Saturday, 28 Nov, 2026

పాపాయి కన్నా ఫ్యాషన్ గా ఉండచ్చు

పాపాయి పుట్టాక పాలిచ్చే తల్లులు ఉద్యోగానికి వెళ్ళాలి. శరీరం తీరులో  మార్పొస్తుంది. బరువు పెరగచ్చు. ఫ్యాషన్ దుస్తులు వేసుకోలేకపోతున్నామని ఆఫీస్ మానేయటం కుదరదు కదా. శరీరానికి పట్టేసేవిగా ఉండకుండా కాస్త వదులుగా వుండే దుస్తుల్ని వేసుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ముందు వైపు గుండీలు వుండేలా  ఎంచుకుంటే పిల్లలకు పాలివ్వటం ఈజీ గా వుంటుందంటున్నారు. మెటాలిక్ జిప్పర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అలాగే చీరలే సౌకర్యం అనుకుంటే తేలిగ్గా వుండే సిల్క్ చీరలుబావుంటాయి. క్రాప్ టాప్ బోట్ నేక్ […]

అత్యంత శక్తినిచ్చే సపోటా

సపోటా ని తియ్యని పండే  అనుకుంటాం కదా. కానీ ఈ పండు శిరోజాలను దృష్టినీ పరిరక్షిస్తుంది. నడుము కొలతల్ని సమంగా ఉంచగలుగుతోంది. బరువు తగ్గాలని ప్రణాళిక వేసుకున్నా  వాళ్ళకి ఇది మంచి ఆహారం. సపోటా లో ఎక్కువ శాతం పీచు కూడా వుంది. అంచేత దాన్ని భోజనానికి ముందు తీసుకోవటం వల్ల  ఉదర ఎంజైమ్ల విడుడలను క్రమబద్దీకరించటంలో సహకరిస్తుంది. సపోటా జ్యూస్ లోకి విటమిన్ సి జుట్టు కుదుర్లు  సరిచేసి ఎదుగుదలకు సహకరిస్తుంది. సపోటా లో వుండే […]

అందం అంటే అత్యంత స్టయిల్ గా ఉండటం

సింపుల్ అండ్ క్లాసిక్ గా ఉంటాను షూటింగ్ లేకపోతే హైడ్రేట్స్ లోని షార్ట్స్  ,టీ షర్టుల,స్పీకర్లు ధరిస్తానని తన  ఫ్యాషన్ స్టయిల్  గురించి చెప్పే పూజా హెగ్డే  అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాధం లో నటిస్తోంది. ముకుంద సినిమా తర్వాత హృతిక్ రోషన్ లో కలిసి మొహంజదారో లో నటించిన పూజా కు తెలుగు సినీ పరిశ్రమే కలిసివస్తోందనిపిస్తోంది. మొహెంజెదారో  సక్సెస్ ఫెయిల్ సంగతి మాట్లాడలేను కానీ ఆ సినిమాలో పనిచేస్తూ వ్యక్తిగా నేను ఎదిగాను అంటోంది […]

సినిమాలకు భాషా బేధం ఏమిటి ?

ఫలానా అని  ఎలాంటి ట్యాగ్ తగిలించుకోకుండా   ఈమెది బంగారు పాద  ముద్ర స్థాయికి  చేరుకుంది. శృతి హాసన్. తెలుగు తమిళ   చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ పరుగు అందుకుంటోంది. ఈ సంవత్సరం తెలుగులో  కాటమరాయుడు  మినహా మరే సినిమాకు శృతి హాసన్ డేట్లు లేవు. ఇదే చెపుతోంది శృతి హాసన్. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. నా కెరీర్ ను మార్చింది తెలుగు పరిశ్రమే. గబ్బర్ సింగ్ కు ముందు అన్నీ పరాజయాలే. అందుకే […]

నిద్రలో కూడా నియంత్రిస్తుంది

అలారం పెట్టుకుని నిద్రలోంచి మెలకువ తెచ్చుకుంటూ వుంటాం  . శరీరాన్ని నియంత్రించగలం అనుకొంటున్నాం గానీ నిద్ర ఎంతవరకు అవసరమో అంతపొగలిగితేనే  మేలు అంటున్నాయి అధ్యయనాలు. ఎంత సేపు నిద్ర పోగలిగితే పూర్తీ చురుకుదనం తో ఉత్సాహం తో ఉండగలమో మన అనుభవంతోనే తేల్చుకోవాలంటున్నారు. మన జీవ గడియారం స్థితి  ప్రకారం నిద్రపోవటం మేల్కోవటం చేయాలి. ఒక్కసారి  ఎక్కువసేపు  నిద్ర మేల్కొనవలసి ఉంటుంది.అలంటి వృత్తిలో రాత్రివేళ కొంతసేపు నిద్రమేలుకుని పనిచేయవలిసి వస్తే తెల్లారి నిద్రను మన అదుపులోకి తీసుకుని […]

ఉద్యోగినుల కోసం మెనూ

రోజంతా పరుగులతో సరైన భోజనం అమరణి ఉద్యోగినుల కోసం ఒక మెనూ ఇచ్చారు. పోషకాహార నిపుణులు. ఉదయం వేళ  ధాన్యంతో వండిన పదార్ధాలు తీసుకోవాలి. ఓట్స్ తో పల్చని గంజిలా చేసి అందులో పండ్లు చెర్రీ ముక్కలు వేసుకుని తాగచ్చు. హాల్ గ్రేయిన్ లేదా మల్టీ గ్రేయిన్ బ్రేడ్ తో శాండ్ విచ్ తయారుచేసుకుని తినాలి. పాన్ కేకులు చేయుకుంటే మైదా పిండి బదులు గోధుమపండి వాడాలి. చపాతీలను గోధుమపిండి తో మల్టీ గ్రేయిన్  ఆటా తో […]

సహజ ముత్యాల జెమ్స్ అంత విలువైనవే

ముత్యాల నగలు అన్ని రకాల డ్రెస్ లకు మంచి ఆప్షన్. ముందర సహజమైన ముత్యాల్ని కల్చర్ ముత్యాల్ని తేడా ఎలా తెలుసుకోవాలి అంటే జెమ్ ల్యాబోరేటరీ లోనో లేదా మైక్రోస్కోప్ కిందో పరీక్ష చేయాలి. సహజమైన ముత్యాలు చాలా అరుదైన ఆభరణాలు. సైజ్  షేప్ కలర్ ఉపరితలం మెరుపులపై ఆధారపడి ముత్యాలు వెలికడతారు. అత్యంత విలువైన ,ముత్యాలు బాగా వెలుగ్గా ఉండి  మృదువుగా ఉంటాయి. మంచి ముత్యాలు అత్యంత ముఖ్యమైన ప్రమాణం వాటిమెరుపు. దాని వైట్ రిఫ్లెక్షన్ […]

కనీళ్ళు రాలితే మనసు తేలికవుతుంది

జీవితంలో ఏ  అనుభవానికైనా కళ్లనీళ్లు వస్తాయి. పట్టలేని ఆనందం వచ్చినా పట్టరాని దుఃఖం వచ్చినా కనీళ్లొస్తాయి. బాధ దిగులు కోపం నిస్సహాయత నొప్పి అన్నింటికీ తిరుగులేని సమాధానం ఏడుపే. చిన్నప్పటినుంచి ఏడుపు ఒక బలహీనత ఎలాంటి పరిస్థితుల్లోనూ కనీరు ఆపెసుకోవటం అలవాటు చేసుకుంటాం. కానీ కనీళ్లకు ఒక హీలింగ్ పవర్ ఉంది. మనసారా కడుపారా పడేస్తే మనసుకి కలిగిన కష్టం ఎగిరిపోతుంది. ఇతరులను ఆదుకోవటం తో కలిగిన సంతోషం కనీళ్ళ రూపంలోనే ఉంటుంది. అంతులేని విజ్ఞానం పొందినపుడు […]

ఈ దుంప పోషకాల గంప

బ్రేక్ ఫాస్ట్ గా సాయంత్రం స్నాక్స్ గా ఎపుడూ ఉప్మాలో రవ్వట్లో తినక్కర్లేదు. ఉడికించిన లేదా కాల్చిన  చిలకడదుంప వుంటే చాలు . ఇందులో వుండే మాగ్నేషియం శరీరాన్ని తేలికగా వుంచటం తో పాటు చక్కని తీయని రుచితో వెరైటీ టిఫిన్ అనిపిస్తుంది. ఈ దుంపల పులుసు తియ్యగా చేసినా బావుంటుంది. చిలకదుంపలోని బీటాకెరోటిన్లు చర్మానికి మేలు చేసి యవ్వనంగా వుండేలా చేస్తాయి. ఇందులో పీచు సమృద్ధిగా వుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగు పరుస్తుంది. […]

ఇదింకో అదనపు మంచి లక్షణం

నీహారికా , మనకి అస్తమానం  అందరు ఎదో ఒకటి చెప్పాలని చూస్తారు. వినటం చాలా బోర్ అనేసారు. నీకో విశేషం చెప్పనా …. విజేతలకుండే మొదటిలక్షణం ఎదుటివాళ్ళ ఆలోచనలు స్వాగతించటం . అన్ని రకాల ఆలోచనలు మనకే రావుకదా. కొత్త ఆలోచనలు రావాలి. ఇది కొత్త విషయాలకు కొదవ లేని కాలం. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఆలోచిస్తున్నారు. అందుకే కదా సోషల్ మీడియా ఉపయోగించుకునేది. చిన్న చిన్న వ్యాపారాలు ఆలోచనలోకి వచ్చాయనుకో . స్టార్ట్ప్స్  గురించి పదిమందికీ […]

విలన్ పాత్రలో యామీ గౌతమ్

మాఫలానీ  క్రీమ్  రాసుకోండి తెల్లగా ఆయిపోతారు నేను హామీ అని యాడ్స్ లో మెరిసే యామీ గౌతమ్ బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ . యాంటీ రోల్ లో నటిస్తోంది . తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకోవటానికి వచ్చే యువతీ పాత్రలో యామీ నటిస్తోంది. విలన్ పాత్రలో యామీ ఎంతో బావుందని టాక్. నిజానికి తనకి నెగిటివ్ రోల్స్  అంటే పెద్ద ఇష్టంలేదని అయితే బిగ్ బీ సినిమాలో పాత్ర అనేసరికి వప్పేసుకున్న […]

బ్లౌజ్ కో ధీమ్ లుక్ హై నెక్

ఫ్యాషన్ ప్రపంచంలో పది హలచల్  చేస్తుందో దాన్ని ఫాలో అవటం సెలబ్రెటీల రహస్యం . ఈ సంవత్సరం బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు ఏ సినిమా వేడుకల్లో అయినా త్రిష తమన్నా సమంతా కాజల్ రెజీనా అందరూ హై నెక్  బ్లౌజ్ డిజైన్లతో చాలా సార్లు కనిపించారు. బ్రొకేడ్ హై నెక్  డిజైన్ తో క్లాసీ లుక్ తో నలుచదరపు బాక్స్ కట్ తో కొన్ని బ్లౌజ్ లు మల్టీ కలర్స్ తో నెట్ ఫ్యాబ్రిక్ తో […]

ఉదరాన్ని కష్టపెడితే సమస్యే

పరిమితికి మించిన ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించుకోవటానికి సరిపడా స్రావాలను విడుదలచేయటానికి అంతర్గత అవయవాలు అవసరానికి మించి శ్రమపడాల్సి వస్తుందని  ఇలా తరచుగా జరుగుతూవుంటే  మెటాబాలిజమ్ ఎండోక్రైన్ పనితీరు గాడితప్పి గ్రోత్ హార్మోన్ తగ్గటం జరుగుతుందని డాక్టర్లు చెపుతారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే జీర్ణరసాలు సరిపోక పొట్టలో అసౌకర్యం మొదలవుతుంది. అప్పుడు కొన్ని చిట్కాలు పాటించమంటున్నారు. పెద్దవాళ్ళు రెండు టేబుల్ స్పూన్ల సోంపు వేయించి పొడిచేసి  గ్లాసునీళ్లలో ఓ స్పూన్ పొడి  వేసుకుని రెండు సార్లు తాగితే […]

టాప్ హీరోస్ కంటే ఎక్కువ ఈమె

నాలుగు సినిమాలలో ఎంతో బిజీగా వున్నానంటోంది అనుష్క. సూర్యతో సింగం 3 ప్రభాస్ తో బాహుబలి లేడీ  ఓరియెంటెడ్ మూవీ భాగమతి నాగార్జున రాఘవేంద్ర రావులతో ఓం నమో వెంకటేశాయ . అన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. ఈ నాలుగు నెక్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవుతాయి. సింగం ఒకటి రెండు ఇప్పుడు మూడు సినిమాల్లో అనుష్క జోడీగా నటించింది. ఇప్పటి సింగం 3 లో అనుష్క తో  హీరోయిన్ శ్రుతీ హాసన్ కూడా కలిసి […]

ఇది సౌందర్య నిపుణుల సలహానే

మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో  అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి  వంటింట్లో వాడే బేకింగ్ సోడా చర్మ సౌందర్యానికి మెరుగులు దిద్దుతుంది. అంటున్నారు. సౌందర్యాన్ని నిపుణులు. బేకింగ్ సోడా నీళ్లతో కలిసి పేస్ట్ లా చేసి ముఖం పై రాసుకుని ఆరనిచ్చి కడిగేస్తే చర్మం మురికిపోయి కాంతులీనుతుంది. అంటున్నారు. ఇదే పేస్ట్ ను వంటికి రాసుకుంటే మంచి డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. ఒక […]

నీలివర్ణమే నిజమైన అందం

ప్రకృతిలో ఎన్నో వర్ణాలు. ప్రపంచంలో మనం సృష్టించిన ఇంకెన్నో రంగులు అలాగే కొన్ని రంగులు కలిపేస్తే ఇంకో కొత్త షేడ్ వస్తూ  ఉంటుంది. ఎన్ని కొత్త వర్ణాలు కనిపెట్టినా  దేని అందం దానిదే. ఒక కొత్త సర్వే రిపోర్ట్ లు మహిళలు నీలిరంగు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని తేలింది . ఇంతకంటే అందమైన ఇంకొటిలేదని ఎక్కువమంది తేల్చిచెప్పినట్లు రిపోర్టులు. ఇక రంగుల్ని గురించిన అభిప్రాయాలు ఎలా వున్నాయంటే 29 శాతం నీలిరంగే. మేలైన రంగన్నారు . 27 […]

మంచి కథ అయితే గొప్ప పేరొస్తుంది.

అందం అభినయం ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. కధలు ఎంపిక చేసుకునే విషయంలో శ్రద్ధ  చూపించాలని తెలుసుకొన్నానంటోంది తమన్నా. నాలుగైదు సినిమాలు చేస్తే కనీసం ఒక్కటైనా పేరు తెచ్చేదిగా వుండాలని  అనిపించింది. ఆ వ్యూహం ఫలించింది ఇప్పుడు రాబోయే బాహుబలి విషయంలో నేను ఇటు మంచి కధ. అందంగా కనిపించటం ముఖ్యంగా నాలో ఒక నటి వుండటం  ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అన్నదామె. ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. మంచి నటన కనబరచగలిగినవాళ్లు ఓమెట్టుపైన  వుంటున్నారు. ఇవాళ్టి […]

కేన్సర్ గొప్ప సమస్యేమీ కాదు

కేన్సర్  వస్తే సిగ్గు పడద్దనీ వ్యాధిపై సైనికుల్లా పోరాడాలనీ లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రముఖ  నటి గౌతమి పిలుపు నిచ్చారు. ఈ మహమ్మారిని జయించటం గొప్ప కష్టం ఏమీ కాదనీ దానికి తనే ఉదాహరణ అని ఆమె అన్నారు. కేన్సర్ పై శ్రీ రక్ష చారిటబుల్ ట్రస్ట్ అడపాలు  ఫౌండేషన్ బహ్రెయిన్  కువైట్ తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన ఒక అవగాహన సదస్సులో ఆమె మాట్లాడేరు. కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తనకు […]

మహిళా సైంటిస్ట్ సంఖ్య చాలా తక్కువ

అంతర్జాతీయ సైన్స్ అకాడమీలో మహిళా సైంటిస్టుల సంఖ్య పైన ఒక గ్లోబల్ సర్వే జరిగింది. 66 దేశాల్లోని సైన్స్ అకాడమీలో మహిళా సభ్యులు కేవలం 12 శాతం మాత్రమే వున్నారని సర్వే రిపోర్ట్. ఒక్క మన దేశంలో 2011-12 లెక్కల ప్రకారం రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ మొత్తం 1.93 లక్షల మంది సైంటిస్టులు పనిచేస్తుంటే వారిలో మహిళా సైంటిస్టులు 27,532 మంది మాత్రమే అంటే 14 శాతంగా ఉన్నారు. పెళ్లి కుటుంబ బాధ్యతలు పిలల్ల పెంపకం ఉద్యోగ […]

తప్పునీదా ఇతరులదా ? తేల్చుకోముందు

నీహారికా , ఇప్పుడు రెండు వేమన పద్యాల్లోని ఒక్క లైను చెపుతూ కోపముండు బతుకు కొంచమై పోవును. ఇదొక పద్యం లోది. శాంతభావ మహిమ చర్చించ లేమయా. ఇది ఇంకో పద్యంలోని లైవ్. ఎంచెపుతున్నాడంటే  కోపం వలన మనిషి తన వివేకాన్ని ఆలోచననీ కోల్పోతున్నాడు. పరాజయానికి కారణం విశ్లేషించుకోలేడు. అంచేత ఎంతటి విద్యావంతుడైన కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అందరినీ దూరం చేసుకుంటాడు అని. అలాగే శాంతం  వలన మనిషి తన ఆలోచనలు అదుపులో వుంచుకోగలుగుతాడు. అన్నింటా జయం […]