొట్టేస్తుంది. కాసేపు టి.వి చూసే కాసేపు ఫోన్ మెసేజ్ లు చేసి ఇంకా బోర్ అనిపించేలోపే ఎదురుగా వున్న చిప్స్ పాకెట్ చేతిలోకి వస్తుంది. ఖాలిగా వుంటే ఏదైనా తినాలని అనిపించేస్తుంది. దీనికి కారణం మనిషి వొంటరిగా వుండే గ్రెల్లిన్ అనే హార్మోన్ విడుదల అవ్వుతుంది. అలా ఎక్కువ అవగానే ఎదోటి తినాలనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే ఎదో పనిలో బిజీగా వుండటమే. అలాగే ఇంట్లో సాధ్యమైనంత జంక్ ఫుడ్ తెచ్చి పెట్టొద్దు. అలాగే ఫ్రిజ్ లో ఎక్కువ క్యాలరీలు వుండే చిప్స్, కూల్ డ్రింక్స్, క్రిమ్ బిస్కట్స్ కూడా పెట్టోద్దు. మనస్సు పైన వత్తిడి వున్నా కూడా ఎదో ఒక్కటి తినాలనే కోరిక వుంటుంది. వత్తిడి వల్ల శారీరం లోని కొవ్వు నిల్వలను శక్తిగా మార్చే జీవక్రియలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడి తగ్గంగానే కార్టిసాల్ విడుదల అవుతుంది. దీనితో ఆకలేస్తుంది. ఇది కేవలం హార్మోన్ల మాయ. కేవలం ఒత్తిడితగ్గేలా కాసేపు బయటికి మనుష్యులున్న చోటికి వాకింగ్ కి వెళ్ళినా చాలు ఈ సమస్యలుండవు.

    ఇలాగే తినేస్తూ వుండేది

    ఒక్కరే ఇంట్లో వుంటే బోర్ కొట్టేస్తుంది. కాసేపు టి.వి చూసే కాసేపు ఫోన్ మెసేజ్ లు చేసి ఇంకా బోర్ అనిపించేలోపే ఎదురుగా వున్న చిప్స్ పాకెట్…

  • మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. మసాలా పదార్దాలు, బయటి ఫుడ్ కి అవకాసం ఇవ్వకూడదు. శరీరంలోని వ్యర్ధాలు బయటకు పంపే పానీయాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం వల్లనే వ్యర్ధాలు బయటకు పోతాయి. సాధ్యమైనంత నిల్వపచ్చళ్ళు, అప్పడాలు, నూనె లో వేయించిన చిరు తిళ్ళు తినకపోతేనే మంచిది.

    ప్రతి మూడు గంటలకొ సారి తినాలి

    మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం…

  • కొందరికి తీపి అంటే ఎంతో ఇష్టం ,మరి కొందరికి కారం ఇలా పలు రకాల రుచుల సమ్మేళనం తో పలానాది తినాలి అనే కోరిక నాలుకను లాగేస్తుంటాయి . ఇలా తినాలన్న కోరిక మన బుర్రలో వుందా ? లేదా మనకేం కావాలో శరీరానికే తెలుస్తుందా ? ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం చాలా సింపుల్ . ఇది చాలా అవసరం కూడా. మనం శరీరానికి నిజంగా అవసరం అయ్యే పదార్ధాలు తినాలన్నా కోరిక ఏవీ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆరోగ్య వంతమైన పదార్ధాలే. తినాలన్న కోరిక కూడా చాలా అరుదే. తినాలనే కోరికలు సంతోషపూరితమైన ఎమోషనల్ అనుసంధానాలు అంటారు నిపుణులు . అయితే కూల్ డ్రింక్స్ క్యాండీలు కంటికి ఇంపుగా కనిపించే ఏదైనా సరే తినాలనే కోరికను బయోలాజికల్ మూలం ఉంటుంది. ఉప్పు ఫ్యాట్ మెదడులోని ఆహ్లాదకర కేంద్రాలను చురుగ్గా చేస్తాయి. అంటే తినాలన్న కోరిక ఎక్కువ భగం మెదడుదే తప్ప శరీరం తప్పు ఏవీ లేదు. ఈ విషయం తేలింది కనుక ఆలోచనను ఎలా కంట్రోల్ లో పెట్టుకోవటమో ఆలోచించుకోవాలి.

    తినాలన్న కొరిక మెదదుదా ? శరీరానిదా ?

    కొందరికి తీపి అంటే ఎంతో ఇష్టం ,మరి కొందరికి కారం ఇలా పలు రకాల రుచుల సమ్మేళనం తో పలానాది తినాలి అనే కోరిక నాలుకను లాగేస్తుంటాయి…

  • కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం తాగే కాఫీ కాంబినేషన్ బెస్ట్ అంటారు. కాఫీ లో వుండే కెఫిన్ అన్న పదర్ధానికి పంచదార జాడిస్తేనే రెండూ కలిసి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. ఈ రెండు పదార్ధాలు మెదడు లోని రెండు ముఖ్య భాగాల పైన ప్రభావం చూపెడతాయి. ఒకటి జ్ఞాపక శక్తికీ రెండవది దృష్టి కేంద్రీకరించటానికీ ఉపయోగపడతాయి. అలాగే పాలు కమలాఫలం రెండూ ఒకేసారి తినటం తాగటం తప్పు. అది ఉదయం వేళ అయితే శరీరం ఆమ్లాలను గ్రహించలేదు కనుక జీర్ణక్రియకు ఇబ్బంది చేస్తుంది. అరటి జామ కలిపి తినకూడదు. బొప్పాయి నిమ్మ మంచి కాంబినేషన్ కాదు. నారింజ క్యారెట్ కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అదే తేనె నిమ్మరసం అల్లంరసం కలిపి తీసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతుంది. కొన్ని పదర్ధాలు వుండే రసాయనాలు ఇంకో దానికి జోడిస్తే ప్రమాదం.

    కొన్నింటిని కలిపి తేనే మంచిది

    కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం…